two wheelers
-
టూ వీలర్లకు ఫ్రీగా పెట్రోల్!
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ద్విచక్ర వాహనదారుల కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఈ సంస్థ ప్రారంభించి 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఫౌండేషన్ డే ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టూ వీలర్లకు ఉచితంగా పెట్రోల్‌తోపాటు (Free Petrol) క్యాష్ కూపన్ అందిస్తోంది.ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్‌ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన బీపీసీల్ రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్‌తో పాటు కనీసం ఒక ప్యాక్ మ్యాక్ 4టీ (MAK 4T) లూబ్రికెంట్ను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ ఆఫర్లో పాల్గొనడానికి అర్హులు. ఈ పథకం ద్విచక్ర వాహన కస్టమర్లకు మాత్రమే. ఇందులో పాల్గొని రూ. 75 విలువైన పెట్రోల్‌ను ఉచిత పొందొచ్చు. జనవరి 24నే మొదలైన ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది.బీపీసీఎల్ డీలర్లు, పంపిణీదారులు, ఛానల్ భాగస్వాములు, ప్రకటనల ఏజెన్సీల ఉద్యోగులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్ మేనేజర్లు మొదలైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఆఫర్లో పాల్గొనడానికి అర్హులు కారు. అలాగే వాహనదారులకు ఒకసారి మాత్రమే ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి రిజిస్ట్రేషన్‌కు వినియోగించిన మొబైల్ నంబర్ మరోసారి ఉపయోగించేందుకు వీలు లేదు.ఆఫర్ ప్రయోజనాలుఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ కింద మ్యాక్ 4టీ (MAK 4T) ల్యూబ్రికెంట్ ఆయిల్ కొనుగోలు చేశాక తక్షణమే రూ. 75 విలువైన పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. లూబ్రికెంట్ల ప్యాక్‌లో రూ. 1000 వరకు విలువ చేసే క్యాష్ కూపన్ ఉంటుంది. దీనిని రిటైల్ అవుట్లెట్లోనే కౌంటర్లో నగదుగా మార్చుకోవచ్చు. క్యూఓసీ యంత్రాన్ని ఉపయోగించి మ్యాక్ క్విక్ కియోస్క్‌లో ఆయిల్ చేంజ్ ఉచితంగా చేసుకోవచ్చు. ఆర్ఓ డీలర్ హలో బీపీసీఎల్ యాప్‌ని ఉపయోగించి కూపన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఆ మొత్తాన్ని కస్టమర్‌కు అక్కడికక్కడే అందజేస్తారు. కస్టమర్ హలో బీపీసీఎల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, నిర్ణీత కేవైసీ ప్రక్రియను అనుసరించిన తర్వాత కూపన్‌ను స్వయంగా స్కాన్ చేయవచ్చు. -
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు
లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు. -
పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి, చిన్న బ్యాటరీలను కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, రిమూవబుల్ లేదా స్వాపబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో పెద్ద బ్యాటరీలను కలిగిన టాప్-5 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి తెలుసుకుందాం.4 కిలోవాట్ బ్యాటరీఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, రివర్ ఇండీ, టోర్క్ క్రటోస్ ఆర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో 4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా 195 కిమీ (ఓలా ఎస్1 ప్రో), 190 కిమీ (ఓలా ఎస్1 ఎక్స్), 161 కిమీ (రివర్ ఇండీ), 180 కిమీ (టోర్క్ క్రటోస్ ఆర్)గా ఉంది. ఒకే పరిమాణంలో ఉన్న బ్యాటరీని కలిగి ఉన్నప్పటికీ రేంజ్ తేడా ఏంటా? అని బహుశా ఎవరికైనా అనుమానం రావొచ్చు. కానీ ఒక వాహనంలో ఉన్న ఫీచర్స్.. దాని పరిధిని (రేంజ్) నిర్థారిస్తారు. అంతే కాకుండా ఎంచుకున్న మోడ్.. ప్రయాణించే రోడ్డు మీద కూడా ఆధారపడి ఉంటాయి.4.4 కిలోవాట్ బ్యాటరీఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైకులో 4.4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 187 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఈ రేంజ్ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో మారే అవకాశం ఉంటుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఏకైన మోడల్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ కావడం గమనార్హం.5 కిలోవాట్ బ్యాటరీసింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఫిక్డ్స్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది. 5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జీతో 212 కిమీ రేంజ్ అందిస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు 525 సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం.5.1 కిలోవాట్ బ్యాటరీటీవీఎస్ ఐక్యూబ్ వివిధ పరిమాణాల బ్యాటరీలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ లాంచ్ చేసిన రెండేళ్ల తరువాత 5.1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జీతో 185 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా ఇది దాదాపు సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు.ఇదీ చదవండి: రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..7.1 కిలోవాట్ బ్యాటరీ & 10.3 కిలోవాట్ బ్యాటరీబెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైకులో 7.1 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన ఎఫ్77 మ్యాక్ 2 రీకాన్ మోడల్ 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 323 కిమీ రేంజ్ అందిస్తుంది. -
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
ఈ–టూ వీలర్స్‌లో బజాజ్ టాప్–2
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 88,156 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 31 శాతం వృద్ధితో 7,99,103 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది ఒక మిలియన్ యూనిట్ల మైలురాయిని పరిశ్రమ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఒక ఏడాదిలో ఈ స్థాయి విక్రయాలు నమోదుకావడం ఇదే తొలిసారి అవుతుంది. 2023లో దేశవ్యాప్తంగా 8,48,003 యూనిట్ల ఈ–టూవీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 మార్చిలో అత్యధికంగా 1,37,741 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఆగస్ట్‌లో 87,256 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,48,539 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–టూ వీలర్ల వాటా ఏకంగా 59 శాతం ఉంది. ఏడాదిలో 166 శాతం వృద్ధి.. ఇప్పటి వరకు ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ 11 నెలల కనిష్టానికి 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెపె్టంబర్లో ఇది 27 శాతానికి పడిపోవడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో గత నెలలో 17,865 యూనిట్ల అమ్మకాలను సాధించి 20.26 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితం అయింది. ఏథర్, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. 19 నెలల కనిష్టానికి.. ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు సెప్టెంబర్‌లో 19 నెలల కనిష్టానికి పడిపోయాయి. గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5,733 యూనిట్లు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 9 శాతం తగ్గుదల. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 9,661 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధితో 68,642 యూనిట్లు రోడ్డెక్కాయి. తొలి స్థానంలో ఉన్న టాటా మోటార్స్ గత నెలలో 3,530 ఈవీలను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికి వచ్చి చేరింది. 2023 సెప్టెంబర్‌లో ఇది 68 శాతం నమోదైంది. ఎంజీ మోటార్ ఇండియా 955 యూనిట్ల అమ్మకాలతో 16.65 శాతం వాటాతో రెండవ స్థానంలో పోటీపడుతోంది. 443 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా 7.72 శాతం వాటా కైవసం చేసుకుంది. బీవైడీ ఇండియా, సిట్రన్, బీఎండబ్లు్య ఇండియా, మెర్సిడెస్ బెంజ్, హ్యుండై మోటార్ ఇండియా, వోల్వో ఆటో ఇండియా, కియా ఇండియా, ఆడి, పోర్ష, రోల్స్ రాయిస్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
91 శాతం వాహనాలు బీమాకు దూరం
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2018లో తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం షోరూం నుంచి కొత్త కారు రోడ్డెక్కాలంటే ఒక ఏడాది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఐఆర్డీఏఐ 2019లో తెచ్చిన రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనాల విషయంలో ఇది 1+5 ఏళ్లు ఉంది. ఇదంతా సరే. మరి రెన్యువల్స్ సంగతి ఏంటి? తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో ఎంత మంది తమ వాహనాలను రెన్యువల్ చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 19 శాతం టూ వీలర్లు, 47 శాతం కార్లు మాత్రమే రెన్యువల్ అవుతున్నాయట. మొత్తంగా దేశంలో అన్ని వాహనాలకు కలిపి బీమా విస్తృతి 9 శాతమే ఉంది. అంటే రోడ్డుమీద తిరుగుతున్న 100 వాహనాల్లో తొమ్మిదికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నట్టు లెక్క. 2015కు ముందు ఇది కేవలం 3 శాతమే. వాహనానికి ఏమీ కాదు.. అనవసరంగా డబ్బులు ఖర్చు అన్న నిర్లక్ష్యపు భావనే ఇందుకు కారణమని బీమా కంపెనీలు అంటున్నాయి. బీమా లేకుంటే వాహనానికి జరగరానిది జరిగితే జేబులోంచి ఖర్చు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టమూ తప్పదు. సమగ్ర బీమా ఉంటే ప్రకృతి విపత్తుల నుంచీ వాహనానికి రక్షణ లభిస్తుంది.డిజిటల్ పాలసీలదే హవా.. వ్యయాలను తగ్గించుకోవడానికి, పాలసీల జారీని వేగవంతం చేయడానికి బీమా కంపెనీలు డిజిటల్ వైపు మళ్లుతున్నాయి. 10 నిమిషాల్లోనే పాలసీలను కస్టమర్ల చేతుల్లో పెడుతున్నాయి. ఆన్లైన్లో జారీ అవుతున్న పాలసీల సంఖ్య ఏకంగా 65 శాతం ఉందంటే డిజిటల్ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) అడ్వైజర్లు సైతం కస్టమర్లను నేరుగా చేరుకుని డిజిటల్ రూపంలో పాలసీలను అందిస్తున్నారు. 2029–30 నాటికి జారీ అవుతున్న పాలసీల్లో డిజిటల్ వాటా 75 శాతానికి చేరుతుందని పరిశ్రమ భావిస్తోంది. కస్టమర్లలో 15 శాతం మంది జీరో డిప్రీసియేషన్ కోరుకుంటున్నారు. నడిపే దూరానికి బీమా చెల్లించే ‘పే యాజ్ యూ డ్రైవ్’ ప్లాన్స్‌ను 6 శాతం మంది ఎంచుకుంటున్నారని పాలసీబజార్‌కు చెందిన పీబీపార్ట్నర్స్ మోటార్ ఇన్సూరెన్స్ అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్ అమిత్ భడోరియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీల మధ్య పోటీ కారణంగానే ప్రీమియంలో వ్యత్యాసం ఉంటోందని అన్నారు. రూ.1.60 లక్షల కోట్లకు.. దేశంలో వాహన బీమాను 27 సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీల జారీలో 57 బ్రోకింగ్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. భారత్‌లో మోటార్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2023–24లో 12.9 శాతం దూసుకెళ్లి రూ.91,781 కోట్లు నమోదు చేసింది. 2029 నాటికి ఇది సుమారు రూ.1.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. వాహనాలన్నింటికీ బీమా కలిగి ఉండాలన్నదే ఐఆర్డీఏఐ లక్ష్యం. అంతేగాక బీమా ప్రీమియం వినియోగదార్లకు అందుబాటులో ఉంచేందుకు ఐఆర్డీఏఐ కృషి చేస్తోంది. బీమా పాలసీలను విస్తృతం చేసే లక్ష్యంతో 2015లో పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) కాన్సెప్ట్‌కు ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టడం పరిశ్రమ వృద్ధికి ఆజ్యం పోసింది. జారీ అవుతున్న పాలసీల్లో 60 శాతం బ్రోకింగ్ కంపెనీల నుంచే ఉండడం గమనార్హం. 40 శాతం పాలసీలు నేరుగా బీమా కంపెనీల నుంచి జారీ చేస్తున్నారు. 75 శాతం చౌక ప్రీమియం పాలసీలే..దేశంలో 2018కి ముందు రెన్యువల్స్ ద్విచక్ర వాహనాలకు 31 శాతం, కార్లకు 37 శాతం నమోదైంది. ఐఆర్డీఏఐ చొరవతో ఇన్సూరెన్స్ విస్తృతి పెరిగింది. పాలసీబజార్.కామ్ ప్రకారం టాప్–20 నగరాల్లో 50 శాతం టూ వీలర్స్, 60 శాతం కార్లకు బీమా ఉంది. తృతీయ, ఆపై తరగతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 40 శాతం ద్విచక్ర వాహనాలు, 45 శాతం ఫోర్ వీలర్స్‌కు ఇన్సూరెన్స్ ఉంది. టాప్–20 నగరాల్లో సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్) పాలసీని 55 శాతం మంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 70 శాతం మంది ఎంచుకుంటున్నారు. ఈ నగరాల వెలుపల 30 శాతం మంది సమగ్ర పాలసీ, 50 శాతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ప్రీమియంలో లభించే పాలసీలను 75 శాతం మంది తీసుకుంటున్నారు. ఇక ప్రమాదానికి గురైన వాహనాల్లో 40 శాతం వాటికి బీమా ఉండడం లేదట. -
ఈవీ విక్రయాలు.. ఏటా కోటి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్ల స్థాయికి చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే 5 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరగగలదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 64వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఆటోమోటివ్లకు సంబంధించి భవిష్యత్తులో భారత్ నంబర్‌వన్ తయారీ హబ్‌గా ఎదగగలదని తెలిపారు. 2030 నాటికి దేశీయంగా మొత్తం ఈవీ వ్యవస్థ రూ. 20 లక్షల కోట్ల స్థాయికి, ఈవీ ఫైనాన్స్ మార్కెట్ రూ. 4 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీల ఖరీదు మరింత తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగి వస్తాయని, ఈవీల వినియోగం గణనీయంగా పెరిగేందుకు ఇది దోహదపడగలదని ఆయన చెప్పారు. 2023–24లో ఈవీల అమ్మకాలు 45 శాతం పెరిగాయని, 400 స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభించాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సుమారు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, మొత్తం అమ్మకాల్లో టూ–వీలర్ల వాటా 56 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) బ్యాటరీ సెల్ తయారీకి ఊతం లభించగలదని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశ్రమగా ఎదిగేందుకు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ఆటోమొబైల్ సంస్థలు మరింత ఇన్వెస్ట్ చేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ఉత్పత్తులకు గ్లోబల్ ఎన్‌క్యాప్ (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం) రేటింగ్స్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. పీఎల్ఐ కింద రూ. 75 వేల కోట్ల ప్రతిపాదనలు.. పీఎల్ఐ కింద రూ. 75,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కంపెనీలు ఇప్పటికే సుమారు రూ. 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. సుమారు 30,000 ఉద్యోగాల కల్పనకు స్కీము తోడ్పడిందని మంత్రి వివరించారు. మరోవైపు, వాహనాల వయస్సును బట్టి కాకుండా వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని బట్టి స్క్రాపేజీ విధానం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ కార్యదర్శి తెలిపారు. ‘విశ్వసనీయమైన‘ పొల్యూషన్ పరీక్షల విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వానికి వాహన పరిశ్రమ దన్నుగా నిలవాలన్నారు.ఆర్థిక వృద్ధికి ఆటోమోటివ్ దన్నుభారత్ అధిక స్థాయిలో వృద్ధిని సాధించేందుకు ఆటోమోటివ్ రంగం చోదకంగా ఉంటుంది. ఇందుకు కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలు తోడ్పడతాయి. ఈ క్రమంలో పెరిగే డిమాండ్‌తో పరిశ్రమ కూడా లబ్ధి పొందుతుంది. దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ గత దశాబ్దకాలంలో గణనీయమైన స్థాయిలో, గతంలో ఎన్నడూ చూడనంత వృద్ధిని సాధించింది. రాబోయే రోజుల్లో దేశ పురోగతి వేగవంతంగా మాత్రమే కాకుండా పర్యావరణహితంగా కూడా ఉండాలి. – ప్రధాని మోదీ -
హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవగాహన కల్పించండి హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ధరించకుండా సంభవించే దు్రష్పభావాలపై వాహన చోదకులలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది. చట్ట నిబంధనల గురించి ప్రాంతీయ, జాతీయ భాషా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంది. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తప్పనిసరిగా బాడీఓర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరం ఉందంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలంది. తద్వారా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కోర్టు ముందుంచి వారికి శిక్ష పడేలా చేయొచ్చని తెలిపింది. అలాగే మోటారు వాహన చట్టంలో నిర్ధేశించిన ఇతర నిబంధనలను కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారం విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. అందువల్ల సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి విధించిన చలాన్ల వివరాలను, వాహన తనిఖీల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. మంచి వ్యాజ్యం దాఖలు చేశారంటూ పిటిషనర్ తాండవ యోగేషన్ను ధర్మాసనం ఈ సందర్భంగా అభినందించింది.2022లో 3,042 మంది మృతి కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ట్రాఫిక్‌తో సహా మోటారు వాహన చట్ట నిబంధనల కింద ఇతర విధులు నిర్వర్తించే పోలీసులు, ఇతర అధికారులు బాడీఓర్న్ కెమెరాలను ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా 3,703 మరణాలు సంభవించాయని, ఇందులో 3,042 మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవించాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. విజయవాడలో హెల్మెట్ లేకుండా వాహన చోదకులు తిరుగుతుండటాన్ని తాము కూడా గమనించామంది. చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉందని, ఈ దిశగా తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. దీనికి ముందు చట్ట నిబంధనల అమలుకు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఈ స్కూటర్‌ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్‌టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. -
రోజుకు 4,591 ఈవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరుగు జోరుగా సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 4,591 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022–23లో ఈ సంఖ్య 3,242 యూనిట్లు. మార్చి నెలలో ఏకంగా 2,08, 410 యూనిట్ల అమ్మకాలు తోడవడంతో.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశవ్యాప్తంగా 16, 75,700 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022–23తో పోలిస్తే ఇది 41 శాతం అధికం కావడం విశేషం. దేశ ఈవీ చరిత్రలో 2024 మార్చి నెలతోపాటు 2023–24 ఆర్థిక సంవత్సరం అత్యధి క విక్రయాలను నమోదు చేసింది. ఇక భారత్‌లో 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో కలిపి 2,45,26,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఈవీల వాటా 6.78 శాతానికి చేరడం విశేషం. విభాగాల వారీగా ఇలా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 9,44,082 టూ వీలర్లు అమ్ముడయ్యాయి. 2022–23తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. అలాగే 57 శాతం వృద్ధితో 6,32,485 యూనిట్ల త్రిచక్ర వాహనాలు విక్రయం అయ్యాయి. మొత్తం ఈవీల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 94 శాతం ఉంది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్ 90,379 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాదిలో ఈ–ప్యాసింజర్ కార్స్, ఎస్‌యూవీల సంఖ్య 89 శాతం దూసుకెళ్లడం విశేషం. ఈ–బస్‌లు 3,693 యూనిట్లు, హెవీ గూడ్స్ వెహికిల్స్ 240, తేలికపాటి సరుకు వాహనాలు 4,699, ఇతర వాహనాలు 122 యూనిట్లు విక్రయం అయ్యాయి. పుంజుకున్న డిమాండ్.. దేశంలో 2014–15 నుంచి 2024 మార్చి వరకు 39,55,021 యూనిట్ల ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్డెక్కాయి. ఇందులో 72 శాతం అంటే 29,59,218 యూనిట్లు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో తోడయ్యాయంటే ఈవీల విభాగం ఏ స్థాయిలో వేగం పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. 2013–14లో మొత్తం 2,627 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ–కామర్స్ పరిశ్రమ, సరుకు రవాణా కంపెనీల నుండి ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం, అలాగే టాక్సీ ఫ్లీట్ ఆపరేటర్ల నుండి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల కోసం వేగంగా డి మాండ్ వస్తోంది. 2030 నాటికి ఈవీల వా టా వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్యాసింజర్ వెహికిల్స్‌లో 30, బస్‌లలో 40, ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 80 శాతానికి చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్.. జాబితాలో నాలుగు - అవార్డు దేనికో?
ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడవ సీజన్ విజేతలను ఈ రోజు సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ 'జితేంద్ర సింగ్' సమక్షంలో ప్రకటిస్తారు. ఇందులో అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు సిద్దమవుతాయి. ఈ రోజు ఏ విభాగంలో ఏ వాహనం విజేతగా నిలుస్తుందో అధికారికంగా తెలుస్తుంది. ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్.. ఇలా అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు నామినేషన్‌కు సిద్ధమయ్యాయి. తుది ఫలితాలు, విజేతలు త్వరలో తెలుస్తాయి. ఇదీ చదవండి: విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ (Electric Two-Wheeler of the Year) అవార్డు నామినేషన్ జాబితాలో 'అల్ట్రా వయొలెట్ ఎఫ్ 77, ఏథర్ 450 ఎక్స్ జెన్3 (మూడవ తరం ఏథర్ 450 ఎక్స్), హీరో విడా వి1, టార్క్ క్రటోస్ ఆర్' ఉన్నాయి. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ రోజే తెలిసిపోతుంది. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి!
విజయదశమి, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా ఎక్కువ వాహనాలను విక్రయించడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ పండుగ సీజన్లో టూ వీలర్ కొనాలనుకునే వారు ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే సమాచారం ఇక్కడ చూడవచ్చు. హీరో మోటోకార్ప్ భారతదేశంలోని అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన 'హీరో స్ల్పెండర్ ప్లస్' బైక్ కొనుగోలు మీద 'బై నౌ పే ఇన్ 2024' అనే ఓ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. అంటే ఈ బైకుని ఈ ఏడాది కొంటే వచ్చే ఏడాది నుంచి ఈఎమ్ఐ మొదలవుతుంది. హార్లే డేవిడ్సన్ ప్రముఖ లగ్జరీ బైక్స్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ ఎంపిక చేసిన కొన్ని బైకుల మీద రూ.5.30 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్, స్పోర్ట్‌స్టర్ ఎస్, నైట్‌స్టర్ బైకులు ఉన్నాయి. కంపెనీ 2023 మోడల్స్‌కి మాత్రమే కాకుండా 2022 మోడల్స్‌కి కూడా ఈ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఆంపియర్ ఎలక్రిక్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆంపియర్ కంపెనీ గో ఎలక్ట్రిక్ ఫెస్ట్ పేరుతో మంచి ఆఫర్స్ అందిస్తోంది. మాగ్నస్ ఈఎక్స్ మీద రూ.10 వేలు, ప్రైమస్ మీద రూ.14 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అవకాశం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద బజాజ్ ఇప్పుడు రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి రూ. 1.30 లక్షల స్కూటర్ ఇప్పుడు రూ. 1.15 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం కర్ణాటక, తమిళనాడుకు మాత్రమే పరిమితం చేశారు. -
AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: కాకినాడకు ‘నానొ’చ్చేస్తున్నా! ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషిస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ ఎందుకు పెరిగాయి? కార్లు, ద్వి చక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయంటే అర్థమేంటీ..? రాష్ట్రంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని అర్ధం. అంతేకాదు.. జనాల చేతుల్లో డబ్బులున్నాయని అర్ధం. సంపదను ప్రభుత్వం ప్రజలకు పంచుతుందని అర్ధం. -
బ్యాటరీ బండి దూకుడు
సాక్షి, హైదరాబాద్: బ్యాటరీ బండి పరుగులు పెడుతోంది. పర్యావరణ హితమైన వాహనాల పట్ల నగర వాసులు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలా మంది ఇంధన భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వాటిలో రవాణా వాహనాల కంటే ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. గతేడాది 23 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కాయి. ఈ సంవత్సరం మే చివరి నాటికి 12 వేలకు పైగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి లక్ష వాహనాలకు జీవితకాల పన్ను నుంచి రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కేటగిరీకి చెందిన సుమారు 47 వేలకు పైగా కార్లు, బైక్‌లపైన ఇప్పటి వరకు రూ.220 కోట్ల వరకు రాయితీని అందజేశారు. మరో 53 వేల వాహనాలకు ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. రానున్న రెండేళ్ల వరకు ఈ అవకాశం ఉండవచ్చునని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలే టాప్.... మొదట్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల విముఖత చూపారు. నాణ్యత లేని బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరిగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఉదంతంతో చాలా మంది వెనుకడుగు వేశారు. దీంతో వాహన తయారీ సంస్థలు బ్యాటరీల నాణ్యతపైన ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి ప్రవేశించడంతో సమర్థవంతమైన బ్యాటరీలు కలిగిన బండ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో వాహనదారుల్లో వాటిపైన నమ్మకం కలిగింది. ఫలితంగా వీటి కొనుగోళ్లు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 50 వేలకు పైగా నమోదు కాగా, గతేడాది అనూహ్యంగా 27 వేలకు పైగా రోడ్డెక్కాయి. వీటిలో 23 వేలకుపైగా ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం. భారీగా వెయిటింగ్ లిస్టు... ప్రస్తుతం డిమాండ్ మేరకు వాహనాలు లభించడం లేదు. కొన్ని బ్రాండ్లకు చెందిన వాహనాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురు చూడవలసి వస్తోంది. పెట్రోల్ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఒకసారి చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మాత్రమే బండి నడిచేది. ఇప్పుడు వంద కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. నిస్సందేహంగా కొనొచ్చు ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత చాలా బాగుంది. ఎలాంటి సందేహం లేకుండా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న వాహనాలే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. – సంధ్య గద్దె, ఎలక్ట్రిక్ వాహన డీలర్, లింగంపల్లి పెట్రో ‘బాదుడు’ నుంచి ఊరట పెట్రోల్ ధరల దృష్ట్యా బండి బయటకు తీయాలంటేనే వెనుకడు గు వేయాల్సి వస్తోంది. బ్యాటరీ బండితో చాలా వరకు ఈ భారం తగ్గుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే వాహనాలు వస్తే బాగుంటుంది. – కోల రవికుమార్ గౌడ్ ధరలు కాస్త ఎక్కువే లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చి నప్పటికీ ధరలు ఎక్కువగా నే ఉన్నాయి. మధ్యతరగ తి వర్గాలకు భారంగానే ఉంది. పెట్రోల్, డీజిల్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల వైపు వస్తున్నా రు. కానీ ధరలు చూడగానే వెనుకడుగు వేయాల్సి వస్తోంది. – సుధాకర్‌రెడ్డి -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్‌షిప్‌లలో 35–40 శాతం డీలర్‌షిప్‌లను దశలవారీగా అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
ప్యాసింజర్ వాహనాలు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్‌లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్ ఇండియా హోల్‌సేల్ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్‌సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్ 1 నుండి పరిశ్రమ బీఎస్–6 ఫేజ్–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
ఈ వెహికల్స్ కొంటే డ్రైవింగ్ లైసెన్స్‌తో పనే లేదు - మరెందుకు ఆలస్యం..
భారతదేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ అన్ని విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ప్రజా రహదారులలో డ్రైవ్/రైడ్ చేయడానికి తప్పకుండా లైసెన్స్ అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అవాన్ ఇ ప్లస్ (Avon E Plus) భారతదేశంలో లభించే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'అవాన్ ఇ ప్లస్'. దీని ధర కేవలం రూ. 25,000 కావడం గమనార్హం. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 50 కిమీ రేంజ్ అందిస్తుంది. 48v/12ah కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 24 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 6.5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రధానంగా చెప్పుడోదగ్గ మోడల్ ఈ అవాన్ ఇ ప్లస్ కావడం గమనార్హం. డీటెల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus) మన జాబితాలో మరో టూ వీలర్ 'డీటెల్ ఈజీ ప్లస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 40,000 మాత్రమే. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 60 కిమీ రేంజ్ అందిస్తుంది. 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఆంపియర్ రియో ఎలైట్ (Ampere Reo Elite) రూ. 44,500 ధర వద్ద లభించే ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్‌తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 20Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి గంటకు 25 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8 గంటలు. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 (Hero Electric Flash E2) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మన జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్ కావడం గమనార్హం. రూ. 52,500 ఖరీదైన హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 స్కూటర్ వినియోగించడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులోని 51.2v/30ah బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 65 కిమీ రేంజ్ అందిస్తుంది. లోహియా ఓమా స్టార్ లి (Lohia Oma Star Li) రూ. 41,444 వద్ద లభించే ఈ 'లోహియా ఓమా స్టార్ లి' ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రైడింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్స్ లో ఇది ఒకటి. ఇందులోని 48V/20 Ah బ్యాటరీ 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఒకినావా లైట్ (Okinawa Lite) దేశీయ విఫణిలో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇందులో భాగంగానే ఒకినావా లైట్ మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 67,000. ఇందులోని 1.25 కిలోవాట్ బ్యాటరీ ఇక ఫుల్ ఛార్జ్‌తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ టైమ్ 6 నుంచి 7 గంటలు. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఓకినావా ఆర్30 (Okinawa R30) మన జాబితాలో చివరి ఎలక్ట్రిక్ బైక్ 'ఓకినావా ఆర్30'. దీని ధర రూ. 62,500. ఈ స్కూటర్ రేంజ్ 65 కిలోమీటర్లు. ఇది 4 నుంచి 5 గంటల సమయంలో 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు) నిజానికి దేశంలో వినియోగించే చాలా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే తక్కువ వేగంతో లేదా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇలాంటి స్కూటర్లు లాంగ్ రైడ్ చేయడానికి ఉపయోగపడవు, కానీ రోజు వారి ప్రయాణానికి, నగర ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఫేమ్-2 పెంపుపై ఈవీ పరిశ్రమల డిమాండ్ - మరో నాలుగేళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్తున్నాయి. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–22 విక్రయాలతో పోలిస్తే ఏకంగా రెండున్నర రెట్లకుపైగా వృద్ధి నమోదు కావడం విశేషం. ఎలక్ట్రిక్ టూ వీలర్లు 2021–22లో భారత్‌లో 3,27,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ భారం నుంచి బయటపడేందుకు, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీలతో ప్రోత్సహించడం కలిసి వచ్చే అంశం. విభాగాల వారీగా ఇలా.. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే హై స్పీడ్ ఈ–టూ వీలర్లు 7,26,976 యూనిట్లు విక్రయం అయ్యాయి. 2021–22లో లో స్పీడ్ 75,457 యూనిట్లు, హై స్పీడ్ 2,52,443 యూనిట్లు రోడ్డెక్కాయి. నీతి ఆయోగ్ లక్ష్యం, ఇతర పరిశోధన సంస్థల అంచనాల కంటే 25 శాతం తక్కువ స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. పరిశ్రమకు అడ్డంకులు.. దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) పథకం కింద మార్గదర్శకాలను పాటించనందుకు ఫేమ్–2 రాయితీలను నిలిపివేయడం ఈ–టూ వీలర్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని ఎస్ఎంఈవీ తెలిపింది. ‘స్థానికీకరణలో జాప్యం సాకుతో వినియోగదారులకు ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఓఈఎం) ఇప్పటికే బదిలీ చేసిన రూ.1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అకస్మాత్తుగా నిలిపివేయడం హాస్యాస్పదం. అలాగే తక్కువ ఇన్వాయిస్ చేశారనే ఆరోపణ కారణంగా ఖరీదైన ఈ–టూ వీలర్లను తయారు చేస్తున్న ఓఈఎంలకు చెందిన మరో రూ.400 కోట్లు నిలిచిపోయాయి. దీని పర్యవసానంగా మూలధన నిధుల కొరతతో వారి వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి. నేడు పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు ప్రస్తుత గందరగోళ పరిస్థితి నుంచి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. 2023–24లో తమ వ్యాపార ప్రణాళికలు చేసుకోవడానికి వీలుగా ఫేమ్ దశలవారీ తయారీ కార్యక్రమం తాలూకా అడ్డంకులకు తొలగించాలని విన్నవిస్తున్నాయి’ అని వివరించింది. ఎండమావిలా లక్ష్యం.. ద్విచక్ర వాహన రంగంలో 2022–23లో ఈ–టూ వీలర్ల వాటా 5% మాత్రమే. స్వల్పకాలిక లక్ష్యం 30 శాతం. 2030 నాటికి ఇది 80 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యం మరింత ఎండమావిలా కనిపిస్తోందని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ అన్నీ కోల్పోలేదు. ఈ రంగాన్ని తిరిగి గా డిలో ఉంచగలిగేది దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) అర్హత ప్రమాణాలను రెండేళ్లు పొడిగించడం. అలాగే దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఖచ్చితంగా అమలు చేయడం. ఫేమ్ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం మొత్తం పరిశ్రమ విధిని నిర్ణయించే కీలకాంశం. ఈ విషయంలో ప్రభు త్వం నుంచి స్పష్టత కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదు రుచూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్వయం–సమర్థ వంతంగా చేయడానికి కనీసం 3–4 ఏళ్ల పాటు ఫేమ్ పథకాన్ని పొడిగించడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. కస్టమర్లకే నేరుగా సబ్సిడీ.. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయడం కంపెనీలకు కష్టతరం అవుతోందని గిల్ వివరించారు. ‘సబ్సిడీలలో ఏదైనా ఆకస్మిక తగ్గింపు వృద్ధిపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. ఈ–మొబిలిటీ కోసం ప్రభుత్వ ప్రణాళికను ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుత విధానంలో తయారీదార్లు సబ్సిడీని కస్టమర్‌కు బదిలీ చేస్తారు. విక్రయం తర్వాత ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మోసపూరితంగా సబ్సిడీని క్లెయిమ్ చేయడానికి ఓఈఎంలు అమ్మకాలను మార్చడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం నేరుగా కస్టమర్‌కు ప్రోత్సాహకాలను చెల్లించడానికి ప్రత్యక్ష సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టాలి’ అని వివరించారు. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
టూ వీలర్లు సేల్స్ ఢమాల్!
జిల్లాలో వాహనాల అమ్మకాలు ఏడాదికేడాది తగ్గుతున్నాయి. ముఖ్యంగా బైక్‌ల అమ్మకాలు పడిపోతున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏటా రెండు వేల పైచిలుకు వాహనాల అమ్మకాలు తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. బైక్‌ల అమ్మకాలు గణనీయంగా తగ్గగా.. ఆటోలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. కార్ల అమ్మకాలు పరవాలేదన్నట్లుగా ఉండగా.. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, ట్రాలీల అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సాక్షి, కామారెడ్డి: వాహనాల రిటైల్ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా లెక్కిస్తారు. జిల్లాలో టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18,352 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2021–22 లో 15,722 వాహనాలు, 2022–23 లో 13,312 వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే ఏటా 2 వేల పైచిలుకు అమ్మకాలు తగ్గుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం.. గతంలో బైక్‌ల అమ్మకాలు ఎక్కువగా ఉండేవి. వీటి ధరలు ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం వాహనాల కొనుగోళ్లపై పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14,318 వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 2021–22 లో 12,290 కు తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9,539 వాహనాల రిజిస్ట్రేషన్లే జరగడం గమనార్హం. ధరలు పెరగడంతో చాలామంది కొత్త బైక్‌లను కొనుగోలు చేయకుండా.. సెకండ్ హ్యాండ్ బైక్‌లవైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో బైక్‌ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. కార్ల అమ్మకాలు.. కోవిడ్ తర్వాత చాలామంది కార్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. దీంతో కార్ల అమ్మకాలలో కొంత వృద్ధి కనిపించింది. 2020 –21 ఆర్థిక సంవత్సరంలో 1,110 కార్ల రిజిస్ట్రేషన్ జరగ్గా.. 2021–22 లో 1,396 కి పెరిగింది. ఈసారి ఇప్పటివరకు 1,333 కార్ల రిజిస్ట్రేషన్లు రికార్డయ్యాయి. కొందరు కొత్త కార్ల వైపు మొగ్గు చూపుతుండగా.. చాలామంది సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. ఆటో రిక్షాల అమ్మకాలలో వృద్ధి కరోనా మూలంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో చాలామంది ప్రత్యామ్నాయంగా ఆటో రిక్షాలు, ట్రాలీ ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. 2020–21 లో 358(141 ఆటో రిక్షాలు, 217 గూడ్స్ క్యారేజీలు), 2021–22 లో 347(107 ఆటోరిక్షాలు, 240 గూడ్స్ క్యారేజీలు), 2022–23 లో 651(245 ఆటో రిక్షాలు, 406 గూడ్స్ క్యారేజీ)ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. టూ వీలర్.. ట్రాక్టర్లు, ట్రాలీలు.. జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో 794 ట్రాక్టర్లు, 435 ట్రాలీలు, 2021–22లో 537 ట్రాక్టర్లు, 257 ట్రాలీలు, 2022–23లో 452 ట్రాక్టర్లు, 136 ట్రాలీలు కొను గోలు చేశారు. కమర్షియల్ అవసరాల కోసం 2020–21లో 672 ట్రాక్టర్లు, 367 ట్రాలీలు, 2021–22లో 457 ట్రాక్టర్లు, 273 ట్రాలీలు, 2022–23 లో 547 ట్రాక్టర్లు, 180 ట్రాలీలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. -
2023 ఫిబ్రవరిలో టూవీలర్ సేల్స్: టీవీఎస్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు
ఫిబ్రవరి 2023 ముగియడంతో దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు కొంత పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 టూవీలర్ బ్రాండ్స్ లో హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో చేరింది. గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 382317 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 15.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 3,31,462 యూనిట్లు. ఎగుమతుల విషయంలో మాత్రం -54.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 3,94,460 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు). హోండా మోటార్‌సైకిల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 2,27,064 యూనిట్లు కాగా, ఎగుమతులు 20,111 యూనిట్లు. 2023 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 2,47,175 యూనిట్లు. దేశీయ అమ్మకాల్లో కంపెనీ -20.25 శాతం, ఎగుమతుల్లో -25.36 శాతం, మొత్తం అమ్మకాల పరంగా -20.93 శాతం తగ్గుదలను నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే 2023 ఫిబ్రవరిలో 2,21,402 యూనిట్లను దేశీయ మార్కెట్లో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా 45,624 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే -51.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల పరంగా -0.22 శాతం తగ్గుదలతో 2,67,026 యూనిట్ల వద్ద ఆగిపోయింది. 2023 ఫిబ్రవరిలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు దేశీయ అమ్మకాలు + ఎగుమతులు 2,35,356 యూనిట్లతో 2022 ఫిబ్రవరి కంటే -15.74 శాతం అతగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 1,15,021 యూనిట్లు కాగా, దేశీయ అమ్మకాలు 1,20,335 యూనిట్ల వద్ద ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో కంపెనీ పురోగతిని కనపరిచినప్పటికీ, ఎగుమతుల్లో -37.08 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 71,544 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు) కాగా, కేవలం దేశీయ అమ్మకాలు 64,436 యూనిట్లు, ఎగుమతులు 7,108 యూనిట్లు. కంపెనీ ఎగుమతుల్లో 1.18 శాతం వృద్ధిని, దేశీయ అమ్మకాల్లో 23.59 శాతం వృద్ధిని కనపరిచింది. -
20 లక్షల వాహనాలు తుక్కు లోకి!
భువనేశ్వర్: రోడ్లపై రవాణాకు పట్టు కోల్పోయి, 15 ఏళ్లు పైబడిన 20 లక్షలకు పైగా వాహనాలను రద్దు చేయనున్నారు. రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖ మంత్రి టుకుని సాహు అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ పాలసీ–2022 ప్రకారం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 20 లక్షలకు పైగా వాహనాలను దశల వారీగా రోడ్ల నుంచి తొలగిస్తామన్నారు. 15 ఏళ్లకు పైగా రవాణాలో ఉపయోగిస్తూ.. పట్టు కోల్పోయిన 20,39,500 వాహనాలను గుర్తించామన్నారు. రద్దు చేయనున్న వాహనాల్లో 12,99,351 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డొక్కు వాహనాలు రద్దు చేయడంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పాలసీ మార్గదర్శకాల ప్రకారం పాత వాహనాల యజమానులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా పొందుతారని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చదవండి వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ! -
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలకు స్పీడ్ బ్రేకర్లు! ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: అమ్మకాల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమకు స్పీడ్ బ్రేకర్లు ఎదురుపడ్డాయి. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ పథకం కింద ఒక్కో వాహనంపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. స్థానికంగా విడిభాగాలను సమీకరించుకుని తయారు చేసే వాహనాలకే ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని పరిమితం చేసింది. విడిభాగాలు స్థానికంగా సమకూర్చుకోకుండానే, చైనాలో తయారైన వాటిని ఇక్కడివిగా చూపించి కొన్ని కంపెనీలు, నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలను దుర్వినియోగం చేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో కొన్ని కంపెనీలకు సబ్సిడీల మంజూరును నిలిపివేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించాలన్న లక్ష్యాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో చేరుకోలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్ల సబ్సిడీని నిలిపివేసినట్టు తెలిపాయి. ‘‘తాజా పరిణామం కొన్ని కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. మూలధన నిధులకు సైతం కొరత ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే విక్రయించిన వాహనాలపై సబ్సిడీని కస్టమర్లకు అందించాయి. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ కోసం అవి ఎదురు చూస్తున్నాయి’’ అని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 25 శాతం తక్కువ అమ్మకాలు.. ‘‘ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 7,20,000-7,50,000 మించకపోవచ్చు. నీతి ఆయోగ్, ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) అంచనా వేసినట్టు మిలియన్ వాహనాల మార్క్ కంటే ఇది 25 శాతం తక్కువ’’అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. హీరో ఎలక్ట్రిక్ సీఈవోగానూ గిల్ పనిచేస్తున్నారు. ఫేమ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలను ఎస్ఎంఈవీ ఖండించింది. ఫేమ్ సబ్సిడీకి అర్హత సాధించేందుకు కృత్రిమంగా వాహనాల ధరలను తక్కువగా నిర్ణయించినట్టు అనుమానాలతో మరో నాలుగు కంపెనీల వ్యవహారాలను సైతం కేంద్ర సర్కారు పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్‌పై సమాచారాన్ని పరిశీలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 6 లక్షల మార్క్‌ను చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో మరో 1.5 లక్షల విక్రయాలు నమోదు కావచ్చన్నది సోహిందర్ గిల్ అంచనా. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2,31,000 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. ప్రధాన బ్రాండ్ల జోరు ప్రముఖ బ్రాండ్లు అయిన టీవీఎస్ మోటార్, ఏథెర్, ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు మంచి వృద్ధిని చూస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినవా, యాంపియర్ తదితర కొన్ని కంపెనీలు సబ్సిడీ దుర్వినియోగం ఆరోపణలతో దర్యాప్తును ఎదుర్కొంటున్నాయి. టీవీఎస్ మోటార్, ఏథెర్, ఓలా, హీరో విదా సంస్థలు ఉత్పత్తుల ధరలను తప్పుదోవ పట్టించే విధంగా నిర్ణయించాయనే ఆరోపణలు చవిచూస్తున్నా యి. మరోవైపు కస్టమర్ల నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి ఆదరణ కొనసాగుతోంది. డిమాండ్‌ను అందుకునేందుకు కొన్ని కంపెనీలు తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు రెవ్ఫిన్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సమీర్ అగర్వాల్ తెలిపారు. నూతన బ్యాటరీ ప్రమాణాలతో ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయ ధరలు పెరగొచ్చని ప్రరిశ్రమ చెబుతోంది. ధరల పెరుగుదల అమ్మకాల వృద్ధికి అవరోధం కాబోదని, డిమాండ్ గణనీయంగా ఉందని అంటోంది. సబ్సిడీలతోనే వృద్ధి.. దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు శరవేగంగా వృద్ధిని చూడడం వెనుక ప్రధాన మద్దతు ఫేమ్ సబ్సిడీలేనని పరిశ్రమ అంటోంది. ఒక కిలోవాట్ సామర్థ్యానికి కేంద్ర సర్కారు రూ.15,000 సబ్సిడీగా అందిస్తోంది. మొత్తం వాహన వ్యయంలో ఇలా ఇచ్చే సబ్సిడీ గరిష్ట పరిమితి 40 శాతంగా ఉంది. దీంతో ఒక వాహనంపై రూ.30–60వేల స్థాయిలో సబ్సిడీ లభిస్తోంది. సబ్సిడీ అంశాన్ని త్వరగా పరిష్కరించకపోతే, సంప్రదాయ కర్బన ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్రం కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని గిల్ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రంలో వాహనాలు రెట్టింపును మించి పెరిగాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును దాటగా, ఇప్పుడది కోటిన్నరను దాటిపోయింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్‌లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం వాహనాలు 71,54,667 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఏకంగా 81,50,483 పెరిగాయి. ప్రతి నెలా సగటున 80 వేల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే మరో ఐదేళ్లలో రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోటాపోటీగా ద్విచక్రవాహనాలు, కార్లు గతంలో ఇంటింటికీ ఓ సైకిల్ ఉండగా, ఇప్పుడా స్థానాన్ని ద్విచక్రవాహనాలు ఆక్రమించాయి. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి. కార్ల కొనుగోళ్లు కూడా పోటీ పడుతున్నట్టుగా పెరుగుతున్నాయి. రా ష్ట్రంలో ప్రస్తుతం 84 లక్షల గృహాలుండగా, ఈ నెల 23 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాల సంఖ్య 1,12,90,406కు చేరు కుంది. 2014 జూన్‌లో తెలంగాణలో 8,84,870 కార్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 19,84,059 కు చేరింది. కోవిడ్ సమయంలో సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు విపరీతంగా సాగగా, కొత్త వాహనాల అమ్మకాలు కాస్త తగ్గాయి. అయితే గతేడాది కొత్త వాహనాల విక్రయం బాగా పెరగటంతో వాహనాల సంఖ్యలో పెరుగుదల ఊ పందుకుంది. ఏడాదిలో 5.61 లక్షల ద్విచక్ర వా హనాలు, 1.52 లక్షల కార్లు కొత్తగా వచ్చి చేరాయి. క్యాబ్ సంస్కృతి పెరుగుదలతో.. రాష్ట్రంలో క్యాబ్‌ల వాడకం గణనీయంగా పెరిగింది. గతంలో ఆటోలు తప్ప క్యాబ్‌లు నామమాత్రంగానే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నాటికి రాష్ట్రంలో కేవలం 49 వేలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 1.18 లక్షలకు చేరుకున్నాయి. ఆరుగురు కంటే ఎక్కువమంది ప్రయాణించే మ్యాక్సీ క్యాబ్‌లు అప్పట్లో 6,390 మాత్రమే ఉండగా, ఇప్పుడు 30,904కు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల జోరు చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. వీటి కొనుగోళ్లు మరింత పెరిగే అవకా శం ఉందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలుండగా, ఎలక్ట్రిక్ కార్లు 4 వేలను దాటాయి. 2014లో వాటి సంఖ్య సున్నా. ఆర్టీసీ బస్సుల సంఖ్యే తగ్గింది.. అన్ని రకాల కేటగిరీ వాహనాలు గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు రెట్టింపు అవటమో, అంతకుమించి పెరగటమో జరగ్గా.. ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో తెలంగాణ ఆర్టీసీ వద్ద 10,579 బస్సులు ఉండేవి. రవా ణాశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వాటి సంఖ్య 9,400 మాత్రమే. కొత్త బస్సుల కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండటం, నడిచే పరిస్థితి లేని బస్సులను తుక్కుగా మార్చాల్సి రావటంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగటానికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ప్రతి సిరీస్‌లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్‌నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్‌జడ్ 9999’ నెంబర్‌కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ తెలిపారు. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమొబైల్ జోరు
ముంబై: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచిగా కోలుకుందని, వచ్చే ఆర్థిక సంవ్సరంలో సింగిల్ డిజిట్లో అధిక వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, రవాణా కార్యకలాపాలు పెరగడం వృద్ధికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. విభాగాల వారీగా చూస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6–9 శాతం మధ్య, వాణిజ్య వాహనాల అమ్మకాలు 7–10 శాతం మధ్య వృద్ధిని చూస్తాయని ఇక్రా తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6–9 శాతం మధ్య, ట్రాక్టర్ల విక్రయాలు 4–6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విభాగంలో డిమాండ్ ఆరోగ్యకరంగా ఉందని తెలిపింది. కానీ, ద్విచక్ర వాహన విభాగం ఇప్పటికీ సమస్యలను చూస్తోందని, విక్రయాలు ఇంకా కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించలేదని వివరించింది. ఇటీవల పండుగలు, వివాహ సీజన్లో విక్రయాలు పెరిగినప్పటికీ.. స్థిరమైన డిమాండ్ రికవరీ ఇంకా కనిపించలేదని తెలిపింది. ఆరంభ స్థాయి కార్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ధరల పెంపు ప్రభావం.. ‘‘కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాలు, సవాళ్లను అధిగమించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకునేందుకు వాహనాల ధరలను కంపెనీలు గణనీయంగా పెంచాయి. దీంతో దిగువ స్థాయి వాహన వినియోగదారుల కొనుగోలు శక్తి తుడిచిపెట్టుకుపోయింది. 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో గరిష్ట స్థాయి సింగిల్ డిజిట్ (8–9 శాతం) అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నాం’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. ద్విచక్ర వాహన విభాగంలో మాత్రం వృద్ధి మోస్తరుగా ఉండొచ్చన్నారు. ‘‘2023–24 బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద గ్రామీణ ఉపాధి కోసం, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇరిగేషన్ వసతుల పెంపునకు, పంటల బీమా పథకం కోసం కేటాయింపులు పెంచొచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కు మద్దతునిస్తుంది’’ అని దేవాన్ అంచనా వేశారు. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
ఈవీల్లో అన్ని విభాగాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అన్ని విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తామని అర్బనైట్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అర్బనైట్ బ్రాండ్‌లో బజాజ్ ఆటో ఆఫర్ చేస్తోంది. ఈ–టూ వీలర్స్‌లో ఏటా ఒక కొత్త మోడల్‌ను పరిచయం చేయాలన్నది బజాజ్ లక్ష్యమని అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ‘ఇందుకు అనుగుణంగా నూతన ఉత్పాదనలను అభివృద్ధి చేస్తున్నాం. చేతక్ లేదా ఇతర పేర్లతోనూ వాహనాలు రావొచ్చు. ఈవీ వ్యాపారం ఒక దీర్ఘకాలిక క్రీడ. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల వాటా గతేడాది 9 శాతం. ఇప్పుడిది ఏకంగా 20 శాతానికి చేరింది. రెండేళ్లలో మొత్తం స్కూటర్ల విక్రయాల్లో 70 శాతం ఎలక్ట్రిక్ కైవసం చేసుకుంటుంది’ అని వెల్లడించారు. చేతక్ శకం మళ్లీ వస్తుంది.. నాణ్యతలో రాజీపడని కస్టమర్ల తొలి ప్రాధాన్యత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఎరిక్ అన్నారు. ‘బ్రాండ్‌ను నిలబెట్టడానికి మన్నిక, సాంకేతికత, ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్ త్రీ, ఫోర్ వీలర్ల విభాగంలోకి రాలేమని చెప్పలేను. చేతక్ అంటే అంచనాలు ఎక్కువ. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కిన చేతక్ శకం మళ్లీ వస్తుంది. మొబిలిటీ కంపెనీ యూలు వినియోగిస్తున్న 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి సరఫరా చేశాం. మొబిలిటీని ఒక సేవగా దేశంలో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ టూవీలర్లను అద్దె ప్రాతిపదికన బెంగళూరు, ముంబై, ఢిల్లీలో యూలు ఆఫర్ చేస్తోంది. కాగా, నెలకు 200లకుపైగా చేతక్ స్కూటర్లను విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక మోబైక్స్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో చేతక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు మూడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్
ఇంతవరకు ఎన్నో ఘోర ప్రమాదాలు చూసి ఉంటాం. చచ్చిపోతారు నోడౌట్ అనేంత దారుణమైన ప్రమాదాల బారినపడినవారు సైతం బతికిన ఉదంతాలు చూశాం. ఇవన్నీ ఒకత్తైతే ఇక్కడ జరిగిన ప్రమాదం చూస్తో వామ్మో అని బిగిసుకుపోతాం. ఎందుకంటే కచ్చితంగా బయటపడే ఛాన్స్‌లేదు అనేంత దారుణమైన ప్రమాదం. వివరాల్లోకెళ్తే...ఒక టూవీలర్ వాహనదారుడు రాత్రిపూటా రద్దీ లేకపోవడంతో రోడ్డును క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ట్రక్కు వచ్చింది. ఐతే రెండు కూడా చాలా వేగంగానే వస్తున్నాయి. ఇద్దరూ ఓ రేంజ్ స్పీడ్‌లో వచ్చారు. కచ్చితం దారుణం ఢీ కొట్టారు. ఎవ్వరూ బతికే అవకాశం లేదనిపించేలా గగ్గుర్పాటుకు గురి చేసే ఘటన. అలాంటిది ఊహించని విధంగా ప్రమాదం జరగదు. చివర్లో భలే గమత్తుగా బైకర్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అసలు అదేలా సాధ్యం అనిపిస్తుంది. మిరాకిల్ ఘటన అంటే ఇదేనేమో అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా వారిద్దరికీ భూమ్మీద నూకలు ఉండబట్టి..ప్రమాదం నుంచి సునాయాసంగా బయటపడ్డారు అని అనాలో అర్థంకాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఊపిరాగిపోతుందేమో అన్నంత రేంజ్లో ఉంటుంది ఆ ఘటన. ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय, औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD — Dipanshu Kabra (@ipskabra) January 5, 2023 (చదవండి: నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్సన్ బైక్‌తో.. ) -
ఈ–వీ అమ్మకాల్లో రికార్డ్ సేల్స్.. ఆ కంపెనీ బైకులను ఎగబడి కొంటున్న జనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాల్లో హీరో ఎలక్ట్రిక్ కొత్త రికార్డు నమోదు చేసింది. సవాళ్లు ఉన్నప్పటికీ 2022లో ఏకంగా 1,00,000 పైచిలుకు యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. దశాబ్దానికి పైగా మార్కెట్లో సంస్థ నాయకత్వాన్ని అమ్మకాల మైలురాయి ప్రతిబింబిస్తుందని హీరో తెలిపింది.ఆరు లక్షలకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. మూడేళ్లలో 50 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. 25,000 మంది మెకానిక్‌లకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో శిక్షణ, పునర్ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. భాగస్వాముల సహకారంతో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
ఎయిర్‌బ్యాగ్స్ తయారీ రంగం అప్పటికల్లా రూ.7000కోట్లకు చేరుతుంది
వాహనాల్లో కీలక భద్రత ఫీచర్ అయిన ఎయిర్‌బ్యాగ్స్ తయారీ రంగం దేశీయంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 7,000 కోట్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది రూ. 2,500 కోట్లుగా ఉంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. భద్రతా ప్రమాణాలను నియంత్రణ సంస్థ నిబంధనలను కఠినతరం చేస్తుండటం, వాహనాల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్ సంఖ్యను పెంచుతుండటం తదితర అంశాలు ఈ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి కారుకు సగటున మూడు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటున్నాయి. 2023 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ సంఖ్య ఆరుకు చేరనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రూ. 2,400–2,500 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 25–30 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 6,000–7,000 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. పెరగనున్న కార్ల తయారీ వ్యయాలు.. 2019 జూలైలో ప్రతీ కారుకు ఒక ఎయిర్‌బ్యాగ్ (డ్రైవర్ కోసం)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2022 జనవరి 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు (3.5 టన్నుల కన్నా తక్కువ బరువుండి, ఎనిమిది మంది వరకూ ప్రయాణించగలిగే వాహనాలు) ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను నిర్దేశించింది. 2023 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు రెండు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కానుంది. దీంతో కార్లలో తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసేందుకు, అదనంగా సెన్సార్లు ఏర్పాటు చేసేందుకు తయారీ కంపెనీలకు వ్యయాల భారం కూడా పెరగనుంది. అటు ఎయిర్ బ్యాగ్స్ తయారీ సంస్థలు కూడా డిమాండ్‌కి తగ్గట్లు సరఫరా చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో ఉత్పత్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సి రానుంది. ‘‘పలు కంపెనీలు గత 6–8 నెలల నుంచి సామర్థ్యాలను పెంచుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇందుకోసం వచ్చే 12–18 నెలల్లో కంపెనీలు సుమారు రూ. 1,000 – రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి’’ అని ఇక్రా తెలిపింది. దిగుమతులపై ఆధారం.. ఎయిర్‌బ్యాగ్ మొత్తం తయారీ వ్యయంలో ఇన్‌ఫ్లేటర్ ఖర్చే దాదాపు 50 శాతంగా ఉంటుండగా, మిగతా భాగం కుషన్ మొదలైన వాటిది ఉంటోంది. వీటికి సంబంధించి దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలు, తగినంత స్థాయిలో అమ్మకాలు లేకపోతుండటంతో పరిశ్రమ ప్రస్తుతం తమకు అవసరమైన పరికరాల్లో దాదాపు 60–70 శాతాన్ని విదేశాల్లోని మాతృ సంస్థలు, జాయింట్ వెంచర్ పార్ట్నర్లు మొదలైన వాటి నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వీటి తయారీ సామర్థ్యాలను పెంచుకోకపోతే మరింత ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి రానుందని ఇక్రా పేర్కొంది. -
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Cheapest Electric Scooters: దేశంలో గత పది ఏళ్లలో ద్విచక్ర వాహన విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తెరపైకి వచ్చింది. దీనికి తోడు కేంద్రం ఈ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పోత్సాహకాలు కూడా అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈవీల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ ఈవీ మార్కెట్లో వస్తున్న స్కూటర్లు కొన్ని ఖరీదుగా ఉండడం, కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోనివి రావడంతో ఈ విషయమై సామాన్యుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అటువంటి వారి కోసం చౌకగా వారి బడ్జెట్‌కు సరిపోయే చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. Bounce Infinity E1 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. ఒక వేళ మీకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కావాలనుకుంటే దాని ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది. Hero Electric Optima CX ఈ ఈవీ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190గా ఉంది. దీని గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కలర్స్‌లో కస్టమర్లకు లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. Avon E Scoot ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. కేవలం 6 నుంచి 8 గంటల సమయంలో దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. Ampere Magnus EX ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999. Hero Electric Photon హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్‌తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇది 90 కి.మీల రేంజ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీగా ఉంది. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్‌లైట్, టెయిల్ లైట్‌తో పాటు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కేవలం 5 గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కానుంది. -
వావ్ అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్.. స్టైలిష్ లుక్‌తో అదరగొడుతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్‌తో ఓ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్‌పల్స్ 200టీ మోడల్లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్‌షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్‌పీ, 17.3 ఎన్ఎం టార్క్‌తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్‌లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్‌తో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్, యూఎస్బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
దేశంలో విద్యుత్ వాహనాల జోరు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ) అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2030 నాటికల్లా దేశంలోని టూ వీలర్ సెగ్మెంట్లో ఏకంగా 40–45 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని బైన్–కో అనే సంస్థ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాబోయే ఎనిమిదేళ్లలో మొత్తంగా 66 శాతం మంది విద్యుత్ వాహనాలనే వాడతారని ఈ అధ్యయనం తేల్చింది. విద్యుత్ వాహనాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం, రిపేర్లకు అవకాశం తక్కువ కావడం, మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండటంతో వాహనదారులు వీటిని ఎంచుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వాయు, శబ్ధ కాలుష్యాలు లేకపోవడం కూడా అమ్మకాల పెరుగుదలకు ఒక కారణంగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేగంగా పెరుగుతున్న అమ్మకాలు.. మన దేశంలో మొదటి విద్యుత్ వాహనాన్ని స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1996లోనే తయారు చేసింది. ‘విక్రమ్ సఫా’ అనే పేరుతో త్రీ వీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. దాదాపు 400 వాహనాలను విక్రయించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బీహెచ్ఈఎల్ 18 సీట్లున్న ఎలక్ట్రిక్ బస్సును రూపొందించింది. 2001లో బెంగళూరుకు చెందిన ‘రెవా’ అనే సంస్థ కూడా ఈవీ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించింది. 2012 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుదల మొదలైంది. ఆ ఏడాది 6 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్లవ్వగా.. 2015లో 9 వేలు, 2016లో 50 వేల మార్కును దాటేసింది. 2016–2019 మధ్యలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ 51,129 నుంచి 1.61 లక్షలకు పెరిగింది. 2020లో కోవిడ్ వల్ల 1.19 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలే జరిగాయి. 2021 నుంచి మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.34 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతుండగా.. ఇతర వాహనాల సంఖ్య 27.81 కోట్లుగా ఉంది. 2030 నాటికి ఈ సంఖ్యలో సగభాగం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. -
గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్!
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వాహన మార్కెట్ గాడిన పడుతోంది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు ఇటీవలి నెలల్లో పుంజుకోవడంతో ఆటోమొబైల్ కంపెనీల్లో భవిష్యత్ డిమాండ్ పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ సెంటిమెంట్ మెరుగుపడిన దానికి ఇది నిదర్శనం. ద్విచక్ర వాహనాలు, కార్లకు గ్రామీణ మార్కెట్ కీలకంగా ఉండడం గమనార్హం. కరోనాతో ఏర్పడిన పరిస్థితులతో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడం తెలిసిందే. ఆ డిమాండ్ ఇంకా బలంగా పుంజుకోలేదు. ఇప్పుడు సెంటిమెంట్‌లో మార్పు కనిపిస్తుండడం ఆశావహం. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఈ విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల పాత్ర బలంగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) తర్వాత తిరిగి గత నెలలోనే ట్రాక్టర్ల విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. ఆల్టో కారుకు డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే చిన్న కారు మారుతి ఆల్టో.. గత మూడు నెలల కాలంలో(సెప్టెంబర్–నవంబర్) రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. అమ్మకాలు 42.5 శాతం పెరిగి 61,767 యూనిట్లుగా ఉన్నాయి. ఆల్టో కే10 పేరుతో నవీకరించిన మోడల్‌ను మారుతి సుజుకీ ఇండియా ఈ ఏడాది ఆగస్ట్‌లో మార్కెట్‌కు పరిచయం చేసింది. విక్రయాల్లో దీని పాత్ర కూడా బలంగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విక్రయ ధోరణలను పరిశీలిస్తే డిమాండ్ మెరుగుపడుతున్నట్టు తెలుస్తోందని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ‘‘గత నెల విక్రయాలు కొంత నిదానించడాన్ని చూశాం. గ్రామీణ డిమాండ్ ఎప్పుడూ సీజనల్‌గా ఉంటుంది. వర్షాలు గత మూడు నాలుగేళ్లుగా మెరుగ్గా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. రబీ సాగు కూడా వేగంగానే ఉంది. సాగు తర్వాత వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని శ్రీవాస్తవ వివరించా రు. మారుతీ సుజుకీ వాహన విక్రయాల్లో గ్రామీణ ప్రాంత వాట గత ఆర్థిక సంవత్సరంలో 43.3 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అది 43.8 శాతానికి పుంజుకుంది. టూ వీలర్లదీ అదే దారి.. ద్విచక్ర వాహన విక్రయాల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. గత త్రైమాసికంలో విక్రయాల్లో ఒక అంకె వృద్ధి నమోదు కాగా, రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్‌లో విక్రయాలు 41 శాతం పెరిగితే, నవంబర్‌లో 24 శాతం వృద్ధి ఉన్నట్టు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) డేటా తెలియజేస్తోంది.దేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో కార్ప్.. సానుకూల వినియోగ సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో రానున్న త్రైమాసికంలో విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలను వ్యక్తం చేసింది. సాగు బలంగా ఉండడం, వివాహాల సీజన్‌ను ఉదాహరణలుగా పేర్కొంది. ఎఫ్ఎంసీజీకి అనుకూలం.. గ్రామీణ ప్రాంతాల్లో సన్నగిల్లిన ఎఫ్ఎంసీజీ డిమాండ్.. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావంతో గత నాలుగు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం దిగొస్తుండడం, మరోవైపు బలమైన సాగు, పంటల మద్దతు ధరలతో డిమాండ్ ఇక మీదట బలపడుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వచ్చే త్రైమాసికంలో డిమాండ్ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నాయి. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
ఇప్పటి వరకు ఇదే అత్యధికం..రికార్డ్ స్థాయిలో వెహికల్స్ అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్‌లో వాహన అమ్మకాలు నవంబరులో 23,80,465 యూనిట్లు నమోదయ్యాయి. 2021 నవంబర్‌తో పోలిస్తే 26 శాతం అధికం. అంతేగాక భారత వాహన పరిశ్రమలో ఈ స్థాయి విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘బీఎస్–4 నుంచి బీఎస్–6 ప్రమాణాలకు మళ్లిన నేపథ్యంలో 2020 మార్చిలో జరిగిన అత్యధిక అమ్మకాలను మినహాయించాలి. పండుగల సీజన్ ముగిసినప్పటికీ పెళ్లిళ్ల కారణంగా గత నెలలో విక్రయాల జోరు కొనసాగింది. విభాగాలవారీగా ఇలా.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ప్యాసింజర్ వెహికిల్స్ గత నెలలో 21 శాతం వృద్ధితో 3 లక్షల మార్కును దాటాయి. కార్ల లభ్యత, కొత్త మోడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి కారణం. కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్‌యూవీల జోరు కొనసాగింది. టూ వీలర్లు 24 శాతం అధికమై 18,47,708 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 81 శాతం, ట్రాక్టర్లు 57 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాలు 33 శాతం దూసుకెళ్లి 79,369 యూనిట్లుగా ఉంది. మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టిసారించడం, కొత్త మైనింగ్ ప్రాజెక్టుల రాక, పాత వాహనాల స్థానంలో కొత్తవి చేరికతో కమర్షియల్ విభాగం మెరుగ్గా ఉంది. డిస్కౌంట్లు సైతం.. చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. మరోవైపు స్టాక్ క్లియర్ చేసుకోవడానికి బేసిక్ వేరియంట్లతోపాటు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. రెపో రేటు పెరగడంతో కస్టమర్లపై రుణ భారం పెరిగి ద్విచక్ర వాహనాలు, ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా లాక్డౌన్ కారణంగా సెమికండక్టర్ల సరఫరా మందగించే చాన్స్ ఉంది. ఇదే జరిగితే విక్రయాల స్పీడ్‌కు బ్రేకులు పడతాయి. తద్వారా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండదు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు..ఏ కంపెనీ వెహికల్స్ ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. డీజిల్ రేట్లు దడపుట్టిస్తున్నాయి. కాలుష్యం కాటేస్తుంది. వాహనదారుల జేబుకు చిల్లు. వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ అదిగదిగో ఎలక్ట్రిక్ వెహికల్. పొగుండదు. పొల్యూషన్ అస్సలు ఉండదు? పెట్రోల్, డీజిల్‌తో పనుండదు. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే. ఇదిగో..ఈ తరహా ధోరణి వాహనదారుల్లో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదని, పండగ సీజన్లో కంటే ఆ తర్వాతే ఈవీ బైక్స్ అమ్మకాలు జోరందుకున్నాయని ఆ నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ‘వాహన్’ డేటా ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల కాలంలో దేశంలో 1,53,000 ఎలక్ట్రిక్ బైక్స్ అమ్ముడుపోయాయి. ఇదే కాలంలో గతేడాది కేవలం 43,000 వెహికల్స్ అమ్మకాలు జరిగినట్లు ఆ డేటా తెలిపింది. అమ్మకాల జోరు 2021 అక్టోబర్ నెలలో ఈవీ బైక్స్ 19,702 మాత్రమే కొనుగులో చేయగా..ఈ ఏడాది అక్టోబర్‌లో 77,000 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇక, 2021 నవంబర్‌లో 23,099 వెహికల్స్ అమ్ముడుపోగా.. 2022 నవంబర్‌లో 76,150 వెహికల్స్‌ను కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థలు దేశీయంగా ఏప్రిల్-నవంబర్లలో కలిపి 4.3 లక్షల యూనిట్ల సేల్స్ నిర్వహించగా..డిసెంబర్ నెలలో సైతం ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమకు చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో ఈవీ బైక్స్ మార్కెట్ షేర్ ఎంత? వాహన్ నివేదికలో దేశీయంగా ఈవీ వెహికల్స్ తయారీ సంస్థలు జరిపిన అమ్మకాలు ఎంత శాతంగా ఉన్నాయో తెలిపింది. ఇందులో ప్రధానంగా ఒక్క నవంబర్‌లో ఓలా 21శాతం ఈవీ వెహికల్స్‌ను అమ్మగా, ఆంపియర్ 16 శాతం, ఓకినావా 12 శాతం, హీరో ఎలక్ట్రిక్ 12 శాతం , టీవీఎస్ 10.6 శాతం, ఎథేర్ 10 శాతం, బజాజ్ 4 శాతం, ఒకయా 2 శాతం అమ్మగా.. ఇతర సంస్థలు 12.4శాతం మేర విద్యుత్ వాహనాల్ని అమ్మినట్లు తేలింది. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
గుడ్ న్యూస్: ఆర్టీవో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) వెళ్లి ఆర్టీఓ వద్ద డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇవేమి చేయకుండా లైసెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా, ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. పరీక్ష లేకుండా లైసెన్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నుంచి శిక్షణను పూర్తి చేయాలి. ఆపై డ్రైవింగ్‌లో అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌లను సదరు శిక్షణా సంస్థ జారీ చేయనుంది. ఆపై వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆర్టీఓ వద్ద ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా ఈ శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ పొందవచ్చు. వీటిని కేంద్ర లేదా రాష్ట్ర రవాణా శాఖలు ఈ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయం కూడా నెలకొంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఎంత వరకు సత్పలితాలను ఇస్తాయని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
టీవీఎస్‌తో జతకట్టిన అమెజాన్ ఇండియా.. 2025 నాటికి అదే టార్గెట్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను బలోపేతం చేయడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ అమెజాన్ ఇండియాతో చేతులు కలిపింది. వివిధ అమెజాన్ నెట్వర్క్, లాజిస్టిక్స్ విభాగాలలో ఈవీ(EV) వినియోగ కేసులను పరిశీలించడానికి ఈ రెండు కంపెనీలు కలిసి పని చేయనున్నాయి. పారిస్ ఒప్పందానికి ప్రకారం 2040 నాటికి జీరో కార్బన్‌ను సాధించాలనే నిబద్ధతలో భాగంగా అమెజాన్ ఈ ప్రయత్నాలను చేస్తోంది. అందుకోసం 2025 నాటికి 10,000 ఈవీలను డెలివర్ చేసే దిశగా అమెజాన్ ఇండియా ప్లాన్ చేస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎనిమిది త్రైమాసికాల వ్యవధిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రీ-వీలర్ల వాహనాల పూర్తి పోర్ట్‌ఫోలియోను మార్కెట్లో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరించడంతో పాటు బలోపేతం చేయాలని భావిస్తోంది. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి హిందుస్తాన్ మోటార్స్
సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్? ఈ విషయాలు తెలుసుకోండి! -
వాహనాలకు పండగొచ్చింది
న్యూఢిల్లీ: తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా మెరుగుపడటంతో పండుగల సీజన్లో వాహన పరిశ్రమ కళకళ్లాడుతోంది. కస్టమర్లకు డెలివరీలూ పుంజుకుంటున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. 13,19,647 యూనిట్ల నుంచి 14,64,001 యూనిట్లకు పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో విక్రయాలు మరింత పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దశాబ్దకాలంలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమమైనదిగా ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు‘ అని పేర్కొంది. ట్రాక్టర్లు, కొన్ని రకాల త్రిచక్ర వాహనాలు మినహా మిగతా అన్ని ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు.. ద్విచక్ర వాహనాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదు చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2,37,502 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధి చెంది 2,60,556 యూనిట్లకు చేరాయి. ‘సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడి కార్ల లభ్యత పెరగడం, వినూత్న ఫీచర్లతో కొత్త వాహనాలను ఆవిష్కరించడం తదితర అంశాల కారణంగా కస్టమర్లు తమకు నచ్చిన వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో అమ్మకాలకు ఊతం లభించేలా డిమాండ్‌కి అనుగుణంగా వాహనాలను అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 9,31,654 యూనిట్ల నుంచి 10,15,702 యూనిట్లకు చేరాయి. ఎంట్రీ స్థాయి బైక్‌ల అమ్మకాలు గణనీయంగా దెబ్బతినడంతో మొత్తం టూవీలర్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ► వాణిజ్య వాహనాల విక్రయాలు 59,927 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 71,233 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 53,392 నుంచి 52,595 యూనిట్లకు తగ్గాయి. ► ప్యాసింజర్ వాహనాల విభాగంలో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 99,276 యూనిట్ల నుంచి 1,03,912 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ 39,118, టాటా మోటార్స్ 36,435 కార్లు విక్రయించాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అత్యధికంగా 2,84,160 యూనిట్లు విక్రయించింది. హీరో మోటోకార్ప్ 2,50,246 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 19,474 యూనిట్లతో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిల్చింది. -
పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ధరలను సవరించింది. మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధర మోడల్‌ను బట్టి రూ.1,000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కంపెనీ గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరగడంతో వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు మోటారు సైకిళ్లు, స్కూటర్లకు వరిస్తుందని పేర్కొంది. పండుగ సీజన్లో కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడం సహజం, కానీ హీరో మోటో కార్ప్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగస్టులో.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1.92% పెరిగి 462,608 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాల వాల్యూమ్ కూడా గత ఏడాది విక్రయించిన యూనిట్లతో పోలిస్తే 4.55% పెరిగి 450,740 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఆగస్టు 2022లో ఎగుమతులు క్షీణించాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఈ రెండు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. -
వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్!
వీధి చివర కిరాణా దుకాణంలో వాహన టైర్లు అందుబాటులో ఉంటే..? వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఆర్పీజీ గ్రూపు కంపెనీ సియట్ ఇదే ఆలోచనను అమలు చేస్తోంది. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు కిరాణా దుకాణాలను సైతం వినియోగించుకోవాలన్నది ఈ సంస్థ ప్రణాళికగా ఉంది. పాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు కొనుగోలు చేసే షాపులో టైర్లు అమ్మడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల మాదిరిగా కాకుండా.. టైర్ల పరిశ్రమ పరిమిత వృద్ధితో కూడినది. ఈ పరిమిత మార్కెట్లోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేయాలన్నది సియట్ అభిమతంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు అసలు టైర్లను విక్రయించని దుకాణాలతో ఓ నెట్‌వర్క్‌ను సియట్ ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల వద్ద కూడా కస్టమర్ల కోసం టైర్లను అందుబాటులో ఉంచుతుంది. దీంతో దాదాపు దేశ ప్రజల్లో అధిక శాతాన్ని చేరుకోవచ్చన్నది కంపెనీ యోచన. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం వెళ్లే వీధి దుకాణం వద్ద.. ‘సియట్’ టైర్లు కస్టమర్ల కళ్లలో పడుతుంటాయి. దీంతో బ్రాండ్‌కు ఉచిత ప్రచారం కూడా లభించినట్టు అవుతుంది. నూతన నమూనా.. ‘‘కిరాణా స్టోర్లు, పంక్చర్ రిపేర్ దుకాణాలు, ఓఈఎం మినీ అధీకృత సేవా కేంద్రాలు, వాహన విడిభాగాలు విక్రయించే స్టోర్ల యజమానులను సంప్రదించి, సియట్ టైర్లను విక్రయించాలని కోరాం’’అని సియట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్ణబ్ బెనర్జీ తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉంది. 2021–22లో 1.34 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో సగానికి పైన గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉండడం గమనార్హం. ఒక విధంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల మార్కెటింగ్ నమూనాను సియట్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. సియట్ కంపెనీ విక్రయించే ద్విచక్ర వాహన టైర్లలో 70 శాతం సంప్రదాయేతర స్టోర్ల నుంచే ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ద్విచక్ర వాహన టైర్ల మార్కెట్లో సియట్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2011 నాటికి 11 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచుకుని మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. మార్కెట్ అగ్రగామిగా ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ను సైతం టూవీలర్ విభాగంలో వెనక్కి నెట్టేసింది. కొన్నేళ్ల క్రితం 20,000 విక్రయ కేంద్రాలు ఉంటే, వాటిని 50,000కు పెంచుకున్నట్టు ఆర్ణబ్ బెనర్జీ వెల్లడించారు. కస్టమర్లకు మరింత చేరువ అయ్యే చర్యలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఇతర టైర్ల కంపెనీలతో పోలిస్తే డీలర్లు, సబ్ డీలర్లకు సియట్ విక్రయించే ధర అధికంగానే ఉన్నప్పటికీ.. తన వాటాను మాత్రం పెంచుకోగలుగుతోంది. చదవండి: Elon Musk: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్ ఇవే!
సాక్షి, ముంబై: 190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచరలతో లభించే ట్రెండీలుక్స్తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్‌లపై ఓ లుక్కేద్దాం. హోండా ఎస్పీ125 బీఎస్-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్‌తో10.5bhp గరిష్ట శక్తిని 10.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈబైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) హీరో గ్లామర్ హీరోకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్‌తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 హీరో గ్లామర్ 12 వేరియంట్లు,13 కలర్ ఆప్షన్లలో లభ్యం. హోండా షైన్ హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) హీరో సూపర్ స్ప్లెండర్ హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 bhp, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ ధర రూ. 77,939 . టీవీఎస్ రైడర్ 125 టీవీఎస్ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్లలో లభ్యం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకునే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్) బజాజ్ పల్సర్ 125 బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్‌తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్లలో లభ్యం.ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్‌తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
భద్రతా లోపాలతో 13 లక్షల వాహనాలు వెనక్కి
న్యూఢిల్లీ: భద్రతా పరమైన లోపాల కారణంగా 13 లక్షల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లను గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) కంపెనీలు వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు తెలిపారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. 8,64,557 ద్విచక్ర వాహనాలు, 4,67,311 ప్యాసింజర్ కార్లు వెనక్కి పిలిచిన వాటిల్లో ఉన్నట్టు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,60,025 ద్విచక్ర వాహనాలు, 25,142 ప్యాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తయారీ అనంతరం లోపాలు బయటపడినప్పుడు ఆయా బ్యాచ్‌ల వారీగా మొత్తం వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వెనక్కి పిలిపించి, అన్నింటినీ సరిచేసిన తర్వాత అప్పగిస్తుంటాయి. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇలా మొత్తం 3.39 లక్షల వాహనాలు, 2019–20లో 2.14 లక్షల వాహనాలను కంపెనీలు వెనక్కి పిలిపించుకున్నాయి. ‘‘ఓ మోటారు వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి లేదా నడిపే వారికి లేదా ఆ వాహనంలో ప్రయాణించే వారికి, లేదంటే రహదారులను వినియోగించుకునే ఇతరులకు ప్రమాదం అని భావిస్తే.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీలను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది’’అని మంత్రి చెప్పారు. -
వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో 75 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోమవారం నుంచే పెరిగిన జీవితకాల పన్ను అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. మొదటి రోజు నమోదైన వాహనాలన్నీ పాత జీవితకాల పన్నుపైనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో వాహనదారుల నుంచి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం మిగతా డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు స్లాబ్‌ల పద్ధతి ఉండగా, కొత్తగా 4 స్లాబుల్లో జీవిత కాల పన్నును విధించిన సంగతి తెలిసిందే. వాహనాల ఖరీదు ఆధారంగా పన్ను విధించినప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై భారం అధికంగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సగటుజీవిపై పన్ను బాదుడు పిడుగుపాటుగా మారింది. జీవిత కాల పన్ను రూపంలో నగరంలోని వాహనదారులుపై ఏటా రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆదాయంలోనూ ఆ మూడు జిల్లాలే.. ► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3500 వరకు కొత్త వాహనాలు నమోదవుతుండగా వీటిలో సగానికి పైగా గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఆదాయంలోనూ ఈ మూడు జిల్లాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా ప్రస్తుతం 1.34 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 70 లక్షలు దాటింది. ► రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు, పర్మిట్లు, వివిధ రకాల పౌరసేవల పునరుద్ధరణపై వచ్చే ఆదాయం కంటే జీవితకాల పన్ను రూపంలోనే ఆర్టీఏకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు రూ.3,350 కోట్ల వరకు ఆదాయం లభించగా గ్రేటర్ పరిధిలోనే రూ.1600 కోట్లకు పైగా ఆదాయం నమోదు కావడం గమనార్హం. ► కొత్తగా పెంచిన జీవితకాల పన్ను ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా గ్రేటర్ నుంచి లభించనుంది. ఇతర రాష్ట్రాలవాహనాల రీరిజిస్ట్రేషన్, హై ఎండ్, లగ్జరీ వాహనాల నమో దు, ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ వేలం తదితర రూపాల్లోనూ రవాణా శాఖకు హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ద్విచక్ర వాహనాలే టాప్... ► గ్రేటర్లో ప్రతి రోజు 1500 నుంచి 2000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి వరకు ద్విచక్ర వాహనాలే. కోవిడ్ కాలంలో సైతం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 శాతం చొప్పున పాత జీవితకాల పన్ను ప్రకారం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు బైక్‌లు లభించాయి. ప్రస్తుతం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ పెరగడంతో వాహనాల ధర రూ.80 వేల నుంచి రూ.90 వేలు దాటనుంది. పెరిగిన పన్నుల మేరకు ద్విచక్ర వాహనాలపైనే గ్రేటర్లో రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా. (చదవండి: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) ► ఇక పాత పన్నుల ప్రకారం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే రూ.10 లక్షల వరకు ఖరీదైన కార్లకు 12 శాతం ఉండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచారు. ఈ మేరకు ఈ కేటగిరి వాహనాలపైనే రూ.కోటికిపైగా అదనపు భారం పడనుంది. అన్ని రకాల వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం అదనంగా లభించే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!) -
హోండా సరికొత్త రికార్డులు.. ఏకంగా 30 లక్షలకుపైగా..
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) సరికొత్త రికార్డులను నెలకొల్పింది. భారత్ నుంచి సుమారు 30 లక్షల యూనిట్ల టూవీలర్ వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. భారీ డిమాండ్..! హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 21 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అరుదైన ఘనతతో భారత్‌లో అగ్రశ్రేణి స్కూటర్ ఎగుమతిదారుగా హోండా స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవలి కాలంలో హోండాకు ఇతర దేశాల్లో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. 2001లో హోండా ఎగుమతులను మొదలుపెట్టగా...15 లక్షల యూనిట్లను ఎగుమతి చేయడానికి సుమారు 16 సంవత్సరాల సమయం పట్టింది. కాగా మరో 15 లక్షల యూనిట్ల ఎగుమతులను కేవలం ఐదేళ్లలోనే సాధించడం గమనార్హం. ఈ అమ్మకాలు మునుపటి కంటే మూడు రెట్లు అధికం. 18 పైగా ఎగుమతులు..! తొలిసారి యాక్టివా టూవీలర్ బైక్‌ను 2001లో ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు 18పైగా టూవీలర్ వాహనాలను హోండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. దేశీయ మార్కెట్లో టూవీలర్ అమ్మకాల జాబితాలో హోండా యాక్టివా రెండవ స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో హోండా డియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ నుంచి నవీ, డియో, ఎక్స్-బ్లేడ్, డ్రీమ్, సీబీ షైన్, హార్నెట్, యునికార్న్, యాక్టివా, సీబీ350 వంటివి భారీగా ఎగుమతి అయ్యాయి. చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు -
మాకొక ‘కారు’ కావలె.. ఎందుకంటే కారణాలివే?
కర్నూలు: ఒకప్పుడు కారులో ప్రయాణించడమంటే గొప్పగా భావించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు కారుకు జై కొడుతున్నారు. మాకొక కారు కావలె అంటూ.. కార్ల వైపు చూస్తున్నారు. కరోనా భయంతో కారే నయం అంటున్నారు. బడ్జెట్ కుదిరితే కారు.. లేదంటే బైక్ కొనుగోలు చేస్తున్నారు. కరోనా మార్చిన జీవనయానం, పెరిగిన రవాణా చార్జీల నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రజా రవాణాపై ఆధారపడిన వారు లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులుపడ్డారు. చదవండి: విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్.. అవేమిటంటే..? సడలించిన తరువాత కూడా భౌతిక దూరం పాటింపు, కోవిడ్ భయంతో సొంత వాహనాలే మేలన్న అభిప్రాయంతో ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు వారి ఆర్థిక స్తోమతను బట్టి కొత్త లేదా పాత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లా లో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రెండు నెలల్లో రిజి్రస్టేషన్ అయిన వాహనాల సంఖ్య సుమారు 10 వేలు ఉండగా వాటిలో సగానికి పైగా ద్విచక్ర వాహనాలే. స్కూలు బస్సులు, లారీలు, ట్రక్కులు, గూడ్సు వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలు కలిపి 1,169 వరకు రిజి్రస్టేషన్ జరిగాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ముఖ్య పట్టణాలతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వాహన విక్రయాల షోరూమ్‌లు, వ్యాపార అనుబంధ శాఖలు, విడిభాగాల అమ్మకాలు, మరమ్మతుల దుకాణాలు, మెకానిక్ షెడ్లు దాదాపు 2250 వరకు ఉన్నాయి. ఈ రంగానికి సంబంధించి రోజుకు సగటున రూ. 2.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంటుంది. పాత వాహనాలకు డిమాండ్ కొంతకాలంగా పాతకార్లు, బైకులకు డిమాండ్ పెరిగింది. కరోనా, లాక్డౌన్ సమయంలో ప్రయాణ కష్టాలను అనుభవించిన కొందరు మరో ఆలోచన లేకుండా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసి ఆ తరువాత డ్రైవింగ్ నేర్చుకుని దూసుకెళ్తున్నారు. ఒక ప్పుడు నగరాలకే పరిమితమైన పాతకార్ల కొనుగో లు ట్రెండ్ మండలాలు, గ్రామాలకు పాకింది. రూ. 5 లక్షలు పెడితే చాలు కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారు వస్తుందని కర్నూలుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన స్వీయఅనుభవాన్ని తెలిపాడు. రవాణా శాఖ లెక్కలేం చెబుతున్నాయంటే రవాణాశాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గతేడాది 3800 కార్లకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే 700కు పైగా కార్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, కొందరు ఉద్యోగులు మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం కార్లను కొంటుండగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు రూ. 3 నుంచి రూ. 5 లక్షల విలువైన కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తికి కారణాలివే ►లాక్డౌన్ సమయంలో ప్రజా రవాణా నిలిచిపోవడం, సడలింపు తరువాత చార్జీల భారం పెరగడం. ►ద్విచక్ర వాహనం ఇద్దరికే పరిమితం కావడం, కారైతే కుటుంబమంతా అనువుగా ఉండటంతో కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ►రూ. 5 లక్షల విలువైన కారుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష చెల్లిస్తే చాలు అందుబాటులోకి వచ్చేలా ఫైనాన్స్ సౌకర్యం చేరువైంది. ►వాయిదాలను కూడా వార్షిక ఆదాయానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడంతో కారు విక్రయాల జోరు సాగుతోంది. అందుబాటులో షోరూంలు కార్ల కొనుగోళ్లకు గతంలో జిల్లా కేంద్రం కర్నూలుకు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు నంద్యాల, ఆదోని ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాలకు షోరూంలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ వడ్డీతో పాటు సులభతర వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా ఫైనాన్స్ సంస్థలు రుణాలు మంజూరు చేస్తుండటంతో గ్రామీణులు సైతం వాహన కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. వ్యక్తిగత వాహన కొనుగోళ్లు పెరిగాయి జిల్లాలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. ప్రజా రవాణాపై ఆధారపడిన వారు లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సొంత వాహనాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయి. రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. – రమేష్, ఇన్చార్జ్ డీటీసీ -
ఎండకాలంలో జాగ్రత్త..! ఆ టైంలో బైక్‌పై వెళ్లకపోవడమే ఉత్తమం
సాక్షి, ఖిలా వరంగల్: ఎండాకాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలతో మనం అల్లాడిపోతాం. ఉదయం పది దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు సాహసించాల్సివస్తోంది. అత్యవసర పరిస్థితిల్లో బయటకు వస్తే దాహం తీర్చుకోవడానికి శీతలపానియాలు, పండ్లరసాలు తీసుకుంటాం. వేసవితాపానికి గురికాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా వాహన దారులు తమ వాహనాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు మెకానిక్‌లు. వాహనాల విషయంలో వేసవి జాగ్రత్తలు, సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు నిపుణుల సలహాలు అవసరమనే పలువురు మోటారు టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దూరప్రయాణం వద్దు.. కొంత మంది ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు ఇష్టపడతారు. ఎండాకాలంలో దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఎండల్లో ఎక్కువ ప్రయాణించడం వల్ల ఇంజిన్, టైర్లు వేడెక్కుతాయి. టైర్లు పేలే అవకాశం, ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బైక్‌లపై తప్పనిసరి పరిస్థితుల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మార్గమధ్యలో చల్లటి ప్రదేశాల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎండలో పార్కింగ్ చేస్తే అంతే.. వాహనాలను ఎండలో పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లు పడడం ఖాయమంటున్నారు నిపుణులు. వేసవిలో వడదెబ్బతగలకుండా మనం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. కానీ, మనషులకే కాదు వాహనాలకు కూడా ఎండ తాకిడి ఉంటోంది. రంగు వెలసిపోవడం, పెట్రోలు ఆవిరైపోవడం వంటివి జరుగుతుంది. చదవండి: గుర్తుపెట్టుకోండి.. అలాంటి కాల్స్ చేసిన కటకటాలే! జాగ్రత్తలు.. ఎండలో ఇంజిన్ ఆయిల్ త్వరగా వేడెక్కి పలచనవుతుంది. ఎండాకాలం మొదలవగానే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం శ్రేయస్కరం. పెట్రోలు ట్యాంకుపై మందపాటి కవర్ ఉండేటట్టు చూసుకోవడం వల్ల కొంత వరకు పెట్రోలు ఆవిరి కాకుండా తగ్గించుకోవచ్చు. టైర్లు అరిగి ఉంటే మార్చుకోవాలి. ట్యూబ్‌లకు పంక్చర్లు ఉంటే వేసవి కాలంలో మార్చుకోవడం మంచిది. మధ్యాహ్నం ఎండలో ఎక్కువ సమయంలో పార్కింగ్ చేసి ఉంచితే వాహన జీవితకాలం తగ్గుతుంది. వేసవిలో ఇంజిన్ గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లడం ఉత్తమం. చదవండి: బంజారాహిల్స్: పెళ్లి పేరుతో వంచింది..సహజీవనం చేసి...చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం తీయాల్సి వస్తే మధ్య మధ్యన విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ వేడి తగ్గుతుంది. రాత్రివేళ ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెడితే మంచిది. దీంతో గ్యాస్ బయటకు పోయి ఆయిల్ సులువుగా ఇంజిన్లోకి వెళ్తుంది. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 2నుంచి 4గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. నీడలో పార్కింగ్ చేయాలి.. వేసవిలో ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం చేయొద్దు. ఎండవేడికి టైర్లు మెత్తపడి గాలిదిగి బైక్ నిలిచిపోతుంది. ప్యాచీలు కరిగి బైక్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇంజిన్‌లో శబ్ధం వచ్చి మొరాయిస్తుంది. నీడలో పార్క్‌చేయాలి. – ఎండీ జాఫర్, బైక్ మెకానిక్, వరంగల్ -
తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 15 ఏళ్లలో యువశక్తి తగ్గిపోనుంది. రాష్ట్ర జనాభాలో ప్రస్తుతం 15–40 ఏళ్లలోపు యువత 43.6% ఉండగా 2036 నాటికి ఇందులో 15.9% తగ్గి.. 27.7% కానున్నట్లు అంచనా. బుధవారం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2021’లో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. ప్రణాళిక, ఆర్థిక శాఖలు సంయుక్తంగా తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం రానున్న 15 ఏళ్లలో 40 ఏళ్ల పైబడిన వారి జనాభా 42.5 శాతానికి పెరగనుంది. 15–40 ఏళ్లలోపు గణాం కాలను పరిగణనలోకి తీసుకునే 6 శ్లాబుల్లో 35–39 ఏళ్ల శ్లాబు మినహా అన్ని శ్లాబుల్లోనూ తగ్గుదల నమోదు కానుండటం గమనార్హం. 80ఏళ్ల పైబడిన వారి సంఖ్య 82% పెరగనుంది. ఈ గణాంకాల ప్రకారం 2021 నాటికి రాష్ట్ర జనాభా 3,77,25,000 కాగా దేశ జనాభాలో ఇది 2.8 శాతమని అంచనా. రాష్ట్రంలో 50.3 శాతం మంది పురుషులు కాగా, 49.7 శాతం మంది మహిళలున్నారు. జోనల్ విధానం ఇలా.. 2021లో ఏర్పాటైన జోనల్ విధానం ప్రకారం రాష్ట్రా న్ని 7 జోన్లుగా విభజించారు. ఇందులో బాసర, భద్రా ద్రి, కాళేశ్వరం, రాజన్న, చార్మినార్, జోగు లాంబ, యాదాద్రి జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్లో 4,5 జిల్లాలున్నాయి. బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న జోన్లు మల్టీజోన్–1గా, చార్మినార్, జోగు లాంబ, యాదాద్రి జోన్లు మల్టీజోన్–2 పరిధిలోకి వస్తాయి. కోటి దాటిన టూవీలర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల సంఖ్య కోటి దాటింది. మొత్తం వాహనాలు కోటిన్నరకు చేరువలో ఉన్నాయి. గత మూడేళ్లలోనే కొత్తగా 26 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం గణాంకాల్లో స్కూటర్లు, మోటారు సైకిళ్లు, మోపెడ్లు కలిపి 1.02 కోట్లు, అన్ని రకాల వాహనాలు 1,38,11,466 ఉన్నాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరం లెక్కలు. ప్రస్తుతం ఫిబ్రవరి మూడో వారం వరకు నమోదైన ద్విచక్ర వాహనాలు 5 లక్షలు, మిగతా అన్ని వాహనాల సంఖ్యను కలిపి లెక్కిస్తే ఈ సంఖ్య కోటిన్నరకు చేరువైంది. 1,45,00,000గా నమోదైంది. మరో రెండు మూడు నెలల్లో ఈ సంఖ్య కోటిన్నర దాటనుంది. ప్రస్తుతం సంవత్సరానికి 8 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. 2020–21లో కొత్తగా 8,22,416 వాహనాలు నమోదయ్యాయి. 2019– 20 సంవత్సరంలో ఈ సంఖ్య అత్యధికంగా నమోదైంది. కరోనా వల్ల వ్యక్తిగత వాహనాల కోసం జనం పోటెత్తటంతో కొత్త వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. 12,38,778 వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 లక్షల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. -
బండి కనిపిస్తే మాయం చేస్తారు
జియాగూడ: నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి వాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డావిస్ అన్నారు. శనివారం షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో గోషామహాల్ ఏసీపీ ఆర్.సతీస్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నగరంలోని వెస్ట్, సౌత్, ఈస్ట్, సెంట్రల్ జోన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం జరుగుతున్నాయి. దీంతో షాహినాయత్ గంజ్ పోలీసుల క్రైమ్ టీమ్ నిందితులను పట్టుకున్నారన్నారు. జహనుమాకు చెందిన అబ్దుల్ వాహిద్(63), వారసిగూడలోని మహిమూద్‌గూడకు చెందిన మహ్మద్ సోయేల్ హుల్‌హక్ (28)లు రాత్రి వేళల్లో బస్తీలలో ఇంటి బయట పార్కు చేసిన యాక్టివా ద్విచక్ర వాహనాలను నకిలీ తాళాలతో ఓపెన్ చేసి ఎత్తుకువెళ్లేవారు. వాటిని మెకానిక్ షాపులు, స్క్రాబ్ దుకాణాలలో విక్రయించే వారు. అనుమానం రాకుండా కుటుంబ సభ్యులకు వైద్యం కోసం డబ్బులు అవసరం అయ్యాయని నమ్మిస్తూ ఆధార్‌కార్డు కూడా ఇచ్చేవారు. షాహినాయత్‌గంజ్ సీ.ఐ. వై.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్ఐ. జి.రాజేశ్వర్ రెడ్డి, క్రైమ్ టీం సిబ్బందితో కలిసి బేగంబజార్ నుండి చంద్రాయణగుట్ట వరకు గల వివిధ దారుల్లో, బస్తీల్లో వందకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులు దొంగిలించిన వాహనాలను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ జోయల్ డావిస్ క్రైమ్ టీమ్‌ను అభినందించారు. -
‘ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు. జీఎస్టీ తగ్గాల్సిందే’
న్యూఢిల్లీ: డిమాండ్ పెరగాలంటే ద్విచక్ర వాహనాలకు జీఎస్టీ 18 శాతానికి కుదించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు. జీఎస్టీ తగ్గాల్సిందే. జీఎస్టీ 28 శాతం, సెస్ 2 శాతం ఈ విభాగానికి శ్రేయస్కరం కాదు’ అని అసోసియేషన్ అభిప్రాయపడింది. జీఎస్టీ భారం తగ్గాలి- ఏంటీఏఐ వైద్య పరికరాలు, కోల్డ్ చైన్ యూనిట్లు, విడిపరికరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ), కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంటీఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పరిశోధనా ఆధారిత మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ– ఎంటీఏఐ ఇచ్చిన ప్రీ–బడ్జెట్ మొమోరాండంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - వైద్య పరికరాలు, మెడికల్ కోల్డ్ చైన్లపై జీఎస్టీని ప్రస్తుత 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం వల్ల వైద్య రంగంలో వ్యయాలు తగ్గుతాయి. ఆరోగ్య సంరక్షణ రంగం విస్తరణకు ఈనిర్ణయం దారితీస్తుంది. - ప్రస్తుతం వైద్య పరికరాల విడిభాగాలపై కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ పూర్తి స్థాయి పరికరాల కంటే ఎక్కువ రేటుతో అమలవుతోంది. - ’యాడ్–వాలోరమ్’ అనే పదాన్ని తొలగించడం ద్వారా హెల్త్ సెస్ యాడ్ వాలొరమ్లో సవరణ చేయాలి. దీనివల్ల ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బీసీడీ) రేటుపై మాత్రమే సెస్ అమలు జరిగే వీలు ఏర్పడుతుంది. - కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)పై పన్ను మదింపు అలవెన్స్ అందించాలి. వైద్య పరికరాల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు పన్ను మినహాయింపు అవసరం. అన్ని స్థాయిలలో ఆరోగ్య సంరక్షణ కార్మికుల (హెచ్సీడబ్ల్యూ) నైపుణ్యం, ఈ రంగంలో పురోగతికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు అవసరం. ఆరోగ్య సంరక్షణ బీమా విస్తృతికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. తొలుత వీటిపై దృష్టి – పవన్ చౌదరి, ఎంటీఏఐ చైర్మన్ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ స్థోమతను మెరుగుపరచడం, దాని ప్రయోజనాన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే అధిక కస్టమ్స్ సుంకాలు, అదనపు ఆరోగ్య సెస్సుల భారం, వైద్య పరికరాల రంగంలో పరిశోధన–అభివృద్ధికి ప్రోత్సాహకాలు లేకపోవడం, క్రమబద్ధీకరించని పన్ను విధానం ఇక్కడ ప్రధాన సమస్యలు ఈ సమస్యల పరిష్కారానికి ప్రధానంగా కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనికితోడు పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌లోని చాలా వైద్య పరికరాలపై కస్టమ్ డ్యూటీ విధానం భారతదేశంలో కంటే తక్కువగా ఉంది. ఇది అక్రమ రవాణాకు దారితీసే అవకాశం ఉంది. చదవండి: జీఎస్స్టీ నుంచి లబ్ధిపొందేలా వేలకోట్ల ఫేక్ ఇన్వాయిస్లు -
టూవీలర్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్!
టూవీలర్ కొనుగోలు దారులకు ఎల్ అండ్ టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'వెల్కమ్ 2022' లో భాగంగా కొనుగోలు దారులకు భారీ ఎత్తున లోన్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. హైపోథికేట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 3నిమిషాల్లో 7.99 శాతం నుంచి వడ్డీతో అందిస్తున్నట్లు వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేసిన కొనుగోలు దారులు తీసుకున్న లోన్‌ను 4ఏళ్లలో చెల్లించవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్జిగ్యూటీవ్ డైరక్టెర్ బి. గోవిందరాజన్ చెప్పారు. కంపెనీ డీలర్ల దగ్గర లేదా ఎల్ అండ్ టీ ఫైనాన్స్ బ్రాంచ్ ఆఫీస్‌ల దగ్గర ఈ స్కీమ్‌ను పొందవచ్చు. లేదా కంపెనీ వెబ్సైట్ www.ltfs.com లోకి వెళ్లి ఈ స్కీమ్ కింద లోన్‌కు అప్లై చేసుకోవచ్చు. క్లాసిక్ 350, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ట్విన్స్, హిమాలయన్ వంటి బైక్‌లను రాయల్ ఎన్ఫీల్డ్ అమ్ముతుంది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ప్రకారం బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ టర్నరౌండ్ టైమ్ (టీఏటీ) లో భాగంగా..ఎల్ అండ్ టీ ఫైనాన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలు,పట్టణాల్లోని కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌పై లోన్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా? -
తిరుపతి లీలామహాల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం
-
తిరుపతిలో బీభత్సం: టూవీలర్స్‌పైకి దూసుకెళ్లిన కొత్త కారు
సాక్షి, తిరుపతి: తిరుపతి లీలామహల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొత్త కారు కొని.. షోరూం ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. చదవండి: వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి.. -
ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు
SBI Easy Ride: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్విచక్ర వాహనాలు కొనేవారికి తీపికబురు అందించింది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫారం ద్వారా సులభంగా ద్విచక్ర వాహనా రుణాలను పొందవచ్చు అని తెలిపింది. ద్విచక్ర వాహనా రుణాల కోసం ఎస్బీఐ "ఈజీ రైడ్" పేరుతో మరో ఆప్షన్ తీసుకొనివచ్చింది. అర్హత కలిగిన ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించకుండానే యోనో యాప్ ద్వారా క్షణాలలో ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు అని తెలిపింది. "కస్టమర్లు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 10.5% వడ్డీరేటుతో రూ.3 లక్షల వరకు ఈజీ రైడ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణ మొత్తాన్ని రూ.20,000గా నిర్ణయించారు' అని బ్యాంకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ పొందిన రుణం నేరుగా డీలర్ ఖాతాలోకి జమ కానుంది. ఈ పథకం కింద వాహనం ఆన్-రోడ్ ధరలో 85% వరకు రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ.. 'ఎస్బీఐ ఈజీ రైడ్' రుణ పథకం మా కస్టమర్లకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!) -
భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి
సాక్షి, చెన్నై: నెర్కుండ్రంలో భార్యపై కోపంతో నాలుగు బైకులకు, ఓ కారుకు నిప్పు పెట్టి దగ్ధం చేసిన ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్ సత్యం వీధిలో గత నెల 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: (ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య) పోలీసులు వివరణలో చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్న సతీష్ 2019 నుంచి భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటి నుంచి తల్లి ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విరక్తి చెంది.. భార్య వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం చేశాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ విష యం స్థానికంగా సంచలనం కలిగించింది. చదవండి: (లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..) -
కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు!
మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మనలో ఎంత మందికి తెలుసు, మనం బైక్ కొన్న కంపెనీలు హెల్మెట్ ఇస్తాయని. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీ కంపెనీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న రెండు హెల్మెట్లను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్) కొత్త బైక్ ఎక్కడ కొంటున్నారో ఆ షోరూం వారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగాలని అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వకపోతే వెంటనే వినియోగదారుల ఫోరమ్, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో బీఎస్ఐ ప్రమాణాల ప్రకారం సూచించిన ఐఎస్ఐ హెల్మెట్లను కంపెనీలు వినియోగదారులకు అందజేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని స్థానిక కోర్టు రవాణా కమిషనర్ ను ఆదేశించింది. CTP appeals citizens to rightfully claim two standard helmets along with any type of motor cycle they purchase as per the Rule 138(4)(f) of the Central Motor Vehicles Rules, 1989.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/EEbx5ud8kC — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 -
దూసుకెళ్తున్న వాహన విక్రయాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్తున్నాయి. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో వాహన విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వాహన విక్రయాలు జోరుగా జరిగాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 1.60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఇదే గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో చూస్తే 1.09 లక్షల ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు జరిగాయి. అంటే 47.09 శాతం వృద్ధి నమోదైంది. కార్ల కొనుగోళ్లలో గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో 303.20 శాతం వృద్ధి నమోదైంది. అలాగే గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, ఆటోల కొనుగోళ్లు కూడా గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీ వృద్ది నమోదైంది. ఈ ఏడాది మెరుగు గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ లాక్‌డౌన్‌తో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయింది. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో గత ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రవాణా రంగం ఆదాయంలో 77.50 శాతం వృద్ధి నమోదైందని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తొలిపారు. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా కేవలం రూ.367.13 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.651.68 కోట్లు ఆదాయం వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పడితే మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయన్నారు. -
డుకాటీ బైక్ @ 23 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ దిగ్గజం డుకాటీ తాజాగా భారత్‌లో రెండు అడ్వెంచర్ టూరర్ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర మల్టీస్ట్రాడా వీ4 రూ.18.99 లక్షలు కాగా వీ4–ఎస్ రూ.23.10 లక్షలు ఉంది. 10,500 ఆర్పీఎంతో 170 హెచ్‌పీ పవర్ వీ4 గ్రాన్టూరిస్మో ఇంజిన్ పొందుపరిచారు. రోడ్, ఆఫ్–రోడ్ వినియోగం కోసం ఇంజిన్‌ను డిజైన్ చేశారు. రైడింగ్ మరింత సౌకర్యవంతం చేసేందుకు వీ4 ఎస్ మోడల్‌కు రాడార్ టెక్నాలజీని వినియోగించారు. ఇది వేగాన్ని నియంత్రించడంతోపాటు వెనుక నుంచి వాహనాలు వస్తే హెచ్చరిస్తుంది. -
కేటీఆర్ జన్మదినానికి సర్ప్రైజ్: దివ్యాంగులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుక (జూలై 24) మంచి పనికి శ్రీకారం కానుంది. గతేడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేటీఆర్ జన్మదినాన్ని సమాజ సేవ కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. గతేడాది ‘గిఫ్ట్ ఏ స్మైల్’ అనే కార్యక్రమంతో ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు విరాళంగా అందించారు. ఆ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా అందించారు. ఈ ఏడాది తన జన్మదినాన్ని దివ్యాంగుల కోసం వినియోగించనున్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరుతో తాను వంద త్రిచక్ర వాహనాలను దివ్యాంగులకు అందించినున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా ఆ విధంగా చేయాలని పిలుపునిచ్చారు. బొకేలు, శాలువాలు, జ్ఞాపికలు, భారీ కేకులు వద్దంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే కేటీఆర్ పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే పలువురు త్రిచక్ర వాహనాలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం వరకు ఎమ్మెల్సీలు నవీన్ రావు వంద వాహనాలు, శంభీపూర్ రాజు 60 వాహనాలు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 60 వాహనాలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 50 వాహనాలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్ 50 వాహనాలు, గువ్వల బాలరాజు 20, గాదరి కిశోర్ 10 వాహనాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఒక్కరోజే ఇంత పెద్ద స్థాయిలో స్పందన లభించింది. 24వ తేదీ వరకు భారీ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. సంగీత దర్వకుడు ఎస్ఎస్ తమన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిని అవుతానని ప్రకటించారు. తోచినంత సహాయం చేస్తానని ట్విటర్లో తెలిపారు. Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90! This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S — KTR (@KTRTRS) July 22, 2021 -
కొత్త ఎడిషన్‌లో యమహా ఎఫ్‌జడ్ 25
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తాజాగా భారత్‌లో మాన్స్టర్ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌లో ఎఫ్‌జడ్ 25 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.1,36,800. బీఎస్–6 ప్రమాణాలతో 249 సీసీ ఎయిర్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను పొందుపరిచారు. పరిమిత సంఖ్యలోనే ఈ మోడల్ బైక్స్‌ను విక్రయిస్తారు. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న రేసింగ్ వాహనాలను ఇక్కడ పరిచయం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇతర మోడళ్లలోనూ మాన్స్టర్ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌ను తీసుకు రానున్నట్టు యమహా ప్రకటించింది. -
బైక్ ఎగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో మే నెలలో కొత్త రికార్డు నమోదైంది. గత నెలలో భారత్ నుంచి 3,58,756 టూ వీలర్లు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. దేశవ్యాప్తంగా 3,52,717 యూనిట్ల విక్రయాలు జరిగాయి. భారత చరిత్రలో తొలిసారిగా దేశీయంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఎగుమతులదే పైచేయి కావడం విశేషం. మే నెలలో భారత్‌లో 2,95,257 యూనిట్ల మోటార్ సైకిల్స్ అమ్ముడైతే.. 3,30,164 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేశారు. భారత్‌లో గత నెలలో ఉత్పత్తి అయిన టూ వీలర్లలో ఎగుమతుల వాటా అత్యధికంగా 57 శాతానికి చేరడం గమనార్హం. 2019 మే నెలతో పోలిస్తే పరిమాణం 22 శాతం ఎక్కువ. 2020 మే నెలలో పూర్తి లాక్డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీల వారీగా ఇలా.. 2021 మే నెల ఎగుమతుల్లో 83 శాతం వాటా టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ కంపెనీలు చేజిక్కించుకున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలైతే వాటి ఉత్పత్తిలో సగానికిపైగా ఎక్స్పోర్ట్ చేశాయి. మహమ్మారి నేపథ్యంలో సొంత వాహనం ఉంటే సురక్షితం అన్న భావన ప్రజల్లో ఉండడం వల్లే వాహనాలకు డిమాండ్ పెరుగుతోందన్నది తయారీ సంస్థల మాట. మధ్యప్రాచ్య దేశాల నుంచి డిమాండ్ అధికమైంది. దక్షిణాసియా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వర్కెట్లు రికవరీ కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమైంది. ఎగుమతుల స్థిర డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం పెరిగేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. 2020–21లో దేశం నుంచి 32,77,724 యూనిట్ల టూ వీలర్లు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ -
బైకుల అమ్మకాలు ఢమాల్
వెబ్‌డెస్క్ : లాక్డౌన్ ఎఫెక్ట్‌తో బైకుల అమ్మకాలు మేలో ఢమాల్ అన్నాయి. ఒక్కసారిగా అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని స్టేట్స్లో లాక్డౌన్ అమలు చేశారు. దీంతో టూ వీలర్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ది ఫేడరేషన్ ఆఫ్ ఆటో మొబైల్ డీలర్ అసోసియేషన్స్ (ఫెడా) తాజా గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. 56 శాతం లాక్డౌన్ అమల్లోకి రాకముందు ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా టూ వీలర్స్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. 2021 ఏప్రిల్‌లో 6,67,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. మేలో ఈ సంఖ్య 2,95,257కి పడిపోయింది. ప్రత్యేకించి స్కూటర్ అమ్మకాలు మరీ దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో అమ్ముడుపోయిన యూనిట్ల సంఖ్య 3,00,462 ఉండగా మే వచ్చే సరికి ఈ సంఖ్య 50,294కి పడిపోయింది. మొత్తంగా టూ వీలర్ అమ్మకాల్లో 56 శాతం క్షీణత నమోదు అవగా స్కూటర్ సెగ్మెంట్లో 83 శాతం క్షీణత నమోదైంది. ఆటో అమ్మకాలు ఇలా ఆటో అమ్మకాలపై కూడా లాక్డౌన్ ప్రభావం పడింది. ఏప్రిల్‌లో 13,728 యూనిట్లు అమ్ముడు కాగా మే వచ్చే సరికి 1,251 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా 91 శాతం అమ్మకాలు పడిపోయాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ - రాజేశ్ మీనన్ (డైరెక్టర్ జనరల్) సోసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ దేశవ్యాప్తంగా మేలో లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దాని ప్రభావం ఆటో మొబైల్ పరిశ్రమపై పడింది. చాలా కంపెనీలు తయారీ యూనిట్లు మూసేశాయి. షోరూమ్‌లు తెరిచే అవకాశం లేకుండా పోయింది. అందువల్లే అమ్మకాలు బాగా తగ్గాయి. చదవండి: తగ్గనున్న టూ వీలర్ ధరలు.. ఈవీలపై సబ్సిడీ పెంపు -
e- vehicles: గుడ్‌న్యూస్.. తగ్గనున్న టూ వీలర్ ధరలు!
వెబ్‌డెస్క్ : ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1 kWhకి రూ.15,000 ప్రస్తుతం ఈవీ వెహికల్స్ తయారీకి సంబంధించి కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్ అవర్ (kWh) సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ. 15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 kWh బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. అథర్ స్పందన ఈవీ వెహికల్స్‌పై సబ్సిడీని ఒకేసారి 50 శాతానికి పైగా పెంచడంతో అథర్ సంస్థ తన స్కూటర్ల ధరలను వెంటనే తగ్గించింది. అథర్ 450ఎక్స్ మోడల్‌పై రూ. 14,500 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈవీ అమ్మకాలు జోరందుకుంటాయని అథర్ ఫౌండర్ తరుణ్ మెహతా ప్రకటించారు. రివోల్ట్ మోటార్స్ దీన్ని గేమ్ ఛేంజర్‌గా ప్రకటించింది. మరిన్ని కంపెనీలు ధరలు తమ ఈవీల తగ్గించే పనిలో పడ్డాయి. డిమాండ్ పెంచేందుకే ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్, ఛార్జింగ్ పరంగా 2 kWh సామార్థ్యం ఉన్న బైకులు పెట్రోలు బైకులకు ప్రత్యామ్నయంగా ఉన్నాయి. అయితే ధరల విషయంలో పోల్చినప్పుడు పెట్రోలు బైకుల కంటే ఈవీ బైకుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కష్టమర్ల నుంచి ఆశించిన మేరకు డిమాండ్ రావడం లేదు. దీంతో సబ్సిడీ ఇవ్వడం ద్వారా వెహికల్స్ ధర తగ్గించి, డిమాండ్ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఫేమ్ 2 ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (FAME) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది. Govt of India doubles down on its commitment towards #goingelectric. Subsidy for electric 2W increases under #FAME2 incentives. Which means a whopping ₹14,500 additional subsidy on the #ATHER450X. Haven't booked it yet? Now seems like a good time: https://t.co/HNCOb2bGc9 pic.twitter.com/t2qD3c5Qq6 — Ather Energy (@atherenergy) June 11, 2021 చదవండి: బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే -
బైక్ రైడింగ్‌తో నడుమునొప్పా.. అయితే ఇది మీకోసమే!
సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని నిర్ణీత ప్రమాణాలను పాటిస్తుంటారు. బైక్ నడుపుతున్నప్పుడు ఆయా అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉండేలాంటి (ఎర్గానమిక్స్) జాగ్రత్తలతో వాటిని తయారు చేస్తుంటారు. దాంతో దాదాపుగా అవయవ సమస్యలు రావు. ఒకవేళ బైక్‌లోని హ్యాండిల్‌బార్, సీట్, ఫుట్రెస్ట్స్ వంటి వివిధ అంశాలు సరైన ప్రమాణాలతో లేకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా బైక్ ఎర్గానమిక్స్ సరిగా లేక నడుమునొప్పి వస్తుందని అనుమానిస్తుంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది. ►బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. అలాగని మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా నడుమునొప్పి రావచ్చు. ►బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. నడుమునొప్పితో బాధపడేవారు తమ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, అలాగే వారు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి తగ్గవచ్చు. ఈ జాగ్రత్తల తర్వాత కూడా నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది. -
చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా...
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకుండా, పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకునే ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై చలాన్లను తప్పించుకోవటానికి నెంబర్ ప్లేటుపై ట్రిక్కులు చేయాలనుకుంటే తిక్క కుదురుతుందని హెచ్చరిస్తున్నారు. నెంబర్ ప్లేటు సరిగా లేని బైకులకు రూ. 200, ఉద్దేశ్యపూర్వకంగా బండి వివరాలను దాయాలని చూసేవారికి రూ. 500 ఫైన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ ఖాతాలో ‘‘ అనుకున్నది ఒక్కటీ, అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ..’’ అంటూ ఓ ట్విట్‌ను చేశారు. చలాన్ల వివరాలను అందులో పేర్కొన్నారు. ( కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి.. ) దీనిపై నెటిజన్లు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు..‘‘ హైదరాబాద్ పోలీసులనుంచి తప్పించుకోవటం కష్టం కాదు! అసాధ్యం.. ఇది మోసం సార్! అలాంటి వాళ్లను జైళ్లలో వేయాలి.. నగర పౌరులకు చలాన్లు విధించే డ్యూటీలో మీకు మీరే సాటి సార్!.. చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా ఇకపై లాభం ఉండదు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ) అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట...#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/H5gsDf3Gjv — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) November 9, 2020 -
ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్ మోటార్ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అవుట్‌లుక్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. -
ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు శుభవార్త
ముంబై: ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుంది. కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. ఈ అంశంపై ఓ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ద్విచక్రవాహనాల పరిశ్రమపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే మంచి వార్త వింటారని తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిమితిని తగ్గిస్తారని, తద్వారా తక్కువ ధరలకే వాహనాలు లభిస్తాయని, కంపెనీలకు ఎంతో లాభదాయకమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులకు ఎక్కువగా ఉపయోగపడే ద్విచక్రవాహనాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలకు 28శాతం జీఎస్టీ ఉంది. అయితే ద్విచక్రవాహనాలకు జీఎస్టీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో లిమిటెడ్, టీవీఎస్ మోటార్ కంపెనీల షేర్ల ఒక్కసారిగా 2నుంచి 6శాతం షేర్లు పెరిగాయి. త్వరలో జరగనున్న 41వ జీఎస్టీ సమావేశంలో ద్విచక్రవాహనాలపై జీఎస్టీ శాతం ఎంత ఉండేది స్పష్టత రావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (భారత్‌లో పెట్టుబడులు; పునరాలోచనలో అలీబాబా..) -
బీఐఎస్ నాణ్యత హెల్మెట్లు మాత్రమే..
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు మరింత భద్రత కల్పించేలా బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, హైవేల శాఖ ముసాయిదా నివేదికను ఇచ్చింది. దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఐ సర్టిఫికెట్ ఉండేలా నియమాలు తీసుకొని రానుంది. దీనివల్ల ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి పంపాలని కోరింది. -
వాహన కొనుగోలుదారులకు ఊరట
సాకి, న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. నేటి (ఆగస్ట్ 1) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు పెను భారంగా మారిన లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపసంహరించుకోనున్నాయి. దీంతో వినియోగదారులు మూడు లేదా ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన 2020 ఆగస్టు 1 తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు వర్తిస్తుంది. దీంతో ఇకపై కారు, లేదా బైక్ కొనే వారు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వెహికల్ ఆన్‌రోడ్ ధర కూడా దిగి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఎక్కువ కాలం ఒకే బీమా కంపెనీకి కట్టుబడి ఉండాల్సి అవసరం లేదు. ఇతర బీమా సంస్థలకు కూడా మారవచ్చు. కాగా వాహన యజమానులు ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లు, నాలుగు చక్రాల వాహనాలకు మూడేళ్లు దీర్ఘకాలిక పాలసీని 2018లో సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇది భారమవుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తాజా నిబంధనలను ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది. -
సొంత బండే సో బెటరు
సాక్షి, సిటీబ్యూరో: సగటు జీవికి లాక్డౌన్ అనేక పాఠాలను నేర్పించింది. ఇల్లుకదలకుండా చేయడమే కాదు..నిబంధనలను సడలించిన తర్వాత కూడా బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేసింది. లాక్డౌన్ సడలింపులతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. కానీ స్తంభించినప్రజారవాణా కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కేఅవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సిటీజనులు సొంత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, మధ్యతరగతికి చెందిన వర్గాలు లాక్డౌన్ సడలింపులతో ఆటోమొబైల్ షోరూమ్‌ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా వాహనాల అమ్మకాలు పెరిగాయి.ప్రత్యేకించి ద్విచక్రవాహనాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. గ్రేటర్లో సుమారు 10 వేల కొత్త వాహనాలు.. వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోయి ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో లాక్డౌన్ పిడుగుపాటుగా మారింది. దీంతో మార్చి 22 నుంచి మే రెండో వారం వరకు అన్ని రకాల వాహనాల అమ్మకాలు నిలిచిపోయాయి. షోరూమ్‌లు మూసివేశారు. ప్రభుత్వం దశలవారీగా లాక్డౌన్ నిబంధనలను సడలించింది. మొదట రవాణాశాఖ కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. ఆ తరువాత ఆటోమొబైల్ షోరూమ్‌లు తెరిచేందుకు అవకాశం ఇవ్వడంతో మే నెల 16వ తేదీ తర్వాత తిరిగి అమ్మకాలు మొదలయ్యాయి. లాక్డౌన్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న సగటు వేతన జీవులు సొంత వాహనాల వైపే మొగ్గుచూపారు. ‘లాక్‌డౌన్‌కు ముందు సొంత వాహనం కంటే సిటీ బస్సుల్లోనో, మెట్రో రైళ్లలోనో ప్రయాణం చేసి ఖర్చు తగ్గించుకోవాలనుకున్న వారు ఇప్పుడు అప్పు చేసైనా సరే సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణం భారంగా మారడం కూడా ఇందుకు కారణం.’ అని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాంకోటేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ ఆంక్షలను సడలించిన అనంతరం వాహనాల అమ్మకాలు 25 నుంచి 30 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో టూవీలర్స్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణాశాఖ లెక్క ల ప్రకారం గత నెల 16 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 11,570 వాహనాలు తాత్కాలికంగా నమోదు కాగా, వాటిలో సుమారు 10 వేల వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. రెండు నెలల పాటు లాక్డౌన్ కారణంగా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు చాలామంది బైక్‌లు కొనుగోలుకు ముందుకు రావడం గమనార్హం. లాక్డౌన్ సడలింపులతో బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, ప్రజారవాణా పట్టాలు ఎక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజారవాణా వాహనాలను వినియోగించడం వల్ల కరోనా వ్యాప్తి చెందవచ్చనే ఆందోళన కూడా కారణమే. దీంతో చాలామంది ఆటోలు, క్యాబ్‌లను వినియోగించేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఆర్టీఏ కేంద్రాల్లో పెరిగిన స్లాట్లు.. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వాహనాల రిజిస్ట్రేషన్లు, లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి వివిధ రకాల పౌరసేవల కోసం పరిమితంగా స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ కొద్ది రోజులుగా వీటి సంఖ్యను పెంచింది. గతంలో ఒక్కో కార్యాలయంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 50 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ మేరకు 80 నుంచి 100 స్లాట్ల వరకు పెంచారు. వాహన వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు స్లాట్లను అంచనా వేస్తూ పెంచుతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 1000 వాహనాల వరకు నమోదు చేసే అవకాశం ఏర్పడింది. మరోవైపు ఆన్లైన్లోనే అన్ని రకాల అనుమతులను పొందే సదుపాయాన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. -
2021 నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
సాక్షి, న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఓలా ఎలక్ట్రిక్) బుధవారం వినూత్నఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు నెదర్లాండ్స్ కు చెందిన ఎటెర్గో బీవీ ను స్వాధీనం చేసుకుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా, జాతీయంగా ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. ఓలా ఎలక్ట్రిక్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని 2021లో భారతదేశంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. అయితే డీల్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. రానున్నకాలంలో పట్టణాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందనీ, ప్రధానంగా కోవిడ్-19 తరువాత ప్రపంచం మారుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నగరాల్లో టూ, త్రీ వీలర్ల ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించినట్టు తెలిపింది. యూరోపియన్ డిజైన్, బలమైన ఇంజనీరింగ్ సహకారంతో, ఇండియా సప్లయ్ చైన్ సహాయంతో అటు గ్లోబల్ ద్విచక్ర వాహన మార్కెట్‌ను, ఇటు భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ ను క్లీన్ ఎనర్జీ, డిజిటల్ భవిష్యత్తుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) ప్రతి సంవత్సరం, కార్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు దాదాపు రెండు రెట్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ భవీష్ అగర్వాల్ అన్నారు. అందుకే విద్యుత్, డిజిటల్ అనుసంధాన సామర్థ్యాలతో, ఇంజనీరింగ్, డిజైన్, తయారీలో ఉత్తమమైన ప్రపంచ సామర్థ్యాలను పెంపొందించేందుకు చూస్తున్నామన్నారు. ఇప్పటికే రాజధాని ఢిల్లీలో బ్యాటరీ మార్పిడి, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో భారతదేశంలోని ప్రముఖ విద్యుత్ పంపిణీ సంస్థలతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా 2014లో ఏర్పాటైన ఎటెర్గో ఆల్-ఎలక్ట్రిక్ యాప్ స్కూటర్‌ను అభివృద్ధి చేసి 2018 లో విడుదల చేసింది. 240 కిలోమీటర్లు దూసుకెళ్లే అధిక శక్తి సాంద్రత గల బ్యాటరీని ఇందులో అమర్చింది. వినూత్న డిజైన్, ఇంజనీరింగ్ ఫీచర్లను సొంతం చేసుకున్న ఈ స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను గెలుచుకుంది. -
చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్
సాక్షి, హిందూపురం: ‘మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్రవాహనాలను స్టేషన్లో ఎండ పెట్టకుండా వదిలేయండి’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐలు బాలమదిలేటి, మన్సూరుద్దీన్‌లతో అన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లలో ఉంచారు. అవి ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనిపై సాక్షిలో కథనం కూడా ప్రచురితమైంది. చదవండి: దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ.. ఈ క్రమంలో గురువారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాట్లాడారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా పోలీసులకు సూచించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' -
పోలీస్ స్టేషన్లు ‘హౌస్‌ఫుల్’
సాక్షి, ఖమ్మం : లాక్డౌన్ మరింత కఠినతరం అవుతున్నా నిబంధనలు ఉల్లంఘిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఆ వాహనాలతో పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. ఖమ్మం నగరంలో అయితే నాలుగు పోలీస్స్టేషన్లు వాహనాలతో నిండిపోవటంతో స్టేషన్లను పరిశీలించిన ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వీటిని ప్రకాష్ నగర్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు ‘సిటిజన్ ట్రాకింగ్ మాప్ ఫర్ కోవిడ్’ అనే అప్లికేషన్‌ను అమలులోకి తెచ్చినా పరిస్థితి అదుపులోకి రావటం లేదని తెలుస్తోంది. (గౌస్ మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్ ) దయచేసి సహకరించండి కరోనా నియంత్రణకు ప్రజలకు పూర్తిగా సహకరించాలి. అత్యవసరమైతే తప్ప, అకారణంగా రోడ్లపైకి రావద్దు. ఒక్కసారి వాహనం సీజ్ అయితే లాక్డౌన్ ముగిసేంతవరకు వాహనం బయటకురాదు. ఆ తర్వాత కోర్టులో విధించే జరిమానా కట్టుకోవాలి. ఇన్ని ఇబ్బందులు పడేకన్నా వాహనదారులు ఇంట్లోనే ఉండటం మంచిది. (బాలయ్య, చిరులకు ఎన్టీఆర్ చాలెంజ్) – శ్రీధర్ త్రీటౌన్ సీఐ -
కొండచిలువ కలకలం
కర్ణాటక ,క్రిష్ణగిరి: సూళగిరి సమీపంలోని అటవీ ప్రాంత గ్రామంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్రవాహనంపైకి పాకుతున్న 10 అడుగుల కొండ చిలువను స్థానికులు బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సూళగిరి సమీపంలోని డ్యాం ఎబ్బళం గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలోకి తరచూ సర్పాలు వస్తుంటాయి. సోమవారం ఉదయం రోడ్డుపక్కన నిలిపిన ఓ బైక్ మీదికి పెద్ద కొండచిలువ పాకుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు దానిని కట్టెతో అడ్డుకుని బంధించారు. అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. అటవీ ప్రాంతం నుండి విషపురుగులు గ్రామంలోకి చొరబడక అటవీశాఖాధికార్లు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
చేతక్ ఎలక్ట్రిక్ @ రూ. లక్ష
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఒకప్పటి తన ఐకానిక్ స్కూటర్ ‘చేతక్’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ–స్కూటర్ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్–షోరూం ధరని కంపెనీ వివరించింది. అంటే, రోడ్ ట్యాక్స్, బీమా కలపని ధర ఇది. డిస్క్ బ్రేక్‌లు, లగ్జరీ ఫినిషింగ్ కలిగిన ప్రీమియం ఎడిషన్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ సంక్రాంతి పండుగ రోజే (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. సంస్థ వెబ్సైట్ ద్వారా ఈ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని, ఇందుకు ఇనీషియల్ అమౌంట్ కింద రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. మూడేళ్ల వారంటీ..: ఈ–స్కూటర్‌కు ఏడాదికి ఒకసారి లేదంటే.. 12,000 కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారీ కనీస నిర్వహణ అవసరమని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు 50,000 కిలోమీటర్ల వరకు లేదంటే, మూడేళ్లు ఏది ముందైతే అది వారంటీగా లభిస్తుంది. లిథియం–అయాన్ బ్యాటరీకి కూడా వారంటీ వర్తిస్తుంది. అతి నియంత్రణ వల్లే రేట్ల పెంపు.. ఏడాదిన్నరలో 30% పెరగనున్న ద్విచక్ర వాహనాల ధరలు బడ్జెట్‌పై పెద్దగా ఆశల్లేవు: బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఏడాదిన్నర వ్యవధిలో ద్విచక్ర వాహనాల ధరలు 30 శాతం మేర పెరగనున్నాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. మార్కెట్లను ’అతిగా నియంత్రించడమే’ ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ఉద్గార నిబంధనల అమలు ప్రభావం తదితర నియంత్రణపరమైన అంశాలను బజాజ్ ఉదహరించారు. చేతక్ స్కూటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంఛనంగా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కొత్తగా భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయాల్సి రానుండటంతో స్టేజ్–4 తో పోలిస్తే రేట్లు మరింత పెంచాల్సి వస్తుందంటూ ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బజాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, విద్యుత్ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని 5 శాతంగా కేంద్రం నిర్ణయించినప్పటికీ.. కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28 శాతం కొనసాగుతోందని బజాజ్ చెప్పారు. దీన్ని 18 శాతానికైనా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే అంశాలేవీ బడ్జెట్లో ఉంటాయని తానేమీ ఆశించడం లేదని బజాజ్ తెలిపారు. -
మూడు బైక్‌లు.. ఆరుగురు దొంగలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మూడు బైకుల్లో ఆరుగురు దొంగలు కలియతిరుగుతూ ఎంచక్కా చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజులుగా జిల్లాలో మకాం వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి నుంచి మొదలైన ఈ దొంగల ప్రహసనం.. జిల్లా వరకూ కొనసాగుతోంది. సరిగ్గా 15 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో బైకులపై ఆరుగురు వచ్చి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి కర్నూలు మీదుగా జిల్లాకు మంగళవారం చేరుకున్నారు. ప్రధానంగా డబ్బు, బంగారం, పట్టుచీరలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. కళ్లెదుటే మద్యం సీసాలు కనపడ్డా.. కన్నెత్తి కూడా చూడకుండా తమ పని కానిచ్చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఎక్కడా సీసీ కెమెరాకు కూడా చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. 15 రోజుల క్రితం వనపర్తిలో మొదలైన ఈ వరుస దొంగతనాల వ్యవహారం కర్నూలు జిల్లాలోని గార్గేయపురం, పత్తికొండ ప్రాంతాల్లోని ఇళ్లలో లూటీ చేశారు. అక్కడి నుంచి జిల్లాలోకి మంగళవారం రాత్రి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అదే రోజు ఒకేసారి మూడు ప్రాంతాల్లో ఇళ్లతో పాటు ప్రభుత్వ మద్యం దుకాణంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారు. బైకులపై వచ్చి.. : ఆరుగురు దొంగలు మూడు బైకులపై వస్తున్నారు. ఒకరు బైకు ఆన్ చేసుకుని సిద్ధంగా ఉంటుండగా.. మిగిలిన ఇద్దరు ఎవ్వరూ లేని ఇంట్లోకి వెళ్లి లూటీ చేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇళ్లకు వేసిన తాళాలను కట్టర్ ద్వారా కోసేసి సులువుగా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో రాప్తాడు మండలంలోని రెండు గ్రామాల్లో ఆరు ఇళ్లతో పాటు ధర్మవరం మండలంలోని చిగిచెర్లలో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అంతేకాకుండా కందుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కూడా లక్షన్నరకు పైగా నగదును దోచుకెళ్లారు. ఈ మద్యం దుకాణంలో భారీగా మద్యం ఉన్నప్పటికీ కనీసం ఒక్క బాటిల్ కూడా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ మద్యం దుకాణం ముందు ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో వీరి పని మరింత సులులైంది. మొత్తం నగదును క్యాష్చెస్ట్లో పెట్టకుండా డ్రాలో ఉంచడంతో వీరి పని సులువుగా ముగిసింది. దొంగలు సరిగ్గా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకోవడం విస్తుగొలుపుతోంది. దర్యాప్తు చేస్తున్నాం.. జిల్లాలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు బైక్‌లపై ఆరుగురు తిరుగుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. దర్యాప్తు చేస్తున్నాం. కొద్దిరోజుల క్రితం కర్నూలులో కూడా దొంగతనాలు జరిగాయి. వారు, వీరు ఒకరేనా అనేది కూడా పరిశీలిస్తున్నాం. త్వరలో దొంగలను పట్టుకుంటాం. – సత్యయేసు బాబు, జిల్లా ఎస్పీ -
హీరో మోటో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ
న్యూఢిల్లీ: ద్విచక్ర మోటారు వాహనాల మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశ్యంగా పేర్కొంది. ఈ పథకం ఈ నెల (సెపె్టంబర్) 28వరకు అమల్లో ఉంటుంది. 40 ఏళ్లు, అంతకు మించి వయసులో ఉన్న వారు, కంపెనీలో కనీసం ఐదేళ్ల సర్వీసు (స్థిరంగా) పూర్తి చేసినవారు అర్హులుగా కంపెనీ తెలిపింది. ఉద్యోగి కంపెనీలో ఎన్నేళ్ల పాటు పనిచేశారు, పదవీ విమరణకు (58 ఏళ్లు) ఇంకా ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది?.. తదితర అంశాల ఆధారంగా ఏకీకృత చెల్లింపుల మొత్తాన్ని కంపెనీ నిర్ణయిస్తుంది. ఆటోరంగం మందగమన పరిస్థితుల్లో కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
వాహనదారులు అప్రమత్తం
సాక్షి, అమరావతి బ్యూరో : ‘నేను ఐదేళ్లుగా విజయవాడ నగరంలో ఉంటున్నాను. నగరానికి వచ్చిన కొత్తలో ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాను. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా బండికి ఇన్సూ్యరెన్స్ చేయించకుండానే సంచరించాను. ఈ–చలానాల విషయంలో పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ సవరించిన చట్టం అమలు చేస్తారని తెలియడంతో అప్రమత్తం కావాల్సి వచ్చింది. రెండు రోజుల కిందటే వాహనానికి ఇన్సూ్యరెన్సు చేయించాను. గతంలో వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపితే ఎవరో ఒకరితో ఫోన్ చేయించడమో.. ఏదో ఒకటి చెప్పి వెళ్లడమో జరిగేది. కొత్త చట్టం అమల్లోకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు జేబు గుల్ల అయ్యే ప్రమాదం ఉండటంతో జాగ్రత్త పడ్డాను.’–ఓ వాహనదారుడు ..మోటారు వాహనాల చట్టం–1988కు సవరణల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. జరిమానాలు భారీగా వి«ధించడంతోపాటు జైలు శిక్ష ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, ఇన్సూ్యరెన్స్ పత్రాలు లేకుండా, వాహన రిజిస్ట్రేషన్ చేయించకుండా జల్సాగా తిరుగుతున్న వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. బీమా కంపెనీలకు పరుగులు పెడుతున్నారు. మొన్నటి వరకు రోజుకు 40–50 వరకు ఉండే ఎల్ఎల్ఆర్ స్లాట్ల బుకింగ్‌లు ఒక్కసారిగా 30 శాతం పెరిగాయంటే ప్రజలు ఎంత జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతోంది. గరిష్టంగా రూ.25 వేలు జరిమానా.. గతంలో అయితే విజయవాడ కమిషనరేట్ పరిధిలో చాలా జరిమానాలు రూ.100 వరకే ఉండేవి. సేవారుసుం రూ.35 కలుపుకొని రూ.135 కడితే సరిపోయేది. మోటారు వాహన చట్టంలో తాజా సవరణల కారణంగా ఎక్కువ ఉల్లంఘనలకు రూ.5వేల వరకు విధించే అవకాశం కనిపిస్తోంది. గరిష్ఠంగా రూ.25 వేల వరకు బాదే ప్రమాదముండటం ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అంశంగా మారింది. దీనికితోడు కొన్ని ఉల్లంఘనల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేసే అవకాశముండటమూ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మైనర్లకు వాహనాలిచ్చిన యజమానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడనుండటం వాహనదారుల్ని వణికిస్తోంది. నూతన చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ఉల్లంఘనులపై చర్యలతోపాటు జరిమానాలు పిడుగుపాటు మాదిరిగా తాకే అవకాశముండటంతో ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇన్సూ్యరెన్స్ కియోస్క్‌ల వద్ద సందడి వాహన పత్రాలంటే సాధారణంగానే రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుకొస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే చాలావరకు షోరూం నిర్వాహకులే రిజిస్ట్రేషన్‌తోపాటు ఇన్సూ్యరెన్స్ చేయించడం సర్వసాధారణం. ఇన్సూ్యరెన్సు కాలపరిమితి తీరిన తర్వాత పునరుద్ధరించుకోవడంలోనే చాలామంది వాహనదారులు బద్ధకిస్తుంటారు. ఇన్సూ్యరెన్‌స పునరుద్ధరించని సమయంలో వాహనదారుడు ప్రమాదానికి గురైతే జరిగే ఆర్థిక, ప్రాణనష్టం ఖాయం. వాహన ఇన్సూ్యరెన్స్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కీలక దృష్టి సారిస్తుండటంతో చాలామంది వాహనదారులు వాహన బీమా పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు. పెట్రోల్‌బంక్‌ల్లోని కియోస్క్‌ల వద్ద సందడి పెరగడమే ఇందుకు తార్కాణం. జరిమానాలు ఇలా... ♦ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కితే మోటారు వాహనాల చట్టంలోని 181 సెక్షన్ ప్రకారం గతంలో రూ.500 జరిమానా ఉండేది. తాజా సవరణల క్రమంలో అది రూ.5 వేలు విధించే అవకాశముంది. ♦ ఇన్సూ్యరెన్స్ చేయించని వాహనాన్ని నడుపుతూ దొరికితే 196 సెక్షన్ ప్రకారం గతంలో రూ.1,000 జరిమానా విధించేవారు. సమీప భవిష్యత్తులో రూ.2వేల వరకు విధించొచ్చు. ♦ చట్టంలోని 206 సెక్షన్ ప్రకారం పోలీసు అధికారులు అవసరమైతే వాహన పత్రాల్ని స్వాధీనపరుచుకునే అధికారముంది. గతంలో ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇకపై పత్రాల విషయంలో అనుమానముంటే ఈ నిబంధనపై గట్టిగా దృష్టి సారించే అవకాశముంది. ♦ ఉల్లంఘనను బట్టి అవసరమైతే 183, 184, 185, 189, 190, 194సి, 194డి, 194ఇ సెక్షన్ల ప్రకారం పోలీసులు పత్రాల్ని జప్తు చేసి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయొచ్చు. ధ్రువపత్రాలు తప్పనిసరి మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలున్నాయన్న సంగతి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. డ్రైవింగ్ లైసెన్సుతో సహా బీమా, కాలుష్య పరిమితి పత్రం.. ఇలా అన్నీ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో పట్టుపడితే భారీ జరిమానాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు వీటిని తమ వద్ద ఉంచుకోవాలి. అలా కానీ పక్షంలో ఎం–పరివాహన్ మొబైల్ యాప్‌లో మన వివరాలు నమోదు చేసుకుంటే అవి మనతోనే ఉంటాయి. ఎం–పరివాహన్ మొబైల్ యాప్‌ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూపొందించింది. – ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, -
ఫైన్ పడకుండా జిమ్మిక్కులు
సాక్షి, మంచిర్యాల : నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చేపట్టిన చర్యల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ట్రాఫిక్‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వాహనదారులకు తెలియకుండానే పోలీసులు ఫొటోలు తీసి వాహనం నంబర్ ఆధారంగా ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తూ ఆన్లైన్లో నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు పోలీస్ కెమెరాకు చిక్కకుండా వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే హల్చల్ చేస్తున్నారు. నంబర్ ప్లేట్ ఉన్నా వారు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి తమకాళ్లతో, చేతులతో నంబర్‌ప్లేట్ కనిపించకుండా రయ్‌మని వెళ్లిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. పత్రాలు మార్చుకోవడంలో జాప్యం పాత వాహనాలు కొనుగోలు కొనుగోలు చేసినవారు పత్రాలు మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఈ–చలాన్ ద్వారా వాహనం ఎవరి పేరుమీద ఉంటే వారే బాధితులకు నష్టపరిహారం కట్టించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటివల తేల్చి చెప్పింది. దీంతో యాజమాన్య హక్కులు బదలాయింపులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా... ఇబ్బందులకు గురైనట్లే. ఇంతేకాదు ఇటీవల పోలీస్‌శాఖ రహదారి నిబంధనల్లో కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈ–చలాన్ విధానం అమలు చేస్తోంది. దీంతో వాహనాలు ఎవరి పేరుమీద ఉంటే వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు వాహనాల పత్రాలను మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో వారు దానికి జరిమానా విధించాల్సి వస్తుంది. వాహనాలు విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరుమీద త్వరగా పత్రాలను మార్చేయాలి. లేదంటే ఇబ్బందులకు గురికావల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం తగదు హైదరాబాద్, విజయవాడ, మహారాష్ట్రలాంటి పెద్దపెద్ద నగారాల్లో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారానికి పెట్టింది పేరు. ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా వాహనాలు కొనుగోలు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 150వరకు కన్సల్టెన్సీలు ఉన్నాయి. కొందరు దొంగ వాహనాలను కొనుగోలు చేసి వాటికి పత్రాలు లేకున్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వాహనాదారుల నుంచి పత్రాలు తీసుకుంటున్నా కొనేవారి పేరుతో బదిలీ చేయడంలో తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు వాహన యజమాని ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు ఇది కొంతమేర తలనొప్పిగానే మారే అవకాశం ఉందని ఓ అధికారి అనడం గమనార్హం. అసలు యజమాని ఎవరో తెలియక ఎవరి పేరుమీద వాహనం రిజిష్టర్ అయి ఉంటుందో వారికే ఈ–చలాన్ ద్వారా జరిమానా నోటీస్ వెళ్తుందన్నారు. అప్పుడు ఎవరూ ఏమీచేయలేరని ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానా విధించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరిపై చర్యలేవీ? నంబర్ ప్లేట్ లేని వాహనదారులు, ఉన్నవారు నంబర్ ప్లేట్‌పై ఉన్న నంబర్ కనిపించకుండా కాళ్లు, చేతులు అడ్డుపెట్టి తప్పించుకొని తిరుగుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
చిన్న బండి.. లోడు దండి!
సాక్షి, అనకాపల్లి టౌన్ (విశాఖపట్నం): దినదినాభివృద్ధి చెందుతున్న అనకాపల్లి పట్టణంలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధాన రహదారి మినహా మిగతా రహదారులు చిన్నవి కావడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది. విస్తరణకు నోచుకున్న ప్రధాన రహదారిలో వన్‌వే ఆంక్షలు విధించడంతో ఇరుకు వీధి రోడ్లలో కూడా భారీ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వీధుల్లో ద్విచక్ర వాహనాలపై కొంతమంది చిరు వ్యాపారులు పెద్దఎత్తున సామగ్రి కట్టుకొని వెళ్తుండడంతో ఆ వాహనం వెళ్తే గాని మరో వాహనం వచ్చే పరిస్థితి లేదు. పాదచారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారదానది వంతెనపై నుంచి వచ్చే ఆటోలను నెహ్రూచౌక్ మీదుగా వెళ్లనీయకపోవడంతో పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న శ్రీధర్లాడ్జి వీధి రహదారి మీదుగా వెళ్లి రామచంద్ర థియేటర్ ప్రధాన రహదారికి చేరుకోవాల్సి వస్తోంది. ఇరుకుగా ఉండే ఈ రహదారిపై అధికలోడు వాహనాలతో పాటు ఒక్కో సమయంలో భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు నిత్యం ఏర్పడుతున్నాయి. పట్టణంలో దాదాపు అన్ని వీధి రోడ్లలో ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నంబర్లు కూడా కనిపించని రీతిలో.. కొందరు ద్విచక్రవాహనాలపై అధిక లోడుతో ప్రయాణించే సమయంలో వాహనం నంబర్లు కనిపించడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత వాహనదారుడిని పోలీసులుకాని, ఆర్టీవో అధికారులు కాని గుర్తించడం కష్టమే. చూడ్డానికి ద్విచక్ర వాహనమే అయినా రోడ్డంతా ఆక్రమించేలా భారీ సామగ్రితో వెళుతున్నాయి. వీటి కారణంగా ఇతర వాహన చోదకులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారిపై ఆంక్షలు ఎత్తివేయాలి ప్రధాన రహదారులపై ఆంక్షలు ఎత్తివేస్తే ద్విచక్ర, ఆటోరిక్షా వంటి వాహనాలు ఎక్కువగా ఆ రోడ్లపై ప్రయాణిస్తాయి. వీధి రహదారులపై ద్విచక్ర వాహనాలు, పాదచారులు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ప్రధాన రహదారిగుండా ఆటోలను వెళ్లనీయకపోవడం, అధికలోడు వాహనాలకు అవే ఆంక్షలు వర్తించడంతో వీధి రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తక్షణం ప్రధాన రహదారులపై ఒన్‌వే ఆంక్షలు ఎత్తివేయాలి. –రాజు, వాహనచోదకుడు, నర్సింగరావుపేట అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు ద్విచక్రవాహనాలపై అధికలోడు వేసుకొని వెళితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. లోడుకు ప్రభుత్వం కొన్ని వాహనాలు సమకూర్చింది. వాటిని మాత్రమే వినియోగించాలి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన వారిపై చర్యలు తప్పవు. – కిరణ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, అనకాపల్లి -
ఒక వాహనం.. 73 చలాన్లు
సనత్‌నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది కాదు అంతకంటే కాదు.. ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 73 పెండింగ్ చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ట్రాఫిక్ పోలీసులు సదరు ద్విచక్ర వాహనాన్ని గుర్తించి ఆ చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం మహంకాళి పోలీసులు సోదాలు చేస్తుండగా ఏపీ 09 సీడబ్లు్య 6418 నెంబర్ బైక్‌పై ఉన్న చలాన్లను ఆన్లైన్లో చెక్ చేశారు. దీంతో 73 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. అప్పటికప్పుడే సదరు వాహనదారుడి నుంచి మొత్తం రూ.13,120 పోలీసులు వసూలు చేశారు. -
ద్విచక్ర వాహనంపై ఏఎస్పీ పర్యటన
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని కొండపై ఉన్న చాపరాయి జంగిడిభద్ర గ్రామానికి పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ్ సతీసమేతంగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏఎస్పీ ద్విచక్రవాహనంతో వెళ్లారు. ఏజెన్సీలోని గిరిజనులకు ఓటు వినియోగం విషయంలో పలు సూచనలు చేసేందుకు మంగళవారం ఆయన పర్యటించారు. ఆయన వెంట ఎల్విన్‌పేట సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ వి.జ్ఞానప్రసాద్ ఉన్నారు. -
మహిళలకు తోడుగా ‘ఉమెన్ ఆన్ వీల్స్’
ఖైరతాబాద్: నగరం పోలీసు విభాగంలో షీ టీమ్స్ తరహాలోనే పెట్రోలింగ్ వ్యవస్థలో ఉమెన్ ఆన్ వీల్స్ కూడా కీలకంగా మారుతుందని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ‘‘ఉమెన్ ఆన్ వీల్స్’’ విధుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థలో మహిళా కానిస్టేబుళ్లతో ‘ఉమెన్ ఆన్ వీల్స్’ పేరుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. షీ టీమ్స్ తరహాలోనే పెట్రోలింగ్ వ్యవస్థలో పురుషులకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు. వారికి రెండు నెలల పాటు డ్రైవింగ్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్, ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఈ తరహా పోలీసింగ్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఇప్పటివరకు మహిళా కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్, రిసెప్షనిస్ట్‌లుగా మాత్రమే పరిమితమయ్యారన్నారు. ఎన్టీఆర్గార్డెన్, లుంబినీపార్క్, సంజీవయ్యపార్క్, మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలు ఈవ్‌టీజింగ్ తదితర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉమెన్ పెట్రోలింగ్ సిబ్బందితో మహిళలు వారి సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు వీలవుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ‘ఉమెన్ ఆన్ వీల్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 20మంది కానిస్టేబుళ్లు అవగాహన కల్పించేందుకు పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ రోటరీ చౌరస్తా, లుంబినీపార్క్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, చిక్కడపల్లి, ఆబిడ్స్, లేక్ పోలీస్స్టేషన్ల పరిధిలో వీరు విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో షీ టీమ్స్ ఏసీపీ నర్మద, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ చింతల సైదిరెడ్డి, సీసీఎస్ అడ్మిన్ పూర్ణచందర్, నాంపల్లి రాజేష్, రాంగోపాల్‌పేట్ బాబు ఇన్స్ప్పెక్టర్లు పాల్గొన్నారు. సమస్యలను ధైర్యంగా చెప్పుకోవచ్చు మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు 100కు డయల్‌చేసిన వెంటనే పెట్రోలింగ్ విధుల్లో ఉండే పురుషులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వారి సమస్యలను నేరుగా చెప్పలేకపోవచ్చు. ఆ విధుల్లో మేము ఉండటం వల్ల వారు ధైర్యంగా వారి ఇబ్బందులు మాతో చెప్పుకోగలరు. విధులను చాలెంజ్‌గా తీసుకుంటా.– పుష్యమిత్ర, చాంద్రాయణగుట్ట పీఎస్ కొత్త ఒరవడికి శ్రీకారం ఉమెన్ ఆన్ వీల్స్ అనే కొత్త వరవడికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా మాకు రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలకు నేరుగా సేవచేసేందుకు ఇదో మంచి అవకాశం. – నాగకుమారి, చాంద్రాయణగుట్ట పీఎస్ -
ఏడు లక్షల ద్విచక్ర వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచింది. 2017–18లో అయిదు లక్షల పైచిలుకు సుజుకి టూవీలర్లు రోడ్డెక్కాయి. 2020 నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకోవాలన్నది లక్ష్యమని సంస్థ సేల్స్, మార్కెటింగ్ జోనల్ మేనేజర్ కేఎన్‌వీఎస్ సురేశ్ సోమవారం తెలిపారు. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా రీజినల్ మేనేజర్ పంకిత్ మోడి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘యాక్సెస్ 125 స్కూటర్‌కు మంచి డిమాండ్ ఉంది. సీబీఎస్ వేరియంట్‌తోపాటు స్పెషల్ ఎడిషన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టాం. 150 సీసీ సెగ్మెంట్లో కంపెనీకి 8% వాటా ఉంది. ఈ విభాగంలో ఇంట్రూడర్ హల్చల్ చేస్తోంది. నెలకు 5,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 200 ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 25 శాతం వాటా చేజిక్కించుకున్నాయి.’ అని వివరించారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధర రూ.70,292 ఉంది. -
ఇక ఇద్దరికీ హెల్మెట్ ‘పట్టుకుంటే పదివేలు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పట్టుకుంటే పదివేలు’. ఇదేదో మంచి సినిమా టైటిల్‌లాగుందే అనుకుని తీసిపారేస్తే ‘తప్పు’లో కాలేసినట్లే. మోటార్ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారిద్దరూ ఇక శిరస్త్రాణం ధరించడం తప్పనిసరని మద్రాసు హైకోర్టు తాజాగా ఆదేశించింది. మీరినవారు పట్టుబడితే రూ.10వేలు జరిమానా వసూలు చేయాలని పోలీస్‌శాఖ భావిస్తున్నట్లు సమాచారం. మోటార్ సైకిళ్లలో వెళ్లేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ 2015లో ఆదేశించారు. ఈ ఆదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు విజృంభించి హెల్మెట్ లేకుండా బైక్‌లో ప్రయాణిస్తున్న వారిని పట్టుకుని కేసులు పెట్టారు. అంతేగాక బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కోర్టులు, మొబైల్ కోర్టులు ద్విచక్రవాహన చోదకులతో కిటకిటలాడాయి. కోర్టులో జరిమానా చెల్లించనదే బైక్‌లు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఆ తరువాత క్రమేణా పోలీసు జోరు తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ దశలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు శివజ్ఞానం, భవాని సుబ్బరాయన్ ముందు న్యాయవాది రాజేంద్రన్ కోర్టులో గురువారం హాజరై హెల్మెట్ అంశాన్ని లేవనెత్తారు. బైక్‌లలో వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు వేసుకోవాలనే నిబంధన సక్రమంగా అమలు కావడం లేదని చెప్పారు. నిబంధనలను అమలుచేయడంలో ట్రాఫిక్ పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. దీంతో న్యాయమూర్తులు గురువారం మరలా ఆదేశాలు జారీచేశారు. మోటారు ద్విచక్రవాహనాల్లో వెళ్లే ఇద్దరూ హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించేపుడు డ్రైవర్ సహా అందరూ సీటు బెల్టు వేసుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనలను పాటించాలని చెప్పారు. హెడ్లైట్లకు మధ్యలో నలుపు స్టిక్కర్ అతికించి ఉందా అని కూడా గమనించాలని సూచించారు. ఇందుకు సంబంధించి డీజీపీ ఈనెల 27వ తేదీన హైకోర్టులో ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. హెల్మెట్, సీటుబెల్టు ఆదేశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరించనివారి నుంచి రూ.10వేల వరకు జరిమానా వసూలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. -
మీ బండిని ఎండలో పార్క్ చేస్తున్నారా..
గుంటూరు: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. సాయంత్రం ఆరు గంటల వరకు చల్లదనం మాటే వినిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు మన వాహనాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. లేనిపక్షంలో ఎండ తీవ్రతకు అవి దెబ్బతిన మన జేబులను ఖాళీ చేయిస్తాయి. ఈ నేపథ్యంలో కొద్దిపాటి జాగ్రత్తలతో వాహనాలను ఎలా సంరక్షించుకోవాలో చూద్దాం రండి.. ద్విచక్ర వాహనాల విషయంలో ఇలా... ♦ ద్విచక్ర వాహనాలను ఎక్కువ సేపు ఎండలో ఉంచకూడదు. ♦ అలా ఉంచడం వల్ల ట్యాంకులోని పెట్రోలు ఆవిరైపోతుంది. ♦ అతినీలలోహిత కిరణాల ప్రభావంతో వాహనం రంగు వెలిసిపోతుంది. ♦ పార్కింగ్‌లో ఎక్కువ సేపు ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా కవర్లు కప్పాలి. ♦ రాత్రి వేళల్లో పెట్రోలు కొట్టించాలి. ఆ సమయంలో వేడి తీవ్రత తక్కువగా ఉండి ఆవిరి కాకుండా ఉంటుంది. ♦ అధిక వేడి వల్ల తరచూ టైర్లలో గాలి తగ్గిపోతుంది. అది గమనించి సరైన మోతాదులో గాలి నింపుకోవాలి. ♦ ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. ♦ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రతి 20 కిలోమీటర్లకు ఒకసారి బండి ఆపాలి. ♦ సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇంజిన్ ఆపివేయాలి. దీని వల్ల ఇంజన్ చల్ల బడి అధిక మన్నిక వస్తుంది. ♦ వేసవిలో ఇంజిన్ ఆయిల్ త్వరగా శక్తి కోల్పోతుందని గమనించండి. ♦ కనుక ఇంజిన్ ఆయిల్ ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ♦ వారంలో ఒక్కసారైన బ్రేక్ షూలు, రబ్బరు విడిభాగాలు చెక్ చేసుకోవాలి. ♦ అధిక వేడి వల్ల రబ్బరు విడిభాగాలు త్వరగా దెబ్బతింటాయి. నాలుగు చక్రాల విషయంలో ఇలా... ♦ కార్లు, ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లో నీటిని తరచూ చెక్ చేసుకోవాలి. ♦ నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ♦ రేడియేటర్లో నీళ్లకంటే కూలెంజ్ ఆయిల్ వాడడం మంచిది. ♦ ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కనుక తరచూ ఆయిల్ లెవల్ చెక్ చేసుకోవాలి. ♦ ఎండకాలం పూర్తయ్యే వరకూ కొత్త టైర్లు వాడాలి. ♦ వేసవిలో టైర్లు వేయించాల్సి వస్తే సెకండ్స్, చైనా, రీబటన్ టైర్లు జోలికి వెళ్లకపోవడం మంచిది. ♦ వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు నీడలో ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి. ♦ లేనిపక్షంలో కవర్ కప్పి ఉంచాలి. ఎక్కువ సేపు ఎండలో ఉంటే వాహనం రంగు పాలిపోతుంది. ♦ ఇప్పుడు వస్తున్న వాహనాలన్ని ప్యూజిల్ కంప్యూటర్లతో అనుసంధానమై ఉంటున్నాయి. ♦ కనుక వాహనాల్లోని వైరింగ్ వ్యవస్థను ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ♦ కార్లకు పెట్రోల్ స్థానంలో ఎల్పీజీ గ్యాస్ కిట్లు అమర్చుకుని వాటిని ఉపయోగించే వారు ఈ వేసవిలో వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ♦ వంట గ్యాస్ అసలు వినియోగంచరాదు. ♦ అధిక ఉష్ణోగ్రతల వల్ల గ్యాస్ పీడనానికి గురయ్యే ప్రమాదం ఉంది. ♦ తప్పని సరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం ఎండతీవ్రత లేని వేళల్లో వాడటం మంచిది. ♦ కారులో ఏసీ నిలబడేందుకు సెడ్ అద్దాలకు ఫిల్మ్ లేని వారు అద్దాలకు సరిపడా క్లాత్ మ్యాట్స్ లభిస్తున్నాయి. వాటిని అద్దాలకు అమర్చుకోవచ్చు. -
హైవేపై ఆటోలు నిషేధం
జాతీయ రహదారిపై ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించినట్లు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు మంగళవారం ప్రకటించారు. ఇక నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాలు సర్వీసు రోడ్డులో మాత్రమే ప్రయాణించాలని స్పష్టంచేశారు. గుంటూరు: జాతీయ రహదారిపై ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించినట్లు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు మంగళవారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కావున ఆటోలు, ద్విచక్రవాహనాలు సర్వీసు రోడ్డులో మాత్రమే ప్రయాణించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ వాడటం, ఆటో డ్రైవర్లు పరిమితికి లోబడి ప్రయాణీకులను ఎక్కించుకోవాలని సూచించారు. గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 57 ఆటోలు ప్రమాదాలకు గురి కాగా, వాటిలో ప్రయాణిస్తున్న 16 మంది మృతి చెందారని, 69 మంది గాయాల పాలయ్యారని చెప్పారు. అదే విధంగా ద్విచక్రవాహనదారులు 147 మంది ప్రమాదాల బారిన పడగా 72 మంది మృతి చెందగా, 124 మంది గాయాలపాలయ్యారని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, హెచ్చరిక పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. నేటి నుంచి పోలీస్ యాక్ట్–30 అమలు గుంటూరు: మే 2వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు పోలీస్‌యాక్ట్–30 అమల్లో ఉంటుందని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సోమవారం తెలిపారు. అర్బన్ జిల్లా పరిధిలో ఎలాంటి బహిరంగ సభలు, ధర్నా నిరసన దీక్షలు పూర్తిగా నిషేధమని చెప్పారు. కార్మిక, విద్యార్థి, ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు అధికారులకు, సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. కావున ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. -
ఇక టూవీలర్స్‌కి జీపీఎస్
తిరుపతి మంగళం: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు టూవీలర్స్‌కి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చకోవాలని తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు జీపీఎస్ ఎంతో దోహదపడుతుందన్నారు. దానికి తోడు వారి వారి పిల్లలు బైక్‌లపై ఎక్కడికి వెళుతున్నారో, ఎంత స్పీడు వెళుతున్నారన్న విషయాలను సెల్‌ఫోన్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత, భవిష్యత్ కోసం వారి బైక్‌లకు జీపీఎస్‌ను అమర్చాలని సూచించారు. మొట్ట మొదటిసారిగా జీపీఎస్ అమర్చిన టూవీలర్‌ను మంగళవారం తిరుపతిలోని టీవీఎస్ బైక్ షోరూంలో జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న, తిరుపతి సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, తిరుపతి ఎస్పీ అభిషేక్ మొహంతి ప్రారంభిస్తారని తెలిపారు. -
మరోసారి ఆటో షో
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఒకప్పుడు ద్విచక్రవాహనం కొనాలంటే సొమ్ము మొత్తం చేతిలో ఉంటేనే సాధ్యపడేది. ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల కారణంగా సులభ వాయిదాల రూపంలో కొత్త వాహనాలతో పాటుగా పాత వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఉగాదిని పురస్కరించుకుని సాక్షి దినపత్రిక–పద్మపూజిత ఆటోఫైనాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో మరోసారి న్యూ, యూజ్డ్ వెహికల్స్ ఆటో షో జరగనుంది. పద్మపూజిత అనుబంధ సంస్థలు విశాఖ ఆటోఫైనాన్స్, సిరి ఆటోఫైనాన్స్, పవన్‌సాయి ఆటోఫైనాన్స్ సంస్థలు కూడా ఈ ఆటోషోలో పాల్గొంటాయి. హీరోహోండా, బజాజ్, యమహా, హీరో, రాయల్‌ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, సుజికీ తదితర ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన కొత్త, పాత ద్విచక్రవాహనాలు ఇక్కడ విక్రయిస్తారు. ఈనెల 12, 13, 14, 15 తేదీలలో నగరంలోని పాతజైలు రోడ్డులోని విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా గల విశాఖ సెంట్రల్‌పార్కు ఆవరణలో రోజూ ఉదయం 9 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోషో జరుగుతుందని ని ర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాక్షి దినపత్రిక మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. వీటీం ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఇవే తేదీలలో గాజువాక లం కా గ్రౌండ్స్‌లో, కాకినాడ నగరంలో ఆటో షో జరుగుతుంది. ఆయా కంపెనీలకు చెందిన లేటెస్ట్ మోడల్స్ బైకులు, స్కూటర్లు ఇక్కడ అందుబా టులో ఉంచుతారు. వినియోగదారులకు అవగాహన ఈ ఆటోషోలో పద్మపూజిత, పవన్‌సాయి, వి శాఖ, సిరి ఆటోఫైనాన్స్ ప్రతినిధులు వినియోగదారులకు వాహనాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. వారి వారి అవసరాలకు ఏ యే వాహనాలు వినియోగించాలో సూచి స్తారు. ఇక్కడ 100 సీసీ, 120సీసీ, 150సీసీ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఏ కంపెనీలో ఏ బ్రాండ్ వాహనం ఇంధనం ఆదా చేస్తుంది, మంచి రీసేల్ వేల్యూ ఇస్తుందన్న స మాచారాన్ని ఇక్కడి ప్రతినిధులు వివరిస్తారు. 30 నిమిషాలలో ఆటో ఫైనాన్స్ ఇక్కడ కేవలం 30 నిమిషాలలో వాహనాలకు 70శాతం మేరకు ఫైనాన్స్ చేస్తారు. వినియోగదారులు 30 నుంచి 35శాతం మేరకు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 లేదా 36 సులభ వాయిదాలలో చెల్లించాలి. బ్యాంకులు విధిస్తున్న సవాలక్ష నిబంధనల నేపథ్యంలో సులభంగా లభించే ఆటోఫైనాన్స్‌కు ఎంతగానో ఆదరణ లభిస్తుంది. సాధారణ వడ్డీలో 3శాతం తక్కువ వడ్డీకే వాహనాలు అందజేయడం ఈ ఆటోషో ప్రత్యేకత. వినియోగదారుడు, ఒక ష్యూరిటీ పై వాహనాలు తీసుకోవచ్చు. సదరు వ్యక్తులు ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ అందజేస్తే సరిపోతుంది. ఇక్కడ రూ.50వేల నుంచి రూ.3లక్షల విలువైన వాహనాలకు ఫైనాన్స్ చేస్తారు. కొత్త వాహనాలకు 18శాతం, పాత వాహనాలకు 21శాతం వంతున వడ్డీ ఉంటుంది. వినియోగదారుల నమ్మకమే నడిపిస్తోంది వినియోగదారుల నమ్మకంతోనే గత 15 సంవత్సరాలుగా ఆటోఫైనాన్స్ రంగంలో ముందుకు సాగుతున్నాం. వారి నమ్మకమే మమ్మల్ని నడిపిస్తోంది. తమ సంస్థ 15 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరిలో మొదలయింది. కాలక్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు విస్తరించాం. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ఏడు నుంచి 8 లక్షల వాహనాలు విక్రయించాం. తక్కువ వడ్డీకే అన్నిరకాల కంపెనీల ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో 135 బ్రాంచ్‌ల ద్వారా సేవలందిస్తున్నాం. వినియోగదారులకు గత 15 ఏళ్లుగా నమ్మకమైన సేవలందిస్తున్నాం. మూడు నుంచి నాలుగేళ్లలో రీసేల్‌వేల్యూ గల వాహనాలు విక్రయిస్తున్నాం.–ఆర్ఎస్వీపీ బసవరాజు, మేనేజింగ్డైరెక్టర్, పద్మ పూజిత ఆటో ఫైనాన్స్, దొండపర్తి, విశాఖ -
హెల్మెట్‌తో వెన్నెముకకు రక్ష
వాషింగ్టన్: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల వెన్నెముక మెడ పైభాగానికి (సర్వైకల్ స్పైన్) గాయం కాకుండా తప్పించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రమాద సమయంలో వెన్నెముకకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడలేదని.. పైగా హెల్మెట్ వల్ల కొన్నిసార్లు వెన్నెముకకు గాయమయ్యే ప్రమాదం కూడా ఉందని అనేకమంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 2010–15 మధ్య విస్కాన్సిన్ ఆస్పత్రిలో నమోదైన 1,061 మంది వాహన ప్రమాద బాధితుల మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. వీరిలో 323 మంది ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించగా.. 738 మంది హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ లేని వారిలో ఈ తరహా గాయాలయ్యే అవకాశం 10.8% ఉండగా.. ధరించిన వారిలో 4.6%గా ఉందన్నారు. -
అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తా
చిన్నమండెం(రాయచోటి రూరల్) : చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన గ్రామం నాగూరివాండ్లపల్లెలో ఆదివారం సాయంత్రం అదుపు తప్పిన ద్విచక్రవాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో దేవగుడిపల్లెకు చెందిన ఎన్. కాళేశ్వరబాబు(24) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పడమటికోనకు చెందిన ఏ.వెంకటేష్(22) తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ చదువుతున్న సమయంలో కాళేశ్వరబాబు, వెంకటేష్‌లు స్నేహితులు. వీరు ద్విచక్రవాహనంలో చిన్నమండెం వైపు నుంచి కలిబండ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో నాగూరివాండ్లపల్లెలో ఉన్న మలుపు వద్ద మీ సేవ ఎదురుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాతిని ఢీ కొన్నారు. దీంతో తలకు తీవ్రగాయమైన కాళేశ్వర మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. చిన్నమండెం ఏఎస్ఐ నాగరాజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్త్రీ సంక్షేమానికి పెద్దపీట
-
స్త్రీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ సంక్షేమానికి మహిళా సాధికారత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో మహిళల పురోగతికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం.. సబ్సిడీ స్కూటర్ల పథకం ప్రారంభించాక మోదీ మాట్లాడారు. కుటుంబంలో ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం కుటుంబానికి సాధికారత లభిస్తుందని అన్నారు. జయలలిత ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని అన్నారు. తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..‘తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాషకు, వారసత్వానికి శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. జయకు నివాళులర్పిస్తూ ఆమెను ‘సెల్వి జయలలిత జీ’ అని సంబోధించారు. ‘మహిళా సాధికారతపై ఎక్కువగా దృష్టిసారిస్తూ అన్ని పథకాల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా సంక్షేమానికి కట్టుబడి ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. ముద్ర యోజన పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 4.60 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాం’ అని మోదీ పేర్కొన్నారు. డామన్ డయ్యూకు రూ. వేయి కోట్ల పథకాలు... కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలో రూ. వేయి కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్–డయ్యూ పట్టణాల మధ్య విమాన సేవలను ఆరంభించారు.మోదీ ప్రారంభించిన పథకాల్లో నీటి శుద్ధి ప్లాంట్, గ్యాస్ పైపులైన్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, మునిసిపల్ మార్కెట్, పాదచారుల వంతెన తదితరాలున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా నిర్మించిన అంగన్వాడీ పాఠశాల భవనాలను కూడా మోదీ ఆరంభించారు. లబ్ధిదారుకు వాహనం ‘కీ’ అందజేస్తున్న మోదీ -
యాక్టివా ‘లాక్’ చాలా ఈజీ!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒంగోలులో ఉన్నప్పుడు కొన్నాళ్ళ పాటు యాక్టివా వాడాను సార్. డూబ్లికేట్ లాక్‌తో దాన్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ. అందుకే ఆ బళ్లే దొంగతనం చేయడం ప్రారంభించా’.. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన వాహన దొంగ సాంబశివ అధికారులతో చెప్పిన మాటలివి. ఈ చోరుడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. ప్రకాశం జిల్లా, కల్లవల్లకు చెందిన పారా సాంబశివరావు కొన్నాళ్ళ పాటు నెల్లూరులో వ్యాపారం చేసి నష్టాలు రావడంతో కుటుంబంతో సహా 2015లో హైదరాబాద్‌కు వలసవచ్చి బోయిన్పల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు వాహన దొంగగా మారాడు. ఒంగోలులో హోండా యాక్టివా వాహనం వినియోగించిన ఇతగాడు దాన్ని హ్యాండిల్ లాక్‌ను మారు తాళంతో తెరవటం తేలికని గుర్తించాడు. దీంతో ఆ వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నాడు. నకిలీ తాళాల గుత్తితో సంచరించే ఇతగాడు పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న హోండా యాక్టివ వాహనాలను చోరీ చేస్తాడు. వీటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. గతంలో వాహన చోరీ చేసిన కేసులో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత అదే పంథా కొనసాగించాడు. పేట్ బషీరాబాద్, బోయిన్పల్లి, సనత్‌నగర్ పరిధుల నుంచి మూడు వాహనాలు చోరీ చేశాడు. ఓ సందర్భంలో పేట్ బషీరాబాద్ పోలీసులు తమ పరిధిలో నమోదైన కేసులో అరెస్టు చేశారు. అప్పట్లో మిగిలిన రెండు చోరీల విషయం అతగాడు బయటపెట్టలేదు. దీంతో ఒక్క కేసులోనే అరెస్టైన శివ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆతర్వాత అల్వాల్ పరిధి నుంచి మరో యాక్టివా చోరీ చేశాడు. బుధవారం బోయిన్పల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు ఆదేశాల మేరకు ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడి నుంచి మూడు యాక్టివ వాహనాలను స్వాధీనం చేసుకుని త దుపరి చర్యల నిమిత్తం బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. -
యువకుడి దుర్మరణం
కూసుమంచి : మండలంలోని జక్కేపల్లి, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చనుపల్లి గ్రామాల మధ్యనున్న పాలేరు వంతెనపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో జక్కేపల్లి గ్రామస్తుడు కొదమగుండ్ల ప్రేమ్ కుమార్(30) మృతిచెందాడు. చనుపల్లికి చెందిన ట్రాక్టర్, చెరకు లోడుతో రాజేశ్వరపురంలోని ఫ్యాక్టరీకి వస్తోంది. ప్రేమ్‌కుమార్, తన కుమారుడు అభిరామ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై చనుపల్లి సమీపంలోగల శివాలయానికి ఉదయం ఆరు గంటల సమయంలో వెళుతున్నాడు. వంతెన పైకి రాగానే, ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్ తగిలింది. ఇద్దరూ కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలతో ప్రేమ్‌కుఆర్ అక్కడిక్కడే మృతిచెందాడు. అతని కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వారి కుటుంబీకులు, బందువులు వచ్చారు, భోరున విలపించారు. తమ కుటుంబాన్ని ట్రాక్టర్ యజమాని ఆదుకోవాలన్న డిమాండుతో మృతదేహంతో వంతెన పైనే ఆందోళనకు దిగారు. కూసుమంచి ఏఎస్ఐ రవూఫ్ వచ్చారు. ఆ ఆందోళనకారులతో మాట్లాడారు. తమకు యజమాని న్యాయం చేసేంతవరకు మృతదేహాన్ని తొలగించేది లేదంటూ అక్కడే టెంట్ వేసుకుని ఆందోళనను ఉధృతం చేశారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. శివరాత్రి విధుల్లో ఉన్న ఎస్ఐ రఘు, జక్కేపల్లి చేరుకున్నారు. మృతుని కుటుంబీకులతో, ట్రాక్టర్ యజమానితో చర్చించారు మృతుని కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు ట్రాక్టర్ యజమాని అంగీకరించటంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ దొంగల అరెస్టు
విజయనగరం టౌన్: జిల్లాలో మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5 లక్షల విలువైన పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జి.పాలరాజు తెలిపారు. జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సంబంధిత వివరాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో మోటారు సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో సీసీఎస్ పోలీసులతో రైల్వేస్టేషన్, ఇతర ముఖ్య మైన కూడళ్లలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా అంతర్ జిల్లా నేరస్తులైన ద్వారపూడికి చెందిన బెల్లాన బాలరాజు, బొబ్బిలికి చెందిన పెంకి గంగరాజులను సీసీఎస్ పోలీస్ టీమ్ రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన బాలరాజు నుంచి రూ.మూడు లక్షల విలువైన ఆరు మోటార్ బైక్స్, గంగరాజు నుంచి రూ.2లక్షలు విలువైన నాలుగు బైక్స్, స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలరాజు వన్‌టౌన్ పరిధిలో మూడు నేరాలు, నెల్లిమర్ల, జామిలో ఒక్కొక్క నేరం, విశాఖ సిటీ ఐదో టౌన్లో ఒక నేరానికి పాల్పడ్డాడని తెలిపారు. గంగరాజు పెదమానాపురం పరిధిలో ఒకటి, బొబ్బిలిలో ఒకటి, పార్వతీపురం పట్టణంలో రెండు నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు. సిబ్బందికి ప్రోత్సహకాలు నేరస్తులను అరెస్టు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సీసీఎస్ డీఎస్పీ ఎఎస్.చక్రవర్తి, నెల్లిమర్ల ఎస్ఐ హెచ్.ఉపేంద్ర, పెదమానాపురం ఎస్ఐ కెఎస్కెఎన్జె.నాయుడు, సీసీఎస్ ఎస్ఐలు ఐ.రాజారావు, నాయుడు, హెచ్‌సీలు ఎమ్.హరి, ఎమ్.రమణ, కానిస్టేబుల్ ఎ.రమేష్, జి.కాశీరాజు, ఇతర పోలీస్ సిబ్బందిని ఏస్పీ ప్రత్యేకంగా అభినందించి, వారికి నగదు రివార్డులను అందజేశారు. పత్రాలను చూపించి బైక్‌లను తీసుకెళ్లండి బైక్‌లు పోయాయని ఫిర్యాదులు చేసిన వారందరూ తమ బైక్‌లను చూసుకుని అందుకు సంబంధించిన పత్రాలను చూపించి బైక్‌లు తీసుకెళ్లాలని ఎస్పీ సూచించారు. సరైన ఆధారాలు లేకుండా బైక్‌లు ఉన్నాయని, ఫిర్యాదుదారులు ఎవరైనా దొరికిన వాటిని గుర్తించి, పత్రాలను చూపించి పట్టుకెళ్లవచ్చన్నారు. -
ప్రజావైద్యంపై నమ్మకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్స్ పథకం అమలు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుప ర్చడం వల్ల ప్రజల్లో ప్రజావైద్యంపై నమ్మకం పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. మాతాశిశు రక్షణలో అమ్మ ఒడి (102) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాటు చేసిన 200 అదనపు వాహనాలను, పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందించే 50 బైకు అంబులెన్స్‌లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించేందుకు ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌లకు బ్రేక్..!
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలం కోరుకొండపాలెంనకు చెందిన కె. సతీష్ అక్టోబర్‌లో రవాణాశాఖ కార్యాలయంలో త్రీవీలర్ లైసెన్స్ టెస్ట్‌కు హాజరై పాసయ్యాడు. అయితే ఈ రోజు వరకు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందలేదు. అలాగే ఎస్.కోట మండలం కిల్తంపాలెం గ్రామానికి చెందిన కె.వంశీకృష్ణ ఆగస్టులో టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌కు హాజరై ఉత్తీర్ణుడయ్యాడు. ఇతనికి కూడా ఇంతవరకు లైసెన్స్ కార్డు అందజేయలేదు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో వేలాదిమంది వాహనదారుల పరిస్థితి ఇలానే ఉంది. నాలుగు నెలలుగా కార్డులు అందకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాహనంతో రోడ్డుపైకి వెళ్లాలంటనే వాహనదారులు భయపడుతున్నారు. పోలీసులు, రవాణా శాఖాధికారులు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అన్ని అర్హతలున్నా డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో లేక చాలామంది అపరాధ రుసుం చెల్లించక తప్పడం లేదు. ఎల్ఎల్ఆర్ వచ్చిన 30 రోజుల తర్వాత అన్ని పరీక్షలు పూర్తి చేస్తే అదే రోజు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ముద్రిస్తారు. అనంతరం ముద్రించిన కార్డులను పోస్టు ద్వారా వాహనదారుడి ఇంటికి నాలుగు, ఐదు రోజుల్లో పంపించాలి. కాని నెలలు గడుస్తున్నా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు), లైసెన్స్ రెన్యూవల్ కార్డుల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఐదు వేల మందికి.. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లు అందాల్సి ఉంది. ఇందులో 2500 రిజిస్ట్రేషన్ కార్డులు, 2500 డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఉన్నాయి. మూలకు చేరిన ప్రింటర్ జిల్లా కేంద్రంలో ఉపరవాణా కమిషనర్ కార్యాలయం ఉంది. అదేవిధంగా సాలురు, పార్వతీపురంల్లో వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అన్నింటికీ కార్డుల ముద్రణ విజయనగరంలో ఉన్న ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలోనే జరుగుతుంది. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రింటర్ తరచూ మొరాయిస్తుండడంతో సమస్య నెలకొంటోంది. సుమారు పదిహేనేళ్ల కిందటి ప్రింటర్ కావడంతో ఎప్పటికప్పుడు సమస్యలు నెలకొంటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అవసరాలు బట్టి కనీసం మూడు ప్రింటర్లు ఉండాలి. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే శాఖలో రవాణాశాఖ ఒకటి అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు తెలియజేశాం.. ప్రింటర్ పాడైన విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. సుమారు ఐదు వేల వరకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ప్రింట్ చేయాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – భువనగిరి కృష్ణవేణి, ఉపరవాణా కమిషనర్ -
బైక్ షి‘కారు’కు గెట్ రెడీ!
జీఎస్టీతో రేట్లు తగ్గిన కార్లు, టూవీలర్లు 350 సీసీ దాటిన బైకుల ధర పెరుగుదల ♦ కొన్ని డీజిల్ కార్లపై స్వల్పంగా మోత ♦ టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ కాస్త ప్రియమే ♦ 1 నుంచి 3 శాతం వరకూ పెరగనున్న ధరలు ♦ కొన్ని రాష్ట్రాల్లో మొబైల్స్ ఇకపై చౌక ♦ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కొంత భారమే ♦ జీఎస్టీ ప్రాతిపదికనే ఈ హెచ్చుతగ్గులు ♦ ముడిసరుకుపై పన్నుల్ని ఇంకా లెక్కించని కంపెనీలు ♦ అసలు ధర తెలిసేది ఆ తర్వాతే... ♦ అందుకు కొన్నాళ్లు ఆగాలంటున్న పరిశ్రమ వర్గాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో కొత్తగా వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చి మూడు రోజుగులు గడిచిపోయింది. జూలై 1, 2 తారీఖులు వారాంతాలనుకున్నా... 3వ తేదీ సోమవారం కావటంతో దాదాపు అన్ని కంపెనీలు జీఎస్టీ ఆధారంగానే అమ్మకాలు జరిపాయి. మరి జనానికి ఒరిగిందేంటి? నిత్యావసర సరుకుల్ని మినహాయిస్తే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్ల విషయంలో పెద్దగా పెరుగుదల ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కార్ల విషయంలో ఏ రకంగా చూసినా రేట్ల తగ్గుదలే కనిపిస్తోంది. చిన్నకార్లు రూ.3వేల నుంచి 10వేల వరకూ తగ్గగా... మధ్య స్థాయి కార్లు గరిష్ఠంగా రూ.1.3 లక్షల వరకూ తగ్గాయి. లగ్జరీ కార్ల విషయానికొస్తే ఈ తగ్గుదల ఇంకా ఎక్కువే. టూ వీలర్లదీ ఇదే బాట. 350 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్ బైక్‌ల మినహా మిగిలిన టూ వీలర్లన్నీ కనిష్ఠంగా రూ.2 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 వేల వరకూ తగ్గాయి. మనకైతే మొబైల్స్ది పెరుగుదలే! మొబైల్ ఫోన్లది కూడా తగ్గుదల బాటే. ఎందుకంటే దేశంలో అమ్ముడవుతున్న ఫోన్లలో మెజారిటీ దిగుమతి చేసుకునేవే. వీటిపై దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 12 శాతం నుంచి ఇపుడు 10 శాతానికి తగ్గించారు. ఇక జీఎస్టీ కూడా పాత పన్నుల కన్నా 1 నుంచి 7 శాతం వరకూ తగ్గినట్లే. అంటే కొన్ని రాష్ట్రాల్లో 5 శాతం తగ్గితే... మరికొన్ని రాష్ట్రాల్లో 4 శాతం వరకూ పెరిగినట్లు లెక్క. ఎందుకంటే మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 12 శాతంగా ఉండగా ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులు కలిపి 16 శాతం వరకూ ఉన్నాయి. అంటే ఇలాంటి వారికి జీఎస్టీతో లాభమే. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం మొబైల్స్‌పై వ్యాట్ 5 శాతమే. ఇలాంటి చోట 12 శాతం జీఎస్టీ పడుతుంది కనక మొబైల్స్ ధరలు పెరుగుతాయనే చెప్పాలి. టీవీ, ఫ్రిజ్‌లూ స్వల్ప పెరుగుదల! గృహోపకరణాల విషయానికొస్తే టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల వంటి గృహోపకరణాల ధరలు కూడా 1 నుంచి 3 శాతం వరకూ పెరుగుతాయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వీటిపై అన్ని పన్నులూ కలిపి 25 నుంచి 27 శాతం వరకూ ఉన్నాయి. జీఎస్టీతో ఇవన్నీ 28 శాతం పన్ను జాబితాలో పడ్డాయి. దీంతో ప్రస్తుతానికి స్వల్ప పెరుగుదలే కనిపిస్తోంది. ల్యాప్‌టాప్ వంటి కంప్యూటర్ల విషయంలో కూడా పన్నుల పరంగా 1 శాతం వరకూ పెరుగుదల ఉండటంతో రూ.300 వరకూ స్వల్ప పెరుగుదల కనిపించింది. అసలు ధరలు కొన్నాళ్ల తరవాతే? నిజానికి జీఎస్టీ అమల్లోకి వచ్చి 3 రోజులే అయింది. కంపెనీలు, డీలర్లు ధరలు తగ్గిస్తున్నా... అవన్నీ జీఎస్టీ రేటును బట్టే నిర్ణయమవుతున్నాయి. నిజానికి రేటును ప్రభావితం చేసేది అమ్మకంపై విధిస్తున్న జీఎస్టీ ఒక్కటే కాదు. ముడి సరుకులపై విధిస్తున్న పన్నులు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. కార్లు, టూవీలర్లు, గృహోపకరణాల ముడి సరుకులపై ప్రస్తుతం ఉన్న పన్నుల రేట్లు కూడా జీఎస్టీతో మారాయి. కాకపోతే కంపెనీలు ఇంకా ఆ రేట్లతో ముడి సరుకుల్ని కొనటం, వాటితో సరుకులు తయారు చెయ్యటం మొదలుపెట్టలేదనే చెప్పాలి. అంటే అవి ప్రస్తుతం ఉన్న సరుకును క్లియర్ చేస్తున్నాయి. కొత్త ముడి సరుకు కొని, తయారీ చేపడితే... తద్వారా తమకు మిగులుతోందా? తగులుతోందా? అనేది కంపెనీలకు తెలిసిపోతుంది. ఒకవేళ ముడిసరుకుపై పన్ను తగ్గితే... ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో కొంత మిగులుతుంది. అలా మిగిలితే దాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలి కూడా. లేనిపక్షంలో జీఎస్టీలో పొందుపరిచిన యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధన వారిని శిక్షార్హుల్ని చేస్తుంది. కాబట్టి అవన్నీ కొత్త ధరలను ప్రకటించి తీరాలి. అప్పుడే జీఎస్టీ ప్రభావంతో ఈ వస్తువుల ధరలు నిజంగా తగ్గాయో లేదో, తగ్గితే ఎంత తగ్గాయో తెలుస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ అమలు ఆధారంగానే పలు కంపెనీలు రేట్లను సవరించినట్లు ఆరెంజ్ హోండా ఎండీ రామ్ తెలిపారు. ‘‘మారుతి సుజుకి కార్ల ధరలు రూ.6,000 నుంచి రూ.18,000 వరకు తగ్గాయి’’ అని వరుణ్ గ్రూప్ ఎండీ వరుణ్‌దేవ్ తనను సంప్రదించిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. కొన్ని డీజిల్ వేరియంట్లు మాత్రం రూ.6–18 వేలు పెరిగాయన్నారు. లగ్జరీ కార్ల కంపెనీలు రూ.1.25 నుంచి రూ.7 లక్షల దాకా ధరల్ని తగ్గించాయి. బజాజ్ బైక్‌ల ధరలు రూ.2,500 వరకు తగ్గాయని శ్రీవినాయక బజాజ్ సీఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. కేటీఎం బైక్‌లు రూ.6,500 దాకా తగ్గినట్టు వెల్లడించారు. పలు కంపెనీల తాజా తగ్గింపులివీ... ♦ హోండా కార్ల ధరలు గరిష్ఠంగా రూ.1.31 లక్షల వరకూ తగ్గాయి. హ్యాచ్‌బ్యాక్ కారు బ్రియో ధరను రూ.12,279 వరకు, కాంపాక్ట్ సెడాన్ కారు అమేజ్ ధరను రూ.14,825 వరకు, జాజ్ మోడల్ ధరను రూ.10,031 వరకు తగ్గించింది. ఇటీవలే మార్కెట్లోకి తీసుకువచ్చిన డబ్ల్యూఆర్–వీ మోడల్ ధరలో రూ.10,064 వరకు, మిడ్‌సైజ్ సెడాన్ సిటీ కారు ధరను రూ.16,510–రూ.28,005 శ్రేణిలో, బీఆర్–వీ ధరలో రూ.30,387 వరకు, ప్రీమియం ఎస్యూవీ సీఆర్–వీ ధరలో రూ.1,31,663 వరకు కోత విధించింది. ఇవన్నీ ఢిల్లీ (ఎక్స్‌షోరూమ్)వి. ప్రాంతాన్ని బట్టి తగ్గింపు మారుతుంది. ♦ ఫోర్డ్ ఇండియా కూడా తన వాహన ధరలను 4.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ముంబైలో ఎస్యూవీ ఎండీవర్ ధర రూ.3 లక్షల వరకు తగ్గనుంది. మొత్తంగా ధరల తగ్గింపు రూ.28,000– రూ.3 లక్షల శ్రేణిలో ఉంటుంది. ఫిగో ధర రూ.2,000, కాంపాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్ ధర రూ.8,000 వరకు తగ్గాయి. ♦ టూవీలర్ సంస్థలు టీవీఎస్ మోటార్, హోండా స్కూటర్స్, సుజుకీ కూడా ధరల తగ్గింపును ప్రకటించాయి. టీవీఎస్ తన వాహన ధరలను రూ.4,150 వరకు తగ్గించింది. హెచ్ఎంఎస్ఐ తన ప్రొడక్టుల ధరల్లో రూ.5,500 వరకు కోత విధించింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా, యమహా కంపెనీలు కూడా వాటి వాహన ధరలను తగ్గించాయి. హీరో మోటొకార్ప్ తన వాహన ధరలను రూ.1,800 వరకు తగ్గించింది. -
హీరో బైక్స్ ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలను పెంచేసింది. సంస్థకు చెందిన వివిధ మోడళ్ల ద్విచక్ర వాహనాల ధరలను రూ .500 నుంచి రూ .2,200 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చలు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో పేర్కొంది. పెంచిన ధరలు మే 1వ తేదీనుంచి అమలవుతాయని తెలిపింది. ఎంట్రీ లెవల్ మోడల్స్ దగ్గర్నుంచి, హై ఎండ్ మోడల్ వాహనాలపై ఈ భారం పడనుంది. వివిధ బైకుల ధరలు రూ .500 నుంచి రూ .2,200 వరకు పెరగనున్నాయి ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడల్ హెచ్ఎఫ్ డాన్ నుంచి టాప్ ఎండ్ మోడల్ కరిష్మా జెడ్‌ఎంఆర్ మోడల్స్ పాపులర్. వీటి ధరలు రూ.40వేల నుంచి లక్షరూపాయలకు వున్నాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశంలో టూవీలర్స్ ధరలను పెంచేందుకు కంపెనీ నిర్ణయించింది. అలాగే మే నెలలో బలమైన రిటైల్ అమ్మకాలు కొనసాగించాలని కంపెనీ భావిస్తోందని తెలిపింది. కాగా గతనెలలో అమ్మకాలు బాగా క్షీణించి 5,91306 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలు 6,12,739 యూనిట్లతో పోలిస్తే 3.49శాతం తక్కువ. -
అల్వాల్ లో కారు బీభత్సం
-
అల్వాల్ లో కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలోని అల్వాల్ లో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారులో వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, మద్యం మత్తులో కారును నడపటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కారులోని వ్యక్తులతో పాటు ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట నుంచి కారులో నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
బుట్టాయగూడెం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంట ర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాగులగూడెంకు చెందిన కొవ్వాసి బుచ్చిరాజు, చోడెం నరసింహరాజు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి రామారావుపేట సెంటర్ వైపు వస్తున్నారు. అలాగే జైనవారిగూడెంకు చెందిన కోర్సా రాంబాబు కూడా ద్విచక్రవాహనంపై రామారావు పేట సెంటర్ వైపు వస్తుండగా, ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో చోడెం నరసింహరాజు, కోర్సా రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
వాహనదారుల సర్కస్ ఫీట్లు
-
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరికి గాయాలు
బసంత్‌నగర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కన్నాల పాత పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లి మండలానికి చెందిన యాట పోచమల్లు (35), ఆయన భార్య మల్లేశ్వరి(30)తో కలసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ జిల్లా శ్రీరామ్‌పూర్ వెళుతున్నారు. కన్నాల పాత పెట్రోల్ బంక్ సమీపంలో వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో పోచమల్లు, మల్లేశ్వరి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. టోల్‌గేట్‌కు చెందిన వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
దర్జాగా తిరుగుతున్నారు!
అనంతపురానికి చెందిన రమేష్ ఆరేళ్ల క్రితం ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే దర్జాగా తిరుగుతున్నాడు.. అతడే కాదు.. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ల (టీఆర్)తోనే రోడ్డుపైకి వస్తున్నారు. కొందరికైతే టీఆర్ కూడా లేదు. అటు పోలీసులు, ఇటు రవాణాశాఖ అధికారుల తనిఖీలు తూతూమంత్రంగా సాగుతుండటంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. * రిజిస్ట్రేషన్‌పై వాహనదారుల అనాసక్తి * జిల్లాలో 16 వేల వాహనాల గుర్తింపు * ప్రభుత్వాదాయానికి గండి అనంతపురం టౌన్ : జిల్లాలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ద్విచక్రవాహనాలు, కార్లు వంటికే అధికంగా ఉంటున్నాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్న యజమానులు వాటి రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావడం లేదు. కొనుగోలు జరుగుతున్న మేరకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలు 5 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో సుమారు 16 వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ప్రధానంగా 80 శాతం ద్విచక్రవాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)తోనే కాలం వెళ్లదీస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన వాహనానికి తప్పనిసరిగా నెలరోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెల దాటితే రూ.20, ఆరు నెలలు దాటితే రూ.100 నామమాత్రపు రుసుం ఉండడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి వీటి నుంచి వచ్చే ఆదాయం కోల్పోతుంది. ఈనేపథ్యంలో రవాణాశాఖ అధికారులు ‘స్పెషల్ డ్రైవ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. టీఆర్‌తో మొదటి సారి వాహనం పట్టుబడితే రూ.2 వేలు, రెండో సారి పట్టుబడితే సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేరాలకు కొత్త వాహనాలు చోరీలు, అక్రమ రవాణా ఇతరత్రా వాటికి కొన్ని అసాంఘిక శక్తులు కొత్త వాహనాలను ఉపయోగిస్తున్నారు. నేరాలు చేయాలన్నా నూతన వాహనాలనే ఎంచుకుంటున్నారు. నేరాలు జరిగినప్పుడు వాహనాన్ని ఎవరైనా చూసినా దానికి నంబర్ ప్లేట్ లేకపోవడంతో అసలు సమస్య ఎదురవుతోంది. వాహనదారులకూ నష్టమే వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే యజమానికే నష్టం జరుగుతుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాహనచట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేని వాహనం చోరీకి గురయితే ఎలాంటి కేసులు నమోదు చేయరు. పోలీసులు వాహనం గుర్తించడం కష్టంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహన యజమానే వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీమా చెల్లింపులకు సైతం ఇబ్బందులు తప్పవు. పోలీసు కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సి ఉంటుంది. సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం నిబంధనలను అతిక్రమించి టీఆర్ నంబర్‌తోనే తిరుగుతున్న వాహనాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 100 కేసులు నమోదు చేశాం. స్వచ్ఛందంగా 440 మంది రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నారు. మొదటిసారి జరిమానా విధిస్తున్నాం. పరిస్థితి అలాగే ఉంటే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. వాహనదారులను చైతన్యవంతం చేసేందుకు గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయూల్లో ఫెక్లీలు ఏర్పాటు చేస్తున్నాం. - వి.సుందర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
టూ వీలర్లకు మినహాయింపు!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల పథకం నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించే అవకాశముందని తెలుస్తోంది. మహిళలు ఉపయోగించే కార్లకు కూడా మినహాయింపు ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధానిలో పెరిగిపోయిన వాయు కాలుష్య నివారణ కోసం సరి సంఖ్య గల కార్లను ఒకరోజు, బేసి సంఖ్య గల కార్లను మరొక రోజు రోడ్లపైకి అనుమతించే ఈ పథకాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ పథకంలోని మినహాయింపుల గురించి హస్తిన వాసులు చర్చించుకుంటున్నారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ఎస్సార్‌నగర్: నగరంలో పలు చోట్ల ద్విచక్రవాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎస్సార్‌నగర్ పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు.. ప్రదీప్(28) అనే యువకుడు గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కాగా, ప్రదీప్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
నిర్ణయం ఎవరిదైనా.. అమలు పోలీసులదే
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (ఆగస్టు 1) నుంచి హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం స్పష్టం చేయడంతో పోలీసు విభాగం ఉలిక్కిపడింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హెల్మెట్ల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడే అమలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్యను చూస్తే.. ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నిరోధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తూ పోలీసు విభాగం దాదాపు మూడు నెలల క్రితమే నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని డీజీపీ మే నెలలోనే ప్రకటించారు. ఆర్టీఏ రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న టూ వీలర్స్ సంఖ్య 61,47,523గా నమోదైంది. వీటిలో అత్యధికం జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లోనే ఉంటాయని పోలీసు విభాగం అంచనా వేసింది. అప్పటికి హెల్మెట్ వినియోగం కేవలం 10 శాతం మాత్రమే ఉండటం, మిగిలిన వారందరికీ అవసరమైన స్థాయిలో జూన్ 30లోపు హెల్మెట్లు అందించగలిగే స్థాయిలో వాటి షోరూమ్స్ లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం హెల్మెట్ నిబంధన అమలును ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జూలై నెల మొత్తం గోదావరి పుష్కరాల బందోబస్తు, భద్రతా ఏర్పాటే సరిపోవడంతో ఇవి అమలులో పెట్టడం సాధ్యం కాలేదు. ‘హెల్మెట్’పై నిర్ణయం ఎవరు తీసుకున్నా అమలు చేయాల్సింది మాత్రం పోలీసు విభాగమే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల ప్రభావం ప్రజల నుంచి నేరుగా వీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు హెల్మెట్ నిబంధనను అమలు చేస్తూనే నిర్ణీత కాలం వాహనచోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఆ తరవాత మాత్రమే జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది. -
జల్సాల కోసం టూవీలర్స్ చోరీ
పంజగుట్ట (హైదరాబాద్) : జల్సాల కోసం ద్విచక్రవాహనాల దొంగతనాలకు అలవాటుపడిన ఏడుగురిని పంజగుట్ట పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వేమన అయ్యప్ప అలియాస్ అమిత్ అలియాస్ సంజు అలియాస్ బన్ని(21) నగరంలో బీజేఆర్ నగర్ యూసూఫ్‌గూడలో నివసిస్తుంటాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడు పంజగుట్ట మార్కెట్ బస్తీకి చెందిన కొర్ర మహేష్ అలియాస్ రాజా(23), బేగంపేట ప్రకాశ్ నగర్‌కు చెందిన అభిజిత్ చెటర్జి అలియాస్ సోన(20), బేగంపేట మయూరి మార్గ్‌కు చెందిన టేకు దొరబాబు అలియాస్ దొర (19), అమీర్‌పేటకు చెందిన తిరుమల వెంకటేశ్ అలియాస్ వెంకట్ (24), యూసూఫ్‌గూడకు చెందిన గుమ్మడి రవి కుమార్ అలియాస్ రవి, లడ్డు (19), బేగంపేటకు చెందిన కె. సచిన్ అలియాస్ నాని (19)లతో కలసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వీరిలో అయ్యప్ప తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను ఎత్తుకుపోవటంలో దిట్ట. వీరు దొంగిలించిన వాహనాలను నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో పబ్‌లకు వెళ్తూ, స్నూకర్స్ ఆడుతుంటారు. వీరిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, రాంగోపాల్‌పేట పరిధిలో 1, కూకట్పల్లి పరిధిలో 1, నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 1 ద్విచక్రవాహనాల దొంగతనం కేసులున్నాయి. దొంగిలించిన వాహనంపై గురువారం అమీర్‌పేటలో ప్రధాన నిందితుడు అయ్యప్ప వెళుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అతన్ని వాహన పత్రాలు చూపమని అడగడంతో తడబడ్డాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారించగా చేసిన దొంగతనాల చిట్టా బయటపెట్టాడు. దీంతో నిందితులందరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహిళ నుంచి పుస్తెలతాడు చోరీ
నల్గొండ: జిల్లాలోని బీబీనగర్ మండలంలోని చిన రావులపల్లి గ్రామ శివారులో గురువారం ఓ మహిళను నమ్మించి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించి పోయారు. ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని కమలమ్మ, ఎప్పటిలాగానే చిన్నరావులపల్లి నుంచి రాఘవాపూరం వెళ్లే రహదారి మధ్యలో కల్లు అమ్ముతుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కల్లు కవాలని అడగంతో కమలమ్మ భర్త వెంకటస్వామిగౌడ్ కల్లు గీసేందుకు తాడు ఎక్కగా అక్కడ ఉన్న ఇద్ధరు యువకులు కత్తలతో బెదిరించడంతో ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును వారికి ఇచ్చింది అక్కడ నుంచి యువకులు పారిపొయినట్లు తెలిపారు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చే స్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు. -
75 శాతం ద్విచక్రవాహనాలకు బీమా లేదు!
న్యూఢిల్లీ: వాహనం ఏదైనా ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానికి బీమా చేయించుకోకపోతే అది చట్టరీత్యా నేరం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మన వాహనం కారణంగా ప్రమాదం జరిగితే.. అవతలి వాళ్లకు బీమా కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది. అయితే ఈ విషయం వాహన వినియోగదారులకు అంతగా బోధపడినట్టు లేదు. దేశంలో 75శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు బీమా అనే అంశాన్ని గాలికి వదిలేశారట. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయం స్పష్టం చేసింది. కాగా, ఇందులో కొంతమంది వినియోగదారులు తొలిసారి రిజిస్ట్రేషన్ కోసం ఇన్సూరెన్స్ చేసి, దాని కాల పరిమితి ముగిసిన తర్వాత తిరిగి రెన్యువల్ చేయించుకోవడం లేదని రహదారి భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ స్పష్టం చేసింది. దేశంలో 82 శాతం ప్రైవేట్ వాహనాలు ఉంటే వాటిలో అత్యధిక శాతం ద్విచక్రవాహనాలకు బీమా లేదని రిటైర్డ్ జడ్జి కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. -
ద్విచక్రవాహనాల ఢీ
ఇద్దరికి తీవ్రగాయాలు పరిస్థితి విషమం తుర్కపల్లి : ఎదురెదురుగా వచ్చిన రెం డు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన ఇప్ప ప్రశాంత్, ఇప్ప శ్రీకాంత్ బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అదే విధంగా మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం లింగరెడ్డిపల్లి నుంచి జాపా గోపి, జాపాకిష్టయ్య, జాపా బుచ్చమ్మ, లత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై యాదగిరిగుట్టకు బయలుదేరారు. వీరి వాహనాలు వెంకటాపూర్ శివారులో మలుపు వద్దకు రా గానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పా శ్రీకాంత్, జాపా గోపి కి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను తుర్కపల్లిలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయ పడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఐదు మోటార్ సైకిళ్లు దహనం
- పావుగంట వ్యవధిలో - ఒకదాని తర్వాత ఒకటిగా.. - చిలక లూరిపేటలో అర్ధరాత్రి కలకలం - పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన చిలకలూరిపేటటౌన్: అర్ధరాత్రి 12 గంటల సమయం.. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్ సమీప ప్రాంతం.. ఇళ్ల ముందు నిలిపిన ఐదు ద్విచక్రవాహనాలు ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు చోట్ల దహన మయ్యాయి. ఎవరు చేశారు? ఎందుకోసం చేశారు..? ఒక్కరి పనేనా..? అంతుచిక్కని ఇలాంటి ప్రశ్నలెన్నో.. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ వరుస ఘటనలు పట్టణంలో కలకలం రేపాయి. పోలీసులకు పెను సవాల్‌గా నిలిచాయి. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా ఐదు ద్విచక్రవాహనాలను దహనం చేసిన ఘటన ఇళ్లలో పార్కింగ్ అవకాశం లేక వాహనాలు బయట నిలిపేవారి గుండెల్లో గుబులు పుట్టించింది. స్టేషన్ వెనుక వీధిలో ఒక మోటార్‌సైకిల్, వినాయకుడి గుడి వీధిలో రెండు, సౌదాగర్ వీధిలో ఒకటి, గుర్రాల చావిడి సమీపంలోని పాత హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద మరో ద్విచక్రవాహనం ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలను ఒకదాని తరువాత ఒకటి పావుగంట వ్యవధిలో తగలబెట్టినట్లు బాధితులు అందజేసిన సమాచారం బట్టి తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ వెనుక వాహనం తగలబడుతున్న విషయం గమనించిన వాహనయజమాని భూపతి రాజేశ్వరరావు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికే బైక్ పూర్తిగా దహన మైంది. వినాయకస్వామి గుడి సమీపంలో, సౌదాగార్ వీధి, పాత గ్యాస్గౌడన్ వద్ద తగలబెట్టిన వాహనాలు ఎందుకు పనికిరాని పరిస్థితి. వినాయకస్వామి గుడి వీధిలో తగలబెట్టిన రెండో వాహనం మాత్రం పాక్షికంగా దహనమైంది. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలకు వెళ్లి సమాచారం సేకరించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ ఎస్ఐ టి.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... ఘటన జరిగిన ప్రాంతాలన్నీ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం పోలీసులకు సవాలుగా మారింది. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పనా.. అన్నీ ఒకరే చేశారా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రెండు మూడు చోట్ల వాహనాలపై పెట్రోలు లేదా కిరోసిన్ పోసి తగలబెట్టి ఉండవచ్చుని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. పాక్షికంగా వాహనం తగలబడిన చోట కేవలం పెట్రోలు ట్యాంకు పైపు లాగి దానికి నిప్పింటించినట్లు భావిస్తున్నారు. -
మృతదేహాల మధ్యే మృత్యుపోరాటం!
మందమర్రి, న్యూస్‌లైన్: అది నిత్యం జనసంచారం కలిగిన కల్వర్టు. రెండు రోజుల క్రితం ఓ ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు కల్వర్టు కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆ మృతదేహాల మధ్యే మృత్యుపోరాటం చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కుందారం శ్రీనివాస్, అతని భార్య శ్రీలత, కుమారడు అజయ్‌రావు, కుమార్తె దీక్షిత గురువారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని తమ బంధువుల తల్లి దిశదిన కర్మకు వెళ్లారు. అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వారు స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మందమర్రి శివారులోని కల్వర్టు పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ విషయం రెండురోజులుగా నుంచి బాహ్య ప్రపంచానికి తెలియలేదు. అయితే, శనివారం ఉదయం తాము ప్రమాదంలో ఉన్నామని మాత్రమే శ్రీలత సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మందమర్రి, రామకృష్ణాపూర్ గ్రామాల మధ్య ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ప్రాంతాల్లో గాలించారు. ఈ గ్రామాల మధ్య గల పాకిస్తాన్ క్యాంపు పక్కనే ఉన్న కల్వర్టు కింద శ్రీనివాస్(35), దీక్షిత (4) మృతదేహాలు కనిపించాయి. పక్కనే శ్రీలత, కుమారుడు అజయ్‌రామ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిని 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బైక్ స్టంటర్ల ఇష్టారాజ్యం!
సాక్షి, ముంబై: ద్విచక్రవాహనాలతో రోడ్లపై స్టంట్ లు చేసే వారి సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. వీరు చేసే అనేక స్టంట్లు పలుమార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అదేవిధంగా అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారి వల్ల ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలా జరిగిన పలు ప్రమాదాల్లో గాయాలపాలైన కొందరు ప్రాణా లు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలు. ఈ సంఘటన నేపథ్యంలో ఇలా స్టంట్లకు పాల్పడేవారిని అడ్డుకోవడంతోపాటు వారిపై చర్యలు తీసుకోవడం కోసం స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు నియమాలు ఉల్లంఘించి స్టంట్లకు పాల్పడేవారిపై 889 కేసులు నమోదు చేశారు.అదేవిధంగా వీరి నుంచి రూ. 1.07 లక్షల జరిమానా కూడా వసూలు చేశారు. ముఖ్యంగా అర్ధరాత్రి అనంతరం మెరైన్ డ్రైవ్, వర్లీ, బాంద్రా రెక్లమేషన్, ఖేర్వాడీ మొదలగు పరిసరాలలో ద్విచక్రవాహనాల చోదకులు (బైకర్స్) ఎక్కువగా స్టంట్లకు పాల్పడుతున్నట్టు ఆర్టిఓ అధికారులు చెబుతున్నారు. ఒక్క ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 5008 మంది స్టంటర్లపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి జరిమానా కూడా వసూలు చేశారు. అదే విధంగా ఆగస్టు నాలుగవ తేదీన కూడా వివిధ అభియోగాల కింద 2190 మందిపై చర్యలు తీసుకుని జరిమానా వసూలు చేసినట్టు ఆర్టిఓ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బాంద్రా పోలీసులు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. గతంలో మోటార్ చట్టం ప్రకారం బైక్ స్టంటర్లను పట్టుకుని రూ. 100 జరి మానా విధించేవారు. ప్రస్తుతం ఐపీసీ 279 చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం ప్రారంభించా రు. దీంతో నియమాలను ఉల్లంఘించి డ్రైవ్ చేసేవారిపై కొంత మేర ప్రభావం పడింది.