మొన్న బుల్లెట్టు, ఇప్పుడు లవ్‌ సాంగ్‌ డ్యూయెట్టు.. | The Warriorr Movie: Dhada Dhada Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

The Warriorr Movie: వారియర్‌ మూవీలోని దడదడ సాంగ్‌ విన్నారా?

Published Sat, Jun 4 2022 4:05 PM | Last Updated on Sat, Jun 4 2022 4:05 PM

The Warriorr Movie: Dhada Dhada Lyrical Song Out Now - Sakshi

రామ్‌ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ది వారియర్‌. ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు.  ఇటీవలే ఈ సినిమాలో నుంచి కమ్‌ ఆన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు.. సాంగ్‌ రిలీజై తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఈ మూవీలో నుంచి ఓ ఫీల్‌గుడ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. దడదడమని హృదయం శబ్ధం.. నువ్వు ఇటుగా వస్తావని అర్థం అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.

శ్రీమణి రాసిన ఈ పాటను హరిచరణ్‌ ఆలపించారు. కాగా రామ్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్‌ కానుంది.

చదవండి: కమల్‌ యాక్షన్‌కి ఫిదా..ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..
స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్‌.. అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement