
స్టైలిష్ పోలీస్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. ఆయన హీరోగా,కృతిశెట్టి హీరోయిన్‌గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషలో ఈ మూవీ తెరకెక్కుతుంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తాజాగా ఈ చిత్రం నుంచి రామ్ కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో రామ్ పవర్‌ఫుల్ పోలీసులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌లో రామ్..షార్ట్ హెయిర్ కట్, మీసాలు, కళ్ళలో ఇంటెన్స్‌తో రామ్ కొత్తగా కనిపించారు.
ఇక ఉగాదికి మాత్రం స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మ్యాచో బైక్ మీద రామ్ వస్తుంటే... ఆయన యాటిట్యూడ్, స్వాగ్ అభిమానులు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని, రామ్, కృతిశెట్టిలపై పాటను చిత్రీకరిస్తున్నామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.
Wishing you all a #HappyUgadi.
— RAm POthineni (@ramsayz) April 2, 2022
Love..#RAPO #TheWarriorr #TheWarriorrOnJuly14 pic.twitter.com/mrZZwB0lle