తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్‌ | Actress Nikki Galrani Respond on Her Pregnancy Rumours | Sakshi
Sakshi News home page

Nikki Galrani: తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్‌

Nov 19 2022 9:22 AM | Updated on Nov 19 2022 9:33 AM

Actress Nikki Galrani Respond on Her Pregnancy Rumours - Sakshi

హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌ నిక్కీ గల్రానీ సోషల్‌ మీడియా వేదిక స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ  తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ‘నేను ప్రెగ్నెంట్‌ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి డెలివరి డేట్‌ కూడా మీరే చెప్పేయండి’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది.

చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్‌

అదే విధంగా ‘ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్‌ కాదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇది తప్పకుండ జరుగుతుంది.  అప్పడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ తన ప్రెగ్నెంట్‌ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. కాగా కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం ఈ ఏడాది మేలో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టిలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నిక్కీ, ఆది కలిసి ‘యగవరయినమ్ నా క్కాక’, ‘మరగధ నానయమ్’ సినిమాల్లో నటించారు. అదే సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ బయటకు చెప్పలేదు. సీక్రెట్‌గా డేటింగ్‌ చేసిన ఆది-నిక్కీ ఈ ఏడాది పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 

చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్‌, నడవలేని స్థితిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement