ICC cricket awards
-
బాబర్ కెప్టెన్సీ వదిలేయాల్సిందే.. ఆఫ్రిదిని కెప్టెన్ చేయండి.. అప్పుడే!
Babar Azam- Shaheen Afridi: ‘‘బాబర్ ఆజం ఇప్పటికైనా కెప్టెన్సీ వదిలేయాలి. ఒకవేళ తను సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే.. క్రికెట్లో దిగ్గజాలు సృష్టించిన రికార్డులన్నీ బద్దలు కొట్టడం కాయం. కెప్టెన్సీ భారం వల్ల తను పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడు’’ అని పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. బాబర్ ఆజంకు ఐసీసీ పట్టం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నిలకడైన ప్రదర్శనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో రాణించిన బాబర్‌ను ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది. 2022లో ఓవరాల్‌గా 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 54.12 సగటుతో 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దిగ్గజ క్రికెటర్ పేరిట ఏడాది ఉత్తమ ఆటగాడికి ఇచ్చే ‘సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని బాబర్ అందుకుంటాడు. దీంతో పాటు బాబర్ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా ఎంపిక కావడం విశేషం. ప్రశంసల జల్లు వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న అతడు... గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు సాధించాడు. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సొంతగడ్డపై బాబర్ సారథ్యంలో ఇటీవల పలు సిరీస్‌లు ఓడిన వేళ.. కెప్టెన్సీ భారం నుంచి అతడికి విముక్తి కల్పించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. షాహిన్ ఆఫ్రిదిని పాక్ కెప్టెన్‌ను చేయాలని అలీ సూచించాడు. షాహిన్‌ను కెప్టెన్ చేయండి ఈ మేరకు క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘బాబర్ బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి సారించాలి. ఇందుకు కెప్టెన్సీ అడ్డంకి కాకూడదు. తనకు రికార్డులన్నీ బద్దలు కొట్టగల ప్రతిభ ఉంది. షాహిన్ ఆఫ్రిదిని పాక్ కెప్టెన్‌ను చేయాలి. టెస్టులు, వన్డేల పగ్గాలు అతడికి అప్పగించాలి. షాబాద్ ఖాన్‌ను టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌ను చేయాలి’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. అయితే, రషీద్ లతీఫ్ వంటి మరికొంత మంది ఐసీసీ అవార్డుల్లో సత్తా చాటిన బాబర్‌కు ఎవరూ సాటిరారని.. అతడే పాక్ కెప్టెన్‌గా ఉండాలని పేర్కొనడం గమనార్హం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2022 ఎవరంటే?
ICC Men’s Test Cricketer of the Year 2022: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ను వరించింది. గతేడాది అద్భుత ప్రదర్శనకు గానూ అతడికి ఈ గౌరవం లభించింది. జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఈ ఆల్‌రౌండర్.. ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్ హిట్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి బజ్‌బాల్ విధానంతో సంప్రదాయ క్రికెట్లోనూ విధ్వంసకర ఆట తీరుతో జట్టును విజయపథంలో నడుపుతున్నాడు స్టోక్స్. వ్యక్తిగతంగానూ ఉత్తమంగా రాణిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది టెస్టుల్లో మొత్తంగా 870 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. అదే విధంగా 26 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైట్ఆర్మ్ మీడియం పేసర్. ఇంగ్లండ్‌కు సారథ్యం వహించిన 10 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న స్టోక్స్‌ను టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికచేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి గురువారం వెల్లడించింది. కాగా ఐసీసీ టెస్టు జట్టుకు బెన్‌స్టోక్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: ICC ODI Cricketer: ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే? Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. -
ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా పుజారా
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌ను వరించింది. దీంతోపాటు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా క్లార్క్కే దక్కింది. ఇక టీమిండియాలో సంచలనాలు సృష్టిస్తున్న ఛటేశ్వర్ పుజారాను ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఐసీసీ ప్రకటించింది. దాదాపు ఏడాది క్రితమే పూజా పాబ్రీతో పుజారాకు ఎంగేజ్మెంట్ అయ్యిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరను ఐసీసీ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఇది ఈసారి గిల్లీకి రావడం గమనార్హం.