Lingusamy
-
డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్ ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో -
వారియర్ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు. చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. pic.twitter.com/aJujcEr01m — Lingusamy (@dirlingusamy) April 13, 2023 -
ఆ చిత్రం సీక్వెల్లో పూజా హెగ్డే.. ముచ్చటగా మూడోసారి!
తమిళసినిమా: ఇంతకుముందు వరకు తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగిపోయిన బ్యూటీ నటి పూజాహెగ్డే. అయితే ఎవరికైనా తాము నడిచే పయనంలో ఎత్తుపల్లాలు సహజమే. ప్రస్తుతం ఈమె నట పయనం అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. ఇటీవల తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తమిళంలో పదేళ్ల క్రితం నటించిన తొలి చిత్రం ముగమూడి ఇటీవల నటించిన బీస్ట్ చిత్రం పూజాహెగ్డేకు అపజయాలనే అందించాయి. అలాగని ఈ అమ్మడికి అవకాశాలు అడుగంటాయని చెప్పలేం. తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పైన పూజాహెగ్డే ఆశలన్నీ. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ముచ్చటగా మూడోసారి ఒక అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు పలు సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగసామి ఇప్పుడు ఒక మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి చిత్రాన్ని దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు సంచలన విజయం సాధించిన పైయ్యా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పైయ్యా చిత్రంలో నటుడు కార్తీ, తమన్న జంటగా నటించారు. తాజాగా నటుడు సూర్య, కార్తీ, శింబు వంటి నటులకు కథను వినిపించినా వారు ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో నటుడు ఆర్యను తన చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇందులో ఆయనకు జంటగా దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని జాన్వీకపూర్ తండ్రి, సినీ నిర్మాత బోనికపూర్ ఖండించారు. దీంతో దర్శకుడు లింగస్వామి నటి పూజాహెగ్డే ను తన చిత్రంలో నాయకిగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఖాదర్‌బాషా ఎండ్ల ముత్తు రామలింగం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిచేసి లింగసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడానికి ఇంకా కాస్త సమయం ఉంది. -
కోర్టులో ఫైన్ కట్టిన డైరెక్టర్ లింగుసామి
సినీ దర్శకుడు లింగుసామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న ఈయనపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ నుంచి దర్శకుడు లింగుసామి తీసుకున్న రూ.1.3 కోట్లు తిరిగి చెల్లించలేదని, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని పిటిషన్లో పేర్కొంది. కేసును విచారించిన న్యాయస్థానం దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో రూ.10 వేలును లింగస్వామి కోర్టుకు అపరాధ రుసుం చెల్లించాడు. ఈ కేసు తిరుపతి బ్రదర్స్ సంస్థకు సంబంధించిందని, ఈ వ్యవహారంలో తాము చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: (షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే) -
హీరో రామ్ 'ది వారియర్' సినిమా మూవీ స్టిల్స్
-
రామ్ పోతినేని - వారియర్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్
-
ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం హీరో రామ్ పోతినేని సరసన ఆమె నటించి తాజా చిత్రం 'ది వారియర్'. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్నా నెటిజన్లు! ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కృతిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నా మాతృభాష తుళు. తెలుగు కూడా బాగానే మాట్లాడుతాను. ఇప్పటికే వరకు నేను తెలుగు బాగా తెలిసిన డైరెక్టర్స్‌తోనే వర్క్ చేశాను. అయితే లింగుస్వామి గారు తమిళ డైరెక్టర్ కావడంతో భాష పరంగా కాస్తా ఇబ్బంది పడ్డాను. ఆయన తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు తమిళం తెలియదు. చదవండి: ఎన్టీఆర్ 30: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే! అందువల్ల ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు. అలా ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడ్డాను. కానీ రామ్‌కు తమిళ భాష బాగా తెలుసు. ఆయన సపోర్ట్ తీసుకున్నాను. డైరెక్టర్ ఏం చెబుతున్నారనేది నాకు రామ్ అర్థమయ్యేలా చెప్పేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అలవాటు పడిపోయాను’ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. ఇందులో తాను రేడియో జాకీగా కనిపిస్తానని, తన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని కృతి చెప్పింది. -
హీరో రామ్ ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
The Warrior: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్
‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. లింగూ.... (నవ్వుతూ) మీరు ముందు రోడ్ బాగా వేస్తే వెనకాలే మేం కూడా వచ్చేస్తాం (పొన్నియిన్ సెల్వన్ విడుదలను ఉద్దేశించి). ‘ది వారియర్’ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ది వారియర్’ చాలా మంచి టైటిల్. జీవితంలో ఏదో సాధించటానికి అందరం ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్. లింగుసామి నాకు మంచి స్నేహితుడు. కరోనా సమయంలో అండగా నిలబడ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ‘ది వారియర్’ పెద్ద హిట్ అవ్వాలి. ఈ ట్రైలర్ చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు ఎస్.జె.సూర్య, సెల్వమణి, కార్తీక్ సుబ్బరాజ్, హీరోలు విశాల్, ఆది పినిశెట్టి, ఆర్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ది వారియర్’ మూవీ 'విజిల్.. విజిల్..' సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
విజిల్ వేయించేలా 'ది వారియర్' విజిల్ సాంగ్..
Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను బయటకు వదిలింది చిత్రబృందం. ఈ సినిమాలోని 'విజిల్.. విజిల్..' అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్‌తో అందరి చేత విజిల్ వేయించేలా మ్యూజిక్ అందించాడు. సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్, సింగర్స్ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతంగా ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, కృతిశెట్టి వేసిన స్టెప్స్ పాటకు హైలెట్‌గా నిలవనున్నాయి. విడుదలైన అతి కొద్ది సమయంలోనే ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. Here’s the #WhistleSong from #TheWarriorrhttps://t.co/4v4ED7InOz All the best for a super success!! @dirlingusamy @ThisIsDSP @RamSayz @AadhiOfficial @IamKrithiShetty — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2022 -
రెహ్మాన్ జయంతి: కవితల పోటీలు నిర్వహించిన లింగుస్వామి
దివంగత ప్రఖ్యాత కవి అబ్దుల్ రెహ్మాన్ తనకు గురువులాంటి వారని దర్శకుడు లింగుస్వామి అన్నారు. రెహ్మాన్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునే విధంగా లింగుస్వామి కవితల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.10 వేలుతో పాటు మరో 50 మందికి తలా వెయ్యి రూపాయలు నగదును అందించారు. హైకూ కవిదై- 2022 పేరుతో స్థానిక కస్తూరి రంగన్ రోడ్డులోని రష్యా కల్చరల్ హాలులో జరిగిన ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించి (53 మంది రాసిన కవితలతో ముద్రించిన) హైకూ కవిదై - 2022 బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం లింగుస్వామి మాట్లాడుతూ ఇకపై ఏటా ఆయన పేరుతో కవితల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. చదవండి: నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్ ‘చింగారీ’ సాంగ్ ఫేం వలూశా డిసూజా గురించి ఈ విషయాలు తెలుసా? -
ఎనర్జిటిక్ హీరో రామ్ వారియర్ మూవీ టీజర్ వచ్చేసింది!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం వారియర్. పందెంకోడితో హిట్ దర్శకుడిగా తెలుగునాట పేరు సంపాదించిన లింగుసామి దర్శకత్వం వహించాడు. శనివారం(మే 14న) ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. 'పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నామప్పా.. ఇంతకుముందు సైలెంట్‌గ ఉండేటోళ్లు ఇప్పుడు వయొలెంట్‌గా లోపలేస్తాండారు.. ఈ మధ్య సత్య అని ఒకడొచ్చినాడు..' అంటూ హీరో రామ్ గురించి ఎలివేషన్ ఇచ్చారు. 'పాన్ ఇండియా సినిమా చూసుంటారు, పాన్ ఇండియా రౌడీలను చూశారా? డియర్ గ్యాంగ్స్టర్స్.. వీలైతే మారిపోండి, లేదంటే పారిపోండి' అని రామ్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ రోల్లో కనిపించగా హీరోయిన్ కృతీశెట్టి అందచందాలతో ఆకట్టుకుంటోంది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన వారియర్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్ కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో నటుడు శింబు బుల్లెట్ సాంగ్‌ను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం. చదవండి: నేనే కాదు, నా భర్త కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు: నటి జాన్ అబ్రహం, రకుల్ మూవీ 'యాక్షన్', ఎప్పటినుంచంటే? -
‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాటను ఆవిష్కరించిన ఉదయనిధి స్టాలిన్ (ఫోటోలు)
-
ఒక్క బుల్లెట్ సాంగ్‌కు మూడు కోట్లు ఖర్చు!
‘‘రామ్‌కు తమిళ భాష తెలియదనుకున్నాను. అయితే ఆయన ఇక్కడ పక్కా తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల క్రితం దర్శకుడు లింగుసామి ‘ది వారియర్’ ఆడియో ఫంక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నాను. అవి పూర్తయ్యాకే చేద్దాం అని చెప్పి, 21న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22కి మార్చారు’’ అని తమిళనాడు ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రామ్ హీరోగా నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘బుల్లెట్...’ అనే పాటను తమిళ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ఆడియోను ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘లింగుసామి దర్శకత్వంలో ఇంతకు ముందు నేనో సినిమా చేయాల్సింది. త్వరలో చేయనున్నాను. ఇక రామ్ నటించిన ‘ది వారియర్’ ఆయన ఇంతకు ముందు నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘లింగుసామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇందులో విలన్‌గా నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక్క ‘బుల్లెట్..’ పాట కోసమే నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు’’ అన్నారు లింగుసామి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లింగుసామితో సినిమా చేయాలనే ఆకాంక్ష ఈ ద్విభాషా చిత్రంతో నెరవేరింది. ‘బుల్లెట్..’ పాట పాడిన శింబుకు థ్యాంక్స్’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ది వారియర్’ నుంచి బుల్లెట్ సాంగ్ వచ్చేసింది
First Single Released From The Warrior Movie: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, ఆన్లైన్లో లీకైన సినిమా ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌సింగిల్ పేరుతో తొలి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించి ఎనర్జీటిక్ మ్యూజిక్, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్‌ను అందించాడు. -
స్టైలిష్ పోలీస్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తున్న రామ్
స్టైలిష్ పోలీస్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. ఆయన హీరోగా,కృతిశెట్టి హీరోయిన్గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషలో ఈ మూవీ తెరకెక్కుతుంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తాజాగా ఈ చిత్రం నుంచి రామ్ కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో రామ్ పవర్ఫుల్ పోలీసులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌లో రామ్..షార్ట్ హెయిర్ కట్, మీసాలు, కళ్ళలో ఇంటెన్స్‌తో రామ్ కొత్తగా కనిపించారు. ఇక ఉగాదికి మాత్రం స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మ్యాచో బైక్ మీద రామ్ వస్తుంటే... ఆయన యాటిట్యూడ్, స్వాగ్ అభిమానులు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని, రామ్, కృతిశెట్టిలపై పాటను చిత్రీకరిస్తున్నామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. Wishing you all a #HappyUgadi. Love..#RAPO #TheWarriorr #TheWarriorrOnJuly14 pic.twitter.com/mrZZwB0lle — RAm POthineni (@ramsayz) April 2, 2022 -
'సరైనోడు' తర్వాత మళ్లీ విలన్ పాత్రలో ఆది
Aadhi Pinisetty In RAPO19: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టి కథానాయికగా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టిని విలన్‌గా ఖరారు చేశారు. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించే అవకాశం దక్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'సరైనోడు తర్వాత మళ్లీ విలన్‌గా చేయాలంటే పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలనుకున్నాను. దర్శకుడు చెప్పిన కథ విన్నాక ఇది మామూలు రోల్ కాదనిపించింది. సాధారణంగా సినిమాల్లో విలన్ పాత్రకు డీటెయిలింగ్ ఉండదు. ఇందులో అది ఉంది. నాది కడప, కర్నూల్‌కు చెందిన రా అండ్ రస్టిక్ రోల్.. తమిళంలో మధురై బేస్‌లో ఉంటుంది. సరైనోడులో స్టైలిష్ విలన్‌గా చేశాక ఇందులో మళ్లీ విలన్ పాత్ర ఇంటరెస్టింగ్ గా అనిపించింది. ఓవైపు నా సినిమాలు నేను చేస్తూ డిఫరెంట్ షేడ్‌ను ఇందులో చూపించవచ్చు. `యూటర్న్` నిర్మాతలతో నాకు ఇది రెండో సినిమా. రామ్ చేసిన సినిమాలన్నీ చూశాను తను చాలా ఎనర్జిటిక్ గా చేస్తుంటారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. లింగుస్వామి గారు విలన్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించనున్నారు. ఈ కారణాల వల్లే ఈ సినిమా చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవకాశాలు నటుడిగా నన్ను నేను విస్తరించడానికి ఓ మంచి అవకాశం అనుకుంటున్నాను. షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందా అని ఎదురు చూస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి. -
RAPO19 యూనిట్‌కు శంకర్ సడన్ సర్ప్రైజ్!
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఓ ప్రేమ పాటను శంకర్‌కు వినిపించగా, ఆయన బాగుందని ప్రశంసించారని చిత్రబృందం తెలిపింది. -
‘పందెంకోడి 3’ వస్తుంది
‘‘పందెంకోడి 2’ వంటి మంచి హిట్ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి థ్యాంక్స్. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఠాగూర్’ మధు అన్నారు. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘పండక్కి విడుదలైన మూడు సినిమాలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. ‘పందెం కోడి 2’ విజయం పట్ల విశాల్ హ్యాపీగా ఉన్నారు. సీక్వెల్స్‌లో సక్సెస్ రేట్ తక్కువ. కానీ, ఫస్ట్ పార్ట్‌లోని పాత్రలతో సింక్ అయిన సీక్వెల్స్ సక్సెస్ అయ్యాయి. మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘పందెంకోడి 3’ కోసం విశాల్, లింగుస్వామి ఓ లైన్ అనుకున్నారు. సెకండ్ పార్ట్ రావడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. ఈసారి లేట్ అవ్వదు. విశాల్ ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘పందెంకోడి 3’ స్టార్ట్ అవుతుంది. నిఖిల్ నటించిన ‘ముద్ర’ సినిమా మా బ్యానర్లో రిలీజ్ అవుతుంది. ‘దేవ్, కాంచన 3’ సినిమాలను తెలుగులో మేం రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వీటితో పాటు తెలుగులో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
అమ్మ అవుతారా?
హెడ్డింగ్ చదవగానే ఏదేదో ఊహించుకునేరు. నయనతార తల్లి కాబోతున్నారేమో అన్నది మీ ఊహ అయితే తప్పులో కాలేసినట్లే. ఆన్‌స్క్రీన్ ‘అమ్మ’గా కనిపించబోతున్నారని చెబుతున్నాం. ఆల్రెడీ తల్లి పాత్ర చేశారు కదా.. ఇప్పుడు కొత్తేంటి అనుకుంటున్నారా? ఆ పాత్ర వేరు. ఈ ‘అమ్మ’ పాత్ర వేరు. తమిళనాట ప్రజలందరికీ ‘అమ్మ’ అయిన నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించబోతున్నారు నయన్. ప్రస్తుతం ఈ వార్త చెన్నైలో జోరుగా షికారు చేస్తోంది. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా మూడు బయోపిక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే నయన్ ఈ మూడు ప్రాజెక్ట్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్‌లో కాకుండా కొత్త చిత్రంలో ఈ పాత్ర పోషించనున్నారట. ‘పందెం కోడి’ ఫేమ్ లింగుస్వామి జయలలిత జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో నయనతారను టైటిల్ రోల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే... జయలలిత అంటే నయనతారకు చాలా అభిమానం. ఓ సందర్భంలో జయలలిత గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు – ‘‘జయలలితగారి పాత్రకు నేను సూట్ అవుతానో లేదో తెలియదు కానీ అవకాశం వస్తే మాత్రం చేయాలని ఉంది’’ అని నయనతార పేర్కొన్నారు. -
బన్నీ ద్విభాషా చిత్రం మొదలవుతోంది..!
కొద్ది రోజుల క్రితం బన్నీ ఓ స్ట్రయిట్ తమిళ సినిమాను ఎనౌన్స్ చేశాడు. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై త్వరలోనే సినిమా ప్రారంభిస్తామని చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎనౌన్స్ చేశారు. అయితే తరువాత ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్లిపోయింది. బన్నీ, వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తే లింగుసామి.. విశాల్ హీరోగా పందెంకోడి సీక్వల్ ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మరోసారి బన్నీ కోలీవుడ్ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ, లింగుసామిల ప్రాజెక్ట్ ఆగిపోలేదని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను 2018 వేసవిలో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ మార్కెట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా పాగా వేస్తాడేమో చూడాలి. -
బన్నీ తమిళ సినిమా హీరోయిన్ ఎవరంటే..?
సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంలో మల్లూ అర్జున్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ ప్రస్తుతం కోలీవుడ్ మీద కన్నేశాడు. అందుకు తగ్గట్టుగా ఓ స్ట్రయిట్ తమిళ సినిమాతో అరవ ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేశాడు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే తమిళ సినిమాను పలువురు తమిళ సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు కీర్తి సురేష్‌ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. నేను శైలజ సినిమాతో తెలుగులో కూడా మంచి విజయం సాధించిన కీర్తి ప్రస్తుతం తమిళ నాట స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. రెండు భాషల్లో పరిచయం ఉన్న భామ కావటంతో కీర్తి అయితేనే హీరోయిన్గా కరెక్ట్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న బన్నీ, ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తమిళ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. -
సొంతగడ్డలో జయిస్తే ఆ కిక్కే వేరు: బన్నీ
చెన్నై: సొంతగడ్డలో జయిస్తే ఆ కిక్కే వేరు అంటున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. తాజాగా 'సరైనోడు' తో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ ఇప్పుడు అదే జోరును కోలీవుడ్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నాడు. చాలాకాలంగా అల్లు అర్జున్ తమిళ చిత్ర రంగప్రవేశం చేయాలన్న కోరిక నిజమయ్యే తరుణం వచ్చేసింది. లింగుసామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ద్విభాషా చిత్రంలో బన్నీ కథానాయకుడిగా నటించనున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి గురువారం చెన్నైలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ..తాను ఈ వేదికపై తమిళంలోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నానన్నాడు. తప్పులు దొర్లినా తమిళంలోనే మాట్లాడతానని తెలిపాడు. తాను పుట్టి పెరిగింది చెన్నైలోనేనని.. 20 ఏళ్ల వరకూ ఇక్కడే గడిపానని, ఆ తరువాత నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నానని చెప్పారు. తన సొంత ఊరు చెన్నైయేనని పేర్కొన్నాడు. తెలుగులో చాలా చిత్రాల్లో నటించినా ఒక్క చిత్రాన్ని తమిళంలోకి అనువదించి విడుదల చేయలేదని అన్నాడు. కారణం తమిళంలోకి నేరుగా పరిచయం అవ్వాలన్న కోరికేనన్నాడు. అలాంటి అవకాశం కోసం చాలా కాలంగా వేచి ఉన్నానని.. అది ఇప్పటికి నెరవేరనుందని చెప్పుకొచ్చాడు. తనను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు లింగుసామి తన భుజాలపై వేసుకున్నారని తెలిపాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా, నటుడు శివకుమార్, దర్శకుడు లింగుసామి, అల్లు శిరీష్, కథా రచయిత బృందాసారథి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?
సరైనోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే బన్నీ సినిమాను డైరెక్ట్ చేయటం కోసం టాలీవుడ్ నుంచే కాదు, కోలీవుడ్ దర్శకులు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొన్ని కథలు విన్న బన్నీ, ఏ సినిమా చేయబోయేది క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ముగ్గురు దర్శకుల పేర్లు ముందు వరసలో వినిపిస్తున్నాయి. 24 సినిమాతో సౌత్‌లో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కె కుమార్, అల్లు అర్జున్ కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడు. ఇప్పటికే ఈ కథ విన్న బన్నీ ఫైనల్ డెసిషన్ మాత్రం చెప్పలేదు. తమిళ దర్శకుడు లింగుసామి కూడా బన్నీతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా విశాల్‌తో చేయాల్సిన పందెం కోడి సీక్వల్‌ను కూడా పక్కన పెట్టేశాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా బన్నీతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన రామయ్య వస్తావయ్యా సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది, కానీ అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరోసారి బన్నీకి కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. మరి ఈ ముగ్గురిలో బన్నీ సినిమా ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.