
యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీతో మార్చి 24న నిశ్చితార్థం జరుపుకున్న హీరో మరికొద్ది రోజుల్లో ఆమెతో ఏడడుగులు వేయనున్నాడు. వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో మే 18న వీరి వివాహం జరగనుందట.
ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆది, నిక్కీ.. ‘యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో జంటగా నటించారు. తెలుగులో ఇది మలుపు పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే మరగద నానయం సినిమాలోనూ వీరు జంటగా నటించారు. ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్, వారియర్ సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: నా కూతురితో కారులో ఉన్నాను.. అతడు అత్యాచారం చేస్తానని బెదిరించాడు
Comments
Please login to add a commentAdd a comment