
కీర్తీ సురేశ్
మరో ఇరవై రోజులు స్పెయిన్‌లోనే గడపనున్నారు కీర్తీ సురేశ్. ఈ నెలాఖరకు గానీ ఇండియా రారని తెలిసింది. స్పెయిన్‌లో ఈ లాంగ్ స్టే తన కొత్త చిత్రం కోసమే. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. జూన్ 11న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను స్పెయిన్‌లో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ జూలై 26 వరకూ సాగనుందని తెలిసింది. ఇటీవలే నదియా, కీర్తీ సురేశ్‌లపై కీలక సన్నివేశాలను షూట్ చేశారట. నదియా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. స్పెయిన్ షెడ్యూల్‌తో ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోనుందని తెలిసింది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. మహేశ్ కోనేరు నిర్మాత. ‘మహానటి’ ఫేమ్ డ్యానీ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment