Auto Driving
-
బాషాలా బండి సంజయ్..
-
హిజాబ్ ధరించి ఆటో నడుతుపుతున్న నజ్మా
ఓ యువకుడు యాచకుడి వేషంలో, కేజీల మొత్తంలో కరెన్సీ నాణేలను తీసుకుని ఐఫోన్ కొనడానికి వెళ్లిన వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.మంచి వయసు, ఓపిక ఉన్న వారే ఇలా చేస్తుంటే... ఓపిక లేకపోయినా సమాజంలో గౌరవంగా బతికేందుకు బురఖా వేసుకుని ఆటో నడుపుతోంది నజ్మా అన్సారీ. అయినా ఇతరుల ముందు చేయి చాచే కంటే.. కష్టపడడమే గౌరవం అనుకుంది. ‘గేర్లు మార్చేయండి చాలు గౌరవంగా బతకవచ్చు’ అని చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. నజ్మా అన్సారీ వయసు 45. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్ నగరంలోని కట్ఘర్లో ఆమె నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2010లో భర్త మరణించడంతో ఇంటి భారం ఆమె మీద పడింది. అప్పటిదాక గృహిణిగా ఉన్న నజ్మాకు తన కొడుకు, కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కాలేదు. భర్త నడిపిన టీషాపును అద్దె కట్టలేక వదిలేసింది. ఇంట్లోనే టీ తయారు చేసి విక్రయించింది. అలా పిల్లల అవసరాలు చూసుకుంటూ ఉండగానే భర్త ఇన్సురెన్స్ డబ్బులు రూ.4.35 లక్షలు వచ్చాయి. మూడు లక్షల రూపాయలతో 2015లో కూతురికి పెళ్లి చేసింది. ఆదాయం సరిపోక.. టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్న నజ్మాకు డబ్బులు సరిపోయేవి కావు. కూతురి పెళ్లి తరువాత ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భర్త ఇన్సురెన్స్ డబ్బుల్లో మిగిలిన మొత్తంతో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంది. ఇంటి పనులన్నీ పూర్తిచేసి ఆటో తోలుతూ సంపాదిస్తోంది. అర్ధరాత్రనే భయం లేదు నజ్మా మూడు షిప్టుల్లో ఆటో నడుపుతోంది. బురఖా ధరించి ఉదయం తొమ్మిదిగంటలకు ఆటో స్టార్ట్ చేస్తుంది. ఎండ వేడికి బురఖాలో ఎక్కువ సమయం ఉండలేక మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆటో నడుపుతోంది. మళ్లీ రాత్రి తొమ్మిది నుంచి రెండుగంటల వరకు విరామం లేకుండా నడుపుతుంది. ఇలా మూడు షిప్టుల్లో మొత్తం మీద రోజుకి ఐదు నుంచి ఆరు వందల వరకు సంపాదిస్తోంది. స్థానిక ట్రాఫిక్ పోలీసులు నజ్మా ధైర్యాన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే నజ్మాను చూసిన ఓ హిందూ మహిళ కూడా ఆటో నడపడం మొదలు పెట్టింది. దీంతో ఆ మహిళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడ్డాయి. ఇలా ఇతరులకు స్ఫూర్తి నిలుస్తూనే, తన కష్టార్జితంతో హజ్ యాత్రకు వెళ్తానని చెబుతోంది నజ్మ. అడుక్కునే కంటే... ‘‘పేదరికం ఉందని అక్కడా ఇక్కడా చేయి చాచకుండా కష్టపడి ఏ పనైనా చేసి గౌరవంగా బతకవచ్చు. ఆటో గేర్లు మారుస్తూ, ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాను. ఇక మహిళా డ్రైవర్‌గా నాకు రాత్రి సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం వచ్చాక అర్ధరాత్రి బయటకు రావడానికి కూడా భయం వేయడం లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మాకు రక్షణ కల్పిస్తోంది. పరిస్థితులు మరింత దిగజారినప్పుడు అల్లా కాపాడతాడు’’ అని నజ్మా అన్సారీ ధైర్యంగా చెబుతోంది. -
ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: వాహనమిత్ర సభకు వెళ్లే ముందు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి స్టీరింగ్ పట్టుకున్నారు. ఆటో డ్రైవర్లను ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలను విచారించారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ వాహనమిత్ర ఆటో, రహదారి భద్రత – జీవితానికి రక్ష, అభయం స్టాల్స్‌ను పరిశీలించారు. అక్కడకు వచ్చిన పలువురు వాహనమిత్ర లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ఫొటోలు దిగారు. చదవండి: నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్ -
షీ డ్రైవ్
ఆమె పేరు జె.స్వర్ణ. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో రోజులు గడవడమే భారమైంది. ఆ సమయంలో ధైర్యాన్ని కూడదీసుకుని తన పిల్లలకు తానే అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. ప్రస్తుతం నెలకు రూ.15వేలు సంపాదించుకుంటూ ఇద్దరి ఆడపిల్లల్ని పాలిటెక్నిక్ చదివిస్తోంది. స్వర్ణ ఒక్కరే కాదు.. భర్త సంపాదించే ఆదాయం చాలక ఇబ్బందులు పడే మహిళలు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలతో ఆటోలు కొనుక్కుని, ఆత్మవిశ్వాసంతో రయ్..రయ్ అంటూ దూసుకుపోతున్నారు. నిబంధనలు పాటిస్తూ.. నమ్మకంగా.... నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని సీవీఆర్ స్కూల్లో చదివే దూర ప్రాంత విద్యార్ధులను వారి ఇళ్లకు తీసుకువెళ్లి, తీసుకువచ్చేసౌకర్యం నగరపాలక సంస్థ అధికారులు కల్పించారు. ఈవిధంగా విద్యార్ధులను తీసుకు వెళ్లి వచ్చినందుకు ఒక్కొక్క ఆటోకు రూ.9000 చెల్లిస్తారు. అంతేకాకుండా మహిళా ఆటో డ్రైవర్లు అంతా కలిసి నగరంలోని కొన్ని ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలను సంప్రదించారు. మహిళలు కావడంతో పాటు నిదానంగా ఆటోలు నడపడం, ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ఉండటం, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఉండటం, సెలవు పెట్టకుండా ప్రతిరోజువిద్యార్థులను సకాలంలో తీసుకువస్తూ ఉండటంతో తమకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అమరావతి షీ ఆటో యూనియన్ కార్యదర్శి బండారు లక్ష్మి సాక్షికి తెలిపారు. విద్యార్థులను పాఠశాలలకు చేర్చిన తరువాత మిగిలిన సమయంలో కిరాయిలు తోలుకుంటారు. కాగా కొంతమంది మహిళా ఆటో డ్రైవర్లు నేరుగా కిరాయికు ఆటోలను నడుపుకుంటున్నారు. సౌకర్యాలు అరకొరే.... మహిళా ఆటో డ్రైవర్లకు నగరంలో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. వాస్తవంగా షీ ఆటో డ్రైవర్లను ప్రోత్సహిస్తామంటూ అధికారులు హామీలు ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా షీ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడే రెస్ట్రూమ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే నాలుగేళ్లు అయినా అవి కార్యరూపం దాల్చలేదు. అయినా చేతిలో ఉన్న వృత్తిని వదులుకోలేక డ్రైవర్లుగా కొనసాగుతున్నారు. రైల్వేస్టేషన్ బస్టాండ్ వద్దకు వెళ్లితే అక్కడ ఉన్న పురుష డ్రైవర్ల అహంకారానికి గురి కావల్సి వస్తోంది. ‘మీరు మాకు పోటీనా’ అంటూ చీదరించుకుంటున్నారని ఈ మహిళలు వాపోతున్నారు. అయితే కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని దొరికినంత కిరాయిలకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరు ఆటోలు నడుపుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వున్న వారు రాత్రి 9 గంటల వరకు నడుపుతున్నారని చెబుతున్నారు. ఆటో డ్రైవర్ నడపడం ద్వారా రోజుకు రూ.700 వరకు సంపాదిస్తే రూ.300 సీఎన్జీ, ఇతర ఖర్చులకు పోయినా రూ.400 వరకు ఇంటికి తీసుకువెళ్లుతున్నామని వారు సంతృప్తిగా చెబుతున్నారు. – శ్యామ్ ప్రకాష్, సాక్షి, విజయవాడ -
ఆటోవాలా క్లార్క్!
బెంగళూరు: భారత పర్యటనకొచ్చిన విదేశీ క్రికెటర్లు ఇక్కడి ఇరుకైన వీధుల్లో సరదాగా ఆటోల్లో షికారు చేసిందే చూశాం... కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఏకంగా ఆటోవాలాగా మారాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడిపాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా సిరీస్ కోసం టీవీ వ్యాఖ్యాతగా వచ్చిన క్లార్క్ తన డ్రైవింగ్ ముచ్చట ఆటోరిక్షాతో తీర్చుకున్నాడు. ఆటో డ్రైవర్‌తో ఎలా నడపాలో నేర్చుకున్న ఈ ఆస్ట్రేలియన్... కాసేపటికే ఒంటరిగా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆటోను రయ్ రయ్‌మంటూ పోనిచ్చాడు. దీనికి సంబంధించిన 21 సెకన్ల నిడివి గల వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 2004లో బెంగళూరులో జరిగిన తొలి టెస్టుతోనే అరంగేట్రం చేసిన క్లార్క్ ఆ మ్యాచ్‌లో వీరోచిత శతకం (151) సాధించి జట్టును నాలుగు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. -
విజయవాడలో ‘షీ’ ఆటోలకు ఏర్పాట్లు
విజయవాడ: దేశంలోనే తొలిసారిగా విజయవాడ నగరంలో షీ ఆటోలను ప్రవేశపెట్టనున్నట్టు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రాష్ట్ర కో-ఆర్డినేటర్, డిప్యూటీ డెరైక్టర్ రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ పట్టణ జీవనోపాధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.