The Warrior: Ram Pothineni Meets Simbu and Thanks Him - Sakshi
Sakshi News home page

Ram Pothineni: శింబును కలిసి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన రామ్‌

Published Mon, Jul 11 2022 11:50 AM | Last Updated on Mon, Jul 11 2022 1:28 PM

The Warrior: Ram Pothineni Meets Simbu and Thanks Him - Sakshi

టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ నటుడు రామ్‌ కోలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యింది. ఈయన కథానాయకుడిగా నటించిన ‘ది వారియర్‌’ తెలుగు, తమిళం భాషల్లో రూపొంది ఈ నెల 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనివాస స్టూడియోస్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం ద్వారా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఇందులో బుల్లెట్‌ పాటను శింబు పాడటం విశేషం.

కాగా చిత్రం విడుదల దగ్గర పడటంతో యూనిట్‌ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో ది వారియర్‌ చిత్రంలో శింబు పాడిన బుల్లెట్‌ సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. రామ్‌ కోరిక మేరకు శింబు ఈ పాటను పాడారట. దీంతో శనివారం నటుడు రామ్‌ చెన్నైలో శింబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. రామ్‌ స్టైలిష్‌ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుందని శింబు ప్రశంసించారు. బుల్లెట్‌ సాంగ్‌ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని, థ్యాంక్స్‌ శింబు అంటూ రామ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: లక్కీ చాన్స్‌ చేజార్చుకున్న కీర్తి సురేశ్‌? ట్రోల్‌ చేస్తున​ నెటిజన్లు!
నా భర్త వేస్ట్‌.. అస్సలు కోపరేట్‌ చేయడు: స్టార్‌ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement