‘ది వారియర్‌’ నుంచి బుల్లెట్‌ సాంగ్‌ వచ్చేసింది | First Single Released From Ram Pothineni The Warrior Movie | Sakshi
Sakshi News home page

Ram Pothineni: ‘ది వారియర్‌’ నుంచి ఫస్ట్‌సింగిల్‌ అవుట్‌, ఆకట్టుకుంటున్న సాంగ్‌

Published Fri, Apr 22 2022 7:03 PM | Last Updated on Fri, Apr 22 2022 7:09 PM

First Single Released From Ram Pothineni The Warrior Movie - Sakshi

First Single Released From The Warrior Movie: రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్‌ కానుంది.

చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్‌, ఆన్‌లైన్‌లో లీకైన సినిమా

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌సింగిల్‌ పేరుతో తొలి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్‌. బుల్లెట్‌ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించి ఎనర్జీటిక్‌ మ్యూజిక్‌, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్‌ను అందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement