సెమీస్ లో టాస్ కీలకం కానుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిడ్నీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ సమరం కోసం భారత్, ఆస్ట్రేలియా కఠిన సాధన చేశాయి. రెండు జట్లు వ్యూహాలు రచించాయి. గురువారం జరిగే ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిడ్నీలో రెండ్రోజులగా వర్షం పడుతోంది. మంగళవారం వర్షం కారణంగా ఎస్సీజీ పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. కాగా గురువారం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశాలున్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా టాస్ కీలక పాత్ర పోషిస్తుందని చాలా మంది క్రీడా పండితులు భావిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచిన జట్టును బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదని వాన్ సూచించాడు.