ఆటోవాలా క్లార్క్‌! | Michael Clarke's Tryst With 'Tuk Tuk' In Bengaluru | Sakshi
Sakshi News home page

ఆటోవాలా క్లార్క్‌!

Published Fri, Mar 3 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

ఆటోవాలా క్లార్క్‌!

ఆటోవాలా క్లార్క్‌!

బెంగళూరు: భారత పర్యటనకొచ్చిన విదేశీ క్రికెటర్లు ఇక్కడి ఇరుకైన వీధుల్లో సరదాగా ఆటోల్లో షికారు చేసిందే చూశాం... కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఏకంగా ఆటోవాలాగా మారాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడిపాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం టీవీ వ్యాఖ్యాతగా వచ్చిన క్లార్క్‌ తన డ్రైవింగ్‌ ముచ్చట ఆటోరిక్షాతో తీర్చుకున్నాడు.

ఆటో డ్రైవర్‌తో ఎలా నడపాలో నేర్చుకున్న ఈ ఆస్ట్రేలియన్‌... కాసేపటికే ఒంటరిగా డ్రైవర్‌ సీట్లో కూర్చొని ఆటోను రయ్‌ రయ్‌మంటూ పోనిచ్చాడు. దీనికి సంబంధించిన 21 సెకన్ల నిడివి గల వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 2004లో బెంగళూరులో జరిగిన తొలి టెస్టుతోనే అరంగేట్రం చేసిన క్లార్క్‌ ఆ మ్యాచ్‌లో వీరోచిత శతకం (151) సాధించి జట్టును నాలుగు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement