‘ది వారియర్’ మూవీతోనే తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. ఈ సినిమాతోనే కోలీవుడ్ కు తన మార్కెట్ ను విస్తరించాలనుకున్నాడు. తర్వాత చేయబోయే బోయపాటి మూవీ, ఆ తర్వాత చేయబోయే గౌతమ్ మీనన్ మూవీతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనుకున్నాడు. ది వారియర్ వేసిన విజిల్ను తమిళ ఆడియెన్స్ పట్టించుకోలేదు.
(చదవండి: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్ మూవీ)
బోయపాటి తో రామ్ నటించే మూవీ పై పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ముందు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్లాన్ చేశారట. కాని ఇప్పుడు మారిన బిజినెస్ స్ట్రాటజీస్ లెక్కలు చూసుకుని బడ్జెట్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా విరమించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
బోయపాటి మూవీ తర్వాత లవ్ స్టోరీస్ కు స్పెషలిస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ మేకింగ్ లో మూవీ చేయాలనుకున్నాడు రామ్. ఈ ప్రాజెక్ట్ ను కేవలం కోలీవుడ్ ఆడియెన్స్ ను టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ చేయాలనుకున్నాడు. కాని ది వారియర్ రిజల్ట్ చూసిన తర్వాత కోలీవుడ్ మార్కెట్ కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. గౌతమ్ మీనన్ కంటే కూడా అనిల్ రావివూడితో మూవీ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాడట. బాలయ్యతో మూవీ తర్వాత ఎఫ్ 3 డైరెక్టర్ అనిల్ రావిపూడి రామ్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment