Is Aishwarya Rai Pregnant Again? Video and Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Aishwarya Rai: మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్‌

Published Wed, Jul 20 2022 8:53 PM | Last Updated on Thu, Jul 21 2022 8:51 AM

Is Aishwarya Rai Pregnant Again, Video and Photos Goes Viral - Sakshi

అందాల తార ఐశ్వర్యరాయ్‌ మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ కొద్ది రోజులుగా బి-టౌన్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తు‍న్నాయి. గతంలోనూ ఐష్‌ రెండోసారి తల్లికాబోతుందంటూ వార్తలు వచ్చినా ఈసారి మాత్రం కాస్తా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల విమానాశ్రయంలో కనిపించిన ఐశ్వర్య వీడియోనే. ముంబై విమానాశ్రయంలో భర్త అభిషేక్‌ బచ్చన్‌, కూతరు ఆరాధ్యలతో కలిసి ఐశ్వర్య దర్శనం ఇచ్చింది.

చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్‌, 2 గంటల పాటు ఎయిర్‌ పోర్టులోనే..

ఇందులో ఐష్‌ కాస్తా బొద్దుగా, పొట్ట భాగంగా ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. అంతేకాదు ఈ వీడియోలో ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపించడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్‌ అని ఫిక్స్‌ అయిపోయారు. దీంతో తాను మరోసారి గర్భవతి అయ్యిందని, అందుకే పొట్ట భాగాన్ని కవర్‌ చేసుకుంటుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్‌ నిజంగానే ప్రెగ్నెంట్‌ అయ్యిందంటూ ఆమె ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

‘బచ్చన్‌ ఫ్యామిలీ బుల్లి వారసుడు రావాలని, ఆరాధ్య పాపకు తమ్ముడు వస్తున్నాడు’ అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐష్‌ స్పందించకపోవడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బచ్చన్‌ ఫ్యామిలీ స్పందించేవరకు వేచి చూడక తప్పదు. కాగా 2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు వివాహం కాగా.. 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement