odd-even formula
-
ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది. మితిమీరిన కాలుష్యంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. గత నాలుగు రోజులు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో వాయు నాణ్యత సూచీలు క్రమేపీ క్షీణిస్తున్నాయి. సోమవారం వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 437కు చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మరోసారి సరి- బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పర్యావరణవాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. అంతకముందు వెల్లడించిన దాని ప్రకారం BS3 పెట్రోల్, BS4 డీసిల్ కార్లను నిషేధం సైతం కొనసాగుతుందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మంత్రి ఆదేశించారు. పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతులు మినహాయించి మిగతా అన్ని పాఠశాలలు నవంబర్ 10 వరకు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తమ అనుకూలతను బట్టి ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు. చదవండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? -
Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత!
న్యూఢిల్లీ: కోవిడ్ పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరుగుతున్న కారణంగా దేశ రాజధానిలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ మంగళవారం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గడచిన ఆరునెలల్లో (జూన్ 9 నుంచి) నమోదైన కేసుల కంటే కేవలం ఒక్క రోజులోనే 331 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువ నమోదైతే లేదా ఏడు రోజుల వ్యవధిలో వరుసగా పాజిటివ్ కేసులు 1,500 దాటితే ‘ఎల్లో అలర్ట్' విధించే అవకాశం ఉందని తెల్పింది. ‘ఎల్లో అలర్ట్' దృష్ట్యా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. తాజా ఆంక్షలివే.. తాజా మార్గదర్శకాల మేరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు మూతపడనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు యథాతథంగా కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్ సరి - బేసి ప్రాతిపదికన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి. స్పా, సెలూన్, బార్బర్ షాప్‌లు మామూలుగానే తెరచుకోవచ్చు. మెట్రో, పబ్లిక్ బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో (ప్రయాణికులు నిలబడకూడదు) పనిచేస్తాయి. తదుపరి మార్గదర్శకాలు విడుదలయ్యేంతవరకు అన్ని పొలిటికల్, సామాజిక, మత పరమైన సమావేశాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. చదవండి: Pigcasso Artwork: కుంచె పట్టి రంగుల చిత్రాలు గీస్తున్న పంది! -
రెండోసారి సరి, బేసి విధానం అమలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోమారు సరి, బేసి నియమం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. నగర రోడ్లపై వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో అమలుచేస్తున్న ఈ నియమం ప్రకారం ఇవాల్టి నుంచి 30 వరకు సరి నంబరు ప్లేటున్న కార్లు సరి తేదీల్లో, బేసి నంబరున్న కార్లు బేసి తేదీల్లో రోడ్లపైకి రావలసి ఉంటుంది. సీఎన్జీ స్టిక్కరు కలిగిన వాహనాలు, బ్యాటరీ హైబ్రిడ్ వాహనాలు, ఒంటరి మహిళలు నడిపే వాహనాలు, యూనిఫామ్ ధరించిన స్కూలు పిల్లలున్న కార్లు, వికలాంగుల కార్లు, ద్విచక్రవాహనాలకు ఈ నియమం నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సందర్భంగా సరి, బేసి నియమాన్ని అందరూ పాటించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ట్విట్టర్లో కోరారు. ఈ విధానాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా తొలిదశలో అమలు చేసిన సరి, బేసి నియమం విజయవంతమైన విషయం తెలిసిందే. ఇలా ఉండగా శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు కావడం, ఆదివారం దీనికి మినహాయింపు ఉండడం వల్ల సోమవారం నుంచే అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ప్రభుత్వం మాత్రం రెండో దశను కూడా విజయవంతంగా అమలుచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్కూలు బస్సులకు కోత విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశముంది. -
'ప్రజలు చనిపోతుంటే.. మీరు సవాల్ చేస్తున్నారా?'
న్యూఢిల్లీ: 'సరి-బేసి' నంబర్ ప్లేట్ విధానంపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై వెంటనే విచారణ చేపట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. 'ఢిల్లీలో ప్రజలు కాలుష్యంతో చనిపోతున్నారు. మేం కారు పూలింగ్ చేస్తున్నాం. దీనిని మీరు సవాల్ చేయాలనుకుంటున్నారా' అని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ 'పబ్లిసిటీ స్టంట్' మాత్రమేనని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఈ సందర్భంగా కోరారు. ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం 'సరి-బేసి' అంకెల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా 'సరి-బేసి' నంబర్ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం వాహనాలను రోడ్లపై అనుమతించాలని నిర్ణయించింది. ఈ నెల 15 వరకు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుకు నోటిఫికేషన్ జారీచేయగా.. ఇందుకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం తమ వాహనాలను సమీకరించుకొని (కార్ పూలింగ్).. రోజుకు ఒకరి వాహనంలో వెళ్లాలని నిర్ణయించారు. అయితే 'సరి-బేసి' నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
బెంగళూరులో 'సరి - బేసి విధానం' !
బెంగళూరు : దేశ రాజధాని న్యూఢిల్లీలో సరికొత్తగా అమలు చేస్తున్న 'సరి - బేసి' విధానాన్ని బెంగళూరు నగరంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. శనివారం బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ప్రాంతంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్‌ను పరమేశ్వర్ ప్రారంభించారు. అనంతరం జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... ఈ విధానం అమలుకు సంబంధించిన సాధక, బాధకాలపై ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీతోపాటు వాయు, శబ్ద కాలుష్యం సైతం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని అంశాలపై తాము చర్చిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అమలు చేస్తున్న సరి బేసి విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందువల్ల ఈవిధానంపై చర్చిస్తున్నట్లు పరమేశ్వర్ చెప్పారు. -
కార్లు తగ్గించినా.. కాలుష్యం తగ్గలేదు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో 'సరి - బేసి' కార్ల ప్రయోగాన్ని ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టినా కాలుష్యం మాత్రం పెద్దగా తగ్గలేదు. ఈ పథకాన్ని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చినా... వాహన కాలుష్యం మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. వాతావరణంలో కాలుష్యం అలాగే ఉందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (సఫర్)కు చెందిన ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. అయితే శుక్రవారం ఉదయం కంటే సాయంత్రానికి కాలుష్యం చాలా తగ్గిందని ఆప్ వర్గాలు చెప్పడం విశేషం. నగరంలో వాయు కాలుష్యం తగ్గలేదని వివిధ ప్రదేశాల్లోని సఫర్ స్టేషన్లల్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ పేర్కొంది. గురువారంతో పోలిస్తే... శుక్రవారం కూడా వాయుకాలుష్యంలో అదే స్థాయిలో ఉందని చెప్పింది. న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం సరి - బేసి కార్ల ప్రయోగాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జనవరి 1-15 తేదీల మధ్య ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. తొలిరోజు చాలావరకు బేసి సంఖ్య వాహనాలే రోడ్లపైకి వచ్చాయి. అయితే.. అక్కడక్కడ సరి సంఖ్య నంబరు వాహనాలు కూడా వచ్చాయి. దీంతో ఢిల్లీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. -
టూ వీలర్లకు మినహాయింపు!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల పథకం నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించే అవకాశముందని తెలుస్తోంది. మహిళలు ఉపయోగించే కార్లకు కూడా మినహాయింపు ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధానిలో పెరిగిపోయిన వాయు కాలుష్య నివారణ కోసం సరి సంఖ్య గల కార్లను ఒకరోజు, బేసి సంఖ్య గల కార్లను మరొక రోజు రోడ్లపైకి అనుమతించే ఈ పథకాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ పథకంలోని మినహాయింపుల గురించి హస్తిన వాసులు చర్చించుకుంటున్నారు.