న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల పథకం నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించే అవకాశముందని తెలుస్తోంది. మహిళలు ఉపయోగించే కార్లకు కూడా మినహాయింపు ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
దేశ రాజధానిలో పెరిగిపోయిన వాయు కాలుష్య నివారణ కోసం సరి సంఖ్య గల కార్లను ఒకరోజు, బేసి సంఖ్య గల కార్లను మరొక రోజు రోడ్లపైకి అనుమతించే ఈ పథకాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ పథకంలోని మినహాయింపుల గురించి హస్తిన వాసులు చర్చించుకుంటున్నారు.
టూ వీలర్లకు మినహాయింపు!
Published Wed, Dec 23 2015 1:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM
Advertisement
Advertisement