
ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆ జట్టు తిరిగి గాడిలో పడాలంటే మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తిరిగి రావాల్సిందేనని పిలుపునిచ్చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఇప్పటికే 0–3తో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే.
‘క్లార్క్ తిరిగి నీవు జట్టులోకి రావాల్సిన సమయం వచ్చింది. రిటైర్మెంట్‌కు గుడ్‌బై చెప్పి ఆసీస్ తరఫున బరిలోకి దిగు. మీ జట్టు నుంచి టాప్ ఆటగాళ్లు తయారవడం ఆగిపోయింది. ఇప్పటి బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి నాణ్యత లేదు’ అని క్లార్క్‌ను ఉద్దేశించి భజ్జీ ట్వీట్ చేశాడు.