The Warriorr Movie
-
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్‌కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్‌తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
వారియర్ బాగా ఆడాల్సింది, సినిమాలో అదే మైనస్!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన చిత్రం ది వారియర్. లింగుస్వామి దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాలోని ప్లస్, మైనస్‌లను విశ్లేషించాడు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన మాట్లాడుతూ.. 'ప్రాణం పోసే డాక్టర్ జీవితం నుంచి ఒక రౌడీ ప్రాణం తీసే పోలీసాఫీసర్‌గా పరివర్తన చెందిన హీరో కథ ఇది. మానవుడు దానవుడు, సర్పయాగం వంటి హిట్ సినిమాలు ఇలాంటి కోవలోకే చెందుతాయి. అయితే రామ్ పాత్రపై కొంత ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రభావం పడింది. సినిమాలో కీర్తి శెట్టితో లవ్ ట్రాక్, విలన్ డామినేషన్ బాగుంది. అలాగే గురు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి అన్న డైలాగ్ ఎఫెక్టివ్‌గా ఉంది. కానీ హీరో తన ఫిర్యాదు వెనక్కుతీసుకోకుంటే బాగుండేది. హీరోయిన్ను కిడ్నాప్ చేసిన వారి దగ్గరి నుంచి విడిపించే సీన్ వేరేలా ఉంటే బాగుండేది. ఏదేమైనా రామ్ నటన అద్భుతం. ఇది చాలా బాగా ఆడాల్సిన కథ. దర్శకుడు స్క్రీన్‌ప్లేలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొనుంటే ఇది ఘన విజయం సాధించి ఉండేది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి. చదవండి: లైగర్ బ్యూటీని కన్నెత్తి చూడని ఆర్యన్ -
కోర్టులో ఫైన్ కట్టిన డైరెక్టర్ లింగుసామి
సినీ దర్శకుడు లింగుసామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న ఈయనపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ నుంచి దర్శకుడు లింగుసామి తీసుకున్న రూ.1.3 కోట్లు తిరిగి చెల్లించలేదని, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని పిటిషన్లో పేర్కొంది. కేసును విచారించిన న్యాయస్థానం దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో రూ.10 వేలును లింగస్వామి కోర్టుకు అపరాధ రుసుం చెల్లించాడు. ఈ కేసు తిరుపతి బ్రదర్స్ సంస్థకు సంబంధించిందని, ఈ వ్యవహారంలో తాము చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: (షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే) -
షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'ది వారియర్' మూవీ డైరెక్టర్ లింగుస్వామికి కోర్టుషాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంతలు హీరోహీరోయిన్లుగా సినిమాను ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ అనే ఓ సినిమాను తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ అనే కంపెనీ నుంచి రూ. 35లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి చెల్లించారు. కానీ ఆ చెక్‌బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం డైరెక్టర్ లింగుస్వామి, అతని సోదరుడు చంద్రబోస్‌లకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో లింగుస్వామి పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. -
రిలీజ్‌కు ముందే సీక్వెల్ ప్రకటన.. ఇప్పుడెలా?
ఒక సినిమా రిలీజ్ కు ముందే సీక్వెల్ ప్రకటించి.. మూవీ హిట్టైన తర్వాత సీక్వెల్ తీస్తే ఎక్కడ లేని కిక్. కాని సీక్వెల్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసిన తర్వాత మూవీ ఫట్ అయితే మాత్రం ఎక్కడలేని ఇబ్బంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ది వారియర్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల దర్శకులు. ఈ రెండు చిత్రాలు కూడా జులైలోనే రిలీజ్ అయ్యాయి. వీటి సక్సెస్ పై హీరోలు మాత్రమే కాదు,దర్శకులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే రిలీజ్ కు ముందే సీక్వెల్స్ స్టోరీస్ రెడీగా ఉన్నట్లు తెలిపారు.సీన్ కట్ చేస్తే రామ్ నటించిన వారియర్, రవితేజన కనిపించిన రామారావు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఈ సినిమా దర్శకులు, హీరోలు సీక్వెల్స్ తో తిరిగొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు!) సీక్వెల్ అంటేనే హిట్ సినిమాకు కొనసాగింపు.అలాంటిది మొదటి సినిమానే పరాజయం పాలైతే ఇక ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉండదు.అందుకే పార్ట్ 2తో ఫెయిల్యూర్ కాగానే కొంతమంది హీరోలు పార్ట్ 3కి దూరంగా ఉండిపోయారు. శంకర్ దాదా జిందాబాద్, సర్దార్ గబ్బర్ సింగ్, రాజు గారి గది 2, మన్మథుడు 2 చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ఈ లెక్కన రవితేజ, రామ్ లు రామారావు, వారియర్ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. -
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "ది వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో రామ్ కి జోడీగా యంగ్, టాలెంటెడ్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్నారు. పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాలు అందించిన దర్శకుడు లింగుస్వామి ఈ విభిన్నమైన కథకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ఒక పండగ భోజనంలా వడ్డించారు. డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకులకు కొత్త. దర్శకుడు లింగుసామి ఆ ప్రయత్నాన్ని కమర్షియల్ సక్సెస్ చేశారు. ఇక డీఎస్పీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడవిన్నా ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. ప్రేక్షకులకు నచ్చే మరెన్నో విషయాలు వున్న ఈ మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది. "వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ది వారియర్: 'విజిల్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి జంటగా నటించిన మూవీ 'ది వారియర్'. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి సూపర్ హిట్టైన 'విజిల్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆంథోనీ దాసన్, శ్రీనిషా ఈ పాటను పాడారు. ఈ సినిమాలో రామ్ సత్య అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. -
సందడే సందడి.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్!
జూలైలో బోలెడు సినిమాలు రిలీజైనా ఏ ఒక్కటీ సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో వరుస విజయాలు అందుకుంటున్న టాలీవుడ్ జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది. అయితే జూలై ఉసూరుమనిపించినా ఆగస్టు తిరిగి ఊపిరి పోసింది. ఒకేరోజు రిలీజైన బింబిసార, సీతారామం రెండూ దిగ్విజయాన్ని అందుకున్నాయి. ఆ ఊపును కొనసాగించడానికి మేము రెడీ అంటూ మరి కొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఆగస్టు రెండో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.. లాల్ సింగ్ చడ్డా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించాడు. హాలీవుడ్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చై బాలీవుడ్ ఎంట్రీ, తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రక్షా బంధన్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రక్షా బంధన్. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్టర్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. మాచర్ల నియోజకవర్గం యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్స్. హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడింది. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజవుతోంది. కార్తికేయ 2 నిఖిల్ సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలుత ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు మాచర్ల మూవీ వస్తుండటంతో ఒకరోజు వెనక్కి జరిగారు. అంటే కార్తికేయ 2 ఆగస్టు 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు.. హాట్‌స్టార్ ► ది వారియర్ - ఆగస్టు 11 అమెజాన్ ప్రైమ్ ► సోనిక్ ది ఎడ్జ్‌హాగ్ 2 - ఆగస్టు 10 ► ది లాస్ట్ సిటీ - ఆగస్టు 10 ► మలయాన్ కుంజు - ఆగస్టు 11 ► కాస్మిక్ లవ్ - ఆగస్టు 12 ► ఎ లీగ్ ఆఫ్ దైర్ వోన్ - ఆగస్టు 12 ఆహా ► మాలిక్ - ఆగస్టు 12 ► మహా మనిషి - ఆగస్టు 12 ► ఏజెంట్ ఆనంద్ సంతోష్ (నాలుగో ఎపిసోడ్) - ఆగస్టు 12 నెట్‌ఫ్లిక్స్ ► హ్యాపీ బర్త్‌డే - ఆగస్టు 8 ► నరూటో: షిప్పుడెన్ వెబ్‌సిరీస్ - ఆగస్టు 8 ► ఐ జస్ట్ కిల్డ్ మై డాడ్ - ఆగస్టు 9 ► ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 2 - ఆగస్టు 10 ► లాకీ అండ్ కీ సీజన్ 3 - ఆగస్టు 10 ► బ్యాంక్ రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ - ఆగస్టు 10 ► దోతా: డ్రాగన్స్ బ్లడ్: బుక్ 3 - ఆగస్టు 11 ► నెవ్వర్ హావ్ ఐ ఎవర్ సీజన్ 3 - ఆగస్టు 12 ► బ్రూక్లిన్ నైన్-నైన్: సీజన్ 8 - ఆగస్టు 13 ► గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ - ఆగస్టు 14 సోనిలివ్ ► గార్గి - ఆగస్టు 12 జీ5 ► హలో వరల్డ్ వెబ్‌సిరీస్ - ఆగస్టు 12 ► రాష్ట్ర కవచ్ - ఆగస్టు 11 ► బ్యూటిఫుల్ బిల్లో - ఆగస్టు 11 ► శ్రీమతి - ఆగస్టు 12 చదవండి: 'పచ్చళ్ల స్వాతి'గా పాయల్ రాజ్ పుత్ లుక్ చూశారా? సిమ్రాన్ చెల్లెలి సూసైడ్‌కి ఆ కొరియోగ్రాఫర్‌కి సంబంధం ఉందా? -
‘వారియర్’ షాక్‌తో ప్లాన్ మార్చుకున్న రామ్!
‘ది వారియర్’ మూవీతోనే తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. ఈ సినిమాతోనే కోలీవుడ్ కు తన మార్కెట్ ను విస్తరించాలనుకున్నాడు. తర్వాత చేయబోయే బోయపాటి మూవీ, ఆ తర్వాత చేయబోయే గౌతమ్ మీనన్ మూవీతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనుకున్నాడు. ది వారియర్ వేసిన విజిల్‌ను తమిళ ఆడియెన్స్ పట్టించుకోలేదు. (చదవండి: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్ మూవీ) బోయపాటి తో రామ్ నటించే మూవీ పై పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ముందు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్లాన్ చేశారట. కాని ఇప్పుడు మారిన బిజినెస్ స్ట్రాటజీస్ లెక్కలు చూసుకుని బడ్జెట్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా విరమించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. బోయపాటి మూవీ తర్వాత లవ్ స్టోరీస్ కు స్పెషలిస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ మేకింగ్ లో మూవీ చేయాలనుకున్నాడు రామ్. ఈ ప్రాజెక్ట్ ను కేవలం కోలీవుడ్ ఆడియెన్స్ ను టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ చేయాలనుకున్నాడు. కాని ది వారియర్ రిజల్ట్ చూసిన తర్వాత కోలీవుడ్ మార్కెట్ కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. గౌతమ్ మీనన్ కంటే కూడా అనిల్ రావివూడితో మూవీ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాడట. బాలయ్యతో మూవీ తర్వాత ఎఫ్ 3 డైరెక్టర్ అనిల్ రావిపూడి రామ్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్ మూవీ
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి జంటగా నటించిన మూవీ ది వారియర్. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. సినిమా రిలీజై నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది వారియర్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సినీప్రియులు అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారియర్‌ను థియేటర్లో చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే నెల 11 దాకా వెయిట్ చేసి ఎంచక్కా ఫోన్లోనే వీక్షించేయండి. He is ready! 😎#TheWarriorr arrives on @DisneyPlusHSTel this August 11.#TheWarriorrOnHotstar @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @anbariv @DisneyPlusHS pic.twitter.com/HXzCxvz1Hl — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) July 31, 2022 చదవండి: సౌత్ హిట్స్‌తో బాలీవుడ్ బేజార్.. స్పందించిన బాలీవుడ్ నిర్మాత ఆహాలో పక్కా కమర్షియల్, ఎప్పటినుంచంటే? -
‘ది వారియర్’ మరోసారి అది నిరూపించింది: రామ్ పోతినేని
‘‘మా ‘ది వారియర్’ రిలీజ్ సమయంలో వర్షాలు పడుతున్నాయి. సినిమా వాయిదా వేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాం. అయితే ప్రేక్షకులు వస్తారని గట్టిగా నమ్మాం.. మా నమ్మకం నిజమైంది’’ అని రామ్ పోతినేని అన్నారు. లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ వచ్చినా, వర్షాలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని ‘ది వారియర్’ మరోసారి నిరూపించింది. ఈ చిత్ర నిర్మాతలతోనే నా తర్వాతి సినిమా ఉంటుంది’’ అన్నారు. లింగుసామి మాట్లాడుతూ.. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి మంచి హీరో, శ్రీనివాసా చిట్టూరి లాంటి నిర్మాత, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో... అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ 'ది వారియర్'లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బాగుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వర్షాల్లో సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అని అన్నారు. -
నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆది
ఆది పినిశెట్టి తాజాగా ది వారియర్ మూవీతో అలరించాడు. పెళ్లి అనంతరం విడుదలైన ఆయన తొలి చిత్రం ఇది. గురువారం(జూలై 14న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇందులో ఆది విలన్ గురుగా కనిపించాడు. ఈ మూవీ రిలీజైన సందర్భంగా ఆది మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆది నటి నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లిపై ఆస్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ‘నేను నిక్కీ మలుపు చిత్రం నుంచే మంచి స్నేహితులం. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నాకు గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొన్ని రోజులు మేం మాట్లాడుకోలేదు. సెట్లో మేం అసలు మాట్లాడుకునే వాళ్లం కాదు. దాదాపు షూటింగ్ అంతా అలానే పూర్తి చేశాం. ఇక చివరిలో మళ్లీ కలిశాం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘‘మలుపు అనంతరం ఇద్దరం కలిసి పలు సినిమాలు చేశాం. ఈ ప్రయాణంలో మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీనే నాకు ప్రపోజ్ చేసింది. తను నా దగ్గరకి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ వెంటనే నేను కూడా ఓకే చెప్పాను. కొన్నాళ్లు ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. ఆ తర్వాతే ఇంట్లోవాళ్లకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం చాలా సంతోషంగా సాగుతోంది. నేను, నిక్కీ కలిసి నటించిన ‘శివుడు’ సినిమా త్వరలోనే రాబోతుంది” అని చెప్పాడు. కాగా మే నెలలలో ఆది-నిక్కీలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మే 18వ తేదీన రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లిలో టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. చదవండి: వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్ View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
నాన్న.. మూవీలో నా నెగెటివ్ పాయింట్స్ చెప్పారు: ఆది
‘‘నేను తెలుగువాణ్ణి అని తమిళ ప్రేక్షకులు అనుకుంటున్నారు.. తెలుగువాళ్లేమో తమిళోడిని అంటున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, నటన బాగుంటే ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు’’ అని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ గురు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి శుక్రవారం విలేకరులతో చెప్పిన విశేషాలు ► ‘సరైనోడు’ తర్వాత ‘అజ్ఞాతవాసి’ సినిమాలో విలన్‌గా చేశాను. ఆ తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా ‘అజ్ఞాతవాసి’ కంటే బెటర్‌గా ఉండాలని అనుకున్నాను. ‘ది వారియర్’లో ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురు పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది.. అది నచ్చడంతో ఈ చిత్రం చేశాను. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ► ‘ది వారియర్’ క్లైమాక్స్ ఫైట్‌లో రామ్, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. ఆ క్రెడిట్ అన్బు–అరివు మాస్టర్లదే. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తున్నట్టుందని లింగుసామి చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్‌లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. ► నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి) నాలో నెగెటివ్ పాయింట్స్ చెప్తారు. ఈ చిత్రంలో నా యాస ఇంకొంచెం బాగుండాల్సింది అని మా నాన్న అన్నారు. నేను హైలైట్ అయ్యానంటే రామ్ గొప్పదనం అని, అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందని కూడా ఆయన అన్నారు. నిక్కీ గల్రానీతో నా పెళ్లి జీవితం బాగుంది.. అంతా హ్యాపీ. చదవండి: లలిత్ మోదీ గట్టిగానే ట్రై చేశాడు, ఇన్నేళ్లకు ఫలించింది! లలిత్ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్ -
వారియర్ మొదటి రోజు ఎంత రాబట్టిందంటే?
రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన మూవీ వారియర్. ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ ముఖ్యపాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న విడుదలైంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందని, రామ్ మరోసారి తన నటనతో, స్టెప్పులతో ఇరగదీశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కథనం మాత్రం సరికొత్తగా ఏమీ లేదంటూ కొందరు సినీవిశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు. మరి మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎంత షేర్ సాధించిందో తెలుసా? రూ.8.73 కోట్లు. మొత్తంగా రూ.39.10 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిన వారియర్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.39 కోట్లు రాబట్టాలి. మరి మొదటి రోజు వారియర్ ఏయే ప్రాంతాల్లో ఎంత వసూలు చేసిందో కింద చూసేయండి.. ♦ నైజాం : రూ.1.96 కోట్లు ♦ సీడెడ్ : రూ.1.04 కోట్లు ♦ యూఏ : రూ.1.02 కోట్లు ♦ తూర్పు గోదావరి : రూ.51 లక్షలు ♦ పశ్చిమ గోదావరి: రూ.67 లక్షలు ♦ గుంటూరు : రూ.1.19 కోట్లు ♦ కృష్ణా: రూ.38 లక్షలు ♦ నెల్లూరు : రూ.29 లక్షలు ♦ వైజాగ్: రూ.1.02 కోట్లు ► ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్ : రూ.7 కోట్ల పైచిలుకు ♦ కర్ణాటక: రూ.32 లక్షలు ♦ తమిళనాడు: రూ.94 లక్షలు ♦ ఓవర్సీస్: రూ. 30 లక్షలు ► ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు: రూ.8.73 కోట్లు చదవండి: రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో? అన్నదమ్ములతో హీరోయిన్ల డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
హీరో రామ్ 'ది వారియర్' సినిమా మూవీ స్టిల్స్
-
The Warrior Review: డాక్టర్ చేయలేని ఆపరేషన్ పోలీస్‌గా చేసిన 'ది వారియర్' రివ్యూ..
టైటిల్ 'ది వారియర్' నటీనటులు: రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతీశెట్టి, నదియా, అక్షరా గౌడ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్ లింగుస్వామి నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ విడుదల తేది: జులై 14, 2022 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం 'ది వారియర్'. కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో గురువారం (జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా మొదటిసారిగా రామ్ పోతినేని తమిళ డైరెక్టర్‌తో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల మధ్య రిలీజైన 'ది వారియర్' ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో రివ్యూలో చూద్దాం. కథ: సత్య (రామ్ పోతినేని) ఓ డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హౌస్ సర్జన్‌గా వైద్య వృత్తిని ప్రారంభించేందుకు కర్నూలు వెళతాడు. ఒకరి ప్రాణం కాపాడితే తాను మళ్లీ జన్మించినట్లుగా భావించే వ్యక్తితం సత్యది. అలాంటి సత్య ఎదుటే గురు (ఆది పినిశెట్టి) మనుషులు తను కాపాడిన వారి ప్రాణం తీయడాన్ని తట్టుకోలేకపోతాడు. పోలీస్‌లకు కంప్లైంట్ చేసిన లాభం ఉండదు. ఇలాంటి సంఘటనలే ఎదురై గురు చేతిలో సత్య చావు దెబ్బలు తింటాడు. గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్‌కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్‌గా చేయలేని ఆపరేషన్ పోలీస్‌గా ఎలా చేశాడు ? అనే తదితర విషయాలు తెలియాలంటే 'ది వారియర్' చూడాల్సిందే. విశ్లేషణ: పోలీస్ తరహా సినిమాలు ఇదివరకు చాలానే వచ్చి మెప్పించాయి. కానీ ఒక డాక్టర్.. పోలీస్‌గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనే కొత్త కథతో 'ది వారియర్'ను తెరకెక్కించారు దర్శకుడు ఎన్ లింగుస్వామి. డాక్టర్‌గా సత్య ఎదుర్కున్న పరిస్థితులను, అక్కడి పోలీసు వ్యవస్థ తీరును, గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సినిమాలో విజిల్ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్‌గా సాగుతుంది. దీంతో కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. చెప్పుకోదగ్గ డైలాగ్‌లు సినిమాకు పడలేదు. అయితే సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న బీజీఎం, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే: రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్‌గా, పోలీస్‌గా, లవర్‌గా రామ్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ మూమెంట్స్, యాక్షన్ సీన్లలో చాలా బాగా చేశాడు. పోలీస్ లుక్‌లో సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక విలన్‌గా ఆది పినిశెట్టి యాక్టింగ్ ఇరగదీశాడు. రామ్, ఆది పినిశెట్టి పోటాపోటీగా నటించి అబ్బురపరిచారు. మాస్ లుక్‌లో మాస్ పెర్ఫామెన్స్‌తో ఆది చక్కగా నటించాడు. ఆర్జే విజిల్ మహాలక్షిగా కృతీశెట్టి అందంగా నటించింది. సినిమాలో ఆమె ప్రజెన్స్ హాయినిస్తుంది. సత్య తల్లిగా నదియా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చెడ్డవారిని శిక్షించాలని కొడుక్కి చెప్పే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. విలన్ గురు పాత్రకు వచ్చే బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ కొత్తగా ఉన్నా కథనం రొటీన్‌గా ఉన్న 'ది వారియర్'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
రామ్ పోతినేని - వారియర్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్
-
వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతా: రామ్ పోతినేని
‘దెబ్బలు తగిలేలా స్టెప్పులు వేయడం అవసరమా?’ అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దర్శకులు కూడా అంత కఠినమైన స్టెప్పులు వద్దులేండి అంటుంటారు. కానీ అభిమానుల కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే... నేను వాళ్ల వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా వందశాతం చేయడానికి ప్రయత్నిస్తా’అని హీరో రామ్ పోతినేని అన్నారు. రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా, లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... సాయంత్రానికే పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించా ‘రెడ్’ తర్వాత పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని డిసైడ్ అయ్యాను. లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందు నాకు విషయం తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. 'ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే... లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా. అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది ది వారియర్ షూటింగ్ సమయంలో కొంచెం సీరియస్ ఇంజ్యూరీ అయ్యింది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా! ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్ ‘జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా?’ అని ప్రశ్నించేసరికి..'అలా అడిగారు ఏంటి?' అనుకున్నాను. తర్వాత వారానికి సెట్ అయ్యాను. అప్పటికి ఆది పినిశెట్టి వేరే సినిమాలు చేయకుండా అలా ఉన్నాడు. పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్. నాకు ఏమో నా వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారని ఫీలింగ్. సినిమాలే లైఫ్ అనుకునే నాకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది. పూరి, లింగు స్వామి డైమండ్స్ లాంటి వాళ్లు పూరి జగన్నాథ్ గారు, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ... వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బాగుంటుంది. లింగుస్వామి కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయ్యాం. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ కనబడుతుంది. ఆది కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు ‘ది వారియర్’ కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్... గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? అనేది టెన్షన్. అయితే, లింగుస్వామి ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆది ఏమో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథ చెప్పాక... ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేసి క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. దేవిశ్రీ ఎప్పుడు ఇలా చెప్పలేదు మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి... రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్లో వేరు. ఒక్కో స్పీకర్లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు... కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్... కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది. ఇన్నాళ్లకు కుదిరింది నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్... రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది. లింగుస్వామి షాకయ్యారు నేను చెన్నైలో పెరిగాను కాబట్టి తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. ‘నేను మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతాను’అని లింగుస్వామితో అన్నాను. డబ్బింగ్ చెప్పిన తర్వాత.. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి షాక్ అయ్యారు. 'అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు' అని అన్నారు. అందుకే ‘ది వారియర్’టైటిల్ కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే పదం బాగా నచ్చింది. ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు డాక్టర్లు, పోలీసులు బయటకు వచ్చారు. అందుకని, వారియర్ టైటిల్ పెట్టాం. అలా చేస్తే హిందీ ప్రేక్షకులు చూడరు హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతా. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనం కన్ఫ్యూజ్ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. హిందీలో డబ్బింగ్ అయినప్పుడు చూశారు. గ్యాప్ తీసుకోను ది వారియర్ విడుదలైన వెంటనే బోయపాటి సినిమా షూటింగ్లో పాల్గొంటా. ఈ సారి గ్యాప్ తీసుకోవద్దనుకుంటున్నాను. బోయపాటి తర్వాత ఎవరితో సినిమా చేయాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. -
ఈవారం థియేటర్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఓటీటీలు వచ్చాక సినీ లవర్స్ పెరిగిపోయారు. మొన్నటి దాకా థియేటర్లలో ఆదరించిన సినిమాలను ఓటీటీలో కూడా రిపీటెడ్‌గా చూస్తూ ఆదరిస్తున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాలే ఉదాహరణ. అయితే విక్రమ్, మేజర్ తర్వాత అంత పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు. ఈ వారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితోపాటు పలు సినిమాలు థియేటర్లో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ది వారియర్ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనుండగా, హీరోయిన్గా కృతిశెట్టి అలరించనుంది. అక్షరా గౌడ, నదియ తదితరులు మరో కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గార్గి ఇటీవల 'విరాట పర్వం'తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకునేందుకు 'గార్గి' చిత్రంతో రానుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. జులై 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అమ్మాయి: డ్రాగన్ గర్ల్ సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మాయి: డ్రాగన్ గర్ల్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్, లవ్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అభిమన్యు సింగ్, మియా ముఖి తదితరులు నటించగా, పాల్ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. జులై 15న విడుదల కానుంది. మై డియర్ భూతం ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్ర్ ప్రభుదేవా భూతంగా అలరించేందుకు సిద్ధంగా ఉన్న మూవీ 'మై డియర్ భూతం'. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాఘవన్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జులై 15న రిలీజ్ కానుంది. హిట్: ది ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి హిట్టు కొట్టిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. ఈ సినిమాను ఇదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్ర, దలిప్ తహిల్, శిల్ప శుక్ల నటించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. హైవేపై మిస్ అయిన ఓ అమ్మాయి ఏమైంది ? అనే కథతో సినిమా రూపొందింది. ఇక ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే! క్లిక్ చేయండి. -
ఇంట్లో వాళ్లు కూడా అనుమానించారు.. అందుకే స్పందించా: రామ్
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకారు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్వయంగా రామ్ స్పందిస్తూ.. అది ఒట్టి పుకారేనని, అందులో నిజం లేదని కుండ బద్దలు కొట్టాడు. అయితే గతంలో కూడా రామ్ పెళ్లిపై పుకార్లు వచ్చాయి.. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సారి మాత్రం ఆయనే స్వయంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటో తాజాగా రామ్ వివరించారు. (చదవండి: స్కూల్లో ఓ అబ్బాయికి లవ్ లేటర్ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి) ‘సాధారణంగా హీరోయిన్లతో పెళ్లి అంటే.. ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. హీరో అన్నాక ఇలాంటి పుకార్లు రావడం కామన్లే అని లైట్ తీసుకునే వాళ్లు. కానీ ఈ సారి మాత్రం సీక్రెట్ చైల్డ్‌వుడ్ ఫ్రెండ్‌తో పెళ్లి అనేసరికి ఇంట్లో వాళ్లు కూడా అనుమానంగా చూడడం మొదలు పెట్టారు. ఫ్రెండ్స్ కూడా అనుమానించారు. మాములుగా అయితే ఇలాంటి రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోని మా అమ్మ.. ‘ఏం లేకుండానే ఇలా రాస్తారంటావా?’ అని అనడంతో నేనే స్పందించాల్సి వచ్చింది. నేను స్కూల్‌కే రెగ్యులర్‌గా వెళ్లలేదు..అమ్మాయితో ఎలా ప్రేమలో పడతానని చెప్పడంతో అమ్మ రియలైజ్ అయింది’ అని రామ్ చెప్పుకొచ్చారు. కాగా, రామ్, కృతీశెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’చిత్రం జులై 14న విడుదల కాబోతుంది. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం తర్వాత రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. -
చెన్నైలో శింబును కలిసిన రామ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ నటుడు రామ్ కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఈయన కథానాయకుడిగా నటించిన ‘ది వారియర్’ తెలుగు, తమిళం భాషల్లో రూపొంది ఈ నెల 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనివాస స్టూడియోస్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో బుల్లెట్ పాటను శింబు పాడటం విశేషం. కాగా చిత్రం విడుదల దగ్గర పడటంతో యూనిట్ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో ది వారియర్ చిత్రంలో శింబు పాడిన బుల్లెట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. రామ్ కోరిక మేరకు శింబు ఈ పాటను పాడారట. దీంతో శనివారం నటుడు రామ్ చెన్నైలో శింబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. రామ్ స్టైలిష్ లుక్ ఎంతగానో ఆకట్టుకుందని శింబు ప్రశంసించారు. బుల్లెట్ సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని, థ్యాంక్స్ శింబు అంటూ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున నెటిజన్లు! నా భర్త వేస్ట్.. అస్సలు కోపరేట్ చేయడు: స్టార్ హీరోయిన్ -
ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం హీరో రామ్ పోతినేని సరసన ఆమె నటించి తాజా చిత్రం 'ది వారియర్'. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్నా నెటిజన్లు! ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కృతిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నా మాతృభాష తుళు. తెలుగు కూడా బాగానే మాట్లాడుతాను. ఇప్పటికే వరకు నేను తెలుగు బాగా తెలిసిన డైరెక్టర్స్‌తోనే వర్క్ చేశాను. అయితే లింగుస్వామి గారు తమిళ డైరెక్టర్ కావడంతో భాష పరంగా కాస్తా ఇబ్బంది పడ్డాను. ఆయన తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు తమిళం తెలియదు. చదవండి: ఎన్టీఆర్ 30: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే! అందువల్ల ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు. అలా ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడ్డాను. కానీ రామ్‌కు తమిళ భాష బాగా తెలుసు. ఆయన సపోర్ట్ తీసుకున్నాను. డైరెక్టర్ ఏం చెబుతున్నారనేది నాకు రామ్ అర్థమయ్యేలా చెప్పేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అలవాటు పడిపోయాను’ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. ఇందులో తాను రేడియో జాకీగా కనిపిస్తానని, తన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని కృతి చెప్పింది. -
హీరో రామ్ ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మొదట పోలీసు పాత్రలు వద్దనుకున్నా.. కానీ: రామ్ పోతినేని
‘‘కరోనా వల్ల రెండేళ్లు సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ‘వారియర్’ లాంటి సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు వస్తున్నాయి. రామ్, కృతీశెట్టికి ఆల్ ది బెస్ట్. శ్రీనివాసా చిట్టూరిగారు మంచి స్నేహితులు.. ఆయన కోసమే ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో రామ్ మాట్లాడుతూ.. ‘‘పోలీస్ పాత్ర చేద్దామని చాలా కథలు విన్నా. అన్నీ ఒకేలా అనిపించడంతో కొద్ది రోజులు పోలీస్ పాత్ర వద్దనుకున్నాను. ఆ సమయంలో లింగుసామిగారు ‘ది వారియర్’ కథ చెప్పాక, ‘పోలీస్ కథ చేస్తే ఇలాంటిదే చేయాలి’ అనిపించింది. ఇందులో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. కథ విన్నాక నేనెప్పుడూ ట్వీట్ చేయలేదు.. తొలిసారి ఈ సినిమా కోసం ట్వీట్ చేశాను. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఇలాంటి అద్భుతమైన కథ రాసిన ఆయనకి హ్యాట్సాఫ్. మీరు(అభిమానులు) లేకుంటే నేను లేను. నా ప్రతి ఎనర్జీ మీ వల్లే వచ్చింది’’ అన్నారు. డైరెక్టర్ లింగుసామి మాట్లాడుతూ.. ‘‘రన్’ సినిమా తర్వాత నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, పవన్‌గార్లు నన్ను కలిసి ఓ సినిమా చేద్దామన్నారు.. ఇప్పటికి కుదిరింది. సెట్లో ప్రశాంతంగా ఉంటారు.. అదే వారి బలం. ఒక డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడో దానికి ఎలా న్యాయం చేయాలా? అని ఆలోచించే రామ్ నాకు దొరకడం నా అదృష్టం. అన్నీ కుదిరితే తనతో ఓ పది సినిమాలు చేయాలనుకుంటున్నా. చాలా రోజులుగా తెలుగులో నేరుగా ఓ సినిమా చేద్దామనుకుంటున్నా. ‘ది వారియర్’ సినిమా నాకు వందశాతం కరెక్ట్ ఎంట్రీ. ఇదే బ్యానర్లో ‘వారియర్ 2’ సినిమా కూడా ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు హరీష్ శంకర్, కిశోర్ తిరుమల, నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, వివేక్ కూచిభొట్ల, కృష్ణ, సినిమాటోగ్రాఫర్ సుజీత్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ స్టార్ట్ చేస్తే.. రామ్ పూర్తి చేశాడు!
సినిమాల ఎంపిక విషయంలో అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్నాడు హీరో రామ్. గతంలో బన్ని ఎంచుకున్న దర్శకుడితోనే బైలింగువల్ సినిమా చేయడం చూస్తుంటే..రామ్ పక్కా ప్లాన్‌తో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్, మాలీవుడ్‌లో స్టార్ డమ్ అందుకున్న తర్వాత బన్ని ఇమిడియెట్ గా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. స్టూడియో గ్రీన్ సంస్థలో లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు.ఇందుకు సంబంధించి అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బన్ని పుష్పలో నటించి పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నాడు. (చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది) కోలీవుడ్ లోకూడా పుష్ప సూపర్ హిట్ కావడంతో అనుకోకుండానే తమిళ మార్కెట్ లోకి బన్ని అఫీసియల్ గా ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. అయితే ఏ లింగుస్వామితో కలసి తమిళ మార్కెట్ లోకి బన్ని ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడో, ఇప్పుడు అదే దర్శకుడితో కలసి తమిళ, తెలుగు బైలింగువల్ మూవీ ‘ది వారియర్’ చేశాడు రామ్. జులై 14న ఈ చిత్రం తమిళంలో భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అందుకు తగ్గట్లే వారియర్ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారతీరాజా, మణిరత్నం, శంకర్ సహా తమిళ దర్శకులందరూ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేశారు. హీరో రామ్ కు తమిళ సినీ పరిశ్రమకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. -
The Warrior: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్
‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. లింగూ.... (నవ్వుతూ) మీరు ముందు రోడ్ బాగా వేస్తే వెనకాలే మేం కూడా వచ్చేస్తాం (పొన్నియిన్ సెల్వన్ విడుదలను ఉద్దేశించి). ‘ది వారియర్’ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ది వారియర్’ చాలా మంచి టైటిల్. జీవితంలో ఏదో సాధించటానికి అందరం ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్. లింగుసామి నాకు మంచి స్నేహితుడు. కరోనా సమయంలో అండగా నిలబడ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ‘ది వారియర్’ పెద్ద హిట్ అవ్వాలి. ఈ ట్రైలర్ చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు ఎస్.జె.సూర్య, సెల్వమణి, కార్తీక్ సుబ్బరాజ్, హీరోలు విశాల్, ఆది పినిశెట్టి, ఆర్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ సమయంలో చాలా నెర్వస్‌గా ఫీలయ్యా : కృతీశెట్టి
‘బుల్లెట్’ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే నాకు చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్లిపోయింది. ఎనర్జీ కావాలనుకుంటే ‘విజిల్’ సాంగ్ వింటాను.. కొంచెం స్టైలీష్ అంటే ‘బుల్లెట్’ పాట వింటా. ఈ పాటకు ముందు వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి’అని కృతీశెట్టి అన్నారు. రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కృతీశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► లింగుస్వామి తెరకెక్కించిన సినిమాలన్ని ఎంటర్టైనింగ్ ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. ఆయన తీసిస ‘అవారా’చిత్రం చాలా ఏళ్ల క్రితం తమిళంలో చూశాను. నాకు బాగా నచ్చిన చిత్రాలలో అదొకటి. ఒక్కరోజు లింగు స్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యారు. ‘ది వారియర్’ కథ వన్ని తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాను. ► 'ది వారియర్'లో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే. ► బుల్లెట్, విజిల్స్ సాంగ్స్ చూసి అందరూ మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. థియేటర్లలో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. సీన్స్ గురించి ఇప్పుడే చెప్పలేను. ► ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఆయనతో నా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే... ఒకరోజు సెట్స్‌కు వెళ్ళాను. బయట చాలా సాఫ్ట్‌గా ఉండే ఆయన... విలన్ రోల్లో కంప్లీట్ డిఫరెంట్‌గా అద్భుతంగా నటించారు. రామ్ తర్వాత ఎక్కువ సన్నివేశాలు నదియా గారితో చేశా. రాయల్‌గా ఉంటారు. ► 'ది వారియర్'తో నేను కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.ఇది నాకు తొలి తమిళ సినిమా.చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. 'ఉప్పెన' టైమ్ నుంచి కోలీవుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు నేను ఊహించలేదు. అంత ప్రేమ చూపిస్తారని! ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో వేరు వేరుగా షూట్ చేశాం. తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నారు. అందులో సూర్య హీరో. అలాగే నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు - తమిళ్ బైలింగ్వల్. అందుకని తమిళం నేర్చుకుంటున్నాను. ► కథ వినేటప్పుడు నేను ఎంటర్టైన్ అయితే... ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతాని అనుకుంటాను. యాక్షన్ రోల్లో నటించాలని ఉంది. అయితే అది ఇప్పుడే కాదు..కొనేళ్ల తర్వాత అలాంటి పాత్రల్లో నటిస్తాను. ఇప్పటివరకు ఫీమేల్ స్క్రిప్ట్ ఏవీ వినలేదు. 'ది వారియర్' తర్వాత 'మాచర్ల నియోజకవర్గం'తో ప్రేక్షకుల ముందుకు వస్తా. -
ది వారియర్ సగం హిట్ అయినట్లే : హీరో రామ్
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ – ‘‘అనంతపురంలో ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ అనగానే హ్యాపీ ఫీలయ్యాను. ఇక్కడ ఫంక్షన్ జరుపుకుని ‘ది వారియర్’ సగం సక్సెస్ సాధించింది’ అన్నారు. ‘‘బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది కాబట్టి సినిమా సగం హిట్ అయినట్లుగా భావిస్తున్నాం. సినిమాలోని ప్రతి ఎమోషన్‌ను లింగుసామి జెన్యూన్‌గా ఫీలై చేశారు’’ అన్నారు రామ్. ‘‘మీ అందరిలో (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) ఉన్న ఎనర్జీ అంతా రామ్ ఒక్కడిలోనే ఉంది’’ అన్నారు లింగుసామి. శ్రీనివాసా చిట్టూరి, ఆది పినిశెట్టి పాల్గొన్నారు. -
‘ది వారియర్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
రామ్ ‘ది వారియర్’ ట్రైలర్ వచ్చేసింది
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. శుక్రవారం(జూలై 1) దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్ విడుదల చేయగా... తమిళ ట్రైలర్‌ను స్టార్ హీరో శివ కార్తికేయన్ రిలీజ్ చేశాడు. ఆద్యంతం మాస్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ పోలీసు ఆఫసర్‌గా కనిపిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా మరోసారి మెప్పించనున్నాడు. ప్రతి కథానాయకుడిగా ఆది సరికొత్తగా కనిపించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. -
తన మూవీ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్, ఏం జరిగిందంటే!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన జూలై 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ చేసిన చిత్రం బృందం నిన్న ఈ ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ‘విజిల్.. విజిల్..’ అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశాడు. ఇక ఈ పాట లాంచింగ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ.. విజిల్ సాంగ్ తనకు బాగా నచ్చిందని చెప్పాడు. చదవండి: హమ్మయ్యా.. షూటింగ్ పూర్తయింది: పూజా హెగ్డే తమ చిత్రానికి మంచి ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించి దేవిశ్రీ ప్రసాద్, సింగర్స్, నిర్మాతలతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ సినిమా సృష్టికర్త అయిన దర్శకుడు లింగుస్వామి గురించి మాత్రం రామ్ ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రామ్ ట్వీట్ చేస్తూ డైరెక్టర్ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ‘ఈ చిత్రం తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, డైరెక్టర్ లింగుస్వామి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ను మీ భుజాలపై ఎత్తుకున్నారు. నేను ఇప్పటి వరకు పనిచేసిన అత్త్యుత్తమైన డైరెక్టర్లలలో మీరు ఒకరు. థ్యాంక్యూ. సారీ సార్.. లవ్ యూ’ అంటూ రామ్ రాసుకొచ్చాడు. చదవండి: అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్ పూరీ Totally missed mentioning the MAIN MAN at the end amidst all the madness!! My Warriorrrr! My Director @dirlingusamy sir! Sir you have carried every single frame of this film on your shoulders!Thank you for being one of the best directors I’ve worked so far!!Sorry & Love you!!♥️ — RAm POthineni (@ramsayz) June 22, 2022 -
‘ది వారియర్’ మూవీ 'విజిల్.. విజిల్..' సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
విజిల్ వేయించేలా 'ది వారియర్' విజిల్ సాంగ్..
Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను బయటకు వదిలింది చిత్రబృందం. ఈ సినిమాలోని 'విజిల్.. విజిల్..' అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్‌తో అందరి చేత విజిల్ వేయించేలా మ్యూజిక్ అందించాడు. సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్, సింగర్స్ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతంగా ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, కృతిశెట్టి వేసిన స్టెప్స్ పాటకు హైలెట్‌గా నిలవనున్నాయి. విడుదలైన అతి కొద్ది సమయంలోనే ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. Here’s the #WhistleSong from #TheWarriorrhttps://t.co/4v4ED7InOz All the best for a super success!! @dirlingusamy @ThisIsDSP @RamSayz @AadhiOfficial @IamKrithiShetty — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2022 -
రామ్ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్ రికార్డు.. ఏంటో తెలుసా ?
Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..' సాంగ్ రిలీజై తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక సాహిత్యమందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి #BulletSong Spark Causing the Wildfire on YouTube 💥 Continues to make whole India groove with 100 Million+ Views 🕺💃 Telugu: https://t.co/XiPpHzsESj Tamil: https://t.co/amuQsznXC2@ramsayz @SilambarasanTR_ @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens pic.twitter.com/HU9lVFA1Z1 — Srinivasaa Silver Screen (@SS_Screens) June 15, 2022 -
యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్!
యంగ్ హీరోస్ అని ఎంత కాలం పిలుపించుకుంటారు. యూత్ ఆడియెన్స్ ను ఎంత కాలం ఎంటర్టైన్ చేస్తారు? అదే పనిగా ఎంత కాలం ప్రేమకథల్లో కనిపిస్తారు? అందుకే ఈ జనరేషన్ యంగ్ హీరోస్ తమ ఇమేజ్ మార్చుకునేందుకు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. స్టార్ హీరోలతో పోటీ పడేందుకు డైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్స్ తోనే మూవీస్ కమిట్ అవుతున్న యంగ్ హీరోస్‌పై ఓ లుక్కేద్దాం. హీరోస్‌పై ఓ లనేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు చేస్తూ వచ్చిన నర్జిటిక్ స్టార్ రామ్.. పూరి జగన్నాథ్ మేకింగ్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో నయా ఇమేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా మాస్ కు బాగా చేరువయ్యాడు. చాక్లెట్ బాయ్ కాస్త ఇప్పుడు ‘వారియర్’ గా మారాడు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతంది. త్వరలో బోయపాటి తో కలసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ కోరుకుంటున్న ఛేంజ్ ఓవర్.. స్టార్ డైరెక్టర్ తో వచ్చే నయా ఇమేజ్‌ని ఇప్పుడు మిగితా యంగ్ హీరోస్ కావాలనకుంటున్నారు. అందుకే నితిన్ కూడా రామ్ బాట పడ్డాడు. చెక్, రంగ్ దే, మాస్ట్రో లాంటి మూవీస్ తర్వాత నితిన్ చేస్తున్న మాస్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ సురేందర్ రెడ్డితో ఓ మూవీ చేయబోతున్నాడు. అది కూడా పక్కా మాస్ సినిమానే. అలాగే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా తెరకెక్కించిన వక్కంతం వంశీతోనూ ఊరమాస్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు అక్కినేని నాగచైతన్య కూడా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. వెంకీమామ, లవ్ స్టోరీ, థ్యాంక్యూ చిత్రాల తర్వాత నాగ చైతన్య కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకట్ ప్రభు తో మూవీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ తో మూవీ చేయబోతున్నాడు. మొత్తానికి యంగ్ హీరోలు రూటు మార్చి మాస్ బాట పట్టారు. -
మొన్న బుల్లెట్టు, ఇప్పుడు లవ్ సాంగ్ డ్యూయెట్టు..
రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ది వారియర్. ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవలే ఈ సినిమాలో నుంచి కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు.. సాంగ్ రిలీజై తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఈ మూవీలో నుంచి ఓ ఫీల్‌గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దడదడమని హృదయం శబ్ధం.. నువ్వు ఇటుగా వస్తావని అర్థం అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. కాగా రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: కమల్ యాక్షన్‌కి ఫిదా..ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు -
The Warriorr: 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో మాస్ సాంగ్
ఒక మంచి మాస్ సాంగ్‌తో ‘ది వారియర్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టింది చిత్రబృందం. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం వారం రోజులుగా రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ మాస్ సాంగ్ షూట్ శనివారంతో ముగిసింది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ కనిపిస్తారు. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. రామ్ సరసన కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఎనర్జిటిక్ హీరో రామ్ వారియర్ మూవీ టీజర్ వచ్చేసింది!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం వారియర్. పందెంకోడితో హిట్ దర్శకుడిగా తెలుగునాట పేరు సంపాదించిన లింగుసామి దర్శకత్వం వహించాడు. శనివారం(మే 14న) ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. 'పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నామప్పా.. ఇంతకుముందు సైలెంట్‌గ ఉండేటోళ్లు ఇప్పుడు వయొలెంట్‌గా లోపలేస్తాండారు.. ఈ మధ్య సత్య అని ఒకడొచ్చినాడు..' అంటూ హీరో రామ్ గురించి ఎలివేషన్ ఇచ్చారు. 'పాన్ ఇండియా సినిమా చూసుంటారు, పాన్ ఇండియా రౌడీలను చూశారా? డియర్ గ్యాంగ్స్టర్స్.. వీలైతే మారిపోండి, లేదంటే పారిపోండి' అని రామ్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ రోల్లో కనిపించగా హీరోయిన్ కృతీశెట్టి అందచందాలతో ఆకట్టుకుంటోంది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన వారియర్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్ కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో నటుడు శింబు బుల్లెట్ సాంగ్‌ను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం. చదవండి: నేనే కాదు, నా భర్త కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు: నటి జాన్ అబ్రహం, రకుల్ మూవీ 'యాక్షన్', ఎప్పటినుంచంటే? -
గెట్ రెడీ
రామ్ తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి లింగుసామి దర్శకుడు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో పోలీసాఫీసర్ సత్య పాత్రలో నటిస్తున్నారు రామ్. జూలై 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘గెట్ రెడీ... ఈ నెల 14న సత్యను పరిచయం చేస్తున్నాం’’ అని రామ్ పేర్కొన్నారు. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
'ప్రేమ'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృతిశెట్టి
ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బేబమ్మ లవ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. మరికొన్నేళ్ల పాటు కెరీర్ మీదే దృష్టి పెడతా. ప్రేమ గురించి ఆలోచించేంత సమయం అస్సలు లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతిశెట్టి తెలుగులో సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.చదవండి: విడాకులపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ -
నా తొలి సినిమా తమిళంలో చేయాల్సింది: రామ్ పోతినేని
సాక్షి, చెన్నై: తన మొదటి చిత్రాన్ని తమిళంలో చేయాల్సిందని హీరో రామ్ అన్నారు. తాను చెన్నైలో పెరిగి చదివిన కుర్రాడినని తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారని.. డీఎస్పీ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తమిళంలో రామ్ కథానాయకుడిగా (తెలుగు, తమిళం) చిత్రం ది వారియర్. చదవండి👉 ది వారియర్: ఒక్క పాటకు మూడు కోట్లు పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు బుల్లెట్ అనే పల్లవితో సాగే పాటను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని లక్స్ థియేటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. చదవండి👉 శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ -
‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాటను ఆవిష్కరించిన ఉదయనిధి స్టాలిన్ (ఫోటోలు)
-
ఒక్క బుల్లెట్ సాంగ్‌కు మూడు కోట్లు ఖర్చు!
‘‘రామ్‌కు తమిళ భాష తెలియదనుకున్నాను. అయితే ఆయన ఇక్కడ పక్కా తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల క్రితం దర్శకుడు లింగుసామి ‘ది వారియర్’ ఆడియో ఫంక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నాను. అవి పూర్తయ్యాకే చేద్దాం అని చెప్పి, 21న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22కి మార్చారు’’ అని తమిళనాడు ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రామ్ హీరోగా నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘బుల్లెట్...’ అనే పాటను తమిళ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ఆడియోను ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘లింగుసామి దర్శకత్వంలో ఇంతకు ముందు నేనో సినిమా చేయాల్సింది. త్వరలో చేయనున్నాను. ఇక రామ్ నటించిన ‘ది వారియర్’ ఆయన ఇంతకు ముందు నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘లింగుసామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇందులో విలన్‌గా నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక్క ‘బుల్లెట్..’ పాట కోసమే నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు’’ అన్నారు లింగుసామి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లింగుసామితో సినిమా చేయాలనే ఆకాంక్ష ఈ ద్విభాషా చిత్రంతో నెరవేరింది. ‘బుల్లెట్..’ పాట పాడిన శింబుకు థ్యాంక్స్’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ది వారియర్’ నుంచి బుల్లెట్ సాంగ్ వచ్చేసింది
First Single Released From The Warrior Movie: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, ఆన్లైన్లో లీకైన సినిమా ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌సింగిల్ పేరుతో తొలి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించి ఎనర్జీటిక్ మ్యూజిక్, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్‌ను అందించాడు. -
వారియర్ మూవీలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు
ది వారియర్‌కు పాట పాడారు తమిళ హీరో, సింగర్ శింబు. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ది వారియర్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో బుల్లెట్ అంటూ సాగే పాటను శింబు పాడారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. రామ్, దేవి శ్రీ ప్రసాద్‌లతో ఉన్న స్నేహం వల్లే శింబు మా చిత్రంలోని బుల్లెట్ పాట పాడారు. ఇది ఒక మాస్ నెంబర్. ఇటీవల ఇంట్రవెల్ సీన్‌తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించాం. మా మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్, కెమెరా : సుజీత్ వాసుదేవ్. Thank you @SilambarasanTR_ #STRforRAPO #Thewarriorr pic.twitter.com/KUX2Fu62sa— Lingusamy (@dirlingusamy) April 17, 2022 చదవండి: షారుక్, అజయ్లతో అక్షయ్ యాడ్, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ -
స్టైలిష్ పోలీస్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తున్న రామ్
స్టైలిష్ పోలీస్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. ఆయన హీరోగా,కృతిశెట్టి హీరోయిన్గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషలో ఈ మూవీ తెరకెక్కుతుంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తాజాగా ఈ చిత్రం నుంచి రామ్ కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో రామ్ పవర్ఫుల్ పోలీసులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌లో రామ్..షార్ట్ హెయిర్ కట్, మీసాలు, కళ్ళలో ఇంటెన్స్‌తో రామ్ కొత్తగా కనిపించారు. ఇక ఉగాదికి మాత్రం స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మ్యాచో బైక్ మీద రామ్ వస్తుంటే... ఆయన యాటిట్యూడ్, స్వాగ్ అభిమానులు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని, రామ్, కృతిశెట్టిలపై పాటను చిత్రీకరిస్తున్నామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. Wishing you all a #HappyUgadi. Love..#RAPO #TheWarriorr #TheWarriorrOnJuly14 pic.twitter.com/mrZZwB0lle — RAm POthineni (@ramsayz) April 2, 2022