RAPO19 యూనిట్‌కు శంకర్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌! | Director Shankar pays surprise visit to Ram Pothineni shooting set | Sakshi
Sakshi News home page

RAPO 19: సెట్స్‌లోకి అనుకోని అతిథి!

Published Thu, Jul 15 2021 12:43 AM | Last Updated on Thu, Jul 15 2021 7:44 AM

Director Shankar pays surprise visit to Ram Pothineni shooting set - Sakshi

శంకర్‌తో కృతీ శెట్టి, నదియా, లింగుసామి, రామ్, శ్రీనివాసా చిట్టూరి, సుజీత్‌ వాసుదేవ్‌

రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రముఖ దర్శకులు శంకర్‌ ఈ షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సమకూర్చిన ఓ ప్రేమ పాటను శంకర్‌కు వినిపించగా, ఆయన బాగుందని ప్రశంసించారని చిత్రబృందం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement