రామ్‌ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్‌ రికార్డు.. ఏంటో తెలుసా ? | Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views | Sakshi
Sakshi News home page

Bullet Song: రామ్‌ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్‌ రికార్డు.. ఏంటో తెలుసా ?

Published Wed, Jun 15 2022 9:22 PM | Last Updated on Wed, Jun 15 2022 9:28 PM

Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views - Sakshi

Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views: రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్‌ ఆన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు..' సాంగ్‌ రిలీజై తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్‌ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. 

తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్‌ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక సాహిత్యమందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. 

చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి
ముసలిదానివైపోతున్నావ్‌.. అంటూ అనసూయపై కామెంట్లు
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement