సరైన జట్టును ఎంపిక చేస్తే గెలుపు మాదే: వార్న్
సిడ్నీ: వచ్చే ప్రపంచ కప్ క్రికెట్ ఛాంపియన్ షిప్ టోర్నిలో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలుస్తుందని స్పిన్ మాంత్రికుడు, మాజీ క్రికెటర్ షేన్ వార్న్ జోస్యం చెప్పారు. ప్రస్తుత బ్యాటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానిమిచ్చారు.
సరియైన జట్టును ఎంపిక చేస్తే.. ప్రపంచకప్ ను గెలుచుకోవడానికి అవసరమైన అద్బుతమైన ఆటగాళ్లు ఆసీస్ లో ఉన్నారని వార్న్ అన్నారు. ప్రస్తుతం కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఫామ్ లో లేరని, త్వరలోనే మునపటి ఫామ్ లోకి క్లార్క్ వచ్చి పరుగులు వరదను పారిస్తారని షేన్ వార్న్ ఆశాభావం వ్యక్తం చేశారు.