Aadhi Pinisetty Open Up On Love and Marriage With Nikki Galrani - Sakshi
Sakshi News home page

Aadhi Pinisetty: మొదట్లో నిక్కీకి నాకు గొడవలు, మనస్పర్థలు.. ఆ తర్వాత..

Published Sat, Jul 16 2022 1:47 PM | Last Updated on Sat, Jul 16 2022 3:43 PM

Aadhi Pinisetty Open Up On Love and Marriage With Nikki Galrani - Sakshi

ఆది పినిశెట్టి తాజాగా ది వారియర్‌ మూవీతో అలరించాడు. పెళ్లి అనంతరం విడుదలైన ఆయన తొలి చిత్రం ఇది. గురువారం(జూలై 14న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇందులో ఆది విలన్‌ గురుగా కనిపించాడు. ఈ మూవీ రిలీజైన సందర్భంగా ఆది మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆది నటి నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లిపై ఆస్తికర వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: లలిత్‌ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్‌, వారెవరంటే!

‘నేను నిక్కీ మలుపు చిత్రం నుంచే మంచి స్నేహితులం. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో తనకు నాకు గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొన్ని రోజులు మేం మాట్లాడుకోలేదు. సెట్‌లో మేం అసలు మాట్లాడుకునే వాళ్లం కాదు. దాదాపు షూటింగ్‌ అంతా అలానే పూర్తి చేశాం. ఇక చివరిలో మళ్లీ కలిశాం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘‘మలుపు అనంతరం ఇద్దరం కలిసి పలు సినిమాలు చేశాం. ఈ ప్రయాణంలో మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీనే నాకు ప్రపోజ్‌ చేసింది. తను నా దగ్గరకి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ వెంటనే నేను కూడా ఓకే చెప్పాను. 

కొన్నాళ్లు ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. ఆ తర్వాతే ఇంట్లోవాళ్లకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం చాలా సంతోషంగా సాగుతోంది. నేను, నిక్కీ కలిసి నటించిన ‘శివుడు’ సినిమా త్వరలోనే రాబోతుంది” అని చెప్పాడు. కాగా మే నెలలలో ఆది-నిక్కీలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మే 18వ తేదీన రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లిలో టాలీవుడ్‌ హీరోలు నేచురల్‌ స్టార్‌ నాని, సందీప్‌ కిషన్‌ సందడి చేశారు.

చదవండి: వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్‌ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement