
‘బుల్లెట్’ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే నాకు చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్లిపోయింది. ఎనర్జీ కావాలనుకుంటే ‘విజిల్’ సాంగ్ వింటాను.. కొంచెం స్టైలీష్ అంటే ‘బుల్లెట్’ పాట వింటా. ఈ పాటకు ముందు వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి’అని కృతీశెట్టి అన్నారు. రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కృతీశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► లింగుస్వామి తెరకెక్కించిన సినిమాలన్ని ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. ఆయన తీసిస ‘అవారా’చిత్రం చాలా ఏళ్ల క్రితం తమిళంలో చూశాను. నాకు బాగా నచ్చిన చిత్రాలలో అదొకటి. ఒక్కరోజు లింగు స్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యారు. ‘ది వారియర్’ కథ వన్ని తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాను.
► 'ది వారియర్'లో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే.
► బుల్లెట్, విజిల్స్ సాంగ్స్ చూసి అందరూ మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. థియేటర్లలో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. సీన్స్ గురించి ఇప్పుడే చెప్పలేను.
► ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఆయనతో నా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే... ఒకరోజు సెట్స్‌కు వెళ్ళాను. బయట చాలా సాఫ్ట్‌గా ఉండే ఆయన... విలన్ రోల్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా అద్భుతంగా నటించారు. రామ్ తర్వాత ఎక్కువ సన్నివేశాలు నదియా గారితో చేశా. రాయల్‌గా ఉంటారు.
► 'ది వారియర్'తో నేను కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.ఇది నాకు తొలి తమిళ సినిమా.చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. 'ఉప్పెన' టైమ్ నుంచి కోలీవుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు నేను ఊహించలేదు. అంత ప్రేమ చూపిస్తారని! ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో వేరు వేరుగా షూట్ చేశాం. తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నారు. అందులో సూర్య హీరో. అలాగే నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు - తమిళ్ బైలింగ్వల్. అందుకని తమిళం నేర్చుకుంటున్నాను.
► కథ వినేటప్పుడు నేను ఎంటర్‌టైన్ అయితే... ఆడియన్స్ కూడా ఎంటర్‌టైన్ అవుతాని అనుకుంటాను. యాక్షన్ రోల్‌లో నటించాలని ఉంది. అయితే అది ఇప్పుడే కాదు..కొనేళ్ల తర్వాత అలాంటి పాత్రల్లో నటిస్తాను. ఇప్పటివరకు ఫీమేల్ స్క్రిప్ట్ ఏవీ వినలేదు. 'ది వారియర్' తర్వాత 'మాచర్ల నియోజకవర్గం'తో ప్రేక్షకుల ముందుకు వస్తా.
Comments
Please login to add a commentAdd a comment