సినిమాల్లో హీరోలు చేసే స్టంట్ సీన్‌లను కళ్లను పెద్దవిగా చేసుకుని మరీ చూసేస్తాం. అంతలా చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. అయితే హీరోయిన్ల విషయానికి వస్తే అలాంటి సీన్ ఉండవు. లేడీ ఓరియంటెడ్ మూవీల్లో తప్పా.. అది కూడా అన్యాయాన్ని ఎదిరించే వీర వనితలాంటి పాత్ర అయితేనే ఫైటింగ్ సీన్‌లు లేదంటే ఉండవు. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో మహిళలను ఆ రేంజ్‌లో చూపించే ఛాన్సే లేదు.
అయితే ఆ టైంలో ఒక అమ్మాయి అందర్నీ ఆశ్చర్యపరిచేలా స్టంట్‌లు చేసి వావ్ అనిపించుకుంది. కండలు తిరిగిన మగవాళ్లని ఒక్క ఊదుటన కట్టడి చేసే ఆమె తెగువకు అందరూ కంగుతిన్నారు. అమ్మాయిలు ఇలాంటివి కూడా చేయగలరనేందుకు ఆమె ప్రేరణగా నిలిచింది. ఆమె వల్లనే ఈనాడు సినిమాల్లో అమ్మాయిలకు మంచి స్టైలిష్ ఫైటింగ్ సీన్‌లు ఇచ్చారని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాంటే భారతదేశపు తొలి స్టంట్ విమెన్ ఆమె. ఎవరామె..ఎలా ఆమె సినీ ప్రస్థానం మొదలైందంటే..
ఫియర్‌లెస్ నదియా(Nadia)గా ప్రసిద్ధి చెందిన నటి-స్టంట్ విమెన్(Stuntwoman) మేరీ ఆన్ ఎవాన్స్ ఆరోజుల్లో అసాధారణమైన ఫైట్‌లతో ప్రేక్షకులను అలరించింది. 1908లో జన్మించిన నదియా అసామాన్యమైన ధైర్యం బలం, నిర్భయ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేది. అలనాటి బాలీవుడ్(Bollywood) మూవీ హనీ బన్నీలో అసామాన్యమైన ధైర్యసాహసాల గల హీరోయినే నదియా.
అందులో ఆమె చేసిన స్టంట్‌లు సినిమా వరకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె నిజజీవితంలో కూడా అలానే ఉంటారామె. ఆస్ట్రేలియా(Australia) మూలాలకు చెందిన నీలి కళ్ల అందగత్తె నదియా. ఆ రోజుల్లో మెకాలి ఎత్తు బూట్లువేసుకుని కొరడాతో ప్రత్యర్థులను చిత్తు చేసే హీరోయిన్‌గా ప్రేకక్షకులను మెప్పించింది. చెప్పాలంటే ఇలాంటి ధైర్యవంతమైన మహిళలను కూడా ఆదిరిస్తారు ప్రజలు అని తన నటనతో చాటిచెప్పింది.
వైవిధ్య భరితమైన సాహోసోపేతమైన పాత్రల చేసినందుకు గానూ ఆమెను హంటర్‌వాలి అని ముద్దుగా పిలుచుకునేవారు అభిమానులు. ఆస్ట్రేలియాలోని గ్రీకుకి చెందిన తల్లి పెర్త్, బ్రిటిష్ తండ్రి(British father)కి జన్మించింది ఎవాన్స్(నదియా). తన తండ్రి సైనిక విభాగంతో భారత్‌కు రావడంతో ఇక్కడ వచ్చింది. అయితే తండ్రి మరణంతో కుటుంబం మొత్తం బొంబాయిలోనే స్థిరపడింది. నటిగా కెరీర్ ప్రారంభించటానికి ముందు సర్కస్‌లో పనిచేసేది.
అక్కడ నృత్యం,గుర్రపుస్వారీల వంటి ప్రదర్శనలు ఇచ్చేది. అలా నటిగా కెరీర్‌ని చిన్న చిన్న పాటలతో ప్రారంభించింది. వాటికి ప్రేక్షకుల ఆదరణ లభించడమే గాక ఓ బాలీవుడ్ దర్శకుడుని దృష్టిలో పడేలా చేసింది. ఆయన ఆమెలోని ప్రతిభను గుర్తించి బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా పరిచయం చేశాడు. అలా ఆమె సినిరంగ ప్రవేశం చేయడమే గాక, మహిళలు స్టంట్ సీన్‌లను చేయగలరని ప్రూవ్ చేసింది.
ఆమె కెరీర్‌లో మైలు రాయి హంటర్‌వాలి మూవీ. అందులో తన తండ్రి మరణానికి న్యాయం కోరుతూ ప్రతీకారం తీర్చుకునే యువరాణిగా అలరించింది. ప్రజలు మదిలో ఆ పాత్ర నిలిచిపోయేలా నటించింది నదియా. ఆ విధంగా ఆమె బాలీవుడ్‌లో ప్రముఖ తారగా వెలుగొందింది. ఆమె సంతకం కూడా వెరైటీగా ఉంటుంది అరుపులాగా హే య్! అని క్యాచీగా సంతకం చేస్తుంది.
నదియా నిర్భయమైన మహిళగా విలన్లతో పోరాడే పాత్రలనే ఎక్కువగా చేసింది. ప్రజలు ఆమె స్టంట్‌లకు బ్రహ్మరథం పట్టేవారట. ఆమె కారణంగానే హీరోయిన్లకు ఇలాంటి పాత్రల ఇచ్చేలా మార్గం సుగమం అయ్యిందని అంటారు సినీ విశ్లేషకులు. అంతేగాదు బాలీవుడ్ కల్ట్ హోదా(విశేష ప్రజాదరణ)ను పొందిన విదేశీయులలో ఆమె కూడా ఒకరు. హీరోయిన్లంటే మాములు పాత్రలకే పరిమితమైన మూసధోరణిని బద్ధలు కొట్టి సాహసోపేతమైన విన్యాసాలను అవలీలగా చేయగలరని చెప్పేలా స్ఫూర్తిగా నిలిచింది. ఆమె 1996లో 88వ పుట్టిన రోజున మరణించారు. ఇప్పటికీ స్టంట్ విమెన్ అనగానే నదియా అని గుర్తొచ్చాలా ప్రజల మదిలో నిలిచిపోయారామె.
(చదవండి: ఆయన దూరమవ్వడానికి కారణం అదేనేమో..! ఈ వేదన, బాధను..)
Comments
Please login to add a commentAdd a comment