Year Ender 2022: List Of 7 Best Dance Hits Songs In 2022, Watch Song Videos - Sakshi
Sakshi News home page

Year End 2022: మాస్‌ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్‌

Published Thu, Dec 22 2022 4:22 PM | Last Updated on Thu, Dec 22 2022 6:46 PM

Year Ender 2022: Best Dance Hits Songs In 2022  - Sakshi

సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్‌ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్‌ సాంగ్స్‌, హీరోహీరోయిన్లతో మాస్‌ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్‌ రికార్టు సృష్టించాయి.

అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్‌ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్‌ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్‌ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్‌ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి!

‘డీజే టిల్లు’
ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో చిన్న చిత్రంగా విడుద‌లై హ్యూజ్‌ హిట్‌ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆడియెన్స్‌ను అల‌రించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్‌ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్‌ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్‌ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్‌ ఫిదా అయ్యాడు. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి.

‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్‌ రికార్డు
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజ‌యంలో పాట‌లు కూడా కీల‌క‌పాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ‌.. మ‌.. మ‌హేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్‌ రికార్డు క్రియేట్‌ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్‌, కీర్తిలు వేసిన మాస్‌ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్‌ వేసిన క్లాస్‌ డాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. 

‘ది వారియర్‌’ బుల్లెట్‌
రామ్‌ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్‌. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్‌, విజిల్‌ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్‌ సాంగ్‌కు సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయ్యింది. ‘కమ్‌ ఆన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. వ్యూస్‌ పరంగా కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్‌ పైనే వ్యూస్‌ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్‌ బండి సిగ్నేచర్‌ స్టెప్‌ కూడా బాగా పాపులర్‌ అయ్యింది. 

రారా.. రక్కమ్మా (విక్రాంత్‌ రోణ)
రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్‌, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్‌ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.

బీస్ట్‌ అరబిక్‌ కతు
కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్‌. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్‌ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్‌ రాబట్టిన రెండో పాటగా అరబిక్‌ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్‌ స్టేప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్‌ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్‌ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్‌ దర్శనిమిస్తున్నాయి.

తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌(గాడ్‌ ఫాదర్‌)
మెగాస్టార్‌ చిరంజీవి, సత్యాదేవ్‌, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్‌ ఫాదర్‌. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇందులో కీ రోల్‌ పోషించారు. ఇక చిరు-సల్మాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌’ పాట ఎంతటి క్రేజ్‌ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్‌ తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్‌ థియేటర్లో ఈలలు వేయించింది. 

రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం)
అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్‌ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్‌ వేసిన మాస్‌ స్టెప్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్‌ హాసన్‌ విక్రమ్‌ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్‌ స్టెప్‌తో రికార్డులు క్రియేట్‌ చేసి ఉర్రుతలూగించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement