ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా పుజారా | Cheteshwar Pujara named ICC Emerging Cricketer of the Year | Sakshi
Sakshi News home page

ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా పుజారా

Published Fri, Dec 13 2013 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా పుజారా

ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా పుజారా

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ను వరించింది. దీంతోపాటు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా క్లార్క్కే దక్కింది. ఇక టీమిండియాలో సంచలనాలు సృష్టిస్తున్న ఛటేశ్వర్ పుజారాను ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఐసీసీ ప్రకటించింది. దాదాపు ఏడాది క్రితమే పూజా పాబ్రీతో పుజారాకు ఎంగేజ్మెంట్ అయ్యిన విషయం తెలిసిందే.

మరోవైపు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరను ఐసీసీ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఇది ఈసారి గిల్లీకి రావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement