విజయవాడ: దేశంలోనే తొలిసారిగా విజయవాడ నగరంలో షీ ఆటోలను ప్రవేశపెట్టనున్నట్టు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రాష్ట్ర కో-ఆర్డినేటర్, డిప్యూటీ డెరైక్టర్ రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ పట్టణ జీవనోపాధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.