బెంగళూరులో 'సరి - బేసి విధానం' ! | Delhi's odd-even formula in bengaluru city | Sakshi
Sakshi News home page

బెంగళూరులో 'సరి - బేసి విధానం' !

Published Sun, Jan 3 2016 10:55 AM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM

బెంగళూరులో 'సరి - బేసి విధానం' ! - Sakshi

బెంగళూరులో 'సరి - బేసి విధానం' !

బెంగళూరు :  దేశ రాజధాని న్యూఢిల్లీలో సరికొత్తగా అమలు చేస్తున్న 'సరి - బేసి' విధానాన్ని బెంగళూరు నగరంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. శనివారం బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ప్రాంతంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ను పరమేశ్వర్ ప్రారంభించారు.

అనంతరం జి.పరమేశ్వర్ మాట్లాడుతూ...  ఈ విధానం అమలుకు సంబంధించిన సాధక, బాధకాలపై ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.  నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీతోపాటు వాయు, శబ్ద కాలుష్యం సైతం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని అంశాలపై తాము చర్చిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అమలు చేస్తున్న సరి బేసి విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  అందువల్ల ఈవిధానంపై చర్చిస్తున్నట్లు పరమేశ్వర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement