2022 Roundup
-
మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు
సాక్షి, హైదరాబాద్: ‘మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు’’... ఇదేదో ఒకరోజులోని దుర్ముహూర్తం కాదు. ఆ ఆరు గంటలే వాహనచోదకులపాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఆ కొన్ని గంటల్లో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. 2022లో ఏడాది పొడవునా జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే తేలిన విషయం ఇది. రాష్ట్ర పోలీస్ శాఖలోని రైల్వే, రోడ్డు భద్రత విభాగం అధికారులు 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలు నమోదైన సమయం, ప్రమాద మృతులసంఖ్యను గణాంకాలవారీగా విశ్లేషించారు. దీనిలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల సమయంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరగడమే కాక ఎక్కువమంది మృత్యు వాత పడుతున్నట్టు గుర్తించామని రోడ్డు భద్రతావిభాగం అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణాలు ఏమిటని విశ్లేషిస్తే, అది ఉద్యోగు లు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయం కావడం, ద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్లే వేళ కావడం, ఇతర పనులపై జనం రోడ్లపైకి ఎక్కువగా వచ్చే సమయం కావడంతోనే ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రమాదాలు తగ్గించడంతోపాటు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు, రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాలు జరిగితే వెంటనే అందించే ప్రాథమిక చికిత్సపైనా అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా?
2022లో కాంగ్రెస్ పార్టీ మరి కొంచెం పతనమైంది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు మూడు మినహా చెప్పుకోదగ్గ రాష్ట్రాల్లో అధికారం లేదు. మూడేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని..మరో రాష్ట్రంలో అధికారం సాధించుకుంది. ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాలు, అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో మరింత కుదేలైన హస్తం శ్రేణుల్లో.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాస్త జోష్ నింపింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని.. 2022లోనూ వైఫల్యాలు వెంటాడాయి. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్లో అయితే ఏడవసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది హస్తం పార్టీ. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీహార్‌లో బీజేపీ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ కమలానికి టాటా చెప్పి.. కాంగ్రెస్ కూటమిలో చేరారు. ఆ విధంగా మహారాష్ట్ర చేజారితే.. బీహార్ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పోయే.. ఖర్గే వచ్చే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీకి అధ్యక్షుడే లేకుండా మూడున్నరేళ్ళ పాటు సాగింది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోయినా తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రక్రియ కొనసాగుతున్న దశలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 22 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరోసారి గాంధీయేతర కుటుంబం నుంచి ఓ నేత అధ్యక్షుడయ్యారు. కర్నాటకకు చెందిన 80 ఏళ్ళ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్త నాయకుడు వచ్చినా.. పార్టీ పరిస్థితుల్లో మార్పులేదు, అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి అధికారం పోగొట్టుకున్న తెలంగాణ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలే. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్, యువనేత పైలట్ వర్గాలు బహిరంగంగా మాటల తూటాలు విసురుకుంటున్నా ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ అల్లాడుతోంది. పార్టీని వెంటాడుతున్న పాపాలు ఓవైపు కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు నేషనల్ హెరాల్ట్ కేసు గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ. సోనియాను మూడుసార్లు, రాహుల్ గాంధీని ఐదు రోజులు విచారించారు ఈడీ అధికారులు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులతో.. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉన్న లింకులపై ఆరా తీశారు. గాంధీలు విచారణకు హాజరైన అన్ని రోజులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, హర్తాళ్లు చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో రోడ్డెక్కిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జోడో.. తెచ్చే మార్పు ఎంత? చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టున్న కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసేందుకు, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు..సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. తొమ్మిది రాష్ట్రాలు దాటుకుని..ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసమే భారత్ జోడో అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీలో నెలకొన్న విపరీత పరిస్థితులు.. నేతల మధ్య అంతరాలను తొలగించి, కాంగ్రెస్‌ను తిరిగి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ గాంధీ వాటి గురించి సీరియస్‌గా తీసుకోకుండా తన జోడో యాత్ర కొనసాగించడంపై విమర్శలు వినిపించాయి. ముందుంది ముసళ్ల పండగ వరుజ పరాజయాలు..అంతర్గత కుమ్ములాటలతో నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర కాస్త ఉత్సాహం నింపింది. జనంలో ఉండేందుకు..ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం దక్కింది. అయితే రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల లబ్ధి మాత్రం ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 2023లో కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ పాటు ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటక సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏమేరకు ఉందో..త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయనున్నాయి. కొండ లాంటి బీజేపీ, బలమైన ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ నుంచి పంజాబ్‌ను చేజిక్కించుకున్నారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అడ్డంగా చీల్చేశారు. ముందు ముందు ఆప్ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతుందనే అంచనాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కంగారు పెడుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Nayanthara: అన్నీ మంచి అనుభూతులే..!
తన జీవితంలో 2022 ఓ ఆనందాల హరివిల్లు అని నటి నయనతార అన్నారు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఈమెను చెప్పుకోవచ్చు. మొదట్లో కేరళ రాష్ట్రం, తిరువనంతపురం నుంచి చెన్నై మహానగరానికి వచ్చిన డయానా మరియం కురియన్‌కి సినిమా పేరు నయనతార. మలయాళి కుటుంబానికి చెందిన ఈమె పుట్టింది మాత్రం బెంగళూరులో. 2002లో మలయాళ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 2005లో అయ్యా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న నయనతార నటిగాను, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అగ్రనాయకి స్థాయికి చేరుకున్నారు. రెండుసార్లు ప్రేమలో ఓడిపోవడంతో ఒక దశలో ఇక పెళ్లి చేసుకోకూడదనే వైరాగ్యానికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఈ సంతోషకరమైన తరుణాలన్నీ 2022లోనే జరగడంతో ఇది ఆనందాల నిలయమైన ఏడాది అని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం నయనతార మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ ఏడాది తనకు ఆనందాల నిలయంగా అమరిందన్నారు. తాను ప్రధాన పాత్రను పోషించిన కనెక్ట్ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారన్నారు. చదవండి: (స్టార్ క్యాలెండర్ 2023) -
తిరుమల: 2022 గణాంకాలను విడుదల చేసిన టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2022వ సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 2,35,58,325 మంది భక్తులు స్వామి వారిని దర్శించకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.1,446 కోట్లకు చేరింది. 1,08,51,706 మంది భక్తులు గడిచిన సంవత్సరకాలంలో స్వామి వారికి తలనీలాలను సమర్పించారు. 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. చదవండి: (AP: సీఐడీ చీఫ్ సునీల్‌కు డీజీగా ప్రమోషన్) -
2022లో టాలీవుడ్లో వివాద పర్వం
-
Year End 2022: ఈ పంచ్ డైలాగ్స్‌పై ఓ లుక్కేయండి
2022 ఎండ్ అవుతోంది... ఈ ఎండింగ్ హ్యాపీకి దారి తీయాలంటూ 2023కి వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నాం. ఈ ఇయర్ ఎండింగ్‌ని కొన్ని పంచ్ డైలాగ్స్‌తో ఎండ్ చేద్దాం. 2022లో రిలీజైన చిత్రాల్లో పాపులర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని పంచ్ డైలాగ్స్, లవ్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఈ విధంగా ... బంగార్రాజు: ఏంటే ఈ మనుషులు.. బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలీదేంటే వీళ్లకి.. పోతేనే తెలుస్తుందా? నాకు తెలుసే దాని విలువ.. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చస్తారు.. బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలు.. పోయాక ఏం మిగులుతుందే.. ఫొటోలు తప్ప. గుడ్ లక్ సఖి: గోలీ రాజు ఏంటి గోలీ రాజు? స్టేజి మీద నా పేరు రామారావు.. నువ్వు రామారావు అయితే నేను సావిత్రి. ఆర్ఆర్ఆర్: తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే ♦ భీమ్... ఈ నక్కల వేట ఎంత సేపు. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా? ఖిలాడి: ఎప్పుడూ ఒకే టీమ్‌కి ఆడటానికి నేషనల్ ప్లేయర్‌ని కాదు.. ఐపీఎల్ ప్లేయర్. ఎవడెక్కువ పాడుకుంటే వాడికే ఆడతాను. డీజే టిల్లు: ఇంట్లో ఒక శవాన్ని, బిల్డింగ్‌లో సీసీ టీవీ కెమెరాల్ని పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసినా చూడు అట్లుంటది మనతోని ముచ్చట. సన్ ఆఫ్ ఇండియా: నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. నేను కసక్ అంటే మీరందరూ ఫసక్. ఆడవాళ్ళు మీకు జోహార్లు: వీకెండ్ అంటే ఏం ఉంటుందండి.. తాగటం, తినడం, తొంగోవడం.. అలా అందరిలా కాకుండా అంతర్వేది, అన్నవరం వెళ్లొద్దామనుకుంటున్నానండి. రాధేశ్యామ్: ఏంట్రా.. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?, ఆడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు. ఆచార్య: పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో? ♦ ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది.. ధర్మస్థలి అధర్మస్థలి కాకూడదు. సర్కారువారి పాట: మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోవద్దు. ♦ దీనికున్న అలవాట్లకి, దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని. ఎఫ్3: వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ ♦ వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ మేజర్: టైమ్‌కి మనం వెళ్లకపోవడం వల్ల ఒక్క ప్రాణం కోల్పోయినా కూడా లైఫ్‌లో నన్ను నేను సోల్జర్ అనుకోలేను సర్. పక్కా కమర్షియల్: సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా.. విలన్. ది వారియర్: ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. థ్యాంక్యూ: లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేది లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికొచ్చాను. బింబిసార: బింబిసారుడు అంటే మరణ శాసనం.. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే. సీతారామం: చూడండీ... అడ్రస్ దొరికింది కదా అని వచ్చేస్తారేమో? అంత సాహసం మాత్రం చేయకండే! కార్తికేయ 2: శక్తి, సామర్థ్యాలతో పాటు బుద్ధి, గుణం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్లయ్యారు. లైగర్: లోపాలు అందరికీ ఉంటాయి. నీకు నత్తి ఉంది అంటున్నారు కదా. రేపు నీ మాట కూడా అందరికీ పాట లెక్క వినపడతది.. వినపడేటట్టు చేయాలి. గాడ్‌ఫాదర్: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు. జిన్నా: నమ్మకం లేని ప్రేమ.. కర్రల్లేని టెంటు నిలబడవు రేణుకా. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: అన్యాయంగా బెదిరించేవాడికన్నా న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు. హిట్ ది సెకండ్ కేస్: అవతలి టీమ్ వీక్ అని మన గోల్ కీపర్‌కి రెస్ట్ ఇవ్వలేం కదా సర్. ధమాకా: నేను వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చినవాణ్ణి కాదురోయ్.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాణ్ణి. 18 పేజెస్: ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించాం అంటే ఆన్సర్ ఉండకూడదు. -
Happy New Year 2023: మెరిసేనా.. ఉరిమేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లిపోతుంది. జ్ఞాపకం ఎప్పుడూ గుర్తుగానే మిగిలిపోతుంది. టైమ్ మెషీన్లో వెనక్కు వెళ్లి అనుభవంలోకి తెచ్చుకోలేము. కొన్ని జ్ఞాపకాలు కంటినుంచి జారిపడ్డ మెరుపుల్లాగా పెదవులపై చిరునవ్వులు వెలిగిస్తాయి. మరికొన్ని కన్నీటి చుక్కల్లా అప్రయత్నంగా ఒలికిపోయి ఘనీభవిస్తాయి. అప్పుడప్పుడు భయపెడతాయి. 2020, 2021 సంవత్సరాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి మానవాళికి అంతులేని విషాదాన్ని, నిర్వేదాన్ని, మానసిక ఒత్తిడిని మిగిల్చి వెళ్లాయి. 2022 ఆశాజనకంగానే ఆరంభమై భయంభయంగానే అయినా మందహాసంతో మందగమనంగా కొనసాగుతున్న వేళ ఒకరి రాజ్యకాంక్ష యుద్ధ రూపంలో విరుచుకుపడింది. యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ప్రపంచాన్ని నిర్దాక్షిణ్యంగా మాంద్యంవైపు నెట్టాయి. ఏడాది చివర్లో కంటికి కనిపించని వైరస్ ఒకటి మరోసారి రాబోయే గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టడం మొదలుపెట్టింది. ఉగాది పచ్చడిలా తీపి, చేదులను రుచి చూపించిన 2022 మానవాళికి కొంతలో కొంత ఉపశమనం కలిగించి వెళ్లిపోతోంది. మరి 2023 కొత్త ఆశలకు ఊపిరులూదుతుందా, లేక ఉన్న ఉసురూ తీస్తుందా? చూడాల్సిందే! వెళ్లిపోనున్న ఈ ఏడాది ప్రభావం రానున్న ఏడాదిపై ఎంతమేరకు పడనుందో ఒకసారి చూద్దాం... మాంద్యం... ముంచుకొస్తోంది! రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలవైపు దూసుకెళుతున్నాయి. కరోనా భయాలు, ఆంక్షలు రెండేళ్లపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి వృద్ధి రేటును పాతాళంలోకి నెట్టేశాయి. ఫలితంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత దశాబ్దంలోకెల్లా గరిష్టానికి చేరుకుంది. ఇది వచ్చే ఏడాది మరింత పైపైకి ఎగబాకి దాదాపు ప్రపంచాన్ని యావత్తూ మాంద్యంలోకి నెడుతుందని విశ్లేషకుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మాంద్యానికి మరింత ఆజ్యం పోస్తుందని వారి విశ్లేషణ. ద్రవ్యోల్బణాన్ని అరికడితే మాంద్యం బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లు పెంచాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో ద్రవ్బోల్బణం ఈ ఏడాది ఒక దశలో గత 40 ఏళ్లలో గరిష్టంగా ఏకంగా 9 శాతానికి ఎగబాకడం ప్రపంచ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం సగటు మనిషికి కోలుకోని దెబ్బే. పెట్రో ధరలు పెరగడం మధ్యతరగతి జీవితాలను పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం వేడి, మరోవైపు మాంద్యం బూచి పలు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఆలోచనలో పడేయడంతో ఖర్చు తగ్గించుకునేందుకు అవి ఉద్యోగాల కోతవైపు దృష్టి సారించాయి. ఫలితంగా పలు దేశాల్లో నిరుద్యోగిత మరింత పెరిగింది. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. భారత్‌లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.9 శాతంగా ఉంది. అయితే వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశించలేం. అంతో ఇంతో మాంద్యం ఊబిలో చిక్కక తప్పని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. వచ్చే ఏడాది బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు సరిచేస్తారో వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి కూడా ఊగిసలాటగానే ఉంది. మరీ శ్రీలంకలాగా దిగజారకున్నా వచ్చే ఏడాది అన్ని దేశాలపైనా మాంద్యం కత్తి వేలాడుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ ఏడాదంతా ఊదరగొట్టిన అధ్యయన సంస్థలు, అది కొంచెం కష్టమేనని తాజాగా అంగీకరిస్తుండటం గమనార్హం. మాంద్యం భయం అంచనాలనూ తారుమారు చేస్తోంది! యుద్ధం... వెన్ను విరుస్తోంది! నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెల ఒక్కటే ప్రశాంతంగా గడిచింది. కరోనా రక్కసి పీడ పోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యుద్ధం మరో దయ్యంలా దాపురించింది. 2020, 2021ల్లో మానవాళిని కరోనా వెంటాడితే ఈ ఏడాదిని రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష వెంటాడింది. ఫిబ్రవరిలో రష్యా ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి తన యుద్ధోన్మాదాన్ని ప్రపంచంపై రుద్దింది. తన అదృశ్య స్నేహితుడు చైనాతో కలిసి రష్యా ఒకవైపు, అమెరికా వత్తాసుతో ఉక్రెయిన్ మరొకవైపు మోహరించాయి. ఇప్పుడు డిసెంబరులో ఉన్నాం. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకీ అడుగు పెడుతోంది. ముమ్మరమా.. ముగింపా.. చెప్పలేం! రెండేళ్లుగా తూర్పు ఆఫ్రికాలో కొనసాగుతున్న యుద్ధం దాదాపు ఆరు లక్షల మందిని కబళించినా ఇంకా కొలిక్కి రాలేదు. వస్తుందనే నమ్మకమూ దరిదాపుల్లో లేదు. మరోవైపు సిరియా, యెమన్లలో జరుగుతున్న అంతర్యుద్ధాల పరిస్థితీ ఇదే. వాటి పర్యవసానాలు ఆయా దేశాలకే పరిమితమైనా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చింది. మరోవైపు పెట్రో ధరలపైనా, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది. క్రూడాయిల్ ఎగుమతుల్లో రష్యా (14 శాతం), గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ (25 శాతం) అగ్ర భాగాన ఉన్న సంగతి తెలిసిందే. వీటిపైనే ఆధారపడ్డ చాలా దేశాలు ఇప్పటికే చమురు కొరతను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి. వచ్చే ఏడాది ఇది మరింత తీవ్రతరం కానుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం పుతిన్, జెలెన్స్కీల్లో ఏ కోశానా ఉన్నట్టు కన్పించడం లేదు. యుద్ధం విషాదమే గానీ ఆపే ఉద్దేశం లేదని పుతిన్ ఇటీవలే బాహాటంగా స్పష్టం చేశారు. రష్యా ముందు సాగిలపడటానికి ససేమిరా అంటున్న జెలెన్స్కీ పోరాడితే పోయేదేమీ లేనట్టు ముందుకు సాగుతున్నారు. దౌత్య చర్చలకు మొగ్గు చూపుతూనే అదనపు ఆయుధ సమీకరణకు నాటో మిత్ర దేశాల వైపు చూస్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవడమే గాకుండా తన ఆయుధపొదిలో పేట్రియాటిక్ క్షిపణులను సమకూర్చుకున్నారు. సంధి కోసమో, కనీసం యుద్ధ విరామం కోసమో ప్రయత్నించాల్సిన అమెరికా లాంటి దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయే తప్ప ఆ దిశగా ఎలాంటి చొరవా చూపడటం లేదు. మరోవైపు యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై రోజుల తరబడి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఒక్క రోజే 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ దశకు చేరుకోనుందో ఊహించవచ్చు. 2023లోకి అడుగు పెడుతున్న యుద్ధం 2024ను కూడా పలకరించేలా కన్పిస్తోంది. కరోనా... వణికిస్తోంది! గడచి రెండేళ్లు (2020, 2021) కరోనా నామ సంవత్సరాలైతే ఈ ఏడాది (2022) కరోనా ఫ్రీ సంవత్సరమని చెప్పుకోవచ్చు. అయితే అది నవంబర్ వరకే. డిసెంబర్లో చైనా మళ్లీ కొత్త వేరియంట్‌తో సరికొత్త కరోనా బాంబు పేల్చింది. కరోనా వైరస్ మానవ సృష్టేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ చైనా పాలిట భస్మసుర హస్తమైంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు అంటూ చైనా నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేట్టు చేశాయి. చైనాలో వైరస్ ఉనికి కనిపించిన ఒకట్రెండు నెలలకు ప్రపంచానికి వ్యాపించడం, లేదా విస్తరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో ప్రత్యక్షమైన కొత్త వేరియంట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా ఇతర దేశాలకు పాకడం ఖాయమని వైద్య నిపుణుల అంచనా. కరోనాతో సహజీవనం చేసిన చాలా దేశాల్లోని జనాలకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఇబ్బంది పెట్టే అవకాశముందని వారి విశ్లేషణ. చైనా ప్రజలు రెండేళ్లుగా కరోనా వైరస్‌కు అల్లంత దూరాన తమను తాము బందీ చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తికి దూరమయ్యారు. ఇప్పడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా తాజాగా చైనా ఆంక్షలు ఎత్తేయడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు చైనానుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. చైనా ప్రపంచానికి వెల్లడించింది ఒక్క వేరియంట్ గురించేనని, నిజానికి అక్కడ మరో డజనుకు పైగా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే ఏ వైపునుంచి ఏ వేరియంట్ వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టం. టీవీలు, వార్తా పత్రికలు ఊదరగొడుతున్నట్టుగా చైనాలో గడ్డు పరిస్థితులేమీ లేవని, అదంతా పశ్చిమ దేశాల కుట్రేనన్నది మరో వాదన. కరోనా వ్యాక్సీన్లను అమ్ముకోవడానికి ఫార్మా కంపెనీలు అల్లుతున్న కట్టుకథలేనన్నది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఇంకా కఠినమైన కరోనా ఆంక్షలేవీ అమల్లోకి రాలేదు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే వచ్చేది మరో కరోనానామ సంవత్సరమే అవుతుమంది. లేదంటే కరోనా ఫ్రీ ఏడాదిగా అందరి ముఖాలపై ఆనందాన్ని వెలిగిస్తుంది! -
సరికొత్త ఆశలతో...
కాలం ఎవరికోసమూ ఆగదు. అది ప్రవాహ సదృశం. మరికొన్ని గంటల్లో ముగియబోతున్న 2022 తీపి, చేదు జ్ఞాపకాల కలయిక. నూతన సంవత్సరంలోకి అడుగిడేముందు వాటిని మననం చేసుకుని, అవసరమైన గుణపాఠాలు తీసుకుంటేనే మెరుగైన రేపటిని పొందగలం. బ్రిటిష్ నటుడు ఐరన్స్ చెప్పినట్టు గడిచే సంవత్సరాలు కాలనాళికల్లాంటివి. వాటిలో కొన్ని మనల్ని వెనక్కి తీసు కెళ్తాయి. అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తాయి కూడా. కొన్ని మనల్ని ముందుకు నడిపిస్తాయి. మనలోని నిరాశానిస్పృహలను పటాపంచలు చేస్తాయి. భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తాయి. అవి స్వప్నాలు. గడిచిపోయిన కాలంలో వేటిని స్వీకరించి సొంతం చేసుకోవాలో, వేటిని తిరస్కరించి ముందుకు నడవాలో మనమే నిర్ణయించుకోవాలి. ‘కలతలే తరగలై లేస్తుంటే/కక్షలే గాలులై వీస్తుంటే... ధరియించి పెదవిపై దరహాసం/భరియించి యెడదలో పరితాపం/విరచింతు నీనాటి నవగీతం...’ అంటూ మహాకవి శ్రీశ్రీ అయిదు దశాబ్దాలనాడు ఓ ఉగాదికి స్వాగతం పలుకుతూ అన్నాడు. నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ సందర్భంలో ఆ కవితాపంక్తులు శిరోధార్యాలు. కరోనా మహమ్మారి కాటేసిన అనంతరం అంతర్జాతీయ స్థితిగతులు ఒక అస్పష్ట చిత్రాన్ని ఆవిష్కరించాయి. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు వణికాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా అయోమయంలో కూరుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎడతెగని దూకుడుతో ఆర్థికంగా అమెరికాను అధిగమించగలదనుకున్న చైనా కరోనా వైరస్ నోటచిక్కి విలవిల్లాడుతోంది. తనకు తోచిందే అమలు చేస్తూ జనావళి బాధలు పట్టించుకోని ఆ ఏకస్వామ్య వ్యవస్థలో సైతం ముసలం పుట్టడం ఈ ఏడాది చోటుచేసుకున్న విచిత్రం. ‘జీరో కోవిడ్’ విధానంతో జనాన్ని ఆంక్షల చట్రంలో బిగించటానికి ప్రయత్నించిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చివరకు చైనా పౌరుల ఒత్తిళ్లకు దిగిరాక తప్పలేదు. లాక్డౌన్లకు స్వస్తి పలకవలసి వచ్చింది. అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ తలెత్తగల ప్రాంతాలుగా అందరూ అంచనావేసిన వాటికి భిన్నంగా ఉక్రెయిన్‌లో మంట రాజుకుంది. రష్యా దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా తలెత్తిన ఆ ఘర్షణ నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలో తెలియక రష్యా అధినేత పుతిన్ తలపట్టుకున్నారు. ఆయనగారు ఇప్పుడిప్పుడు శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. లొంగుబాటుకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్ వెనక అమెరికా సమకూర్చిపెడుతున్న ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలు ఉన్నాయన్నది వాస్తవం. సోవియెట్ పతనానంతరం అమెరికా సృష్టించుకున్న ఏకధ్రువ ప్రపంచ భావనపై ఆఖరి సమ్మెట పోటు వేయాలన్నది పుతిన్ ఎత్తుగడైతే... మరొక్కసారి రష్యాను పాదా క్రాంతం చేసుకుంటే తన సర్వంసహాధికారానికి తిరుగుండదని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఏ యుద్ధంలోనైనా ఆయుధాలు నిర్ణాయక శక్తులు కాదు. అంతిమంగా మానవ సంకల్ప బలమే విజేత. దురాక్రమణపై మొక్కవోక పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రజానీకం దాన్ని మరోసారి నిరూ పించాల్సి వుంది. శాశ్వత పరాజితులు, శాశ్వత విజేతలు ఉండబోరని మొన్నీమధ్య ఖతార్‌లో ముగిసిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చాటాయి. ఈ పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీ నాను అంతక్రితం సౌదీ వంటి దేశం ఓడించిందంటే నమ్మబుద్ధి కాదు. మొరాకో క్వార్టర్ ఫైనల్‌కి రావటం, చివరాఖరి వరకూ విజేతగానే కనబడిన ఫ్రాన్స్ చతికిలబడటం ఆశ్చర్యకరమైనవే. అందరూ సమస్యలెదుర్కొంటున్న ఈ కరోనా అనంతర ప్రపంచంలో ఎంతోకొంత మెరుగ్గా ఉన్నది మన దేశమే. సహజంగానే ఈ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీని తిరుగులేని నేతగా నిలబెట్టింది. అయితే పేదరికం బారినపడి అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలు కోకొల్లలు. ఈ దుఃస్థితి పిల్లలను చదువులకు దూరం చేసింది. సెకండరీ విద్యలో నిరుడు డ్రాపౌట్లు దాదాపు 15 శాతమని ఒక నివేదిక చెబుతోంది. కొత్త సంవత్సరంలో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, ఈశాన్యంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతు న్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రెండు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో జనామోదం లభించకున్నా ఫిరాయింపులను ప్రోత్సహించటంద్వారా బీజేపీ అధికార పీఠాలను ఆక్రమించగలిగింది. మేఘాలయలో అధిక స్థానాలు గెలుచుకున్నా బీజేపీ ఎన్నికల అనంతర పొత్తుతో కాంగ్రెస్ చిత్తయింది. త్రిపురలో 2018లో అధిక సీట్లు బీజేపీయే గెల్చుకున్నా వామపక్షాలకూ, ఆ పార్టీకీ మధ్య వ్యత్యాసం 1.37 శాతం మాత్రమే. ఈ రాష్ట్రాల్లో ఎన్ని ఈసారి బీజేపీ ఖాతాలో పడతాయో చూడాలి. మౌలికంగా యువజనం అధికంగా ఉన్న దేశం మనది. జనాభాలో సగంకన్నా ఎక్కువగా, అంటే 52 శాతంమంది వయసు ముప్ఫైలోపే. అదీగాక ఈ కొత్త సంవత్సరంలో జనాభారీత్యా మనం చైనాను అధిగమించబోతున్నాం. కనుక ఉడుకునెత్తురులో అసంతృప్తి రాజుకోకుండా చూడటం, మెరుగైన విధానాలతో నిరుద్యోగ సమస్యను అధిగమించటం పాలకులకు సవాల్. ఉచిత పథకాలు అరిష్టమన్న కేంద్ర పాలకులు వచ్చే ఏడాదంతా ప్రజాపంపిణీ ద్వారా ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తామని ఈమధ్యే ప్రకటించారు. ఆకలి సూచీల దండోరా తప్పని చెప్పినవారే ఈ ప్రకటన చేయటం మంచి పరిణామం. గతం నేర్పిన గుణపాఠాలను గ్రహిస్తేనే భవిష్యత్తు సవాళ్లను సునాయాసంగా ఎదుర్కొనగలం. కొత్త సంవత్సరంలో నిరంతర అప్రమత్తతతో మెలగగలం. -
పొలిటికల్ కామెంట్ : పీక్స్ లో బాబు ఫ్రస్ట్రేషన్
-
వాటిలో హిట్టే! అసలైన పోరులోనే తుస్సు.. కొందరికి మోదం, కొందరికి ఖేదం
Roundup 2022- Team India: భారత పురుషుల క్రికెట్‌కు 2022లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టిన టీమిండియా ప్రధాన ఈవెంట్లలో మాత్రం ఉసూరుమనిపించింది. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలో విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. శ్రీలంకతో సిరీస్‌తో రోహిత్ శర్మ టెస్టు సారథిగా ప్రయాణం మొదలుపెట్టాడు. కోహ్లి అలా, రోహిత్ ఇలా..! నంబర్ 1 సూర్య అయితే, సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లి ఆసియా కప్ టోర్నీలో భాగంగా.. కెరీర్లో 71వ సెంచరీ నమోదు చేశాడు. కానీ, హిట్‌మ్యాన్‌కు మాత్రం వ్యక్తిగతంగా ఈ ఏడాది కలిసిరాలేదు. గాయాలతో అతడు సావాసం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వన్డే కెప్టెన్‌గా ఎంపికైన ప్రొటిస్‌తో తొలి సిరీస్‌కు దూరమైన రోహిత్.. డిసెంబరులో బంగ్లాదేశ్ పర్యటననూ గాయంతోనే ముగించాడు. ఇక కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటగలిగిన రోహిత్ శర్మ.. ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీల్లో టీమిండియా విఫలం కావడంతో విమర్శలు మూటగట్టుకున్నాడు. మరోవైపు.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. చదవండి: సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన టీమిండియా డైనమైట్ ఇక జట్టు విషయానికొస్తే.. 2022లో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. టెస్టుల్లో 3, వన్డేల్లో 8, టీ20లలో 9 సిరీస్‌లో ప్రత్యర్థి జట్లను ఢీకొట్టింది. వీటిలో 15 విజయాలు ఉండటం విశేషం. టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఐదు, టీ20లలో 8 సిరీస్ విజయాలు(సౌతాఫ్రికాతో స్వదేశంలో డ్రా మినహా) నమోదు చేసింది. గాయాల బెడద ఈ ఏడాది గాయం కారణంగా పలు సందర్భాల్లో జట్టుకు దూరమైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, మహ్మద్ షమీ, కుల్దీప్ సేన్ తదితరులు. ఇక రోహిత్ ఫిట్నెస్ సమస్యలు, విశ్రాంతి పేరిట దూరం కావడం, జట్టు ఒకేసారి రెండేసి దేశాల్లో పర్యటించడం వంటి కారణాల నేపథ్యంలో కెప్టెన్లు మారారు. రోహిత్ సహా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, అజింక్య రహానే వివిధ సందర్భాల్లో సారథులుగా వ్యవహరించారు. గంగూలీ అవుట్ కోహ్లికి వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలకడంతో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శల పాలయ్యాడు. జట్టు ఎంపిక విషయంలో జోక్యం చేసుకుంటున్నాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలన్న దాదా ఆశ నెరవేరలేదు. గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ 36వ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే, జై షా మాత్రం కార్యదర్శిగానే కొనసాగడం గమనార్హం. యువ నాయకత్వం చేతుల్లోకి టీమిండియా మేజర్ టోర్నీల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ విఫలం కావడంతో అతడిని తప్పించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. పూర్తి స్థాయిలో పరిమిత ఓవర్ల నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. అదే విధంగా టెస్టుల్లో కీలక సభ్యుడైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను రోహిత్ తర్వాత నాయకుడిని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: Rishabh Pant Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. సీసీటీవీ ఫుటేజీ వైరల్! ప్రమాదానికి కారణం అదేనా? -
2022 REWIND: ఉద్యోగాల జాతర.. ఆరోగ్యానికి ఆసరా..
రాష్ట్రంలో 2022 ఏడాది ఎన్నో కీలక పరిణామాలకు సాక్షిగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, వైద్యారోగ్య రంగంలో కీలక పథకాలు, మార్పులతో సానుకూలతలు కనిపించగా.. పోడు భూముల వివాదం, ఉపాధ్యాయుల సమస్యలు వంటివి నిరసనలు, ఆందోళనలకు తెరలేపాయి. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు రావడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేసే అంశంలో ఈ ఏడాది ముందడుగు పడింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో పలు రంగాల్లో 2022 తెచ్చిన ప్రత్యేకతలేమిటో చూద్దాం.. – సాక్షి, హైదరాబాద్ అడవి పెరిగింది.. ‘పోడు’గొడవ పెరిగింది! రాష్ట్రంలో పోడు భూముల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై ప్రభుత్వపరంగా పరిశీలన జరుగుతున్నపుడే గొత్తికోయల చేతుల్లో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు గురికావడం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కచ్చితమైన విధానాన్ని రూపొందించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణకు హరితహారం ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడింది. ఈ ఏడాది హరితహారం లక్ష్యం 19.54 కోట్ల మొక్కలుకాగా 20.25 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల రహదారుల వెంట సుమారు లక్ష కిలోమీటర్ల మేర రహదారి వనాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ఆసిఫాబాద్‌లో ఒకరు పులి దాడిలో మృతి చెందారు. వైద్య విద్యలో రికార్డు.. ఆరోగ్యానికి తోడ్పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం 2022లో కీలక ముందడుగు వేసింది. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ రంగంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను స్థాపించడం, తద్వారా రాష్ట్రంలో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం, తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించే పథకాన్ని ప్రారంభించడం ప్రశంసలు పొందాయి. మిగతా జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, సమాంతరంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వైద్యారోగ్య మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని విభాగాలపై నెలవారీ సమీక్షలు జరుగుతున్నాయి. సంస్కరణలకూ తెరలేచింది. దారిన పడిన ఆర్టీసీ దివాలా అంచుకు చేరిన ఆర్టీసీని ఈ ఏడాది చిన్న ఆలోచన మళ్లీ నిలిపింది. డీజిల్ సెస్ పేరుతో చార్జీల సవరణ చేపట్టి ఆదాయాన్ని పెంచుకుని.. నష్టాల ఊబి నుంచి కొంతమేర బయటపడింది. సెస్‌ల రూపంలో టికెట్ చార్జీలను పెంచి ధైర్యం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా పలు చర్యలు చేపట్టడం కలసివచ్చింది. ఇదే సమయంలో డిపో స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం దాకా సిబ్బంది పనితీరును సమీక్షించి మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఓరియంటేషన్లు, ప్రత్యేక శిక్షణలు, స్టడీ టూర్లు, వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం, 100 డేస్ చాలెంజ్, శ్రావణమాసం చాలెంజ్, దసరా పండుగ చాలెంజ్, హెల్త్ చాలెంజ్, ఫిట్నెస్ చాలెంజ్ వంటి కార్యక్రమాలతో సిబ్బంది పనితీరు సమూలంగా మారింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనట్టుగా 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. కొత్త కొలువుల జాతర.. రాష్ట్రంలో 2022 ఏడాది కొలువుల జాతరను తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80వేల మేర ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్–4 కేటగిరీలో 9 వేల కొలువులు, ఇంజనీరింగ్ విభాగాలు, ఇతర శాఖల పరిధిలో మరో 5వేల కొలువులకు ప్రకటనలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు ద్వారా దాదాపు 17 వేల ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వైద్య విభాగాల్లోనూ ఖాళీల భర్తీ చేపట్టారు. గురుకుల విద్యా సంస్థల్లోనూ 12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ‘రోడ్ల’కు మంచి రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రహదారులకు పూర్తిస్థాయి నిర్వహణ పనులకు ఈ ఏడాదే గ్రీన్‌సిగ్నల్ పడింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రోడ్లు భవనాల శాఖలో ఈ ఏడాది భారీ మార్పులు జరిగాయి. కొత్తగా 472 అదనపు పోస్టులు మంజూరు చేయడంతోపాటు 3 సీఈ, 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్‌డివిజన్ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలగిన సవాళ్లు.. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో 2022లో విద్యా సంస్థల్లో పునరుత్తేజం కనిపించింది. అదే సమయంలో ఎన్నో సవాళ్లూ ఎదురయ్యాయి. కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతామంటూ ‘మన ఊరు–మనబడి’పథకాన్ని ప్రారంభించినా ఆచరణలో నిరాశే ఎదురైంది. తొలి విడతగా 9 వేలకుపైగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా 1,200 స్కూళ్లలోనే పూర్తయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అడుగు ముందుకు పడలేదు. మరోవైపు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఫీజుల పెంపు వంటివి విద్యార్థులపై భారం వేశాయి. ఇక ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం, పలు మైనారిటీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. కేంద్రంతో తప్పని ‘పంచాయితీ’! 2022 ఏడాది మొదట్లోనే కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై మొదలైన ‘పంచాయితీ’చివరికి మరింత ముదిరింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు తగ్గాయని, శాఖల వారీగా వచ్చే నిధుల జాడేలేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తెలంగాణ చేపట్టిన పలు పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం మొండిచేయి చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ఆరోపించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా రైతు కల్లాలు నిర్మించారంటూ కేంద్రం పేర్కొనడం, అందుకు సంబంధించిన రూ.150 కోట్లను తిరిగివ్వాలని పట్టుపట్టడం అగ్నికి ఆజ్యం పోసింది. కేంద్రం తీరు సరిగా లేదని, రాష్ట్రానికి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనలు నిర్వహించింది. ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపు ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. డయాలసిస్ బాధితులకు పింఛన్ల మంజూరు కూడా మొదలైంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రం సత్తా చాటింది. -
పొలిటికల్ కారిడార్ : దత్త తండ్రి కోసం పవన్ ఆరాటం
-
పొలిటికల్ కారిడార్ : చిందర వందరగా సైకిల్ పార్టీ
-
2022 REWIND: నువ్వా-నేనా! ఈ ఏడాదంతా రాజకీయ దుమారమే..
సాక్షి, కరీంనగర్: ఈ ఏడాది మొత్తం రాజకీయ యుద్ధాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా నిలిచింది. ‘నువ్వా–నేనా’ అన్న స్థాయిలో సాగిన మాటల యుద్ధాలకు ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పలు బహిరంగ సభలు సాక్షిభూతాలుగా నిలిచాయి. ముఖ్యంగా బీఆర్ఎస్–బీజేపీ మధ్య సాగిన రాజకీయ పోరు ఏడాది పొడవునా.. ఆసక్తిని రగిలించాయి. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని మోదీ వరకు, మంత్రి గంగుల నుంచి బీజేపీ ఎంపీ బండి సంజయ్ వరకు మాటల యుద్ధాలు రాజకీయ ఉత్కంఠకు తెరతీశాయి. ఇక రెండు పార్టీల్లోనూ పలువురు సీనియర్లు అలకబూనారు. సీనియర్లు, జూనియర్ల మధ్య ఏర్పడ్డ వైరం పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లినా.. అవన్నీ టీ కప్పులో తుఫానులా సమసిపోయాయి. ఏడాది ఆరంభంలో కరోనా మూడో వేవ్ భయబ్రాంతులకు గురిచేసినా.. ప్రాణనష్టం లేకుండా ముగిసింది. దీంతో అభివృద్ధి పనులు సైతం యథావిధిగా కొనసాగాయి. బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంటు ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్) ఏడాదిలో జరిగిన పరిణామాలను పరిక్షించి చూస్తే..! జనవరి02.. బండి సంజయ్ అరెస్టు..: జీవో 317 అమలుకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్ష రణరంగంగా మారింది. బండి సంజయ్‌ను అరెస్టు చేయడం, సీపీ స్వయంగా లాఠీఛార్జి చేయడం సంచలనం రేపింది. ఆ తరవాత బండికి పోలీసులు రిమాండ్ విధించడంతో కరీంనగర్‌కు జాతీయ నేతల తాకిడిమొదలైంది. ఈ వ్యవహారం అప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ వరకు వెళ్లింది. జనవరి 13.. కమలంలో కుంపట్లు..: జిల్లాలో మూడు వర్గాలుగా విడిపోయిన కమలం నేతలు పార్టీ కార్యక్రమాలు సమాచారం ఇవ్వట్లేదని ఆవేదనతో బండి సంజయ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ నాయకత్వానికి తరుణ్‌చుగ్ నివేదిక ఇవ్వడంతో సీనియర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం వారి వివరణతో వ్యవహారం సద్దుమణిగింది. జనవరి 26: గులాబీ పార్టీ జిల్లా అధిపతులుగా జీవీ రామక్రిష్ణారావు (కరీంనగర్), కల్వకుంట్ల విద్యసాగర్‌రావు (జగిత్యాల), కే. చందర్ (రామగుండం), తోట ఆగయ్య (సిరిసిల్ల) బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 09: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం సంసద్ ఆదర్శ్ గ్రామ యువజన దేశంలోనే ప్రథమస్థానం లభించింది. మార్చి 17: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సి పల్ మంత్రి తారక రామారావు కరీంనగర్లో పర్యటించారు. దాదాపు రూ.1100 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు మెండి శ్రీలత, నక్కపద్మ టీఆర్ఎస్లో చేరారు. జూన్ 11: వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ అనలిటికల్ టీముల రహస్య సర్వే నిర్వహించాయి. ప్రశాంత్ కిశోర్, చాణక్య, సునీల్ కనుగోలు, ఇతర ప్రైవేట్ టీములు ముందస్తు ప్రచారం నేపథ్యంలో పలుమార్లు ప్రజాభిప్రాయ సేకరణ జరిపాయి. జులై 11: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తితో ఉందని వ్యాఖ్యానించగా.. వీటిని ఖండిస్తూ మంత్రి గంగుల కమలాకర్ ఎదురుదాడితో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జులై 31: గంగుల హరిహరణ్, చెన్నమనేని వికాస్, మేనేని రోహిత్, శ్రీరాం చక్రవర్తి తదితరులు వచ్చే శాసనసభ లేదా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. ఆగస్టు 05: ఉప ఎన్నిక జరిగిన తొమ్మిది నెలల తరువాత హుజూరాబాద్ చౌరస్తాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ నిర్వహించిన సభ వేడి పుట్టించింది. ఈ సభను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు రావడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు. ఆగస్టు 06: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు మెడికల్ అనుమతులు జారీ అయ్యాయి. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి బోధన ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 09: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం పాదయాత్ర చేపట్టారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ చౌరస్తా నుంచి ప్రారంభమైన యాత్ర 18న ఎల్కతుర్తిలో ముగిసింది. ఆగస్టు 29: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పెద్దపల్లిలో కలెక్టరేట్ భవన సముదాయం, పార్టీ కార్యాలయం ప్రారంభించారు. గుజరాత్ గజదొంగలు మతం పేరు మీద కొట్లాడాలని రెచ్చగొడుతున్నారని, బీజేపీ ముక్త భారత్ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబరు 14: మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రవీందర్ అల్లుడు సోహాన్ సింగ్ ఆడియో లీకవవడంతో అతనిపై చర్యల కోసం జిల్లా నాయకులు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అక్టోబరు 28: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరుట్లలోని ఓబులాపూర్ బ్రిడ్జి వంతెన మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ద్వారా ప్రవేశించారు. నాలుగు జిల్లాలో పర్యటించి నవంబరు 17న హన్మకొండలో ప్రవేశించారు. నవంబరు 13: ప్రధాని మోదీ రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేశారు. తప్పులు చేసిన వారిని వదలమంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. నవంబరు 27: ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వెళ్తున్న బండి సంజయ్‌ను జగిత్యాల వద్ద పోలీసులు అరెస్టు చేసి, అర్ధరాత్రి ఇంటికి తరలించారు. మరునాడు కోర్టు అనుమతితో ఆయన భైంసాకు తరలివెళ్లారు. డిసెంబరు 7: జగిత్యాలో సీఎం పర్యటించారు. కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. మెడికల్ కాలేజీకి భూమి పూజ చేశారు. కొండగట్టు దేవాలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ప్రకటించారు. డిసెంబరు 8: మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కూతురు వివాహానికి కరీంనగర్ వచ్చారు. అనంతరం మంత్రి గంగుల ఇంటికి వెళ్లారు. ఆఖరున రవీందర్‌సింగ్‌ను సివిల్ సప్లయ్ విభాగం చైర్మన్‌గా నియమించి వెళ్లారు. డిసెంబరు 10: ఉమ్మడి జిల్లాకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లుగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (జగిత్యాల), ఆది శ్రీనివాస్ (సిరిసిల్ల), మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ (పెద్దపల్లి), కవ్వంపల్లి సత్యనారాయణ (కరీంనగర్)లను ఏఐసీసీ నియమించింది. డిసెంబరు 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ కరీంనగర్లో జరిగింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. డిసెంబరు 26: జిల్లా సహకారం విద్యుత్తు సరఫరా సంఘం (సెస్)కు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలను ౖMðవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని అందుకుంది. -
Year End 2022: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్.. ఫ్లాప్ రీమేక్ చిత్రాలివే
విదేశీ తెరపై హిట్టయిన సినిమా ఇక్కడ కూడా హిట్టవుతుందా? అంటే ‘గ్యారంటీ’ ఇవ్వలేం. అందుకు ఉదాహరణ ఈ ఏడాది విడుదలైన దాదాపు అరడజను చిత్రాలు. అక్కడ హిట్టయిన చిత్రాలు రీమేక్ రూపంలో వచ్చి, ఇక్కడ ఫట్ అయ్యాయి. ఆ రీమేక్ చిత్రాలను రౌండప్ చేద్దాం. అరడజను ఆస్కార్ అవార్డ్స్ సాధించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్‌గంప్’ (1994) హిందీలో ‘లాల్‌సింగ్ చడ్డా’గా రీమేక్ అయింది. టైటిల్ రోల్‌ను ఆమిర్ ఖాన్ చేయగా, అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. హిందీలో చైతూకు ఇదే తొలి చిత్రం. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజైన ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా ఫిల్మ్‌కు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. లాల్‌సింగ్ చడ్డా జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల వల్ల అతని జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇక ఈ ఏడాది అరడజను సినిమాలతో (హిందీలో ‘లూప్ లపేట’, ‘శభాష్ మిథు’, ‘దోబార’, ‘తడ్కా’, ‘బ్లర్’ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్) ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు తాప్సీ. ఈ ఆరులో మూడు సినిమాలు ‘లూప్ లపేట, దోబార, బ్లర్’ విదేశీ చిత్రాలకు రీమేక్. 1988లో వచ్చిన జపాన్ హిట్ ఫిల్మ్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్‌గా ‘లూప్ లపేట’ తెరకెక్కింది. ఆకాష్ భాటియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న రిలీజైంది. యజమాని డబ్బును పోగొట్టి, చిక్కుల్లో పడ్డ తన ప్రియుడి కోసం గాయపడ్డ ఓ రన్నింగ్ అథ్లెట్ ఎలాంటి సాహసాలు చేసింది? ఆమెకు ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? ఎలా ఎదుర్కొంది? అన్నదే ‘లూప్ లపేట’ కథాంశం. ఇక స్పానిష్ చిత్రాలైన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాజ్’ (2018) ఆధారంగా ‘దోబార (2:12)’, స్పానిస్ హారర్ థ్రిల్లర్ ‘లాస్ ఓజోస్ దే జూలియా (2010) ఆధారంగా ‘బ్లర్’ చిత్రాలు రూపొందాయి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దోబార’ ఆగస్టు 19న రిలీజైంది. పాతికేళ్ల క్రితం ఓ అమ్మాయి చూస్తుండగానే పిడుగు పాటుతో ఒకరు మరణిస్తారు. ఆ అమ్మాయి పెద్దయ్యాక ఆ పరిస్థితులే పునరావృతమై ఓ పన్నెండేళ్ల బాలుడు చిక్కుల్లో పడతాడు. ఓ టీవీ సెట్ ఆధారంగా ఆ బాలుడిని ఈ యువతి ఎలా కాపాడగలిగింది? అన్నదే ‘దోబార’ కథనం. ఇక ‘బ్లర్’ విషయానికి వస్తే... అజయ్ భాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే.. గాయత్రి, గౌతమి కవలలు. కానీ ఇద్దరూ దృష్టి లోపంతో బాధపడుతుంటారు. అయితే హఠాత్తుగా గౌతమి మరణిస్తుంది. గౌతమి మరణానికి దారితీసిన పరిస్థితులను గాయత్రి తెలుసుకోవాలనుకుంటుంది? ఈ ప్రయత్నంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘బ్లర్’ చిత్రం సాగుతుంది. విదేశీ కథలతో తాప్సీ చేసిన ఈ మూడు చిత్రాలూ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన తెలుగు చిత్రం ‘శాకినీ డాకినీ’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్ చేసిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. 2017లో వచ్చిన సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్‌గా ‘శాకినీ డాకినీ’ తెరకెక్కింది. అక్రమాలకు ΄ాల్పడే ఓ ముఠా ఆటను ఇద్దరు ట్రైనీ ΄ోలీసాఫీసర్లు ఎలా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథాంశం. -
2022 REWIND : తెలంగాణ రాజకీయం.. గరం గరం..
రాష్ట్రంలో రాజకీయాలు 2022లో మరింతగా వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందటి సంవత్సరం కావడం, బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం.. ఎలాగైనా తిరిగి పట్టుపెంచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించడం.. రాష్ట్రంలో మూడోసారీ అధికారాన్ని నిలబెట్టుకోవడం, జాతీయ స్థాయిలో ప్రభావం చూపడం లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు జనంలో ఉత్కంఠ రేపాయి. ఈ ఏడాది ప్రజల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన ప్రధాన రాజకీయ పరిణామాలు పార్టీల వారీగా ఇవీ.. – సాక్షి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ పార్టీగా 2001లో తెరపైకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి 2022లో కొత్త ప్రస్థానం దిశగా ప్రయాణం ప్రారంభించింది. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెడు తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 5న దసరా సందర్భంగా తెలంగాణభవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీలో తీర్మానం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణభవన్‌లో భారతదేశ చిత్రంతో కూడిన బీఆర్ఎస్ గులాబీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. డిసెంబర్ 14న దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ‘మునుగోడు’లో కీలక పోరు ఈ ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ప్రతిష్టాత్మకంగా మారింది. దీనిపై ముందుగానే అప్రమత్తమైన సీఎం కేసీఆర్.. ప్రజాదీవెన పేరిట ఆగస్టు 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికకు సన్నద్ధం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని అమలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలను రంగంలోకి దింపి మునుగోడులో విజయం సాధించారు. దీనితో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 104కు చేరింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’తో సంచలనం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే వార్తలు అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రంలో సంచలనం రేపాయి. హైదరా బాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డితో మంతనాలు జరిపేందుకు వచ్చిన రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్‌లను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాతి పరిణామాలు టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరును మరింత తీవ్రం చేశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు సీబీఐ నోటీసులు, ఈడీ, ఐటీ దాడులతో బీఆర్ఎస్పై ఒత్తిడి పెరిగింది. కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి కమలం రాష్ట్ర బీజేపీ కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2022 సంవత్సరమంతా బీజేపీ దూకుడుగా ముందుకు సాగింది. పార్టీ అధిష్టానం అండదండలతో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసనల పర్వాన్ని కొనసాగించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో అధికారికంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించడం, కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అన్నట్టుగా బీజేపీ సంకేతాలు పంపింది. ‘అగ్ర త్రయం’ అండదండలతో.. రాష్ట్రంలో అధికార సాధన లక్ష్యంగా బీజేపీ జాతీయ అధినాయకత్వం రాష్ట్ర పార్టీకి పూర్తి అండదండలు అందించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ ఏడాదిలోనే ప్రధాని మోదీ 4 సార్లు, అమిత్‌షా, నడ్డా ఐదేసి పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనన్ని సభలు, సమా వేశాలను బీజేపీ నిర్వహించడం గమనార్హం. వరుస చేరికలతో.. బీజేపీ నేత ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ ఈ ఏడాది ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మర్రి శశిధర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జిట్టా బాలాకృష్ణారెడ్డి, రామారావు పటేల్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రనాయక్, న్యాయవాది రచనారెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. అయితే పార్టీలోకి వచ్చిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్యగౌడ్ వంటివారు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ఈ ఏడాది 2, 3, 4, 5 దశలు పూర్తిచేసుకుంది. విభేదాలు, ఎదురుదెబ్బల ‘హస్తం’! రాష్ట్ర కాంగ్రెస్‌కు ఈ ఏడాది గొడవలతోనే సరిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివాదాలు మరింత ముదరడంతో పార్టీ హైకమాండ్ పలుమార్లు కల్పించుకోవాల్సి వచ్చింది. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపించినా.. ఉప ఎన్నికలో ఓటమి ఎదురుదెబ్బ తప్పలేదు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. నిలువునా చీలిపోయి.. నిజానికి నవంబర్‌లో జరిగిన మునుగోడు ఎన్నికల నాటి నుంచి బహిరంగంగానే విమర్శ లు, ఆరోపణలు మొదలయ్యాయి. డిసెంబర్లో జరిగిన టీపీసీసీ కమిటీల నియామకాలతో వివాదాలు తారస్థాయికి చేరాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచీ సీనియర్లు, జూనియర్లుగా కొనసాగిన విభేదం.. ఒరిజినల్, వలస నేతలుగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ నిలువునా చీలిపోయింది. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు ప్రత్యేకంగా సమావేశమవడం కలకలం రేపింది. దీంతో చక్కదిద్దే చర్యలు చేపట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. జోడో యాత్రతో కాస్త ఊపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ ఏడాది కాంగ్రెస్‌లో కాస్త ఉత్సాహం నింపింది. అక్టోబర్ 23న నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన యాత్ర నవంబర్ 7 వరకు సాగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా సాగి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. తెలంగాణ పొడవునా జరిగిన యాత్రకు ప్రజల ఆదరణ కనిపించింది. పాదయాత్ర, పోరాటాలతో జనంలోకి వైఎస్సార్టీపీ తెలంగాణలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను తీసుకువస్తానంటూ ఏర్పాటైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సా ర్‌టీపీ) ప్రజలకు కొత్త గొంతుకగా మారింది. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. పాదయాత్ర, పోరాటాలతో ముందుకు వెళుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు చేవెళ్లలో ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3,500 కి.మీ. మైలురాయి అధిగమించింది. పాద యాత్ర మధ్యలో నిరుద్యోగులు, రైతులు, వివిధ వర్గాల సమస్యలపై షర్మిల దీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం, ఎమ్మెల్యేల అవినీతిని ప్రస్తావిస్తూ.. వివిధ వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నా రు. ప్రాజెక్టులు, వివిధ పథకాల్లో అవినీతిని నిలదీయడమేగాకుండా.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు కూడా చేశారు. ఆమె పాదయాత్ర ముగింపు దశలో టీఆర్ఎస్ శ్రేణుల దాడి, ప్రతిగా ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల ప్రయత్నించడం, ఆమె అరెస్టు, నిరసనగా నిరాహార దీక్ష వంటి ఘటనలు కలకలం రేపాయి. షర్మిలకు ఆమె తల్లి విజయమ్మ కూడా అండగా నిలిచి.. తన కుమార్తెను దీవించాలని ప్రజలను కోరారు. షర్మిల పాలేరులో వైఎస్సార్టీపీ ఆఫీస్‌కి భూమి పూజ చేసి.. తాను అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. బహుజనవాదంతో బీఎస్పీ గత సంవత్సర కాలంలో చేపట్టిన పోరాటాలతో రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జవజీవాలు పోసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్‌గా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. తన పాదయాత్రతో, వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లారు. గ్రామాలవారీగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనితీరును తీవ్రంగా ఎండగట్టడం వంటివి చేపట్టారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న ఆయన ఈ ఏడాదే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఎస్పీ పోటీకి దిగింది. ప్రవీణ్‌కుమార్ స్థాపించిన స్వేరోస్‌తో పాటు పలు దళిత సంఘాలు బీఎస్పీకి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ కూడా కనిపించింది. బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘లెఫ్ట్’ అడుగులు రాష్ట్రంలో ఈ ఏడాది కమ్యూనిస్టులు బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఆ దిశగానే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వెంట నిలిచి ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారు. ఇదే సమయంలో భవిష్యత్తులోనూ బీజేపీని ఎదుర్కొనే పార్టీలకు తమ మద్దతు ఉంటుందనీ సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటనలు చేయడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలచిన స్థానాలపై వామపక్షాలు ఈ ఏడాది ప్రత్యేకంగా దృష్టిసారించాయి. 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పెంచుకోవాలని, పొత్తులపై స్పష్టత వస్తే సరి, లేకుంటే ఈ సీట్లలో పోటీ చేస్తామని సీపీఐ పార్టీ కార్యదర్శి కూనంనేని పేర్కొన్నారు కూడా. టీఆర్ఎస్తో పొత్తు ఉంటే కొత్తగూడెం నుంచి పోటీచేయాలని కూనంనేని భావిస్తున్నారు. ఇక సీపీఎం పాలేరుతోపాటు మరికొన్ని స్థానాలపైనా దృష్టి సారించింది. ఈసారి సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు సహా పలువురు జాతీయ నేతలు ఇందులో పాల్గొన్నారు. -
2022 Year End: బాయ్‌కాట్ బాలీవుడ్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్..!
ప్రతిరంగంలో వివాదాలు, గొడవలు సర్వ సాధారణం. కానీ సినీ పరిశ్రమలో అవి మరింత ఎక్కువ. బాలీవుడ్లో అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఏకంగా బాయ్‌కాట్ బాలీవుడ్ అనే నినాదం ఊపందుకునేలా వివాదాలు తలెత్తాయి. 2022లో వివాదాలకు దారితీసిన ఆ చిత్రాలు, సంఘటనలేవో ఓ లుక్కేద్దాం. ఓ మ్యాగజైన్ కవర్‌పై రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో, సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ ఫోటో 2022లో అతిపెద్ద వివాదాలుగా నిలిచాయి. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు రావడం హాట్ టాపిక్‌గా మారింది. అలాదే అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ హిందీ భాషపై వివాదం ఇలా చాలానే ఉన్నాయి. రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోకు పోజులివ్వడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై పోలీసు ఫిర్యాదులు కూడా చేశారు. కొంతమంది బాలీవుడ్ నటులు విద్యాబాలన్, మసాబా గుప్తా, నకుల్ మెహతా, చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ దీన్ని ప్రశంసించగా.. ముంబైకి చెందిన ఎన్జిఓ 'మహిళల మనోభావాలను దెబ్బతీయడం'పై అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. సుస్మితా సేన్‌తో లలిత్ మోదీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ జూలైలో అనుకోని రీతిలో సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. అతను సుస్మితా సేన్‌తో కలిసి మాల్దీవుల్లో ఉన్నరొమాంటిక్ ఫోటోలతో వార్తల్లో నిలిచారు. 2018లో ఆయన భార్య మరణించిన తర్వాత కొత్త జీవితంలో 'బెటర్ హాఫ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . "పెళ్లి చేసుకోలేదు - కేవలం ఒకరితో ఒకరు డేటింగ్. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది.” అంటూ లలిత్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను సుస్మితతో ఉన్న ఫోటోను పెట్టాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన వ్యక్తులలో ఇద్దరూ కూడా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రావడం సంచలనంగా మారింది. దీంతో జాక్వెలిన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె క్రమం తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతూనే ఉంది. ఈడీ ఆరోపణల ప్రకారం ఆమెతో పాటు మరో నటి నోరా ఫతేహి.. సుఖేశ్ నుంచి కోట్ల విలువైన బహుమతులు అందుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న నోరా దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా వేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. బిగ్ బాస్ 16లో సాజిద్ ఖాన్ ఎంట్రీ దుమారం: లైంగిక వేధింపుల జాబితాలో దర్శకుడు సాజిద్ పేరు ముందుటుంది. మీటూ ఉద్యమంలో ఆయనపై పలువురు నటీమణులు ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ షో పోటీదారులలో ఒకడిగా ఉండడాన్ని పలువురు తప్పుబట్టారు. అతనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయాలను ఛానెల్ పట్టించుకోలేదు. అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య గొడవ: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఏప్రిల్‌లో జరిగిన ఒక ఈవెంట్లో "హిందీ జాతీయ భాష కాదు. అందుకే వారు పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నారు" అంటూ చేసిన వాఖ్యలు వివాదానికి దారితీశాయి. కిచ్చా సుదీప్ ప్రకటనపై హీరో అజయ్ దేవగణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే సుదీప్ దీనిపై స్పందిస్తూ కన్నడలో టైప్ చేసి ఉంటే అతని స్పందన అర్థం అయ్యేదా అని అజయ్‌ని అడిగాడు. “మేము కూడా భారతదేశానికి చెందినవారమే కదా సార్” అని సుదీప్ ట్వీట్ చేశాడు. లాల్ సింగ్ చద్దా వివాదం: అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా ఈ ఏడాది చాలా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి. అయితే చాలామంది సినిమాకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీ విడుదల సమయంలో ట్విట్టర్లో బాయ్‌కాట్ లాల్‌సింగ్ చద్దా అంటూ అప్పట్లో ట్రెండ్ అయింది. పఠాన్ మూవీ బేషరమ్ రాంగ్: ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా నటించిన చిత్రం పఠాన్. ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రంలో బేషరమ్ రంగ్ పాటకు ధరించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు దీపిక ధరించిన కుంకుమ రంగు బికినీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. షారూక్‌ను సజీవ దహనం చేస్తానని అయోధ్యలోని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారు. -
అట్టబొమ్మగా మారిన బుట్టబొమ్మ
-
బ్యాంకులు భళా.. తగ్గిన మొండి బకాయిలు
ముంబై: భారత్ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) సెప్టెంబర్ 2022 నాటికి 5 శాతానికి తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి తెలిపింది. ‘బ్యాంకింగ్ ఇన్ ఇండియా– ట్రెండ్స్ అండ్ పోగ్రెస్’ శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. ►2017–18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరిన స్థూల మొండిబకాయిలు అటు తర్వాత క్రమంగా దిగివచ్చాయి. 2022 మార్చిలో ఇది 5.8 శాతానికి తగ్గింది. ►చెల్లింపుల్లో వైఫల్యాలు తగ్గడం, రికవరీలు మెరుగుపడ్డం, బకాయిల మాఫీ (రైటాఫ్) వంటి అంశాలు స్థూల మొండిబకాయిలు తగ్గడానికి కారణం.ప్రస్తుతం బ్యాంకింగ్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతోంది. రుణ నాణ్యత పెరిగింది. మూలధన నిల్వలు పటిష్టంగా ఉన్నాయి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రుణ వృద్ధి రేటు మరెంతో మెరుగుపడాల్సి ఉంది. రుణ పునర్వ్యవస్థీకరణ మొత్తంగా 1.1 శాతం పెరిగితే, బడా రుణ గ్రహీతలకు సంబంధించి ఇది 0.5 శాతంగా ఉంది. వ్యక్తిగత రుణాలు, చిన్న వ్యాపాలకు సహాయం చేయడానికి సంబంధించి ప్రవేశపెట్టిన రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్‌ల వల్ల తగిన ప్రయోజనాలు ఒనగూరుతున్నాయి. దేశీయంగా బ్యాంకుల స్థూల మొండిబకాయిలు తగ్గుముఖం పడితే, విదేశీ బ్యాంకుల విషయంలో పెరగడం గమనార్హం. 2020–21లో ప్రైవేటు బ్యాంకుల జీఎన్‌పీఏలు 0.2 శాతం ఉంటే, 2021–22లో 0.5 శాతానికి చేరాయి. బ్యాంకింగ్‌లో 2020–21 మంచి యూ టర్న్ తీసుకుంది. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. ► 2022–23 మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లో మంచి పురోగతి నెలకొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. ►వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ►ఇక గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ. 8,16,421 కోట్ల రుణ మాఫీ చేశాయి. మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్సీబీలు) విషయంలో ఈ విలువ రూ. 11,17,883 కోట్లుగా ఉంది. -
GHMC-Hyderabad: షరా మామూలే.. అక్రమాలు ఆగలే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఈ సంవత్సరం సైతం అక్రమాలు, అవినీతి షరామామూలుగా కొనసాగాయి. బర్త్ సర్టిఫికెట్ల జారీలో అవినీతి గుర్తించి ఏళ్లవుతున్నా నిరోధించలేకపోయారు. గతంలోవి కాక ఇటీవలే మూడువేలకు పైగా బర్త్ సర్టిఫికెట్లు అవినీతి మార్గాల్లో జారీ కావడం పోలీసులు గుర్తించారు. బర్త్ సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలోనూ లోపాలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. ఇక ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుమతుల్లేని నిర్మాణాలు, నిబంధనలు ఉల్లంఘించి అదనపు అంతస్తులను ప్రజలు ఫొటోలతో సహ ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దిక్కులేదు. ఐదంతస్తుల వరకు నిర్మాణ అనుమతుల అధికారం జోన్లకే కట్టబెట్టినప్పటి నుంచి జోనల్, సర్కిల్ స్థాయిల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట లేకుండాపోయింది. నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న ఎల్బీనగర్ వంటి జోన్లలో ఈపరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పురోగతిలో ఎస్సార్డీపీ.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మొదటి దశ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరం పూర్తయిన వాటిల్లో షేక్‌పేట ఫ్లైఓవర్, బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లైఓవర్, బహదూర్‌పురా ఫ్లైఓవర్, శిల్పా లేఔట్ ఫ్లైఓవర్, నాగోల్ ఫ్లైఓవర్, చాంద్రాయణగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్యూబీ, ఖైతలాపూర్ ఆర్ఓబీలున్నాయి. కాగితాల్లోనే మూసీ బ్రిడ్జిలు.. మూసీపై నిర్మించనున్న 15 బ్రిడ్జిలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిల్లో నాలుగింటిని జీహెచ్ఎంసీ నిర్మించాల్సి ఉండగా, ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ)కింద దాదాపు రూ.985 కోట్ల పనుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఎఫ్‌ఓబీలు, వైకుంఠధామాలు.. పాదచారులు రోడ్డు దాటేందుకు కొన్ని ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు(ఎఫ్ఓబీ), స్పోర్ట్స్పార్కులు, వైకుంఠధామాలు, మలీ్టపర్పస్ ఫంక్షన్ హాళ్లు తదితరాలు ప్రారంభమయ్యాయి. పాత ఇళ్ల స్థానే వాటిని కూలి్చవేసి కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఖైరతాబాద్ ఇందిరానగర్‌లో 210, ఓల్డ్మారేడ్పల్లిలో 468 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆగని అగ్ని ప్రమాదాలు.. న్యూబోయిగూడ స్క్రాప్ దుకాణం, సికింద్రాబాద్ రూబీ హోటల్, జూబ్లీహిల్స్ ర్యాడిసన్ బ్లూప్లాజా హోటళ్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు ఫైర్‌సేఫ్టీ లోపాల్ని బట్టబయలు చేశాయి. చెత్త తరలించేందుకు కొత్తగా 60 వాహనాలు వినియోగంలోకి వచ్చాయి. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో హైదరాబాద్ 26వ స్థానానికి దిగజారింది. పెరిగిన సీఆర్ఎంపీ రోడ్లు.. సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్న రహదారులు 709 కి.మీ.ల నుంచి 811 కి.మీ.లకు పెరిగాయి. 32 అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించినా అన్నింట్లో పూర్తికాలేదు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. ఆహారకల్తీ నిరోధానికి మొబైల్ ల్యాబ్ వినియోగంలోకి వచ్చింది. గ్రీనరీ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగి, హైదరాబాద్ ‘ట్రీసిటీ ఆఫ్ వరల్డ్’గా గుర్తింపు పొందింది. (చదవండి: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు) -
ఈ ఏడాదంతా సైన్స్ విశేషాలే!
కొత్త సంవత్సరం రానున్నది. అంటే గడిచిన సంవత్సరంలో జరిగిన, గమనించదగిన అంశా లను సమీక్షించడానికి ఇది తగిన సమయం. 2022లో చాలా ఆసక్తికరమైన విషయాలే జరిగి నట్లు చూడవచ్చు. జనవరి మాసంలో టోంగాలోని ‘హుంగా టోంగా’ అనే అగ్నిపర్వతం పేలింది. 21వ శతాబ్దిలో ఇంతటి పేలుడు ఇదివరకు జరగలేదు. ఈ అగ్ని పర్వతం హోంగా ప్రధాన ద్వీపం పక్కన ఇంచుమించు సముద్రంలో ఉంటుంది. కనుక సునామీ పుట్టి 90 మీటర్ల ఎత్తు అలలు పుట్టాయి. నలుగురు మాత్రమే మరణించారు. జనవరి 24న రష్యావారు ఉక్రెయిన్ మీద దాడి చేశారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో అణు విద్యుత్కేంద్రాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన చెర్నోబిల్ కూడా అక్కడే ఉంది. ప్రపంచంలో అణు విద్యుత్తు ఉత్పత్తిలో ఆ దేశం 7వ స్థానంలో ఉంది. జపోరిజిజియా అనే చోట యూరోప్‌లోకెల్లా పెద్ద విద్యుత్కేంద్రం ఉంది. దాని మీద రష్యా దాడి ప్రభావం పడింది. అంటే యుద్ధం ఇంచుమించు అణు యుద్ధంగా మారే అవకాశం ఉంద నాలి. వీరి కేంద్రాలు నిజానికి పాతవి. కొత్తగా కడుతున్న కేంద్రాలలో ఇటువంటి తాకిడులను దృష్టిలో ఉంచుకుని తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తాకిడిలో మరీ పెద్ద ప్రమాదాలు ఏవీ జరగలేదం టున్నారు నిపుణులు. ఎవరికి వారు వంశ వృక్షాలు సిద్ధం చేసుకోవడం మామూలే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొత్తం మానవ జాతికి వంశ వృక్షం తయారు చేసే ప్రయత్నం మొదలయింది. మానవుల జన్యు వివరాలను పరిశీ లించడం ఇప్పుడు మామూలయింది. అటువంటి ఆధునిక పరీక్షలు 3,600 వరకు ఉన్నాయి. కొన్ని ప్రాచీన మానవ జన్యు పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ కొత్త వంశ వృక్షం తయారవుతున్నది. ఆక్స్ఫర్డ్ యూని వర్సిటీలో జరుగుతున్న ఈ పరిశోధనకు ప్రపంచం మొత్తం నుంచి సమాచారం అందుతున్నది అంటున్నారు పరిశోధకురాలు గిల్ మెక్ వీన్. ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు దాటింది. పర్యావరణం పాడవుతున్నది. గడచిన ఫిబ్రవరి తరువాత మరోసారి సీఓపీ సభలు జరిగాయి. పరిస్థితి మాత్రం అసలు మార్పు లేకుండా ఉంది. వాతావరణ మార్పు ప్రభావాలకు గురవుతున్న బడుగు దేశాలకు సహాయం అందిం చడానికి గాను నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. నెల రోజుల యినా నిధులు ఇస్తున్నట్లు ఎవరూ ప్రకటించలేదు. పెట్రోలియం కంపెనీల మీద ఒత్తిడి తేవాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటరెస్ గట్టిగా అంటున్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి కూడా ఎటువంటి ఆశ కనిపించడం లేదు. ఏం జరుగుతుందని పేద దేశాలు ఆత్రంగా చూస్తున్నాయి. ఆస్టరాయిడ్లు అనే అంతరిక్ష శిలల వల్ల భూమికి ప్రమాదం జరిగే అవకాశాలు అప్పుడప్పుడు ఎదురువుతుంటాయి. నాసా వారు అటు వంటి శిలలను దారి మళ్లించే ప్రయత్నంలో విజయం సాధించారు. భూమికి 11 మిలియన్ కిలోమీటర్ల దూరం పయనించిన ‘డార్ట్’ అనే నౌక ‘డైమార్ఫస్’ అనే అంతరిక్ష శిలను పక్కకు కదిలించ గలిగింది. ఈ చిన్న శిల నిజానికి మరొక పెద్ద శిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు పెద్ద శిలకు కొంచెం దగ్గరగా జరిగింది. ఈ విజయం ఆధారంగా, రానున్న కాలంలో ఇటువంటి శిలలను దారి మళ్లించే ప్రయత్నాలు మరింత ఆశాజనకంగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. మానవ శరీర భాగాలను ఒకరి నుంచి మరొకరికి మార్చే ప్రయ త్నాలు ఈ మధ్యన బాగా జరుగుతున్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీలో సర్జన్లు ఈ సంవత్సరం జనవరిలో జన్యు మార్పులకు గురి చేసిన పంది గుండెను ఒక మనిషికి అమర్చారు. డేవిడ్ బెనెట్ అనే ఆ వ్యక్తి రెండు నెలల తరువాత చనిపోయాడు. అయినా, అతను అంతకాలం బతకడం గమనించదగిన విషయమని పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు. 2021 వరకు జంతు శరీర భాగాలను మనుషులలో అమర్చడం అన్నది ఆలోచనగానే ఉండేది. ఇప్పుడది వాస్తవం కాబో తున్నది అంటారు బర్మింగ్‌హామ్ సర్జన్ ఆండర్సన్. భౌతిక శాస్త్ర పరిశోధకులు విశ్వంలోని పదార్థ నిర్మాణం గురించి అడ్వాన్స్డ్ పరిశోధనలు చేస్తుండటం తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం బోసాన్లు అనే పదార్థ కణాలు కనిపించాయని గొప్ప గోల పుట్టింది. ఈ సంవత్సరంలో డబ్ల్యూ బోసాన్ అనే కణం గురించిన పరిశో ధనలు, రంగంలో అందరినీ ఒక అడుగు వెనుకకు కదిపే రకం ఫలితా లనిచ్చాయి. జెనీవాలోని వార్జ్ వోడ్రాన్కీవైడర్లో ఈ పరిశోధనలు చాలా బలంగా జరుగుతున్నాయి. 2028 నాటికిగానీ, ఈ విషయం గురించి ఏమీ చెప్పలేము అన్నారు అక్కడి వారు. మైనస్ 12 డిగ్రీలు అంటే... అంటార్క్టికా లాంటి చోట తప్ప మరెక్కడా వీలుగాని వేడిమి. అది అసలు వేడిమి కాదు. చల్లదనం. దక్షిణ ధృవం నుంచి 1,600 కిలోమీటర్ల దూరంలోని కన్కార్డియా పరిశోధనా కేంద్రంలో ఆ టెంపరేచర్ 2022 సంవత్సరం మార్చిలో గమనించారు. అంటే అక్కడ వేడిమి మొదలయిందని అర్థం అంటు న్నారు. సముద్రాలు వేడెక్కుతున్నాయి. కనుక ధృవాలు కూడా వేడెక్కు తున్నాయి. ఇటు గ్రీన్లాండ్, అంటే ఉత్తర ధృవంలో ఫియోనా హరికేన్ కారణంగా బిలియన్ టన్నుల మంచు కరుగుతున్నట్టు ఈ సంవత్సరంలో గమనించారు. 2022 సంవత్సరంలో జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ విశ్వంలో అంతకు ముందు చూచి ఎరుగని ప్రాంతాలను పరిశోధకులకు చూప గలుగుతున్నది. భూమి నుంచి రీలుగాలి పద్ధతిలో యంత్రం ఎగ్జో ప్లానెట్లను, అక్కడి వాయువులను గురించి సమాచారం అందించింది. టెలిస్కోప్‌లో మరో 25 సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉంది. అంటే మరెంతో సమాచారాన్ని అది అందజేయగలుగుతుంది. అణు విద్యుత్ కేంద్రాలలో అణువులను విచ్ఛిన్నం చేసి, అంటే పగులగొట్టి శక్తిని పుట్టిస్తారు. అణువుల కలయిక లేదా సంయోజనం ద్వారా కూడా శక్తి ఉత్పాదన వీలవుతుంది. అయితే అందుకు మరో ముప్ఫై సంవత్సరాలు పడుతుందని చాలా కాలంగా అంటున్నారని ఒక జోక్ ఉంది. 2022లో ఆ పరిస్థితి మారింది అంటున్నారు. ఈ ఏడాది యూకేలో ఈ రంగంలో మంచి ఫలితాలు కనిపించాయి. 2025లో అణు సంయోజన కేంద్రం ఒకటి పని మొదలు పెడుతుంది అంటున్నారు పరిశోధకులు. ప్రపంచంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున కరువులు ఈ సంవత్సరంలో కనిపించాయి. ఆఫ్రికా, చైనా, యూఎస్‌లలో నదులు ఎండిపోయినట్లు గమనించారు. విజ్ఞాన శాస్త్రంలో సమస్యలను, సమస్యలుగా గాక, అవకాశాలుగా భావించి ముందుకు సాగడం అలవాటు. వచ్చే ఏడాది ఏం జరుగనుందో వేచి చూడాలి. కె.బి. గోపాలం వ్యాసకర్త అనువాదకుడు, రచయిత -
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన చిత్రాలివే..!
ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కలిసొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జాబితాలో ది కశ్మీర్ ఫైల్స్, కాంతార ముందు వరుసలో ఉంటాయి. ఇక టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించాయి. అలాగే వీటితో పాటు బాలీవుడ్ చిత్రాలు సైతం ఈ మార్క్‌ను చేరుకున్నాయి. ఈ ఏడాది వంద కోట్ల వసూళ్లు దాటిన సినిమాలేవో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది వంద కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలివే.. టాలీవుడ్ చిత్రాలు: ఆర్ఆర్ఆర్, సర్కారువారిపాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, కార్తికేయ, గాడ్‌ఫాదర్ బాలీవుడ్ చిత్రాలు: ది కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మస్త్ర, దృశ్యం-2, భూల్ భూలయ్యా-2, గంగూభాయ్ కతియావాడి, విక్రమ్ వేద, లాల్‌సింగ్ చద్దా, జగ్‌జగ్ జీయో తమిళ చిత్రాలు: పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరుచిత్రాంబలం, సర్దార్, వలిమై కన్నడ చిత్రాలు: కేజీఎఫ్-2, కాంతార, విక్రాంత్ రోణ, 777 ఛార్లీ, జేమ్స్ -
2022 Roundup-Hyderabad: ఓ బాట‘సారీ’!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ... పాదచారులకు మాత్రం పిటీ. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడ్రస్టియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌లు మాయం కావడం, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం... ఉన్న వాటిని పాదచారులు, వాహనచోదకులు పట్టించుకోక పోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. రెండో స్థానంలో పాదచారులు... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. ఈ ఏడాదికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. ఇప్పుడే కాదు... గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. వీటికి మోక్షమెప్పుడో? రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్ తదితరాలతో కూడిన ప్రతిపాదనలకు పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. ఆపరేషన్ రోప్ పై ఆశలెన్నో... ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్) అమలులోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం పాదచారులకు ఇబ్బందికరంగా మారుతున్న అనేక అంశాలపై దృష్టి పెట్టారు. ఆయా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రోప్లో భాగంగా ఇప్పటి వరకు స్టాప్ లైన్ క్రాసింగ్‌పై 1,74,869, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడంపై 27,217, రహదారులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తదితరాలపై 72,668 కేసులు నమోదు చేశారు. దీన్ని మరింత విస్తరించాలని పోలీసు విభాగం భావిస్తోంది. ఫలితంగా రానున్న రోజుల్లో పాదచారుల పరిస్థితి మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
Roundup 2022: ఒక యుద్ధం.. ఒక హిజాబ్.. ఒక రాణి
ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్ మాకొద్దు అంటూ ఇరాన్ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్‌లో ఒక శకం ముగిసిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే, వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఒక్కసారి 2022లోకి తొంగిచూస్తే... వార్తల్లో వ్యక్తులు జెలెన్స్కీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాది హీరోగా మారారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్‌స్క్‌లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కవర్ పేజీ ప్రచురించింది. రిషి సునాక్: ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యం శృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ను గట్టెక్కించడంలో లిజ్ ట్రస్ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్ ప్రధానిగా అక్టోబర్ 25న పదవీ ప్రమాణం చేశారు. ఎలాన్ మస్క్: నిత్యం సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ని అక్టోబర్ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం విశేషం. విషాదాలు ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు. ► సోవియెట్ యూనియన్ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్ శాంతి బహుమానం ఆయనను వరించింది. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు. ఎన్నికలు ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అక్టోబర్ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ► బ్రెజిల్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ► ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం. ► ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ► నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్–మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు. ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్ విక్రమ్‌సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ► అఫ్గానిస్తాన్‌లో జూన్ 21నసంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు. ► జూన్‌లో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్తలు పడ్డారు. అక్టోబర్ నాటికి పాకిస్తాన్లో వరద నష్టం 14.9 బిలియన్ డాలర్లుగా వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ► ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఈజిప్టులో షర్మ్ఎల్–షేక్‌లో నవంబర్ 6 నుంచి 18 వరకు జరిగింది. పర్యావరణ విపత్తులతో నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. ► వాతావరణ మార్పులు ఈ ఏడాది అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వేసవికాలంలో వడగాడ్పులతో పశ్చిమాది దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు తుపానుకు లక్షలాది మంది అంధకారంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అవీ ఇవీ ► అమెరికాలో మారిలాండ్లో బాల్టిమోర్‌లో వైద్యులు ఈ ఏడాది జనవరి 12న పంది గుండెని మనిషికి అమర్చే శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే రెండు నెలలు తిరక్కుండానే మార్చి 9న ఆ వ్యక్తి మరణించడం విషాదం ► గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అబార్షన్‌ను నిషేధం విధిస్తూ 1973లో రియో వెర్సస్ వేడ్ తీర్పుని జూన్ 24న తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్–3 రాజ సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబర్ 17న ఆయన గద్దెనెక్కి తల్లి అంతిమ సంస్కారం సహా అన్నీ దగ్గరుండి నిర్వహించారు. ► ప్రపంచ జనాభా మరో మైలు రాయి చేరుకుంది. మొత్తం జనాభా 800 కోట్లను దాటేసింది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో నవంబర్ 15న జన్మించిన చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది . ► కోవిడ్–19 ఈ ఏడాదితో ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ చివరికొచ్చేసరికి చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్7తో రోజుకి 10 లక్షలకుపైగా కేసుల నమోదవుతున్నాయని, రోజుకి అయిదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా ఒక అంచనా. పుతిన్ యుద్ధోన్మాదం ఉరుములేని పిడుగులా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ చేస్తున్న సన్నాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ రాత్రికి రాత్రికి బాంబు దాడులు చేశారు. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ రష్యా సేనల్ని సమర్థంగా ఎదుర్కొంటూ ఉండడంతో పది నెలలు గడుస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, పులి మీద పుట్రలా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులే 10 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంచనాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని ఏకంగా 78 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలతో చమురుకు కొరత ఏర్పడి ఎన్నో దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ధరల పెరుగుదల, ఆహారం కొరత , సరఫరాలో అడ్డంకులు వంటివాటితో ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ మానవ హక్కుల మండలి నుంచి రష్యాని సస్పెండ్ చేసింది. ఇరాన్లో మహిళల విజయగీతిక హిజాబ్ సరిగా ధరించని నేరానికి మహసా అమిన్ అనే 22 ఏళ్ల యువతిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు సెప్టెంబర్ 16న లాకప్‌లో ఆమె మరణించడంతో ఇరాన్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 1979లో మత ఛాందసవాడులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి సవాళ్లు ప్రభుత్వం ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్‌లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలో నిలిచాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 18 వేల మందిని అరెస్ట్ చేశారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి మోరల్ పోలీసు వ్యవస్థని రద్దు చేయడం ఆ దేశ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయం. అయితే హిజాబ్‌ను రద్దు చేయాలంటూ 100 రోజులైనా ఇంకా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Year-End Roundup: 2022 మిగిల్చిన గాయాలివే..
మరో ఏడాది ముగింపునకు చేరుకుంది. ప్రతీ యేడులాగే.. ఆనవాయితీ ప్రకారం చివర్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవాలి కదా. అయితే ఈ ఏడాదిలో మునుపెన్నడూ లేనంత సంక్షోభాలన్ని, ప్రతికూల పరిస్థితుల్ని కొన్ని దేశాలు ఎదుర్కున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణ ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఇరుదేశాల సంక్షోభం.. యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. తమ దేశ ఔన్నత్యం కోసం ఉక్రెయిన్, ఉక్రెయిన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఉక్రెయిన్ వ్యవహారాల్లో పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఖండిస్తున్న రష్యా.. రష్యా వేర్పాటువాదులకు మద్దతుగా ఉక్రెయిన్ గడ్డపై దురాక్రమణకు తెగబడింది. నాటో సభ్యత్వ ప్రయత్నాలు.. ఈ యుద్ధానికి అగ్నిలో ఆజ్యం పోశాయి. ఫిబ్రవరి 2022లో మొదలైన ఈ యుద్ధం.. యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఆహార, ఇంధన, చమురు సంక్షోభాలు తలెత్తాయి. ఇరువైపులా సైన్య బలగాలతో పాటు అమాయకుల ప్రాణాలు పోయాయి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్.. మరోవైపు వ్లాదిమిర్ జెలెన్స్కీలు ఎవరూ వెనక్కి తగ్గలేదు. కీవ్మాస్కోలు దౌత్యం ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలన్న ప్రయత్నాలు బెడిసి కొడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా తమ పైచేయి ప్రదర్శించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నారు. ఇక దాదాపు 300 రోజుల పాటు సాగిన ఈ యుద్ధానికి ముగింపు పలకాలని, అదీ అర్థవంతంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారు. శ్రీలంక ప్రజాగ్రహ జ్వాలలు 2022 మొదటి భాగం మొత్తం.. ప్రజాగ్రహ జ్వాలల్లో ద్వీప దేశం రగిలిపోయింది. ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆకాశానికి చేరింది. విదేశీ అప్పులు ముట్టకపోగా.. వ్యవసాయ సంబంధిత నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆహార కొరతతో పాటు టూరిజంపై భారీగా ప్రతికూల ప్రభావం పడింది. నిత్యావరసరాల మొదలు ప్రతీ దాని ధరలు చుక్కలను తాకాయి. ఇంధన కొరతతో వాహనాలు నిలిచిపోవడంతో పాటు దేశంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. అవినీతిమయ కుటుంబ పాలన, ప్రభుత్వ అనాలోచిత.. అసమర్థ నిర్ణయాలను జీర్ణించుకోలేని ప్రజలు.. నిరసనాందోళనలకు దిగారు. ప్రధానినే గద్దె దిగిపోవాలంటూ రోడ్డెక్కారు. ఆ హోరుకు తాళలేక ప్రధాని మహీంద రాజపక్స.. దేశం విడిచి పారిపోయారు. చివరికి.. తీవ్ర ఒత్తిళ్ల నడుమ పదవికి రాజీనామా చేశారు. ఆపై సంక్షోభ తీవ్రత తగ్గినా.. ప్రజల నిరసనలు మాత్రం అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ రాజకీయ సంక్షోభం గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులు!. ఇంగ్లండ్ మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది కాలంలోనే తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంది. అధికార పార్టీ నుంచి ఏకంగా ముగ్గురు ప్రధాని బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాదిలో. పార్టీ గేట్ కుంభకోణం వల్ల కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై బోరిస్ తర్వాతి ప్రధానిని ఎన్నకునేందుకు 59 రోజుల టైం పట్టింది. చివరకు.. బోరిస్‌కు అత్యంత సన్నిహితురాలైన లిజ్ ట్రస్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ, ద్రవ్యోల్బణం, మినీ బడ్జెట్ బెడిసి కొట్టడం, తదితర కారణాలతో కేవలం 45 రోజులపాటే ఆమె ఆ పదవిలో కొనసాగారు. ఆపై మెజార్టీ టోరిస్ల మద్దతు ద్వారా ప్రధాని పీఠంపై ఎక్కారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. పాకిస్తాన్ వరదలు పొరుగు దేశాన్ని ప్రకృతి ఈ ఏడు పగబట్టింది. మునుపెన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలతో పాక్ అతలాకుతలం అయ్యింది. జూన్ అక్టోబర్ల మధ్య వరదలతో 1,739 మంది మృత్యువాత పడ్డారు. మూగజీవాల మరణంతో పాటు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పాక్ ఆర్థిక వ్యవస్థకు.. సుమారు 3.2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. సాధారణం కంటే అధికంగా వర్షాలు, వేడి గాలులతో హిమానీనదాలు కరిగిపోయి.. వరదలు పోటెత్తాయి. సుమారు 75 శాతం భూభాగం నీట మునిగిందంటే.. వరదల తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్2 మరణం బ్రిటన్ రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన మహారాణి.. క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో విషాదం అలుముకుంది. 70 ఏళ్లపాటు రాణిగా కొనసాగారామె. తద్వారా బ్రిటన్ సింహాసనంపై చెరగని ముద్ర వేశారు. ఆమె హయాంలో ఎన్నో కీలక ఘట్టాలు జరిగాయి. ఎన్నో దేశాల అధినేతలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. 96 ఏళ్ల వయసులో వయోరిత్య సమస్యలతో ఆమె బాల్మోరల్ కోటలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఇరాన్ నిరసనలు మోరల్ పోలీసింగ్ ఒక నిండు ప్రాణం తీసింది. మహ్సా అమినీ అనే యువతిని టెహ్రాన్ పోలీసులు హిజాబ్ ధరించలేదని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన ఆమె పోలీస్ కస్టడీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో ఇరాన్ భగ్గుమంది. మతఛాందసవాదుల రాజ్యంగా ఇరాన్ మారిందని, స్వేచ్ఛ లేకుండా పోయిందని ఉద్యమించారు. వేల మంది అరెస్ట్ చేశారు. అల్లర్లో ఐదు వందల మందిదాకా మృతి చెందారు. బ్రెజిల్ పాలన మార్పు కరోనా టైంలో ప్రపంచం మొత్తం బాగా వినిపించిన పేరు జైర్ బోల్సోనారో. అధ్యక్షుడి హోదాలో ఉండి వైరస్‌ను తేలికగా తీసుకున్న ఆయన వ్యవహారం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసింది. వైరస్ పట్ల నిర్లక్ష్యం వహించి.. ప్రపంచంలోనే ఆ టైంలో ఎక్కువ మరణాలకు బ్రెజిల్‌ను నిలయంగా చేశాడన్న విమర్శ ఆయన మీద ఉంది. మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డాడు. అన్ని రకాలుగా విసిగిపోయిన ప్రజలు.. ఆయన్ని గద్దె దింపారు. ఆ ప్లేస్‌లో లూయిస్ ఇన్సియోలూలా సిల్వా చేతిలో స్వల్ప మెజార్టీతో బోల్సోనారో ఓటమిపాలయ్యారు. ఎలన్ మస్క్ ట్విటర్ ప్రపంచంలోనే అథ్యధిక ధనికుడైన ఎలన్ మస్క్.. ట్విటర్‌ను చేజిక్కించుకున్నాడు. 44 బిలియన్ల డాలర్ల చెల్లింపుతో ఈ ఒప్పందం కుదిరింది. తొలుత ఈ ఒప్పందం ఉల్లంఘించినట్లు ట్విటర్, ఎలన్ మస్క్‌పై ఆరోపణలు చేసింది. కోర్టుకు ఈడ్చాలని చూసింది. అయితే.. సర్ప్రైజ్ చేస్తూ ట్విటర్ కార్యాలయంలో అడుగుపెట్టాడు. ట్విటర్ డీల్ ముగిసినప్పటికీ.. సంపద విషయంలో అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఎలన్ మస్క్ కొనసాగుతుండడం గమనార్హం. ఎనిమిది బిలియన్లు దాటిన ప్రపంచ జనాభా ప్రపంచ జనాభా ఈ ఏడాదిలోనే మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది 8 బిలియన్ల అంటే.. 800 కోట్ల మార్క్‌ను దాటేసింది అధికారికంగా!. UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ఈ ఘనతను అధికారికంగా ప్రకటించింది. చైనాలో కరోనా కల్లోలం పార్టీ సమావేశం ద్వారా మూడో దఫా చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జి జిన్‌పింగ్.. అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం.. కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం కావడం. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా.. కరోనా వైరస్‌తో వణికిపోతోంది. జీరో కోవిడ్ పాలసీ పేరుతో గత మూడేళ్లుగా అక్కడి జనాలను నరకం చూపిస్తోంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కేసులు, మరణాల లెక్కలు దాస్తూ.. ఆంక్షల పేరుతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియెంట్లు విరుచుకుపడుతుండడంతో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7 స్ట్రెయిన్ ధాటికి లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంభవిస్తుంటే, తప్పుడు లెక్కలతో ప్రపంచాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో.. వైరస్‌తో కలిసి జీవించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది అక్కడి ప్రజలకు. -
2022 Roundup-Hyderabad: సంచలనాల సమాహారం!
మహా నగరానికి సంబంధించి 2022 ఆద్యంతం సంచలనాత్మక ఉదంతాలు, ఘటనలు, నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది జనవరి నెలలో గుజరాత్‌కు చెందిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వరుస పెట్టి పంజా విసిరాడు. అక్టోబర్‌లో మొదలైన ‘ఫామ్‌హౌస్’ ఎపిసోడ్... ఈడీ కేసులు, నోటీసులతో డిసెంబర్ వరకు కొనసాగింది... కొనసాగుతోంది. సికింద్రాబాద్ స్టేషన్ కేంద్రంగా చోటు చేసుకున్న ‘అగ్నిపథ్’ అల్లర్లు, అమ్నేషియా–పుడింగ్ అండ్ మింక్ పబ్స్ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ఆయా ఉదంతాలను ఒక్కసారి పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరో రికార్డులకు ఎక్కిన తొలి డ్రగ్ మరణం డ్రగ్ పెడ్లర్ ప్రేమ్ ఉపాధ్యాయ ఎల్ఎస్డీ బోల్ట్స, ఎక్స్టసీ పిల్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇతడి నుంచి నగరానికి చెందిన ఓ యువకుడు డ్రగ్స్ ఖరీదు చేశాడు. బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మాదకద్రవ్యాల ప్రభావంతో క్లరోసిస్ స్ట్రోక్‌తో బాధపడి చనిపోయాడు. గోవాలో జరిగిన పార్టీలో ఒకేసారి ఎల్ఎస్డీ, కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ పిల్స్‌తో పాటు హష్ ఆయిల్ తీసుకోవడంతో నగరానికి వచ్చాక ఇలా జరిగింది. మూడు కమిషనరేట్లలో పంజా సీరియల్ స్నాచర్ జనవరిలో ఉమేష్ గులాబ్ భాయ్ ఖతిక్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులకు సవాల్ విసిరాడు. మెహదీపట్నంలో యాక్టివా వాహనం చోరీ చేశాడు. మరుసటి రోజు ఆ ల్వాల్ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. వీటిలో స్నాచింగ్స్తో పాటు యత్నాలు ఉన్నాయి. గుజరాత్ పోలీసులకు పట్టుబడిన ఇతడిని సిటీకి తీసుకురావడం, రికవరీల్లోనూ అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు నుంచి రూ.కోట్లు కొట్టేసి.. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో నైజీరియన్లు కీలకంగా వ్యవహరించగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చెన్నై వాసులు పాత్రధారులుగా ఉన్నాయి. ఈ కేసును కొన్ని రోజుల్లోనే ఛేదించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. అయితే ఇప్పటికీ సూత్రధారులు పరారీలోనే ఉన్నారు. ► జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని అమ్నేషియా పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిపై ఇన్నోవా కారులో అత్యాచారం జరగడానికి ముందు బెంజ్ కారులో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. నిందితులుగా ఉన్న వారిలో ఎమ్మెల్యే కుమారుడితో పాటు అనేక మంది ప్రముఖుల సంతానం ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లు కావడం గమనార్హం. ఫామ్‌హౌస్ టు ఈడీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఖరీదు చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలపై నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి అరెస్టయ్యారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు అనేకమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు నందు భాగస్వామిగా ఉన్న అభిషేక్‌తో పాటు ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులను విచారిస్తున్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్.. బంజారాహిల్స్‌లోని రాడిస్సన్ బ్లూ ఆధీనంలోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన డ్రగ్ పార్టీ గుట్టురట్టైంది. కొణిదెల నాగబాబు కుమార్తె నిహారికతో పాటు అనేక మంది ప్రముఖుల వారసులు దీనికి హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఇటీవలే పూర్తి చేసిన పోలీసులు, ఆరుగురిని నిందితులుగా ఖరారు చేస్తూ అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఉగ్రవాదికి 16 ఏళ్ల జైలు పాక్ నిఘా సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న మహ్మద్ నిస్సార్‌కు న్యాయస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బోరుమన్న బోయగూడ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ బోయగూడ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం బీహార్ నుంచి వలసవచ్చిన 11 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు గోదాములో మొత్తం నలుగురు వ్యాపారాలు చేస్తున్నారు. దీని మధ్య భాగంలో దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన సంపత్ అనే వ్యాపారి శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నారు. ఇందులోనే అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిపథ్‌తో అట్టుడికింది కేంద్ర ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి సంబంధించిన సెగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తాకింది. నిరుద్యోగులు ఒక్కసారిగా ఈ స్టేషన్‌ను ముట్టడించారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) లాఠీచార్జ్ చేసింది. దీంతో ఆందోళన ఉధృతం చేసిన నిరుద్యోగులు విధ్వంసానికి దిగారు. ఆరు ప్లాట్‌ఫామ్స్‌లోని దుకాణాలతో సహా ప్రతీది ధ్వంసం చేయడంతో పాటు రైళ్ల పైనా రాళ్లు రువ్వారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. ఆర్పీఎఫ్ అధికారులు కాల్పుల్లో ఓ యువకుడు చనిపోగా... 12 మందికి గాయాలయ్యాయి. -
Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!
సాక్షి, హైదరాబాద్: ‘మహిళల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యం’ ఇదీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నినాదం. కానీ, ఇది ఆచరణలో ఆమడదూరంలో ఉంది. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా స్త్రీలకు భద్రత కరువైంది. గృహ హింస, అత్యాచారం, హత్యలు, వరకట్న మరణాలు, అపహరణలు ఇలా ఎన్నెన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది గ్రేటర్లో మహిళలపై 7,459 నేరాలు జరగ్గా... ఈ ఏడాది 7,578 నేరాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీలపై గృహ హింసలు, వేధింపులే జరగడం బాధాకరం. ఏటేటా ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 4,674 వేధింపుల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,891లకు పెరిగాయి. అయితే అత్యాచారాలు, పోక్సో కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 2021లో 1,089 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 984లకు తగ్గాయి. అలాగే గతేడాది చిన్నారులపై 1,161 అఘాయిత్యాలు జరగగా.. ఈ ఏడాది 1,052 పోక్సో కేసులు నమోదయ్యాయి. తెలిసినోళ్లే తోడేళ్లు.. ఈ ఏడాది రాచకొండలో 372 అత్యాచారాలు జరగగా.. ఇందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు రేప్ చేసిన సంఘటనలే ఎక్కువ. స్నేహితులు రేప్ చేసిన కేసులు 352 కాగా.. చుట్టుపక్కల వాళ్లు 4, కుటుంబ సభ్యులు 2 రేప్ కేసులున్నాయి. ఇతరుల చేసిన అత్యాచార కేసులు 14 ఉన్నాయని వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబరాబాద్, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. గతేడాది 394 పోక్సో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 442కు పెరిగాయి. పోకిరీల భరతం.. విద్యా సంస్థలు, కార్యాలయాలు, బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతుంది షీ టీమ్స్. ఈ ఏడాది 7,521 మంది పోకిరీలను మూడు కమిషనరేట్ల షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆయా నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండోసారి పోలీసులకు చిక్కిన ఆకతాయిలపై ఎఫ్ఐఆర్లు, పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది రాచకొండలో 176 మంది పోకీరీలపై ఎఫ్ఆర్లు, 195 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 137 మందిపై ఎఫ్ఆర్లు, 426 మందిపై పెట్టీ కేసులు, సైబరాబాద్‌లో 82 మందిపై ఎఫ్ఆర్లు, 1,306 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’
వేగంగా డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు కళ్లముందున్న డబ్బు కూడా చేతికొచ్చేలోగా ఆవిరైపోవచ్చు. అప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైం దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్మును కాపాడుకోవడం కూడా కష్టమేనని నిరూపించిన సంఘటన చందాకొచ్చర్ స్కాం. కాస్త తెలివితేటలతో బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డంగా వాడుకోవచ్చని బయటపెట్టిన ఈ కుంభకోణమే చందా కొచ్చర్ స్కాం. ఏదైనా సాధించడం ఎంత కష్టమో. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. పవర్ఫుల్ బ్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందా కొచ్చర్ పొజీషన్ కూడా అదే. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారెడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించారు. ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ కొంతమందిని కొంతకాలమే మోసం చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సీఈవోగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఏలిన కొచ్చర్ కూడా అలాగే దొరికి పోయారు. బ్యాంకింగ్ రంగంలో నడిచిన కరప్షన్ ఏపీసోడ్ మొత్తం బయటపడింది. చందా కొచ్చర్ అక్రమసామ్రాజ్యం పునాదులతో కదిలాయి. సీబీఐ అరెస్ట్ ఒకప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీల మీద మెరిసిన స్టార్ చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. వేణుగోపాల్ ధూత్‌కి చెందిన వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముడుపుల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎస్సార్ గ్రూప్, వీడియోకాన్ గ్రూప్‌లో లాంచాల భాగోతం ఎలా వెలుగులోకి వచ్చింది. ఇచ్చుకో.. పుచ్చుకో 2010లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సాఆర్ స్టీల్‌కి 530 మిలియన్ డాలర్లు అప్పిచ్చింది. ఎస్సార్ ఆయిల్‌కి 350 మిలియన్ డాలర్ల అప్పును పువ్వులో పెట్టి ఇచ్చింది. ఎస్సార్ గ్రూప్‌లోని రెండు కంపెనీలకు అప్పులిచ్చిన తర్వాత లంచాల భాగోతం మొదలైంది. అంటే 2010 నుంచి 2012 మధ్య కాలంలో చందా కొచ్చర్ భర్త దీపా కొచ్చర్ కంపెనీలో పెట్టుబడులను అంటే లంచాల ద్వారా పంపించారు. ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన ఫస్ట్ హ్యాండ్ హోల్డింగ్స్ నాలుగు విడతులుగా న్యూ పవర్లో రూ.325 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. శశిరూయా అల్లుడు అనిరుధ్ భువాల్కాకు చెందిన ఏ1 మోటార్స్ అనే సంస్థ ఏంఎండబ్ల్యూ అనే మరో సంస్థతో న్యూపవర్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసిందని అరవింద్ గుప్తా అనే ఇన్వెస్టర్, సామాజిక కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విలువ ఎంతన్నది బయటకు రాలేదు. అంటే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రెండు కంపెనీలకు అప్పులందాయి. అడిగినంత అప్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగా న్యూపవర్‌కు వెళ్లింది. చదవండి👉ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! తీగలాగితే డొంక కదలింది అప్పులిచ్చిన చందా కొచ్చర్, లంచం తీసుకున్న దీపా కొచ్చర్ భార్యభర్తలు. అప్పులు తీసుకున్న రుయా సోదరులకు పెట్టుబడులు పెట్టిన అనిరుధ్, నిషాంత్ అల్లుళ్లు. ఈ వ్యవహారమే క్విడ్ ప్రోకో అని రిజిష్టార్ ఆఫీస్ కంపెనీస్ నుంచి సేకరించిన సమాచారం తన దగ్గరుందని విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు కొనసాగుతుండగా చందా కొచ్చర్ వీడియోకాన్‌కు రూ.3 వేల కోట్లకు పైగా ఇచ్చిన రుణం ఇచ్చినందుకు గాను తీసుకున్న ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చందా కొచ్చర్ చీకటి సామ్రాజ్యం ప్రపంచానికి తెలిసింది. తీగలాగితే డొంక కదిలిందిన్నట్లుగా వీడియో కాన్ గ్రూప్‌ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులు దెబ్బకు గతంలో ఎస్సాఆర్ గ్రూప్ వ్యవహారం బయటకొచ్చింది. కొచ్చర్ భాగోతంపై ప్రధానికి లేఖ వీడియోకాన్ గ్రూప్‌లో పెట్టుబడిదారు అరవింద్ గుప్తా. ఆ అరవింద్ గుప్తా 2016లో ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొచ్చర్ భాగోతాలపై అదే ఏడాది మార్చిలో ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖతో రంగంలో దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది. చందా కొచర్ - దీపక్ కొచ్చర్ అరెస్ట్: అక్టోబరు 2016: చందా కొచ్చర్‌పై ఆరోపణలు వెల్లు వెత్తిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌లో రుణ అక్రమాలు హైలెట్ అయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది కానీ.. కొచ్చర్ ముడుపుల వ్యవహారాన్ని ఎటూ తేల్చ లేకపోయింది. మార్చి 2018: 31లోన్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్లలో సమస్యలను గుర్తించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బ్యాంక్, ఆర్బీఐకు విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదు చేచేశారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత, సీబీఐ అంతర్గత విచారణను దాఖలు చేసి దీపక్ కొచ్చర్‌ను ప్రశ్నించడం ప్రారంభించింది. ఏప్రిల్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు చందా కొచ్చర్‌కు అండగా నిలిచింది. ఆమెపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. కొన్ని వారాల తర్వాత, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFO) ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన వీడియోకాన్ రుణంపై దర్యాప్తు చేయడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని కోరింది. మే - జూన్ 2018: చందా కొచ్చర్‌పై విజిల్‌బ్లోయర్ తాజా ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ తప్పులు చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ విచారణ ప్రారంభించడంతో మే నెలలో కొచ్చర్ సెలవుపై వెళ్లారు. జూలై 2018: షోకాజ్ నోటీసుకు తన ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొచ్చర్‌ని కోరింది. అక్టోబర్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో బాధ్యతలకు చందా కొచ్చర్ రాజీనామా సమర్పించారు. జనవరి 2019: 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు మంజూరైన రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దీపక్ కొచ్చర్, చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ వెంటనే, చందా కొచ్చర్ బ్యాంక్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 2019: చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. జనవరి 2020: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి విలువ రూ.78 కోట్ల పైమాటే. సెప్టెంబర్ 2020: మనీలాండరింగ్ కేసులో దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది. నవంబర్ 2020: చందా కొచ్చర్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 2021: దీపక్ కొచ్చర్ రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు మే 2022: సీబీఐ చందా కొచ్చర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. డిసెంబర్ 23, 2022: చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సిబిఐ అరెస్టు చేసింది. డిసెంబరు 26, 2022 వరకు వారిని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి 1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచ్చర్.. అతి తక్కువ సమయంలో దేశ బ్యాంకింగ్ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అనతి కాలంలో ట్రైనీ నుంచి బ్యాంక్ సీఈవోగా ఆమె ఎదిగిన తీరు అమోఘం..అనర్వచనీయం. 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్ నియమితులయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రభుత్వ బ్యాంకులకు గట్టి పోటీ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011లో పద్మ భూషణ్ ప్రదానం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు కూడా చోటు దక్కింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్ గుర్తింపును పొందారు. కానీ, ఎంతో అద్భుతంగా సాగుతున్న తన బ్యాంకింగ్ కెరీర్ మెరుపుల నుంచి మరకల వరకు ఇలా కటకటాల వెనక్కి వెళ్తామని బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Cheapest Electric Scooters: దేశంలో గత పది ఏళ్లలో ద్విచక్ర వాహన విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తెరపైకి వచ్చింది. దీనికి తోడు కేంద్రం ఈ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పోత్సాహకాలు కూడా అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈవీల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ ఈవీ మార్కెట్లో వస్తున్న స్కూటర్లు కొన్ని ఖరీదుగా ఉండడం, కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోనివి రావడంతో ఈ విషయమై సామాన్యుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అటువంటి వారి కోసం చౌకగా వారి బడ్జెట్‌కు సరిపోయే చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. Bounce Infinity E1 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. ఒక వేళ మీకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కావాలనుకుంటే దాని ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది. Hero Electric Optima CX ఈ ఈవీ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190గా ఉంది. దీని గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కలర్స్‌లో కస్టమర్లకు లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. Avon E Scoot ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. కేవలం 6 నుంచి 8 గంటల సమయంలో దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. Ampere Magnus EX ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999. Hero Electric Photon హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్‌తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇది 90 కి.మీల రేంజ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీగా ఉంది. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్‌లైట్, టెయిల్ లైట్‌తో పాటు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కేవలం 5 గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కానుంది. -
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్‌తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్‌కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్‌లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్‌కీ విజయం మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్‌బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్‌తో.. ఒక్క ‘మేజర్’ హిట్‌తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్‌లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్‌లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్‌కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
Year End 2022: అలరించని బీటౌన్ స్టార్స్.. వందల కోట్ల నష్టాలు!
బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే..ఖాన్ త్రయం పేరు వినిపిస్తుంది. తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ రేంజ్ చూపిస్తున్నారు. అయితే ఈ ఏడాది బాక్సాఫీసు ముందు వీళ్ల ప్రతాపాలు ఏవీ చెల్లుబాటు కాలేదు. సినిమ టాక్ ఎలా ఉన్నా ఈ స్టార్లు..ఓ మోస్తారు కలెక్షన్లు రాబడుతుంటారు. కానీ ఇప్పుడు మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోతున్నారు. వందల కోట్ల నష్టాలు తీసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలై వందల కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేయండి ఆమిర్ ఖాన్ పేరు చెప్తే..పర్ఫెక్షన్ గుర్తుకు వస్తుంది. ఇంతటి మిస్టర్ పర్ఫెక్షనిస్టు కూడా ఈ ఏడాది బాలీవుడ్‌కు బలం తీసుకురాలేకపోయాడు. పీకే,దంగల్ లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీసును తిరగరాసిన ఆమిర్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తో గట్టి దెబ్బే తిన్నాడు. క్రిటిక్స్‌తో పాటు..కామన్ ఆడియన్..ఈ సినిమాను చూసి పెదవి విరిచేశారు. ఈ ఇ ఏడాదిలో వచ్చిన లాల్ సింగ్ చద్దా అయితే దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు అమిర్ ఈ ఇయర్ ఖాన్ త్రయంలో మరో ఇద్దరు హీరోలు బాక్సాఫీసుకు దూరంగా ఉన్నారు. అపజయాల పరంపర కొనసాగిస్తున్న..షారుఖ్ ఖాన్ పెద్ద బ్రేక్ తీసుకొని వరసగా సినిమాలు చేస్తున్నాడు. 2022 మొత్తం షూటింగ్లకే పరిమితమయ్యాడు. సల్లూ బాయ్ కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ హిందీ డబ్బింగ్‌తో అక్కడి ఆడియన్స్‌కు కనిపించాడు. కానీ ఈ ఖండల వీరుడు ఉన్నా కూడా అక్కడ ఫలితం లేకుండా పోయింది. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ..సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు ఖిలాడి అక్షయ్ కుమార్. ఈ ఏడాదిలో ఈయన నటించిన సినిమాలు..భారీ నష్టాలు తీసుకొచ్చాయి. ఆరు సినిమాలు విడుదలైతే..ఒక్క సినిమా కూడా డబ్బులు రాబట్టలేకపోయింది. ఓటీటీలో వచ్చిన అత్రంగిరే ,కట్‌పత్లీ ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్లలో విడుదలైన బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు లాంటి సినిమాలు బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయి. హృతిక్ రోషన్ విక్రమ్ వేదా,షాహిద్ కపూర్ జెర్సీ, టైగర్ ష్రాప్ ‘హీరో పంతీ 2’, అయుష్మాన్ ఖురానా ‘ఆన్ యాక్షన్ హీరో’, రణ్వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, కంగనా రనౌత్ ‘ధాకడ్’, రణ్‌బీర్ కపూర్ ‘షంషెరా’, వరుణ్ దావాన్ ‘బేడియా’ లాంటి మూవీస్..ఈ ఇయర్ అంచనాలతో విడుదల అయ్యాయి. అయితే..ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌ను థియేటర్లలోకి రప్పించలేకపోయింది. -
‘ఈడీ’నామ సంవత్సరం.. గుట్టలుగా నోట్ల కట్టలు..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఈ పేరు వింటనే ఈ ఏడాది ఎంతో మంది పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు వణికిపోయారు. ఎందుకంటే 2022లో ఈడీ దాడుల కారణంగా కొన్ని వందల కోట్ల అక్రమ సంపాదన బయటకు వచ్చింది. దీంతో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రముఖ రాజకీయ నేతలతో సహా ప్రముఖులు సైతం జైలు ఊసలు లెక్కబెట్టారు. కానీ, వీరంతా ప్రతిపక్ష నేతలు కావడంతో కేంద్రం తీవ్ర విమర్శులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈడీ దాడులు జరగడం విశేషం. ఈడీ జోరు పెంచిన కారణంగా ఈ ఏడాదిని ‘ఈడీనామ సంవత్సరం’గా పేర్కొనవచ్చు.. 1. నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ముందుగా రాహుల్ గాంధీ.. ఈడీ అధికారుల ఎదుట హాజరవుతున్న క్రమంలో ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలో ర్యాలీ తీశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ఐదు రోజుల్లో దాదాపు 50 గంటల పాటు విచారించారు. ఇక, ఈడీ విచారణ అనంతరం.. తన ఓర్పును చూసి ఈడీ అధికారులే షాక్ అయ్యారని రాహుల్ చెప్పుకొచ్చారు. తర్వాత ఈ కేసులో ఈడీ.. సోనియాను విచారించింది. కాగా, ఈడీ విచారణకు ముందే సోనియా కరోనా బారినపడటంతో విచారణ ఆలస్యమైంది. అనంతరం, సోనియా.. ఈడీ విచారణను హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వీరి విచారణల అనంతరం, ఈడీ అధికారులు.. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సహా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ క్రమంలో ఈడీ విచారణ రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది. 2. బెంగాల్లో పార్థా చటర్జీ ప్రకంపనలు.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్లో ఈడీ దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. బెంగాల్ విద్యాశాఖ మంత్రి, టీఎంసీ నేత పార్థా చటర్జీ.. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఈడీ అధికారులు మంత్రి పార్థా చటర్జీ సహా, అర్పిత ముఖర్జీని అరెస్ట్ చేశారు. ఇక, వీరి విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. టీచర్ పోస్టులకు, బదీలీలకు పార్థా చటర్జీ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. కిలోల్లో బంగారం, లగర్జీ కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. దీంతో, సీఎం మమత.. టీఎంసీ నుంచి పార్థా చటర్జీని తొలగించారు. 3. పంజాబ్‌లో మైనింగ్ కేసు.. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ బావమరిది భూపేందర్ సింగ్ హనీపై ఇసుక మాఫియా కేసులో భాగంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ అధికారులు దాదాపు రూ.10 కోట్లు, 21 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా మాజీ సీఎం ఛన్నీని కూడా ఈడీ విచారించింది. 4. జార్ఖండ్ సీఎంకు ఈడీ షాక్.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. ఇదే కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్ చేశారు. మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఇదే క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంగం సూచించిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసు వ్యవహారం జార్ఖండ్‌లో సోరెన్ తన సీఎం పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా రాజకీయంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 5. ఢిల్లీలో ఆప్‌ను తాకిన ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఈడీ అధికారులు షాకిచ్చారు. మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఈడీ ఇన్విస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సత్యేంద్రను మే ౩౦వ తేదీన అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు. అరెస్ట్ అనంతరం.. ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు, వీడియోలు బయటకు వచ్చాయి. జైలులో మసాజ్, ఇంటి ఫుడ్ తీసుకున్న వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో, ఈ వ్యవహారంలో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి అదే జైలులో ఉన్న సహ నిందుతులను సత్యేంద్ర పదే పదే కలుస్తున్నారని, తద్వారా ఈ కేసుని ప్రభావితం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో, సత్యేంద్ర జైన్ జైలు వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ మారింది. 6. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్.. మహారాష్ట్రలో పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో భాగంగా ముంబైలోని సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీ ల్యాండరింగ్ కేసులో రూ. 11 కోట్ల నగదు, పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసులో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక, ఈ కేసులో దాదాపు 100 రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం.. కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు చేయడంతో రౌత్ విడుదలయ్యారు. 7. దావూద్ ఇబ్రహీం కారణంగా నవాబ్ మాలిక్ అరెస్ట్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్‌కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో, ఈ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్‌తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్‌తో మాలిక్‌కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. ఇక, మాలిక్ అరెస్ట్‌ను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు నేతు ఖండించారు. 8. ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అమిత్ అరోరా సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఇక, ఈ కేసులో ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం ద్వారా సంపాదించిన ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కవితకు చేరినట్టు ఈడీ ఆరోపించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఏర్పాటుచేసిన మీటింగ్‌లో కవితతో పాటు అమిత్ అరోరా, దినేశ్ అరోరా, సమీర్ మహీంద్రు పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఇక, ఇదే కేసులో గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఈ కేసులో భాగంగానే కవితను సీబీఐ కూడా విచారించింది. 9. విజయవాడ ఆసుపత్రుల్లో ఈడీ దాడులు.. విజయవాడలోని ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్ల నివాసాలలో 40 ఈడీ బృందాలు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు ఆస్పత్రుల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ సీట్ల అమ్మకం, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఆరా తీశారు. దాదాపు రూ.100 కోట్లు వరకు ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు సమాచారం. 10. గ్రానైట్ విషయంలో గంగులపై ఈడీ దాడి.. టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్‌ను ఈడీ టార్గెట్ చేసింది. గంగుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్లో సోదాలు నిర్వహించారు. గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్‌తో పాటు కరీంనగర్‌లోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గంగులతో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం, గంగుల కమలాకర్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. - ఇవే కాకుండా.. ఎంపీ కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో కూడా ఆయన్ను ఈడీ విచారించింది. ఈ కేసులో చిదంబరం మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ పేర్కొంది. యస్-బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ ఫ్రాడ్ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా రూ. 415 కోట్లను ఈడీ ఎటాచ్ చేసింది. జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ వ్యవహరంలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. -
2022 Round Up: పత్తా లేని హీరోలు, ఉసూరుమన్న అభిమానులు
సినిమా చూపిస్త మామా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలు కొందరైతే గ్యాప్ తీసుకోలేదు భయ్యా, అదే వచ్చింది అంటూ బాక్సాఫీస్‌కు దూరంగా ఉన్న హీరోలు మరికొందరు. ఏడాదికొక్క సినిమా అంటూ లెక్కలేసుకోకుండా వరుస సినిమాలతో కొందరు జోరు చూపిస్తుంటే ఈ సంవత్సరం నో మూవీ అంటూ ఉసూరుమనిపించారు మరికొందరు కథానాయకులు. ఇంతకీ ఏయే హీరోలు ఈ ఏడాది థియేటర్లలో కనిపించి అభిమానులతో విజిల్స్ కొట్టించారు? ఎవరు అసలు కనిపించకుండా పోయి ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.. బ్రేక్ ఇచ్చిన బాలయ్య గతేడాది అఖండతో రికార్డులు బద్ధలు కొట్టాడు బాలయ్య. ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి సెన్సేషన్ అయ్యాడు. కానీ ఈ ఏడాది అతడు బాక్సాఫీస్‌ను పలకరించనేలేదు. అతడు నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఏమాటకామాటే కానీ.. బాలయ్య సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకపోయినా ఆహా అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ద్వారా అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. భారీ ప్లానింగ్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన అల్లు అర్జున్ ఈ ఇయర్ మాత్రం గప్‌చుప్‌గా ఉన్నాడు. నిజానికి పుష్ప సీక్వెల్‌ను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ ఊహించనంత విజయం అందుకోవడంతో సెకండ్ పార్ట్ కథపై భారీ కసరత్తులు చేశారు. దీంతో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన పుష్ప: ద రూల్ షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. స్లో అయిన సాయిధరమ్ తేజ్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది బొణీ కొట్టలేదు. గతేడాది తేజ్‌కు యాక్సిడెంట్ కావడంతో ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. అలా అతడి సినిమాల రిలీజ్ ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం అతడు కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మూవీ, జయంత్ పనుగంటి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. కనిపించని అఖిల్ పోయిన సంవత్సరం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు అక్కినేని అఖిల్. ప్రస్తుతం అతడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఇది ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. చదవండి: ఓటీటీ ప్రేక్షకులను అలరించే చిత్రాలివే! -
Recap 2022: రాజకీయ రంగస్థలంలో కీలక ఘట్టాలు
రాజకీయాలు అంటేనే ఎన్నో మలుపులు, ఆకస్మిక నిర్ణయాలు, అనూహ్య ఫలితాలు, ఫిరాయింపులు, తిరుగుబాట్లుతో ఎప్పడికప్పుడు రక్తికట్టిస్తాయి. అలాంటి కీలక మలుపులకు కేరాఫ్‌గా నిలిచింది 2022. ఈ సంవత్సరంలో రాజకీయాల్లో నెలకొన్న కొన్ని కీలక ఘట్టాలు భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. 2022 ఏడాది పూర్తి చేసుకుని 2023లోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ ఏడాది దేశంలో జరిగిన కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం. ఉత్తరాఖండ్ సంప్రదాయానికి బీజేపీ చెక్: ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది బీజేపీ. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అవసరమైన మెజారిటీని సాధించింది. ఫిబ్రవరి 14న మొత్తం 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లు సాధించి అధికారం ఛేజిక్కించుకుంది. పుష్కర్ సింగ్ ధామీ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీదే గోవా: గోవాలో ఫిబ్రవరి 14న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోమారు అధికారం ఛేజిక్కించుకుంది. మొత్తం 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు సాధించింది. దీంతో ప్రమోద్ సావంత్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు. మణిపూర్‌లో బీజేపీ ఘనవిజయం: ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా 32 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రధాన పాత్ర పోషించిన ఎన్. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ పాగా: జాతీయ పార్టీగా అవతరించాలనే లక్ష్యంగా సాగిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 20న మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92 సీట్లు సాధించింది దేశం దృష్టిని ఆకర్షించింది. ఆప్ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగా హవా: ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హవా కొనసాగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో మొత్తం 403 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు. షిండే తిరుగుబాటు: ఈ ఏడాది మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబావుట ఎగురవేయడంతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. షిండే వర్గం బీజేపీతో చేతులు కలపడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో పరిణామాలు వాడీవేడీగానే కొనసాగుతున్నాయి. శివసేన పార్టీ తమదంటే తమదని ఇటు షిండే వర్గం, అటు ఉద్ధవ్ వర్గం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళా: దేశ చరిత్రలోనే తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఝార్ఖండ్ మాజీ గవర్నర్, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు ముర్మూ. జులై 18న జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్: ఈ ఏడాది ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్.. భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మార్గరేట్ అల్వాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 710 ఓట్లలో 528 సాధించారు. బిహార్‌లో కొత్త కూటమి: మహారాష్ట్రను మించిన ట్విస్టులు బిహార్ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. కూటమిలో నెలకొన్న విభేదాల కారణంగా బీజేపీకి షాక్ ఇస్తూ విపక్ష ఆర్జేడీతో చేతులు కలిపారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. జేడీయూ, ఆర్జేడీ కలిసి కొత్త కూటమిగా ఏర్పడంతో పాటు రెండు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆగస్టు 10న నితీశ్ కుమార్ మళ్లీ సీఎం పీఠం అధిరోహించారు. ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్: తమిళనాడులో అధికారం కోల్పోయిన తర్వాత ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నెట్ర కళగం(ఏఐఏడీఎంకే)లో చీలికలు ఏర్పడ్డాయి. ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) నేతృత్వంలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఓ పన్నీరు సెల్వం(ఓపీఎస్)ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి ఈపీఎస్‌కు దక్కెలా నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. భారత్ జోడో యాత్ర పేరిట తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ యాత్ర ప్రారంభమైంది. హిమాచల్‌ను లాగేసిన కాంగ్రెస్: నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారాన్ని లాగేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 40 సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ 25 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. గుజరాత్లో బీజేపీ రికార్డులు: 25 ఏళ్లకుపైగా గుజరాత్‌ను శాసిస్తోంది బీజేపీ. డిసెంబర్లో రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునామి సృష్టించింది. మొత్తం 182 సీట్లకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి పదవి చేపట్టారు. -
ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోయో హనీసింగ్- షాలినీ తల్వార్ బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. రాజీవ్ సేన్- చారు అసోపా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు. రాఖీ సావంత్- రితేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది. సుస్మితా సేన్-లలిత్ మోదీ మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్మన్తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. సోహైల్ ఖాన్-సీమా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్. -
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్‌కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్‌తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
తెలంగాణలో కమలం బండి ఎట్లా నడిచిందంటే..
సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు ప్రమాణాలు.. ప్రతిజ్ఞలు.. పాదయాత్రలు.. సభలతో తెలంగాణ కమలం పార్టీ ఈ యేడాది దూకుడుగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ యేడాది మొత్తం కాషాయ పార్టీ సెంట్రిక్ గానే తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. అధికారంగా తెలంగాణ విమోచన దిన వేడుకలు నిర్వహించడం.. మునుగోడు ఉప ఎన్నిక.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు.. యాదాద్రి కొండపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రమాణాలతో 2022 బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో రక్తికట్టించిన పరిణామాలను ఒకసారి తిరగేస్తే.. భళా బండి 2022లో తెలంగాణ రాజకీయాలన్నీ కాషాయ పార్టీ కేంద్రంగానే సాగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలుకొన్ని బండి సంజయ్ పాదయాత్రల వరకు ప్రజల్లో నిత్యం పార్టీపై చర్చ సాగే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యేడాది జూలై 2,3,4 హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. కీలకమైన ఈ సమావేశాల్లోప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ.ఎల్.సంతోష్ తో పాటు 350 మంది జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. దేశంలో పార్టీ బలోపేతంతో పాటు పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణ బీజేపీ చరిత్రలోనే పరేడ్ గ్రౌండ్స్ లో అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించి.. ప్రధాని మోడీతో భళా అనిపించుకున్నారు తెలంగాణ కమలదళపతి. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో ఈ యేడాది నాలుగు సార్లు పర్యటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఐదు సార్లు పర్యటించి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఐదుసార్లు రాష్ట్రంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరే కాదు.. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వివిధ సందర్భాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. టీఆర్ఎస్పై పీఎం ఫైర్ ఈ ఏడాది ఆరంభం నుంచే తెలంగాణ ప్రభుత్వానికి.. బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడల్లా.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గైర్హాజరవుతూ వస్తున్నారు. ప్రధాని గౌరవ ఆహ్వానానికి సైతం వెళ్లలేదు ఆయన. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ముచ్చింతల్ పర్యటించారు. ఆ తర్వాత మే 26వ తేదీన గచ్చిబౌలి ఐఎస్బీలో నిర్వహించిన కార్యక్రమం కోసం ప్రధాని వచ్చారు. ఆ సమయంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అధికార టీఆర్ఎస్ తీరును ఆ సభలో ఎండగట్టారు. జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జూలై 4వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్12న రామగుండంలో ఎరువుల కార్మాగార ప్రారంభోత్సవ సందర్భంగా.. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయమంటూ తీవ్రస్థాయిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. యాక్టివ్‌గా షా మరోపక్క.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ దిశానిర్ధేశం చేస్తున్నారు. ఎప్పుడు అవసరమైనా వస్తా అంటూ తెలంగాణ కమలదళానికి భరోసా ఇచ్చారు. సెప్టెంబర్17 న హైదరాబాద్ విమోచన వేడుకలను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టింది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా... పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు సంబంధించి మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించి ముగింపు సభలో అమిత్ షా పాల్గొన్నారు. కేసీఆర్ ను ఓడించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలంటూ.. అమిత్ షా ఆ సభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆగస్ట్ 21న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆగస్టు 21న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేరిక సభలోనూ అమిత్ షా పాల్గొన్నారు. నడా ప్రత్యేక దృష్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ... రాష్ట్రంలో ఐదుసార్లు పర్యటించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు.. బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర సభల్లో నడ్డా పాల్గొన్నారు. మే5న మహబూబ్ నగర్ లో, ఆగస్ట్27న వరంగల్ లో, డిసెంబర్ 17న కరీంనగర్ సభల్లో నడ్డా.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. బండి దూకుడు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఈయేడాది రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో సభలు, సమావేశాలు నిర్వహించి రికార్డు సృష్టించారు. బండి సంజయ్ ఈ యేడాది నాలుగు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. మొదటి విడత పాదయాత్రను గత యేడాది పూర్తి చేశారు. ఈ యేడాది మొదట్లో ఆలంపూర్ జోగులాంబ నుంచి మహేశ్వరం వరకు రెండో విడత పాదయాత్ర చేశారు.భువనగిరి యాదాద్రి నుంచి హన్మకొండ వరకు మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగించారు. కుత్బుల్లాపూర్ నుంచి అబ్దూల్లాపూర్ మెట్ వరకు నాలుగో విడత పాదయాత్ర చేశారు. ఇటీవల భైంసా నుంచి కరీంనగర్ వరకు ఐదో విడత పాదయాత్ర పూర్తి చేశారు బండి సంజయ్. ఇరకాటంలో కూడా.. నిస్తేజంగా ఉన్న నల్లగొండ బీజేపీ క్యాడర్ ను మునుగోడ ఉప ఎన్నికతో నిద్రలేచింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరికతో బీజేపీలో జోష్ పెంచింది. ఉప ఎన్నిక ఓటమితో బీజేపీ కొంత ఢీలా పడినప్పటికీ... ఓట్ల శాతం పెరిగిందని సరిపెట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బీజేపీని కొంత కలవరపాటుకు గురిచేసింది. బీజేపీ అగ్రనేతల పేర్లను ప్రస్తావించడం.. కేసులు పెట్టడం సిట్ వేయడం బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ పేరు ప్రస్తావించడంతో.. తమ పార్టీకి సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహుడి సాక్షిగా తడి బట్టలతో బండి సంజయ్ ప్రమాణం చేశారు. చేరికల పర్వం.. బీజేపీలో జాయినింగ్స్ సంబంధించి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో కమిటీ వేశారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ యేడాది మునుగోడు రాజగోపాల్ రెడ్డితో పాటు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిట్టా బాలాకృష్ణారెడ్డి, రామారావు పటేల్, ఎర్రవల్లి ప్రదీప్ రావు, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రనాయక్, న్యాయవాది రచనరెడ్డి తదితరులు జాయిన్ కాగా.. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్యగౌడ్ పార్టీని వదిలి వెళ్లారు. మొత్తానికి ఈ యేడాది మొత్తం వచ్చే ఎన్నికల ప్రిపరేషన్ లో కాషాయ శ్రేణులు పనిచేశాయని చెప్పవచ్చు. ::: సాక్షి ప్రత్యేకం -
సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన డైనమైట్
Year Ender 2022: పొట్టి క్రికెట్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం కాదనలేని సత్యం. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్‌తో 1408 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా సూర్య టీ20 కెరీర్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుండా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ గణాంకాలు.. - వెస్టిండీస్‌తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. - శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్ రేట్‌తో 34 పరుగులు చేశాడు. - సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్ రేట్‌తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. - ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్ రేట్‌తో 15 పరుగులు చేశాడు. - ఇంగ్లండ్‌తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్ రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. - ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - న్యూజిలాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది. - బంగ్లాదేశ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. - ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్ రేట్‌తో 6 పరుగులు చేశాడు. - హాంగ్‌కాంగ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్ రేట్‌తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - నెదర్లాండ్స్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. - పాకిస్తాన్‌తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. - జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్ రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో సూర్యకుమార్.. - 6 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో సూర్యకుమార్.. - 5 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. -
‘పాన్ ఇండియా’ జాతర.. అంచనాలతో 1000 కోట్లు.. అనుకోకుండా 400 కోట్లు
బాహుబలి లాంటి ఒక్క చిత్రం పాన్ ఇండియా విజయం సాధిస్తే.. అదే ఫీట్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందా అంటే..తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు సమాధానం చెప్పాయి. వందల కోట్ల వసూళ్లు సాధించి సంచలన విజయం సాధించాయి. సౌత్ ,నార్త్ ను ఒక్కటి చేసేలా పాన్ ఇండియా హిట్ కొట్టాయి. 2022లో కూడా ఆ సీన్ రిపీట్ అయింది. ఈ ఏడాదంతా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా జాతర కొనసాగింది. అంచానాలతో వచ్చి వెయ్యి కోట్ల కొల్లగొట్టిన చిత్రాలు..ఏ మాత్రం ఊహించకుండా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి. మరి ఈ ఇయర్ సౌత్ నార్త్ అనే ఎళ్లలు చేరిపేసిన ఆ చిత్రాలపై ఓ లుక్కేయండి. ‘బహుబలి’ సిరీస్ సినిమాలతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. ఆయన ఈ ఏడాది మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను పలకరించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన మరో చిత్రం ‘కేజీయఫ్ 2’. కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే కేజీయఫ్ 2. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అంచనాలకు మించి రూ.1200 కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. బహుబలి సాధించిన విజయం స్పూర్తితో..మణి రత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించాడు. మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీ..ఇటు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది.నాలుగు వందల యాభై కోట్లు కొల్లగొట్టింది. అలాగే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ ఏడాది ‘విక్రమ్’తో బాక్సాఫీస్‌పై తన విశ్వరూపాన్ని చూపించాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 3 విడుదలై పాన్ ఇండియా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.450కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కమల్ హాసన్ సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఈ ఇయర్ లో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి..నార్త్ లో కనికట్టుచేసిన మూవీ..కాంతార. ఇది ఎవరు ఉహించని విజయం..సర్పైజింగ్ సక్సెస్. నాలుగు వందల కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. మరోవైపు బాలీవుడ్ చిత్రం..బ్రహ్మస్త్ర కూడా..పాన్ ఇండియా హిట్ కొట్టింది. హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకొని..దక్షణాది ప్రేక్షకుల ప్రేమను కూడా గెలుచుకుంది. తెలుగు లాంగ్వెజ్ లో ఇరువై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది .అన్ని భాషల్లో కలుపుకొని..నాలుగు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది.ఇలా ఈ చిత్రాలన్ని..ఎళ్లలు దాటి విజయం సాధించాయి..వందల కోట్ల చిత్రాల జాబితాలోకి చేరాయి. -
Recap 2022: స్టార్స్‌కు మాట.. పాట సాయం చేసిన మరో స్టార్ హీరోలు
ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ మాట సాయం చేస్తే.. పాట సాయం కూడా చేస్తే.. ఆ ఇద్దరు స్టార్ల అభిమానులకు పండగే పండగ. 2022 అలాంటి కొన్ని పండగలను ఇచ్చింది. అడగ్గానే కాదనకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి, మాట... పాట పాడిన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. అది కూడా నాలుగు చిత్రాలకు. 2017లో వచ్చిన రానా ‘ఘాజీ’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రాల తర్వాత ఈ ఏడాది లీజైన మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’, బాలీవుడ్ చిత్రం రణ్‌బీర్ కపూర్ ‘బ్రహాస్త్రం’కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలైంది. రణ్‌బీర్, ఆలియా జంటగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్రం’ ట్రయాలజీలోని ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ 1 శివ’ సెప్టెంబరు 9న రిలీజైంది. (చదవండి: ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్) అదే నెల 30న విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 చిత్రానికీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగ మార్తాండ’లోని షాయరీ చిరంజీవి వాయిస్‌తో ఆడియన్స్‌కు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ టైటిల్ రోల్ చేయగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలను చిరంజీవితో షాయరీగా చెప్పించారు కృష్ణవంశీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేశ్‌బాబు. పవన్ కల్యాణ్ ‘జల్సా’ (2008), ఎన్టీఆర్ ‘బాద్షా ’(2013), దివంగత నటుడు కృష్ణ టైటిల్ రోల్ చేసిన ‘శ్రీశ్రీ’ (2016), సందీప్ కిషన్ హీరోగా చేసిన ‘మనసుకు నచ్చింది’ (2018) చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ ఈ ఏడాది ‘ఆచార్య’కు ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజైన సంగతి తెలిసిందే. (చదవండి: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు) మరోవైపు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తనకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్ అందించిన ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజైంది. ఇంకోవైపు ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మార్చి 11న ఈ చిత్రం విడుదలైంది. ఇక వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఇప్పటికే ‘అ!’, ‘హిట్’, ‘హిట్ 2’ సినిమాలను నిర్మించిన నాని ఈ ఏడాది వెబ్ ఆంథాలజీ ‘మీట్ క్యూట్’ నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్‌కు నాని వాయిస్ ఓవర్ అందించారు. సోనీ లివ్‌లో నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో తాను నిర్మించిన ‘అ!’కు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ గ్లింప్స్‌కు హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో మరోచోట కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రానుంది. పాటల సందడి.. ఇప్పటికే ఎన్నో పాటలకు గాత్రం అందించిన శింబు ఈ ఏడాది బాగా సౌండ్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’లోని ‘బుల్లెట్ సాంగ్’ పాడారు. తమిళంలోనూ ఈ పాటను పాడారు శింబు. రామ్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. అలాగే ఈ ఏడాది శ్రోతలను మెప్పించిన మరో పాట ‘టైమ్ ఇవ్వు పిల్ల..’ కూడా శింబు పాడిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రంలోని పాట ఇది. వీటితో పాటు నిర్మాతగా హీరో రవితేజ తెలుగులో సమర్పించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’ థీమ్ సాంగ్ కూడా శింబు గొంతు నుంచి వినిపించిందే. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజైంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు) సినిమా కోసం కూడా శింబు పాట పాడారు. ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయ ఆదితి పాడిన తొలి పాట ‘రోమియోకి జూలియట్‌లా’. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’లోని పాట ఇది. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజైంది. ఇలా మాట.. పాట సాయం చేసిన స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
ఆ ఐడియా సూపర్ హిట్.. నేడు వేల కోట్లకు అధిపతిగా..
ప్రస్తుత రోజుల్లో ఓలా కంపెనీ పేరు తెలియని వారుండరు. నగర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ , మరో వైపు ఎందరో ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తోంది ఓలా. ఎన్నో ఒడిదుడుకులు, జయఅపజయాలు ఎదుర్కొని ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా మొదలై ప్రస్తుతం కొన్ని వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. ఓలా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలు, అవమానాలు పడ్డా సంస్థ వ్యవస్థాపకుడు , సీఈఓ భవిష్ అగర్వాల్‌కు ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఆయన సక్సెస్ స్టోరీపై ఏంటో తెలుసుకుందాం! ఐఐటీ బాంబేలో చదువు భవిష్ అగర్వాల్ పంజాబ్‌లోని లూథియానాలో పెరిగారు. ఆయన 2008లో ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. అగర్వాల్ 2008లో దేశీటెక్.ఇన్ (Desitech.in)పేరుతో బ్లాగర్‌గా తన స్వంత బ్లాగును ప్రారంభించారు.ఈ వెబ్సైట్ దేశంలోని సాంకేతిక రంగంలో సరికొత్త స్టార్టప్‌ల గురించి సమాచారాన్ని అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియాలో రీసెర్చ్ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆగర్వాల్ రెండేళ్లపాటు అందులో పనిచేశాడు. ఆ ఘటనే మార్చింది.. ఒకసారి భవిష్ తన స్నేహితులతో కలిసి టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం వారు అద్దెకు టాక్సీ బుక్ చేసుకున్నారు( బెంగళూరు నుంచి బందీపూర్‌కు వరకు) అయితే టాక్సీ డ్రైవర్ సడన్‌గా మైసూర్లో బండి ఆపేశాడు. తనకు ఈ ప్రయాణ ఖర్చులు సరిపోవని, ఇంకాస్త అదనంగా డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశాడు. చివరికి వారు చెల్లించేందుకు అంగీకరించలేదు. దీంతో అక్కడే వారిని వదిలి టాక్సి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఇదంతా అందులో ఉన్న భవిష్ అగర్వాల్‌ను ఆలోచనలో పడేసింది. ఇలాంటి పరిస్థితులు ప్రజలకు పలు సందర్భాల్లో ఎదురవుతుంటాయనే విషయాన్ని భవిష్ అర్థం చేసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారంగానే నుంచే ఓలా ఆలోచన పుట్టుకొచ్చింది. ఉద్యోగం వదిలేసి.. భవిష్‌కు టెక్నాలజీపై ఆసక్తి ఉండటంతో.. అతని ఓ ఆలోచన వచ్చింది. అలా అతనికి అద్దె కార్ల ఐడియా ప్రస్తుతం ప్రముఖ సంస్థ ఓలా గా మారింది. మొదట్లో తన ఆలోచనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. ఓ సందర్భంలో 2010లో లక్షలు వస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని సైతం వదలాల్సిన పరిస్థితి ఏర్పడిన ధైర్యంగా రాజీనామా చేశాడు. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. చివరికి స్నేహితుడు అంకిత్ భాటియాతో కలిసి ఓలా కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఓలా దాదాపుగా 15 లక్షల మందికి పైగా ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ వేల కోట్ల విలువైన కంపెనీగా కార్యకలాపాలని నిర్వహిస్తోంది. చదవండి: Income Tax: కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే!