
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు మూడు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈద్ పండుగ కోసం షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా చాప్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చ వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
మరో ఘటనలో వడోదర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శుక్రవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని వడోదర నగరంలో 20 ఏళ్ల లా విద్యార్థి నడుపుతున్న కారు వారి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల కథనం ప్రకారం నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment