Nadia
-
భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!
సినిమాల్లో హీరోలు చేసే స్టంట్ సీన్లను కళ్లను పెద్దవిగా చేసుకుని మరీ చూసేస్తాం. అంతలా చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. అయితే హీరోయిన్ల విషయానికి వస్తే అలాంటి సీన్ ఉండవు. లేడీ ఓరియంటెడ్ మూవీల్లో తప్పా.. అది కూడా అన్యాయాన్ని ఎదిరించే వీర వనితలాంటి పాత్ర అయితేనే ఫైటింగ్ సీన్లు లేదంటే ఉండవు. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో మహిళలను ఆ రేంజ్లో చూపించే ఛాన్సే లేదు.అయితే ఆ టైంలో ఒక అమ్మాయి అందర్నీ ఆశ్చర్యపరిచేలా స్టంట్లు చేసి వావ్ అనిపించుకుంది. కండలు తిరిగిన మగవాళ్లని ఒక్క ఊదుటన కట్టడి చేసే ఆమె తెగువకు అందరూ కంగుతిన్నారు. అమ్మాయిలు ఇలాంటివి కూడా చేయగలరనేందుకు ఆమె ప్రేరణగా నిలిచింది. ఆమె వల్లనే ఈనాడు సినిమాల్లో అమ్మాయిలకు మంచి స్టైలిష్ ఫైటింగ్ సీన్లు ఇచ్చారని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాంటే భారతదేశపు తొలి స్టంట్ విమెన్ ఆమె. ఎవరామె..ఎలా ఆమె సినీ ప్రస్థానం మొదలైందంటే..ఫియర్లెస్ నదియా(Nadia)గా ప్రసిద్ధి చెందిన నటి-స్టంట్ విమెన్(Stuntwoman) మేరీ ఆన్ ఎవాన్స్ ఆరోజుల్లో అసాధారణమైన ఫైట్లతో ప్రేక్షకులను అలరించింది. 1908లో జన్మించిన నదియా అసామాన్యమైన ధైర్యం బలం, నిర్భయ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేది. అలనాటి బాలీవుడ్(Bollywood) మూవీ హనీ బన్నీలో అసామాన్యమైన ధైర్యసాహసాల గల హీరోయినే నదియా. అందులో ఆమె చేసిన స్టంట్లు సినిమా వరకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె నిజజీవితంలో కూడా అలానే ఉంటారామె. ఆస్ట్రేలియా(Australia) మూలాలకు చెందిన నీలి కళ్ల అందగత్తె నదియా. ఆ రోజుల్లో మెకాలి ఎత్తు బూట్లువేసుకుని కొరడాతో ప్రత్యర్థులను చిత్తు చేసే హీరోయిన్గా ప్రేకక్షకులను మెప్పించింది. చెప్పాలంటే ఇలాంటి ధైర్యవంతమైన మహిళలను కూడా ఆదిరిస్తారు ప్రజలు అని తన నటనతో చాటిచెప్పింది. వైవిధ్య భరితమైన సాహోసోపేతమైన పాత్రల చేసినందుకు గానూ ఆమెను హంటర్‌వాలి అని ముద్దుగా పిలుచుకునేవారు అభిమానులు. ఆస్ట్రేలియాలోని గ్రీకుకి చెందిన తల్లి పెర్త్, బ్రిటిష్ తండ్రి(British father)కి జన్మించింది ఎవాన్స్(నదియా). తన తండ్రి సైనిక విభాగంతో భారత్‌కు రావడంతో ఇక్కడ వచ్చింది. అయితే తండ్రి మరణంతో కుటుంబం మొత్తం బొంబాయిలోనే స్థిరపడింది. నటిగా కెరీర్ ప్రారంభించటానికి ముందు సర్కస్‌లో పనిచేసేది. అక్కడ నృత్యం,గుర్రపుస్వారీల వంటి ప్రదర్శనలు ఇచ్చేది. అలా నటిగా కెరీర్‌ని చిన్న చిన్న పాటలతో ప్రారంభించింది. వాటికి ప్రేక్షకుల ఆదరణ లభించడమే గాక ఓ బాలీవుడ్ దర్శకుడుని దృష్టిలో పడేలా చేసింది. ఆయన ఆమెలోని ప్రతిభను గుర్తించి బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా పరిచయం చేశాడు. అలా ఆమె సినిరంగ ప్రవేశం చేయడమే గాక, మహిళలు స్టంట్ సీన్లను చేయగలరని ప్రూవ్ చేసింది. ఆమె కెరీర్లో మైలు రాయి హంటర్‌వాలి మూవీ. అందులో తన తండ్రి మరణానికి న్యాయం కోరుతూ ప్రతీకారం తీర్చుకునే యువరాణిగా అలరించింది. ప్రజలు మదిలో ఆ పాత్ర నిలిచిపోయేలా నటించింది నదియా. ఆ విధంగా ఆమె బాలీవుడ్లో ప్రముఖ తారగా వెలుగొందింది. ఆమె సంతకం కూడా వెరైటీగా ఉంటుంది అరుపులాగా హే య్! అని క్యాచీగా సంతకం చేస్తుంది. నదియా నిర్భయమైన మహిళగా విలన్లతో పోరాడే పాత్రలనే ఎక్కువగా చేసింది. ప్రజలు ఆమె స్టంట్లకు బ్రహ్మరథం పట్టేవారట. ఆమె కారణంగానే హీరోయిన్లకు ఇలాంటి పాత్రల ఇచ్చేలా మార్గం సుగమం అయ్యిందని అంటారు సినీ విశ్లేషకులు. అంతేగాదు బాలీవుడ్ కల్ట్ హోదా(విశేష ప్రజాదరణ)ను పొందిన విదేశీయులలో ఆమె కూడా ఒకరు. హీరోయిన్లంటే మాములు పాత్రలకే పరిమితమైన మూసధోరణిని బద్ధలు కొట్టి సాహసోపేతమైన విన్యాసాలను అవలీలగా చేయగలరని చెప్పేలా స్ఫూర్తిగా నిలిచింది. ఆమె 1996లో 88వ పుట్టిన రోజున మరణించారు. ఇప్పటికీ స్టంట్ విమెన్ అనగానే నదియా అని గుర్తొచ్చాలా ప్రజల మదిలో నిలిచిపోయారామె.(చదవండి: ఆయన దూరమవ్వడానికి కారణం అదేనేమో..! ఈ వేదన, బాధను..) -
‘పెన్‌గంగ’పై అప్రమత్తం!
జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతమైన డొల్లార గ్రామ శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం పర్యటించారు. ఉదయం డొల్లార చేరుకొని 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కొరటా–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్ హౌస్‌లను సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు: వరద ధాటికి మండలంలోని పలు గ్రామాల్లో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగాతడిసిపోవడంతో అవస్థలు పడుతున్నారు. కౌఠ గ్రామంలో నిత్యావసర సరుకులను థర్మాకోల్ పడవలపై తరలిస్తూ కనిపించారు. ప్రజలు ఇళ్లను వదిలి మూటముల్లె సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. చెరువులను తలపిస్తున్న పంట చేలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న పంట చేలు బ్యాక్ వాటర్ ధాటికి పూర్తిగా మునిగిపోయాయి. ఆదివారం వర్షం కొంత తగ్గినప్పటికీ చేలలో వరద తొలగలేదు. పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్‌పూర్, కరంజి, కూర, ఖాప్రి, లేకర్వాడ, మాండగాడ, పూసాయి తదితర గ్రామాల పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పెన్‌గంగా నది బ్యాక్ వాటర్ సాంగిడి గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఆ గ్రామస్తులు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటకు రావాలంటే ఇలా నాటు పడవల ద్వారా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. -
డైనమిక్ లేడీ నదియా: కిల్లర్ మూవ్‌తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు
పురుషాధిక్య ప్రపంచంలోఅనేక అసమానతలతో పోరాడి, తమ తమ డొమైన్లలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలెన్నో విన్నాం.మార్కెటింగ్, సేల్స్, ఇన్నోవేషన్స్‌తో స్టార్టప్స్ ద్వారా కూడా మహిళా సాధికారతకు మారుపేరుగా విజయవంతంగా దూసుకు పోతున్నారు. అలాంటి యువ మహిళా పారిశ్రామికవేత్త డైనమిక్ లీడర్, నాలుగు దశాబ్దాల నాటి ఎఫ్ఎమ్సీజీ కంపెనీ ముఖచిత్రాన్నే మార్చివేసిన నదియా చౌహాన్ గురించి తెలుసుకుందాం. దేశంలోని టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటైన పార్లే ఆగ్రో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు నదియా చౌహాన్. పార్లే ఆగ్రో చైర్ ప్రకాష్ చౌహాన్ కుమార్తోగా 2003లో 17 ఏళ్లకే పార్లే ఆగ్రోలో కీలక బాధ్యతలు చేపట్టి, వివిధ విభాగాలను పర్యవేక్షిస్తూ సంస్థ అభివృద్ధికి బాటలువేసారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఆమె సొంతం. వ్యూహాత్మక దృష్టి , సమస్య పరిష్కారానికి ఎంచుకునే సృజనాత్మక విధానం ద్వారా డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. పార్లే ఆగ్రో అద్భుత విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా 34 ఏళ్ల నదియాకే చెందుతుంది. ఆమె కృషి, అంకితభావం వల్ల పార్లే ఆగ్రో దేశంలోని చాలా ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ధీటుగా ఊహించలేని స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు. (మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?) నదియా కాలిఫోర్నియాలో పుట్టినా పెరిగింది మాత్రం ముంబైలోనే .హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఇండోర్ విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా పొందిన నదియాకు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం ఇష్టం. పార్లే ఆగ్రోలో చేరడానికి ముందు, నదియా పెప్సికో ఇండియా , యురేకా ఫోర్బ్స్‌లో సీనియర్ లీడర్షిప్ విధుల్లో పనిచేశారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) రూ.300 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు ప్రయాణం నదియా కంపెనీలో భాగమైనప్పుడు పార్లే ఆగ్రో ఆదాయం కేవలం రూ. 300 కోట్లు (సుమారు 43 మిలియన్లు డాలర్లు) మాత్రమే. అయితే, కొత్త ఉత్పత్తులు ,కేటగిరీల పరిచయం చేయడంతో రూ.8000 కోట్లకు పెరిగింది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పానీయాల బ్రాండ్ ఫ్రూటీ. కంపెనీ టర్నోవర్‌లో దాదాపు 90 శాతం ఫ్రూటీదే. తరువాత ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టి మరింత ఉత్సాహంతో 2005లోనే PET బాటిళ్లలో, టెట్రా ప్యాకేజింగ్‌తో యాపిల్ జ్యూస్‌తో యాప్పీ ఫిజ్‌ను ప్రారంభించాలనే ఆలోచన కీలక మలుపు. అలాగే సింగిల్ బ్రాండ్ ఫోకస్ నుండి మల్టీ-బ్రాండ్ ,మల్టీ-కేటగిరీ ఫోకస్‌కి తీసుకెళ్లడమే ఆమె ప్రధాన ఎజెండా. 2009 నుంచి LMN, Appy, Grappo Fizz వంటి కొత్త పానీయాల బ్రాండ్స్‌తో పార్లే ఆగ్రో పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించింది. ఇవే కంపెనీని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. అప్పటి నుండి పార్లే ఆగ్రో కార్బోనేటేడ్ ఫ్రూట్ డ్రింక్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. నాలుగు సంవత్సరాల్లో,యాపీ ఫిజ్ 70శాతం వృద్ధి రేటును సాధించింది. పార్లే ఆగ్రో టర్నోవర్ రూ.5,000 కోట్లకు చేరుకుంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బోనేటేడ్ డ్రింక్స్ (యాప్పీ ఫిజ్), కార్బోనేటేడ్ కాఫీ (కేఫ్ క్యూబా), ఫ్రూట్ ఫ్లేవర్డ్ స్టిల్ డ్రింక్స్ (ఫ్రూటీ యాప్పీ) ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ లాంటి వాటిని అందిస్తోంది. అలాగే నదియా 2009లో స్నాక్స్ హిప్పోను ప్రారంభించాలనే వ్యూహం బాగా పనిచేసింది. కేవలం రెండేళ్లలో కుర్కుర్, బింగో తర్వాత మార్కెట్ వాటాలో మూడవదిగా మారింది. మరో కిల్లర్ మూవ్.. కంపెనీకి 95శాతం రాబడిని అందించిన "ఫ్రూటీ"పై కంపెనీ ఆధారపడటాన్ని తగ్గించి, సమయానుకూలంగా ఐకానిక్ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ "బైలీస్"ని లాంచ్ చేసింది ఫలితం ఇది 1000 కోట్ల బ్రాండ్‌గా మారింది. అదే సమయంలో ఫ్రూటీ ఆధిపత్యం 48 శాతానికి పడిపోయింది. కానీ యాప్పీ ఫిజ్, ఫ్రూటీ టర్నోవర్‌ను రెట్టింపు చేయాలని లక్ష్యంతో దూసుకుపోతోంది. ఇండస్ట్రీ విసిరిన సవాళ్లనే ఛాలెంజ్‌గా తీసుకోవడమే ఈ విజయానికి కారణమంటారు నదియా. డెలివరీ ఒక నెలలోనే ఇంటి నుండే కార్యక్రమాలను చూడటం, మీటింగ్స్‌ను పాప నియాను తనతోపాటే తీసుకెడుతూ వ్యవహారాలను చక్కబెట్టుకున్నానని చెప్పారు ఒక సందర్బంగా ఆమె. వృత్తిపరంగా తన తండ్రి, భర్త క్రియేటివ్ ల్యాండ్ ఆసియా వ్యవస్థాపకుడు ,చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రాజ్ కురుప్ రోల్ మోడల్స్ తన అంటారు నదియా. బ్రాండ్ ప్రమోటింగ్‌లో దిట్ట బ్రాండ్‌ను మరింత ప్రమోట్ చేయడానికి సూపర్ స్టార్లను, సెలబ్రిటీలను ఎంచుకుంది. బాలీవుడ్ అలియా భట్ , టాలీవుడ్ స్టార్‌హీరోలు జూ.ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫంకీ క్లోత్స్, "ఫ్రూటీ ఫిజ్" బాటిళ్ల యాడ్స్ ఆమె క్రియేటివిటీకి అద్దం పట్టాయి. 11 ఏళ్లకే వ్యాపారంలో ఓనమాలు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు నదియాకుచిన్నప్పటినుంచి తండ్రి ద్వారా వ్యాపార లక్షణాలు అలవడ్డాయి. స్కూల్లో చదువుకునే టైంలోను, వేసవి సెలవుల్లో సేల్స్ టీమ్‌తో గడిపేవారట. వారి ఉత్పత్తులు ఎలా పని చేస్తున్నాయో విశ్లేషించడానికి దుకాణాలకు వెళ్లడం లాంటివి ఆమెకు తన చేసే పట్ల విశ్వాసంతోపాటు, పార్లే వృద్ధి ప్రణాళికకు అనుగుణంగా సాహసోపేత నిర్ణయాలను తీసుకునేలా చేసింది. ఒకసారి ప్రకటనల ఏజెన్సీతో సమావేశం కోసం టీజర్ గురించి చర్చించేందుకు నదియా తన తండ్రి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి ఆమెకు 11 ఏళ్లు. అవార్డులు ఆమె వ్యాపార దక్షతకు అత్యంత శక్తివంతమైన మహిళలు, ఫోర్బ్స్ ఇండియాస్ టైకూన్స్ ఆఫ్ టుమారో , 2018లో అ ఇంపాక్ట్ మ్యాగజైన్ త్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా నిలిపింది. అంతేకాదు రింకు పాల్, పూజ సింఘాల్ రాసిన “డాటర్స్ ఆఫ్ లెగసీ” పుస్తకం ఆమె స్టోరీ కూడా చోటు దక్కించుకుంది. ఫిట్నెస్ ఫ్రీక్, హార్స్‌రైడింగ్ నదియా విపరీతమైన రీడర్. ఫిట్నెస్ ఫ్రీక్, వ్యాయామం, గుర్రపు స్వారీ చేయడం చాలా ఇష్టం.ఇంకా ఎకౌస్టిక్ గిటార్ వాయించడం కూడా ఇష్టం. మహిళా సాధికారతను జరుపుకునే ఈవెంట్లలో ప్రసంగాలిస్తారు కూడా. సామాజిక సేవ నదియా సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గాఉంటారు. ఆ 'పార్లే ఏక్ ప్రయాస్'దేశంలోని వెనుకబడిన పిల్లలకు విద్యా వనరులను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా స్కాలర్షిప్లను కూడా స్పాన్సర్ చేయడం విశేషం. ముగ్గురూ ముగ్గురే పార్లే ఆగ్రో వ్యవస్థాపకుడు ప్రకాష్ చౌహాన్ ముగ్గురు కుమార్తెల్లో పెద్దామె నదియాతోపాటు, మిగిలిన ఇద్దరూ వ్యాపారంలో ఉన్నారు. 1998లో కంపెనీలో చేరిన రెండోకుమార్తె 2006లో సీఈవోగా ఉన్నారు షౌనా. చిన్నకుమార్తె అలీషా CSR ను పర్యవేక్షిస్తుంది. వీరి ఉమ్మడి లక్ష్యం పార్లే ఆగ్రో పోర్ట్‌ఫోలియోను పెంచడం. 2030 నాటికి పార్లే ఆగ్రోను రూ.20,000 కోట్ల కంపెనీగా మార్చడం. -
14 ఏళ్ల వయసులోనే సంచలనాలు.. ఆల్‌టైమ్ గ్రేట్‌గా..!
1976 మాంట్రియల్ ఒలింపిక్స్.. జిమ్నాస్టిక్స్ పోటీలు జరుగుతున్నాయి. అన్ ఈవెన్ బార్స్ విభాగంలో జిమ్నాస్ట్‌లు పోటీ పడుతున్నారు. తీవ్రమైన పోటీ మధ్య ఆటగాళ్లంతా సత్తా చాటారు. పోరు ముగిసింది. అయితే నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన.. ఉత్కంఠత.. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి. అది ఎవరూ ఊహించలేనిది.. అందుకే తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు. అసలేం జరిగిందంటే స్కోరు చూపించే ఎలక్ట్రానిక్ బోర్డుపై గరిష్ఠంగా మూడు అంకెలు మాత్రమే ప్రదర్శించే వీలుంది. కానీ ఆ అమ్మాయి సాధించిన స్కోరు 10 పాయింట్లు! అంటే 10.00గా రావాలి. కానీ అది సాధ్యం కాలేదు. చివరకు ‘1.00’గా మాత్రమే కనిపించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలి సారి ‘పర్ఫెక్ట్ 10’ స్కోర్ చేసి సంచలనం సృష్టించిన ఆ అమ్మాయి పేరే నాదియా కొమనెచ్. కేవలం 14 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనతతో మొదలు పెట్టి ఆల్‌టైమ్ జిమ్నాస్టిక్ గ్రేట్‌లలో ఒకరిగా నిలిచింది. రొమేనియాకు చెందిన నాదియా ప్రస్థానం ఆసక్తికరం. టీనేజర్‌గా ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేయడం మొదలు సొంత దేశంలోనే పరాయిదానిలా ఆంక్షల మధ్య బతకడం, ఆపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రహస్యంగా మరో దేశానికి వెళ్లిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం, అనంతరం అక్కడే వర్ధమాన జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దడం వరకు ఎన్నో మలుపులు ఉన్నాయి. మాంట్రియల్ ఒలింపిక్స్‌లో అన్ ఈవెన్ బార్స్‌లో ‘పర్ఫెక్ట్ 10’తోనే ఆమె ఆగిపోలేదు. ఆ మెగా ఈవెంట్లో మరో ఆరు సార్లు ఆమె ‘పర్ఫెక్ట్ 10’ను సాధించగలిగిందంటే ఆ అద్భుత ప్రతిభ ఏమిటో అర్థమవుతుంది. రొమేనియా దేశం తరఫున ‘ఒలింపిక్ ఆల్‌రౌండ్’ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా నాదియా నిలిచింది. సహజ ప్రతిభతో.. శరీరాన్ని విల్లులా వంచుతూ ఎన్నెన్నో విన్యాసాలతో కనువిందు చేసే జిమ్నాస్టిక్స్‌కు క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒలింపిక్ క్రీడల్లోనైతే జిమ్నాస్ట్‌ల ప్రదర్శన ప్రతిసారీ విశేషమైన ఆసక్తే. అలాంటి పోటీలకు నాదియా అదనపు ఆకర్షణను తెచ్చింది. అపార ప్రతిభ, బ్యాలెన్సింగ్, క్లీన్ టెక్నిక్‌తో ఆమె ఈ పోటీల్లో శిఖరాలను అందుకుంది. ఒక్కసారి బరిలోకి దిగితే కేవలం సాంకేతికాంశాలు, పాయింట్లు మాత్రమే కాదు, నాదియా ఆట కొత్త తరహాలో అందంగా మారిపోయేది. ఆమె చేసిన విన్యాసాలు మరెవరికీ సాధ్యం కాలేదంటే ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. బీమ్‌పై ఏరియల్ వాకోవర్ చేసిన తొలి జిమ్నాస్ట్ నాదియానే! కళ్లు తిప్పుకోలేని ఏరియల్ కార్ట్‌వీల్ బ్యాక్ హ్యాండ్స్ప్రింగ్ను, డబుల్ ట్విస్ట్ డిస్మౌంట్ను, ఫ్లోర్‌పై డబుల్ బ్యాక్ సాల్టోను ప్రదర్శించిన తొలి జిమ్నాస్ట్‌గా ఘనత వహించింది. వరుస విజయాలు సాధించి.. ‘చిన్నప్పుడు అత్యంత చురుగ్గా ఉండేది. ఎగరడం, గెంతడం, దూకడం, ఇలా అన్నింటా నేను ఆమెను అదుపు చేయలేకపోయేదాన్ని, అందుకే ఆమెను జిమ్నాస్టిక్స్‌లో చేర్పించాను’ నాదియా గురించి ఆమె తల్లి చెప్పిన మాట అది. అయితే ఆ అల్లరి పిల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని తల్లి కూడా ఊహించలేకపోయింది. ఆరేళ్ల వయసులో పాఠశాల స్థాయిలో ఆటలో ఓనమాలు నేర్చుకుంది. ఏడేళ్ల వయసులో కోచింగ్ అకాడమీలో అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు, 9 ఏళ్ల వయసు వచ్చే సరికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాదు రొమేనియా జాతీయ చాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కురాలనే రికార్డ్ కూడా నమోదు చేసేసింది. అదే ఏడాది తొలి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నాదియా వరుస విజయాలతో సత్తా చాటింది. 13 ఏళ్లకు యూరోపియన్ టోర్నీలో అన్ని టైటిల్స్ సాధించేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మన్ హటన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ కప్’లో సత్తా చాటి పతకాలు సాధించడంతో నాదియా పేరు మార్మోగింది. భవిష్యత్తు తారగా ఆమెను క్రీడా ప్రపంచం గుర్తించింది. నిజంగానే ఆపై ఆమె తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవడంలో సఫలమైంది. ఒలింపిక్స్‌లో జోరు.. మాంట్రియల్ ఒలింపిక్స్‌లో మొదటినుంచి నాదియా హవా కొనసాగింది. అన్ ఈవెన్ బార్స్ విభాగంలోనే కాకుండా బ్యాలెన్స్ బీమ్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ ప్రదర్శనల్లో కూడా ఆమె స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఇదే ఒలింపిక్స్‌లో టీమ్ ఆల్‌రౌండ్‌లో రజతంతో పాటు ఫ్లోర్ ఎక్సర్సైజ్లో కాంస్యం కూడా గెలుచుకుంది. హార్ట్వాల్ట్లో మాత్రం త్రుటిలో కాంస్యం చేజారి నాలుగో స్థానం దక్కింది. ఈ విజయాలు, ‘పర్ఫెక్ట్ 10’ప్రదర్శనతో నాదియా ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. పలు అవార్డులు, రివార్డులు వచ్చి పడ్డాయి. అప్పటికే పాపులర్ అయిన పాట ‘కాటన్ డ్రీమ్స్’ను ఆమె గౌరవ సూచకంగా ‘నాదియాస్ థీమ్’ అంటూ పేరు మార్చడం విశేషం. ఆ తర్వాత నాదియా ఫ్లోర్ ఎక్సర్సైజ్ పోటీల సమయంలో ఇదే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించడం విశేషం. ఒలింపిక్స్ విజయాల తర్వాత కూడా ఆమె జోరు కొనసాగింది. ఈ పోటీలకు, 1980 మాస్కో ఒలింపిక్స్‌కు మధ్య నాదియా ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, యూరోపియన్ చాంపియన్‌షిప్‌లు, వరల్డ్ కప్‌లలో కలిపి 7 స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ఇదే ఉత్సాహంతో ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన ఆమె మరో మంచి ప్రదర్శనను నమోదు చేసింది. ఇక్కడా 2 స్వర్ణాలు, 2 రజతాలు సాధించడంలో ఆమె సఫలమైంది. మోత్తంగా నాదియా గెలిచిన 5 ఒలింపిక్స్ స్వర్ణాలు కూడా వ్యక్తిగత విభాగంలోనివే కావడం విశేషం. దేశం దాటి వెళ్లి.. స్టార్‌గా ఎదిగిన తర్వాత నాదియా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా క్రీడాభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ‘నాదియా 81’ పేరుతో ఆమె, ఇతర కోచ్‌లు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో రొమేనియాలో కమ్యూనిస్ట్ నికోల్ సీషెస్ నాయకత్వంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోంది. దాంతో వారి దేశంలో పలు ఆంక్షలు, ఆర్థిక సమస్యలు ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాయి. ఇలాంటి స్థితిలో అమెరికాను చేరిన బృందంలో నాదియా మినహా మిగతావారంతా అక్కడే ఉండిపోయారు. తాను మాత్రం స్వదేశం వెళ్లాలనే నిర్ణయించుకుంది. అది ఎంత పెద్ద తప్పో ఆ తర్వాత ఆమెకు తెలిసొచ్చింది. ఇతర ఆటగాళ్లు, కోచ్‌లు అమెరికాలోనే ఉండిపోవడంతో నాదియా పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. ‘మా దేశపు జాతీయ సంపత్తి’ అంటూ నాదియాపై ప్రభుత్వం దేశం దాటి వెళ్లకుండా పలు ఆంక్షలు విధించడంతో పాటు ఆమె ప్రతికదలికపై నిఘా పెట్టింది. ‘నా కుటుంబం కోసం కొంత అదనంగా సంపాదించే అవకాశాన్ని నాకు దూరం చేయడంతో పాటు నన్ను ఖైదీగా మార్చారు’ అంటూ ఆమె వాపోయింది. ఎట్టకేలకు 1989 నవంబర్‌లో కొందరి సహకారంతో ఒక అర్ధరాత్రి నడుస్తూనే రొమేనియా సరిహద్దు దాటింది. ఆపై హంగరీ, ఆస్ట్రియా మీదుగా వెళ్లి మొత్తానికి అమెరికా విమానం ఎక్కింది. అక్కడ ఆమెకు తగిన సహకారం, గౌరవం లభించాయి. తర్వాత కొన్ని వారాలకే రొమేనియా విప్లవంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలి ప్రజాస్వామ్యం రావడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. గతంలో తనకు స్నేహితుడిగా ఉన్న అమెరికా జిమ్నాస్ట్, రెండు ఒలింపిక్స్ స్వర్ణాల విజేత బార్ట్ కానర్‌ను 1996లో వివాహమాడింది. స్వదేశానికి తిరిగొచ్చి రొమేనియా రాజధాని బుకారెస్ట్లోనే ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. రిటైర్మెంట్ తర్వాత కూడా వేర్వేరు హోదాల్లో ప్రపంచ జిమ్నాస్టిక్స్తో నాదియా అనుబంధం కొనసాగుతోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
అంతిమ యాత్రకు వెళ్లి.. 18 మంది అనంత లోకాలకు..
కోల్‌కత: పశ్చిమబెంగాల్ రాష్ట్రం నడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది అసువులు బాశారు. సుమారు 35 మందితో వెళ్తున్న మినీ ట్రక్కు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. చక్డా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా అతని కుటుంబసభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని తీసుకుని నవద్వీప్ శ్మశానవాటికకు మినీ ట్రక్కులో బయలుదేరారు. తెల్లవారుజామున వారి ట్రాక్‌కు హన్షకలీ సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కులోని 12 మంది అక్కడకక్కడే చనిపోగా ఆరుగురు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఐదుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (చదవండి: వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి) -
అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది
తాలిబన్లు చెప్పే మాటలు న మ్మకండి. వాళ్లు చేసే ప్రమాణాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీరు మీ కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌లో నివసిస్తోన్న అఫ్గాన్ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్. ప్రస్తుతం నదియా అఫ్గాన్‌లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. ‘‘నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ మాతృదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు.గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు’’ అని వణికిపోతోంది. నదియా ఇంతగా భయపడడానికి... గతంలో తాలిబన్ల అరాచకాల వల్ల తను అనుభవించిన నరకయాతనలే. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తున్న రోజులవి. అప్పుడు నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. ఒక బాంబు దాడి కుటుంబాన్నే నాశనం చేసింది. ఇది ఇలా ఉండగా... అదే సమయంలో ‘‘మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు’’ అని తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఒకపక్క అన్నయ్య లేడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా కాదు కదా! అనుకుని బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇలా పదేళ్ల పాటు తన బాల్యాన్ని, గుర్తింపును కోల్పోయి బతికింది. పదేళ్ల తరవాత ఓ ఎన్జీవో సాయంతో స్పెయిన్‌కు శరణార్థిగా వెళ్లింది. స్పెయిన్ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం ‘‘పాంట్స్ పర్ లా పావ్’’ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. అంతేగాక చిన్నతనంలోనే అనేక కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన నదియా అనుభవాలతో ‘‘ద సీక్రెట్ ఆఫ్ మై టర్బన్’’, టేల్స్ దట్ హీల్డ్ మీ’’, ‘‘ద ఫస్ట్ స్టార్ ఆఫ్ ది నైట్’’ పుస్తకాలను రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. తనలా ఇంకెంతమందో... ఇన్ని కష్టాలు పడిన నదియా ఇప్పటికీ ఆ చీకటిరోజులను మర్చిపోలేక పోతోంది. తాజాగా తాలిబన్లు మరోసారి పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎంతటిదారుణమైన చర్యలకు పాల్పడతారోనని వణికి పోతుంది. తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘‘ప్లీజ్ మా దేశానికి గన్స్ సరఫరా చేయకండి. నా దేశం గత యాభై ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. అఫ్గాన్‌లో 85 శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నిజంగా మీరు మాకు సాయం చేయాలంటే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మహిళలు చదువుకునేందుకు సహకరించండి’’ అని అంతర్జాతీయ సమాజాన్ని అర్థిస్తోంది. అంతేగాదు, గత పదిరోజులుగా అఫ్గాన్ నుంచి ప్రజలను తరలించేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. నిజంగా కష్టాలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుంది అనడానికి నదియా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నదియా గులామ్ -
RAPO19 యూనిట్‌కు శంకర్ సడన్ సర్ప్రైజ్!
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఓ ప్రేమ పాటను శంకర్‌కు వినిపించగా, ఆయన బాగుందని ప్రశంసించారని చిత్రబృందం తెలిపింది. -
పేటలోకి ఎంట్రీ
‘మిర్చి, అత్తారింటికి దారేది, అఆ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా కీలక పాత్రలు చేసి, మెప్పించారు నదియా. ఆమె మరో పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. నితిన్ హీరోగా రూపొందనున్న ‘పవర్‌పేట’లో ఓ కీలక పాత్రకు నదియాని సంప్రదించారట. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిసింది. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం తర్వాత హీరో నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో కీర్తీ సురేష్ కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కథరీత్యా ఇందులో నితిన్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. నితిన్ లుక్స్ కోసం హాలీవుడ్ మేకప్‌మేన్‌ని తీసుకోబోతున్నారట టీమ్. ఈ చిత్రం రెండు భాగాల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
స్పెయిన్‌లో సందడి
మరో ఇరవై రోజులు స్పెయిన్‌లోనే గడపనున్నారు కీర్తీ సురేశ్. ఈ నెలాఖరకు గానీ ఇండియా రారని తెలిసింది. స్పెయిన్‌లో ఈ లాంగ్ స్టే తన కొత్త చిత్రం కోసమే. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. జూన్ 11న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను స్పెయిన్‌లో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ జూలై 26 వరకూ సాగనుందని తెలిసింది. ఇటీవలే నదియా, కీర్తీ సురేశ్‌లపై కీలక సన్నివేశాలను షూట్ చేశారట. నదియా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. స్పెయిన్ షెడ్యూల్‌తో ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోనుందని తెలిసింది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. మహేశ్ కోనేరు నిర్మాత. ‘మహానటి’ ఫేమ్ డ్యానీ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
అందరూ మహిళలే...
‘మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం’ వంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు చేసి గ్రాండ్ రీ–ఏంట్రీ ఇచ్చారు నదియా. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘తిరైక్కు వరాద కథై’. తులసీ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘దేవి’ పేరుతో అనువాదమైంది. కె.కె.ఆర్. క్రియేషన్స్ పతాకంపై కె. ప్రియభారతి సమర్పణలో కర్రి సత్యనారాయణరెడ్డి, కె. కృష్ణ, సబ్బిళ్ళ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే స్పెషల్ సి.బి.ఐ అధికారిగా నదియా అద్భుతంగా నటించారు. కొందరు సాంకేతిక నిపుణులు మినహా మిగతా అందరూ మహిళలే పని చేసిన చిత్రం ఇది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌తో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. తమిళంలో హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో మేము అనువదించాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. ఈ నెలాఖర్లో చిత్రాన్ని విడుదల చేయ డానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. కోవై సరళ, ఇనియా, శోభికా మోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం.జి. శ్రీకుమార్ సంగీతం అందించారు. -
తమిళ తెరకు దారి!
తెలుగులో హిట్టయిన ‘100% లవ్’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలు తమిళంలో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడీ దారిలో మరో సినిమా చేరింది. ఆ సినిమా ‘అత్తారింటికి దారేది’. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకుంది. నవంబర్ 29న విడుదల కానున్న రజనీకాంత్ ‘2.0’ని నిర్మించింది లైకానే. ఇంకా పలు భారీ చిత్రాలను నిర్మించడంతో పాటు విడుదల కూడా చేస్తుంటుంది. ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారు? అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అత్త పాత్రకు మాత్రం నదియానే తీసుకుంటారని ఊహించవచ్చు. ఎందుకంటే తెలుగు వెర్షన్లో అత్త పాత్రను ఆమె బ్రహ్మాండంగా చేసిన విషయం సినిమా చూసినవారికి గుర్తుండే ఉంటుంది. -
ఎవరీ అందగత్తె?
తమిళసినిమా: ఈ ఫొటోలో యవ్వనవతిగా కనిపిస్తున్న అందగత్తె ఎవరో చెప్పగలరా? చిన్న క్లూ ఇస్తున్నాం. ఆమె మగువ వేషంలో ఉన్న మగాడు. రూప కళ కూడా నానాటికి ఆధునీకతను సంతరించుకుంటోందనడానికిదో మచ్చుతునక. చిత్రాల్లో కథానాయకులు సందర్భాన్ని బట్టి అమ్మాయిల రూపంలోకి మారిపోతుంటారు. అలా ఆడవేషంలో రజనీకాంత్, కమలహాసన్ నుంచి ఈ తరం వారిలోనూ చాలా మంది నటించి అలరించారు. ముఖ్యంగా కమలహాసన్ అవ్వైషణ్ముకి, ప్రశాంత్ ఆన్అళగన్ చిత్రాల్లో ఆడవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా అవతారమెత్తి, హావభావాలను పలికించి మెప్పించారు. ఇటీవల నటుడు శివకార్తికేయన్ కూడా రెమో చిత్రంలో అందమైన నర్సుగా మురిపించి విజయాన్ని అందుకున్నారు. మరి ఈ తాజా సుందరి ఎవరో గ్రహించారా? ఎస్. పై ఫొటోలో అందగత్తెలా కనిపిస్తున్నది నటుడు విజయ్‌సేతుపతినే. ఈయనిప్పుడు మంచి రైజింగ్‌లో ఉన్నారు. విజయ్‌సేతుపతి కాల్షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారనే చెప్పవచ్చు. ఇంతకు ముందు అరణ్యకాండం వంటి విమర్శకులను సైతం మెప్పించిన చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన కుమారరాజా తాజాగా విజయ్‌సేతుపతి కథానాయకుడిగా చిత్రం చేయబోతున్నారు. ఇందులో ఆయన హిజ్రాగా నటించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ అందమైన అమ్మాయి రూపంలో ఉన్న విజయ్‌సేతుపతి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఈ పాత్ర పేరు శిల్ప అట. మరి ఈ శిల్ప పాత్ర అమ్మాయా? లేక ఇప్పటికే ప్రచారంలో ఉన్న హిజ్రానా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇందులో నటి సమంత కథానాయకిగా నటించనున్నారు. నదియా, దర్శకుడు మిష్కిన్, గాయత్రి, భాగవతి ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సూపర్‌డీలక్స్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నలన్‌కుమారస్వామి, నలన్శంకర్, మిష్కిన్, కుమారరాజా నలుగురు దర్శకులు కథను తయారు చేశారు. దీనికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, ఛాయాగ్రహణం, పీఎస్.వినోద్, నీరవ్‌షా అందించనున్నారు. ఈ చిత్రాన్ని టైలర్సుడన్, కినో ఫిస్ట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. -
ఉగ్రకాళి
నరకానికి వెళ్లొచ్చినవాళ్లు మళ్లీ నరకానికి వెళ్లాలని అనుకోరు. కానీ.. నదియా అనుకుంది. నదియాను కిడ్నాప్ చేశారు. అత్యాచారం జరిపారు. లైంగికంగా హింసించారు. ‘సెక్స్ స్లేవ్’గా మార్చి ఊడిగం చేయించుకున్నారు. ప్రాణాలు కళ్లల్లోకి వస్తుండగా తప్పించుకుంది నదియా. ఇప్పుడు మళ్లీ ఆ నరకకూపంలోకి వెళ్లాలనుకుంటోంది. అయితే ఈసారి బాధితురాలిగా కాదు.. బందీలుగా ఉన్నవారిని విడిపించే యోధురాలిగా! ‘ఐసిస్’ చెరలోని ఐదువేల మంది ఆడపిల్లల విముక్తి కోసం... నదియా.. ఉగ్రరూపం ధరించారు. అగ్రరాజ్యాల సహకారంతో ఉగ్రకాళి అవతారం ఎత్తారు. నదియా ‘ఫైట్’ నదియా కిడ్నాప్ : 2014 ఆగస్టు నరకయాతన : మూడు నెలలు నదియా తప్పించుకుంది : 2014 నవంబర్ నదియాను తప్పించింది : ఓ స్వచ్ఛంద సంస్థ అజ్ఞాత ప్రయాణాలు : ఒక ఏడాది (2015) సమితి ముందు సాక్ష్యం : 2015 డిసెంబర్ ప్రస్తుత నివాసం : జర్మనీ ప్రస్తుత కార్యాచరణ : యువతుల విముక్తి 2014 జూలై. ఉత్తర ఇరాక్‌లోని కోకో గ్రామం. ఆ గ్రామంలోనే నదియా కుటుంబం నివాసం ఉంటోంది. తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. నాన్న లేడు. తను డిగ్రీ చదువుతోంది. హిస్టరీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్. హిస్టరీ టీచర్ కావడం నదియా జీవిత ధ్యేయం. చిన్నప్పటి నుంచి ప్రశాంతమైన జీవితం. అయితే ఆ ప్రశాంతతను ఓరోజు నదియా ఇంట్లోని టీవీ భగ్నం చేసింది. ఆమెను భయకంపితురాలిని చేసింది. టీవీలో ఎవరో ఎవర్నో చంపిన ఫొటోలు. అతి కిరాతకంగా తల నరికి, చేతులు నరికి చంపారు. నదియా భయపడిపోంది. ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ అంతటి ఘోరాలకు పాల్పడిందని తెలిసి హడలిపోయింది. ఆ సంస్థ సభ్యులు తమ యాజిడీ తెగ మనుషులను ఇస్లాంలోకి మార్చుకోవడం కోసం గ్రామాల్లోకి ప్రవేశించారని తెలిసి చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే... ఆగస్టు 15, 2014. కోకో గ్రామంలో కలకలం. ఐసిస్ ‘ఫైటర్స్’ (ఈ ఉగ్రవాద మూకలు తమను అలా పిలుచుకుంటాయి) వీధుల్లో విశృంఖలంగా తిరుగుతూ ఇళ్లలోంచి అందర్నీ బయటికి రమ్మని ఆదేశిస్తున్నాయి. గ్రామస్థులందరినీ ఊరి పొలిమేరకు తరలించాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు.. అందర్నీ ఊరి చివర్న ఉన్న ఒక బడి భవనం దగ్గరకు రప్పించాయి. అది మధ్యాహ్న భోజన సమయం. ఆ సమయానికి నదియా, ఆమె చెల్లెళ్లు ఇంటికి వస్తూ ఉన్నారు. వారికి ప్రతి చోటా కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్లలో కొందరు మాస్కులు ధరించి ఉన్నారు. ఏవో తెలియని భాషల్లో మాట్లాడుకుంటున్నారు. జరగరానిది ఏదో జరగబోతోందని అర్థమవుతోంది నదియాకు. పూర్తిగా అర్థమయ్యేలోపే ఆమెనూ బందీగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. అమ్మాయిలే ‘ఐసిస్’ టార్గెట్ అందర్నీ ఒకచోట చేర్చాక మగవాళ్లను, మహిళలను వేరు చేసింది ఐసిస్. అలా.. నదియా, మరికొందరు మహిళలు పాఠశాల భవనంలోని రెండో అంతస్థులో బందీ అయ్యారు. తర్వాత ఒక్క గంటలో ఐసిస్ ముఠా 312 మందిని చంపేసింది. చనిపోయిన వారిలో నదియా సొంత అన్నదమ్ములు, చిన్నాన్న పెదనాన్నల కొడుకులు ఆరుగురు ఉన్నారు. నదియా కళ్ల ముందే అతి కిరాతకంగా వారిని చంపేశారు. ఎంపిక.. పంపకం.. ఇక మిగిలింది నదియా, ఆమెలాంటి కొంతమంది అందమైన యువతులు! వీళ్లందరిని ఇరాక్ పట్టణం మోసుల్కు తరలించారు. అక్కడ మూడు రోజులు నిర్బంధించి, వాళ్లలో వాళ్లు ‘పంచుకున్నారు’! నదియా బందీగా ఉన్న భవంతిలోని ఒక గదిలోనైతే రక్తపు చారికలు, రక్తవర్ణ హస్తముద్రలు కనిపించాయి. హింసకు తాళలేక మహిళలు చేసిన ఆక్రందనలు కూడా నదియాను భయకంపితురాలిని చేశాయి. ఫొటోలు తీసి.. ఫోన్ నెంబర్లు వేసి... నదియాతో పాటు మోసుల్‌లోని నిర్బంధ గృహంలో ఉన్న యువతుల దిన చర్య ఉదయాన్నే బలవంతపు స్నానాలతో మొదలయ్యేది. తర్వాత వారిని షరియా కోర్టుకు చేర్చేవారు. అక్కడ విడివిడిగా ఒక్కొక్కరినీ ఫొటో తీసేవారు. ఫొటోలను కోర్టు లోపలి గోడలకు అంటించేవారు. ఫొటో కింద అప్పటికి ఆ అమ్మాయి ఎవరి అధీనంలో ఉందో ఆ ఉగ్రవాది లేదా కమాండర్ ఫోన్ నెంబరు రాసేవారు. ఫొటోలోని అమ్మాయి నచ్చితే ఆ నెంబరుకు ఫోన్ చేసి బేరం కుదుర్చుకోవచ్చు. డబ్బుల బేరం కాదు. అమ్మాయిలను మార్చుకునే బేరం. నదియా వంతు ఓ రోజు నదియా వంతు వచ్చింది. ఓ ఎత్తుపళ్లవాడు నదియాను ఒక గదికి తీసుకెళ్లాడు. రెండు వైపుల తలుపులు ఉన్న గది అది. అందులో వాడు రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేసేవాడు. అతడికి భార్య, శారా అనే కూతురు ఉన్నారని, అక్కడికి దగ్గర్లోనే ఓ ఇంట్లో వాళ్లు ఉంటున్నారని వాడి మాటల్లో నదియాకు తెలిసింది. రెండో రోజు నదియాను వాడు మోసుల్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి వాడు నదియాను శుభ్రంగా స్నానం చేసి రమ్మన్నాడు. మంచి బట్టలు వేసుకుని రమ్మన్నాడు. తనకు నచ్చలేదని వాటిని విప్పించి, వేరే వాటిని కట్టించాడు. తర్వాత ఆమె ఇష్టాయిష్టాలతో, ఆమె దేహస్థితితో సంబంధం లేకుండా ఆమెపై అనేకసార్లు అత్యాచారం జరిపాడు. ఆ హింసను తట్టుకోలేక మధ్యలో ఒకసారి పారిపోదామని ప్రయత్నించింది నదియా. ఆ కోపంతో ఆమెను చావబాదాడు వాడు. వివస్త్రను చేశాడు. అలాగే ఈడ్చుకెళ్లి ఆరుగురు ఉగ్రవాదులు ఉన్న ఓ గదిలోకి విసిరేశాడు. ఆమె పలుమార్లు స్పృహకోల్పోయేంతగా ఆ ఆరుగురు ఆమెపై అత్యాచారం జరిపారు. ఆమె శరీరంతో ఇష్టానుసారం ప్రవర్తించారు. పంతం పట్టి తప్పించుకుంది! కొన్నాళ్లు ఆ గదిలో జీవచ్ఛవంలా గడిపింది నదియా. ఎవరెవరో వచ్చేవారు. ఒకరి తర్వాత ఒకరు నదియాను ఇచ్చిపుచ్చుకునేవారు. ఒంట్లో ప్రాణాలు కళ్లల్లోకి వచ్చేశాయి నదియాకు. కానీ చావకూడదనుకుంది. వాళ్లకు వాళ్లుగా చంపితే తప్ప, తనకు తానుగా చావకూడదనుకుంది. బతికి బట్టకట్టాలనుకుంది. బయటి ప్రపంచంలోకి వెళ్లి ఇక్కడ జరుగుతున్న ఘోరాల గురించి గొంతెత్తి అరిచి చెప్పాలని పంతం పట్టింది. చివరికి 2014 నవంబరులో ఓ రోజు ఆ ముష్కరుల కన్నుగప్పి తప్పించుకుంది. అమెను బందీగా ఉంచినవాడు తాళం వేయడం మర్చిపోయి వెళ్లడంతో నదియా తప్పించునే సాహసం చేసింది. అక్కడి నుంచి శరణార్థి శిబిరానికి చేరుకుంది. విడిపించే వరకు విశ్రమించేది లేదు నదియా చదువుకున్న అమ్మాయి, తెలివైన అమ్మాయి కావడంతో శిబిరం నిర్వాహకులు ఆమెకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఐసిస్ నుండి తప్పించుకుని వచ్చిన వారిని పునరావాసం కోసం జర్మనీ తరలించడం ఆమె బాధ్యత. జర్మనీలో కొన్ని రోజులు ఉన్నాక అక్కడి నుంచి ఆమె అమెరికా వెళ్లింది. ఐసిస్ బందీలుగా చిక్కుతున్న యాజిడీ అమ్మాయిల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఆమె చేత ఈ ప్రత్యక్ష సాక్ష్యాన్నంతా ఇప్పించింది యాజిడీ అనే స్వచ్ఛంద సంస్థ. ప్రస్తుతం నదియా... ‘ఐసిస్ చెరలో ఉన్న యువతులను విడిపించాలి’ అన్న ఒకే ఒక లక్ష్యంతో ప్రపంచం అంతా పర్యటిస్తోంది. మరోవైపు ఆమెను హతమార్చే లక్ష్యంతో ఐసిస్ కూడా ఆమె కదలికలపై నిఘా వేసి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నదియా ‘టైమ్’ ‘టైమ్’ మేగజైన్ ఏటా 100 మంది వ్యక్తుల జాబితాతో ప్రత్యేక సంచికను విడుదల చేస్తుంటుంది. ఆ జాబితాలో ఏడాది పోప్ ఫ్రాన్సిస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి వారితో పాటు నదియా మూరద్ కూడా ఉన్నారు. ‘కఠోర వాస్తవాలపై వెలుగును ప్రసరింపజేసిన ధ్రువతార’ అని నదియాను కీర్తించింది టైమ్ పత్రిక. నదియా ‘నోబెల్’ ఐసిస్ కబంధహస్తాల నుంచి తప్పించుకుని వచ్చి, ఆ ఉగ్రవాద సంస్థ నికృష్ట రూపాన్ని బట్టబయలు చేసిన యాజిడీ తెగ యువతి నదియా మూరద్ను ఇరాక్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ‘స్త్రీజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ఒక చీకటి శక్తితో పోరాడుతున్న ధీశాలి’ అని నదియాను శ్లాఘించింది. -
రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
కోల్కత్తా : పశ్చిమబెంగాల్ నాడియా జిల్లాలోని గరోలియాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోల్కత్తా వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రయిలర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను శాంతిపూర్, రంఘాట్ ఆసుపత్రులకు తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని... వారిని కృష్ణనగర్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ బస్సు మాల్డా నుంచి కోల్కత్తా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. బస్సు డ్రైవర్, బస్సులోని ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
బత్తిలి అబ్బాయి... ఉక్రెయిన్ అమ్మాయి
భామిని: విదేశీ అమ్మాయి... భారత దేశ సంస్కృతికి మెచ్చి ఇక్కడి అబ్బాయితో ప్రేమ వివాహం చేసుకున్న సంఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. రష్యా సమీపంలోని ఉక్రెయిన్‌కు చెందిన యువతి నడియా గ్లాడ్కా విద్యాభ్యాసం నిమిత్తం ఒడిశాలోని భువనేశ్వర్ వచ్చారు. అదే కళాశాలలో శ్రీకాకుళంజిల్లా భామిని మండలం బత్తిలికి చెందిన దేవకుమార్(దేబ్) విద్యనభ్యసిస్తున్నారు. వీరిద్దరికీ ముంబయిలోనే ఉద్యోగం లభించింది. వీరిమధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి మనసులు కలిశాయి. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడిన ఆమె దేవకుమార్‌తో వివాహానికి అంగీకరించింది. పెద్దల అంగీకారంతో బత్తిలి రోమన్ కేథలిక్ చర్చిలో బుధవారం వివాహం జరిగింది. చర్చి ఫాదర్ జోజిబాబు కొత్త జంటతో ప్రమాణం చేయించి, నూతన దంపతులుగా ప్రకటించారు. కుల పెద్దల సమక్షంలో మత పెద్దల ఆశ్వీర్వచనాలతో ముత్యాల దండలు మార్చుకొని, కేక్‌ను కట్ చేసి ఒక్కటయ్యారు. స్థానిక కుల పెద్దలు మీసాల భాస్కరరావు, నిమ్మల దాస్‌తో పాటు మాజీ ఎంపీపీ టింగ శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. -
హృదయాన్ని కదిలించిన చిన్నారి!
బాల్యానికి ఏదీ నేర్పక్కర్లేదు.. అన్నీ తనే నే ర్చేసుకుంటుంది. ప్రపంచం తనతో ప్రవర్తించే తీరుకు తగినట్టుగా స్పందిస్తుంది. నవ్వితే నవ్వుతుంది.. ఏడిపిస్తే ఏడుస్తుంది! భయపెడితే... భయపడుతుంది. అప్పుడప్పుడు ఆ భయం... భయపెట్టే వారి హృదయాన్ని సైతం ద్రవింపజేస్తుంది. గాజా.. ఇరాక్.. సిరియా.. ఎక్కడైతేనేం కరుడుగట్టిన మతోన్మాదం, యుద్ధోన్మాదం పసిపాపలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో చెప్పడానికి మరే మాటలూ అవసరం లేదు. ఈ ఫోటో చాలు. నదియా అబుషబాన్ అనే లేడీ ఫోటో జర్నలిస్టు సిరియాలో తీసిన ఛాయా చిత్రమిది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అక్కడ సృష్టిస్తున్న విలయతాండవాన్ని చిత్రీకరించడానికి అక్కడకు వెళ్లిన నదియా అక్కడే కనిపించిన ఒక పసిపాపను ముద్దుగా ఫొటో తీయబోయింది. అది గమనించిన ఆ చిన్నారి వెంటనే రెండు చేతులూ పెకైత్తింది! ‘నేను లొంగిపోతున్నా.. నన్నేం చేయద్దు..’ అన్న వేడుకోలు అది! నదియా చేతిలోని కెమెరాను చూసి దాన్ని వెపన్‌గా భ్రమపడింది ఆ పసిపాప. ఎక్కడ తనను కాల్చి చంపుతుందో అనే భయంతో రెండు చేతులూ పెకైత్తి తను లొంగిపోతానని వేడుకొంది. నిర్ఘాంతపోవడం ఆ ఫోటో జర్నలిస్టువంతయ్యింది. ఇదీ ఐఎస్ టైజం విశృంఖలంగా రెచ్చిపోతున్న ప్రాంతంలోని చిన్నారుల పరిస్థితి. అనునిత్యం తుపాకీ పేలుళ్ల మధ్య, గొంతులు కోసి ఆనందిస్తున్న ఉగ్రవాదుల మధ్య ఉంటున్న పిల్లల పరిస్థితి ఇది. అక్కడ పుట్టడమే వారు చేసుకున్న పాపం. ఈ ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది నదియా. సోషల్ నెట్వర్క్ సైట్లలో దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కళ్లలో తడి. -
సన్యాసినిపై గ్యాంగ్ రేప్ కేసులో 8 మంది అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని ఓ కాన్వెంట్ స్కూల్లో క్రైస్తవ సన్యాసిని(71)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఆదివారం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, జిల్లాలో గాలింపు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ అర్నాబ్ వెల్లడించారు. అయితే అరెస్టయిన వారిలో.. కాన్వెంట్‌లోని సీసీ ఫుటేజీల్లో కనిపించిన నలుగురు దుండగులు ఉన్నారో లేదో తెలియడం లేదు. రాణాఘాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. గంగ్నపూర్లోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లోకి శనివారం తెల్లవారుజామున చొరబడిన దొంగలు సన్యాసినిపై అఘాయిత్యానికి పాల్పడి, రూ.12 లక్షలు దోచుకెళ్లడం తెలిసిందే. కాగా, బాధితురాలికి చంపుతామని బెదిరింపులు రావడంతో ఆమె పోలీసు రక్షణ కోరారని బంగీయ క్రైస్తవ పరిసెబ అధ్యక్షుడు హెరోద్ మల్లిక్ చెప్పారు. ఈ అత్యాచారాన్ని కాంగ్రెస్ నేత పీసీ చాకో, ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషీ ఖండించారు. -
ఓటేయమంటున్న ధోతీ కట్టుకున్న 'లేడి'
బెంగాల్ లోని నదియా జిల్లాలో ఓటు వేయడాన్ని ప్రొత్సహించేందుకు ఎన్నికల సంఘం వినూత్న పద్థతిని ఎంచుకుంది. నదియాలో 67 హెక్టేర్ల విస్తీర్ణంలో బేతువాదహారి అభయారణ్యం ఉంది. అందులో మచ్చల లేడి చాలా ఫేమస్. అందుకే ఆ జిల్లాలో ఓటింగ్ ను ప్రోత్సహించేందుకు మచ్చల లేడిని ఎంచుకుంది. ధోతీ కట్టిన మచ్చల లేడి బొమ్మ ఇప్పుడు జిల్లా అంతటా దర్శనమిస్తోంది. దానిని మృగబాబు అని పేరు పెట్టి, మృగబాబు చేత ప్రజలను ఓటేయమని అడిగే పోస్టర్లు వెలిశాయి. జిల్లాలో రెండు లోకసభ నియోజవకర్గాలున్నాయి. అవి కృష్ణ నగర్, రాణాఘాట్. ఈ రెండింటిలో దాదాపు 37 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గాల్లో మే 12 న పోలింగ్ జరుగుతుంది. -
నదియాను చూసి నేర్చుకోండి!
ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా ఇంజనీరింగ్ చదువుని పూర్తిచేసిన నదియా తోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది. జీవితంలో గెలవడానికి తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. ఒంటిరితనం మనిషిని గట్టిపరుస్తుంది. ఎదురీదడం నేర్పుతుంది. తోడులేని జీవితాలకు ధైర్యం, పట్టుదలలే నిజమైన అండ అని గుర్తించిన ప్రతి ఒక్క మహిళా జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. నదియా అలాంటి మహిళే. ఇరాక్‌లోని బాగ్దాద్ ప్రాంతానికి చెందిన నదియా పెళ్లయిన ఐదేళ్లకే భర్తను పోగొట్టుకుంది. ఇద్దరు పిల్లల్ని వెంటబెట్టుకుని పుట్టింట్లో దిగిన నదియా మరొకరిపై ఆధారపడానికి ఇష్టపడలేదు. సంప్రదాయ పొరలను చీల్చుకుంటూ ఒంటరిగా బతుకుతూనే, తనలాంటి పదిమంది మహిళలకు అండగా నిలబడింది. తల్లితండ్రీ, ఇద్దరు అన్నలు, వదినలు, వారి పిల్లలు...ఇరుకింట్లో ఒకరికొకరు ఎలాగో సర్దుకుంటున్నారు. నదియా అడుగుపెట్టాక మరింత ఇరుకైంది. ‘నేను ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటానమ్మా’ అంటూ తల్లిని అడగ్గానే ఇంట్లోవాళ్లంతా ససేమిరా అన్నారు. ‘మాతోపాటే నువ్వూ...మాకున్నదానిలో నీకు, నీ పిల్లలకు పెడతాం. భర్తని పోగొట్టుకున్న ఆడది వీధిలో కాలు పెట్టడం ఎంతటి తప్పో నీకు తెలియదా!’ అన్నారు. దాంతో, ఇంట్లో ఉంటూనే ఆమె రకరకాల వ్యాపారాలు చేసి నాలుగు డబ్బులు సంపాదించింది. ఇంతలో ‘ఇంటర్నేషనల్ మెడికల్ కోర్ వాళ్లు మహిళలకు విద్య, ఉద్యోగ, స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ చేరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో చదువుకున్న నదియాకు అక్కడ శిక్షకురాలిగా ఉద్యోగం వచ్చింది. ఒక పక్క శిక్షణ ఇస్తూనే మరోపక్క లింగవివక్ష, స్వయం ఉపాధి, ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఉచితంగా మహిళలకు కౌన్సెలింగ్‌లు చేయసాగింది. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా ఇంజనీరింగ్ చదువుని పూర్తిచేసిన నదియా తోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది. నదియా జీవితంలో గెలవడానికి తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ‘ఇంటర్నేషనల్ మెడికల్ కోర్’వాళ్లు నదియాను ఒక ఉద్యోగినిగానే కాదు ఒంటరి మహిళలకు స్ఫూర్తిగా పరిచయం చేస్తున్నారు.