‘‘మా ‘ది వారియర్’ రిలీజ్ సమయంలో వర్షాలు పడుతున్నాయి. సినిమా వాయిదా వేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాం. అయితే ప్రేక్షకులు వస్తారని గట్టిగా నమ్మాం.. మా నమ్మకం నిజమైంది’’ అని రామ్ పోతినేని అన్నారు. లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌లో రామ్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ వచ్చినా, వర్షాలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని ‘ది వారియర్’ మరోసారి నిరూపించింది. ఈ చిత్ర నిర్మాతలతోనే నా తర్వాతి సినిమా ఉంటుంది’’ అన్నారు.
లింగుసామి మాట్లాడుతూ.. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి మంచి హీరో, శ్రీనివాసా చిట్టూరి లాంటి నిర్మాత, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో... అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ 'ది వారియర్'లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బాగుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వర్షాల్లో సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment