Cheapest Electric Scooters: దేశంలో గత పది ఏళ్లలో ద్విచక్ర వాహన విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తెరపైకి వచ్చింది. దీనికి తోడు కేంద్రం ఈ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పోత్సాహకాలు కూడా అందిస్తోంది.
పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈవీల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ ఈవీ మార్కెట్లో వస్తున్న స్కూటర్లు కొన్ని ఖరీదుగా ఉండడం, కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోనివి రావడంతో ఈ విషయమై సామాన్యుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అటువంటి వారి కోసం చౌకగా వారి బడ్జెట్‌కు సరిపోయే చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Bounce Infinity E1
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. ఒక వేళ మీకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కావాలనుకుంటే దాని ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది.
Hero Electric Optima CX
ఈ ఈవీ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190గా ఉంది. దీని గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కలర్స్‌లో కస్టమర్లకు లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Avon E Scoot
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. కేవలం 6 నుంచి 8 గంటల సమయంలో దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
Ampere Magnus EX
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999.
Hero Electric Photon
హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్‌తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇది 90 కి.మీల రేంజ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీగా ఉంది. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్‌లైట్, టెయిల్ లైట్‌తో పాటు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కేవలం 5 గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment