Parameshwar
-
డిన్నర్లపై హైకమాండ్ గరం
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు పెరిగిపోగా, ఢిల్లీలో హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. మంత్రులు, సీనియర్లు విందు భేటీలు జరుపుతూ ముఠా రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు రావడంతో పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. డిన్నర్లు, రహస్య భేటీల్లో నిమగ్నమైన నాయకులను ఢిల్లీకి పిలిపించి మందలించనుంది. ఎలాంటి విందు రాజకీయ సమావేశాలను, పార్టీ అనుమతి లేకుండా జరపరాదని హెచ్చరికలు చేయడంతో రాష్ట్ర నాయకుల్లో కలవరం నెలకొంది. వచ్చే వారం కొందరు మంత్రులకు ఢిల్లీకి రావాలని రాహుల్‌గాంధీ ఆప్తుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమాచారం పంపారు. డీకే ఫిర్యాదు ఏమిటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు ముమ్మరం కాగా, ప్రతిపక్షాలు దీనిని హేళన చేస్తున్నాయి. ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా డిన్నర్లు చేసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ గౌరవానికి భంగం వాటిల్లుతోంది. దీనంతటికీ చెక్ పెట్టాలని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్(DKShivakumar) హైకమాండ్‌కు విన్నవించారని తెలిసింది. ఎందుకంటే ఎక్కువ డిన్నర్లు ఆయన వ్యతిరేక వర్గీయులు జరుపుతున్నవే. డీకేశి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్ (CongressHighCommand) మరో రెండు వారాల్లో ప్రక్షాళన చేపడతామని సంకేతాలిచ్చింది. కొందరు మంత్రులు విందు భేటీలు ఏర్పాటు చేయడం సరికాదు, నేను కూడా విందు ఇవ్వవచ్చు, కానీ అలాంటివి సబబుకాదు అని డీకే పేర్కొన్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో కష్టపడి అధికారంలోకి వస్తే నేతలు, మంత్రులు ఇలా చేస్తున్నారేమిటా అని తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ పలువురు సీనియర్ మంత్రులను పిలిపించి గట్టిగా మాట్లాడనుంది. సీఎం వర్గం గుర్రు మరోవైపు డీ.కే.శివకుమార్‌పై సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) వర్గానికి చెందిన కొందరు మంత్రులు అసంతృప్తికి గురయ్యారని తెలిసింది. వీరంతా వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. అంతఃకలహాలు కాంగ్రెస్‌లో ఏ పరిణామాలకు దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది. డీకే అడ్డుగోడల్ని సీఎం వర్గీయులు ఎలా ఛేదిస్తారనేది చర్చకు కారణమైంది.13న సీఎల్పీ భేటీ శివాజీనగర: తాజా పరిణామాల నేపథ్యంలో జనవరి 13న బెంగళూరులోని ఓ హోటల్లో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సభ మొదలవుతుంది. పారీ్టలో గ్రూపు కొట్లాటలు, హైకమాండ్ ఆగ్రహం నేపథ్యంలో ఈ భేటీ కుతూహలం కలిగిస్తోంది.నా విందు వాయిదా: హోంమంత్రి పరమేశ్వర్బుధవారం సాయంత్రం దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు నేను ఏర్పాటు చేసిన విందు రద్దు కాలేదు, వాయిదా పడింది అంతేనని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, హైకమాండ్ సూచన మేరకు విందు భోజనాన్ని వాయిదా వేశాను. విందు తేదీని త్వరలో వెల్లడినన్నారు. డీకే శివకుమార్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియదన్నారు. తాను విందు ఇవ్వరాదని ఎవరైనా అంటే సమాధానం చెప్పే శక్తి తమకు ఉందన్నారు. -
డీకే శివకుమార్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..!
అధికార కాంగ్రెస్‌లో ఓ విధమైన వేడి అలముకొంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కూడగట్టి సర్కారును పడదోయాలని ప్రతిపక్ష బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు. మరోవైపు తమ నాయకుడు డీకే శివకుమారే, రెండున్నరేళ్ల కాలానికి ఆయనే సీఎం అని కొందరు ఎమ్మెల్యేలు గళమెత్తారు. ఈ రెండింటిని ఎలా ఎదుర్కోవాలా అని సీఎం సిద్దరామయ్య తన సన్నిహిత మంత్రులతో హోంమంత్రి ఇంట్లో మంతనాలు జరిపారు. కర్ణాటక: బెంగళూరులో హోం మంత్రి జీ.పరమేశ్వర్ ఇంటిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కొందరు మంత్రులు విందు సమావేశం కావడం రాజకీయంగా కుతూహలానికి కారణమైంది. సీఎం సిద్దరామయ్య, జీ.పరమేశ్వర్, ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.సీ.మహాదేవప్పలు విందు భేటీ జరిపారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం ఆయన వర్గాన్ని అసంతృప్తికి గురిచేస్తోంది. రాష్ట్ర సర్కారును పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు, అలాగే డీకే శివకుమార్ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేల డిమాండ్లు ఇందులో చర్చకు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పోస్టులు తమకూ కావాలని సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్లు అప్పుడప్పుడు చెబుతున్నారు. సర్కారు ఏర్పడి ఇంకా ఆరు నెలలే అయ్యింది. ఇంతలోనే అస్థిరత ఏర్పడినట్లు వదంతులు చెలరేగుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్‌లోని గందరగోళాలకు తెర దించేందుకు సీఎం, మంత్రులు చర్చించారని తెలిసింది. కాగా, సీఎం స్పందిస్తూ, ఈ విందులో ఎలాంటి రాజకీయ చర్చ జరుపలేదు. పరమేశ్వర్ భోజనానికి ఆహా్వనిస్తే, వెళ్లాం. దీనికి రాజకీయ రంగును పూయవద్దు అన్నారు. పరమేశ్వర్ కూడా ఇదే మాటలు చెప్పడం గమనార్హం. బీజేపీ కుట్రలు ఫలించవు: డీకేశి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరిపే ప్రయత్నాలు ఫలించవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వెళ్లేముందు ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరుపుతున్న కుట్ర తెలుసు. దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అయినా కానీ సర్కారును కూల్చలేరు అన్నారు. మొదటి నుంచి బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని మండ్య ఎమ్మెల్యే రవి గణిగ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ప్రలోభాలను అసెంబ్లీలోనే బహిర్గతం చేస్తామన్నారు. కాగా, నేను సీఎం కావాలని ఎవరైనా ఎమ్మెల్యే ప్రకటిస్తే కేపీసీసీ చీఫ్‌గా వారికి క్రమశిక్షణా నోటీస్ జారీ చేయనున్నట్లు డీకే హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులకు పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడరాదని సూచించామన్నారు. మంత్రి పదవి,రూ. 50 కోట్ల ఆఫర్: గణిగ బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేల వద్ద మాట్లాడిన ప్రలోభాల సాక్ష్యాలను మరో రెండు రోజుల తరువాత మీడియా ముందు పెడతానని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ తెలిపారు. మండ్యలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి, రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చారు. సీఎం, డీసీఎంతో మాట్లాడిన రెండు రోజుల తరువాత మీడియా ముందు వస్తానన్నారు. ఒక ఎమ్మెల్సీ, యడియూరప్ప పీఏ సంతో‹Ù, బెళగావి మాజీ మంత్రి ఒకరు బెంగళూరులోని గోల్డ్ ఫించ్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. డీకేశి వెంట 70 మంది ఎమ్మెల్యేలు: శివగంగ డీసీఎం డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌లో 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని దావణగెరె జిల్లా చన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివగంగా బసవరాజ్ అన్నారు. ఈ ఐదేళ్లలో ఆయనను తప్పకుండా ముఖ్యమంత్రిని తప్పకుండా చేస్తామని ప్రకటించి హస్తంలో వేడిని పెంచారు. అధికార పంపకం, పార్టీ, ప్రభుత్వం గురించి ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని శనివారం ఉదయమే సీనియర్లు కఠినమైన హెచ్చరికలు చేశారు. వీటిని బేఖాతరు చేస్తూ శివగంగా విలేకరులతో ఘాటుగా మాట్లాడారు. డీ.కే.శివకుమార్ వంద శాతం సీఎం అవుతారు. పారీ్టలో 60– 70 మంది ఎమ్మెల్యేలు డీకేకి మద్దతుకు ఉన్నామని నేను మామూలుగానే చెప్పాను. ఆ మాటకొస్తే 135 మంది ఎమ్మెల్యేలు డీకేకి అండగా ఉన్నారు అని అన్నారు. అలాగని తాను మరొకరికి వ్యతిరేకం కాదన్నారు. -
మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య
సాక్షి బెంగళూరు: ఐటీ దాడుల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐటీ శాఖ అధికారులు గత మూడు రోజులుగా పరమేశ్వర్ ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పరమేశ్వర్ సన్నిహితుడు, పీఏ రమేశ్ ఇంటిలో కూడా సోదాలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంలో ఆయన శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని జ్ఞాన భారతి విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. అంతకుముందు తన ఇద్దరు స్నేహితులకు రమేశ్ ఫోన్ చేసి ‘నేను పేదవాడిని, నాపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టింది. ఎంతో నిజాయితీగా బతికాను. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. వారి ప్రశ్నలను ఎదుర్కోలేను’ అని చెప్పినట్లు తెలిసింది. -
నాణ్యత ప్రమాణాలు లేకే డిగ్రీ కాలేజీల మూత!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం అవసరం లేకున్నా రాష్ట్రంలో అడ్డగోలుగా డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిందని, ఒక్క కాలేజీ అవసరం ఉన్న చోట ఐదు కాలేజీలను ఇచ్చిందని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం పేర్కొంది. తద్వారా విద్యార్థులను తెచ్చుకోవాలన్న పోటీలో కొన్ని యాజమాన్యాలు నాణ్యత ప్రమాణాలకు నీళ్లొదిలాయని, అలాంటివే ఇప్పుడు మూత పడ్డాయని తెలిపింది. గత ప్రభుత్వం తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. కేజీ టు పీజీ జేఏసీ పేరుతో కొంతమంది నాయకులు గత మూడేళ్లుగా రాజకీయ పదవులకోసం పైరవీ చేసుకొని భంగపడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతం నుంచే ఉన్న సమస్యలను ఇప్పుడే మొదలైన సమస్యల్లా చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఏకపక్షంగా రాజకీయ మద్దతుపై తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తామే విద్యా సంస్థల ప్రతినిధులుగా చెప్పుకోవడాన్ని ఖండించింది. 50 శాతం ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీలు వారివెంట లేవని, మెజారిటీ సభ్యులు కలిగిన గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కూడా వారితో లేదన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫలితాలు రాబట్టుకోవాలే తప్ప ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడాన్ని అనేక యాజమాన్యాలు అంగీకరించడం లేదని వివరించారు. వారు కేజీ టు పీజీ జేఏసీ పేరుతో నాయకులుగా వ్యవహరిస్తూ కాలేజీల సంఘాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం ఫీజు బకాయిలను చెల్లించిందని, అయినా ఇవ్వలేదంటూ విమర్శలు చేయడాన్ని యాజమాన్యాలు నమ్మవద్దన్నారు. సంఘం నేతలు నరేందర్‌రెడ్డి, సిద్ధేశ్వర్ మాట్లాడారు. -
యూపీ సీఎం యోగిది నరం లేని నాలుక
సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం సిద్దరామయ్యపై అనాలోచితంగా ఆరోపణలు,వి మర్శలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నాలుకపై నియంత్రణలో పెట్టుకోవడం ఉత్తమమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బెంగళూరు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సిద్ధాంతాలు, పరివర్తన ర్యాలీ, తమ ప్రభుత్వం సాధించి అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా కేవలం సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, నేరాలు,అవినీతి పెరిగిపోయిందని అందుకు సీఎం సిద్దరామయ్య అసమర్థ పాలనే కారణమంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలు గురివింద నలుపు సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. ఇటీవల మంగళూరులో హత్యకు గురైన దీపక్‌రావ్ హత్య వెనుక బీజేపీ కార్పోరేటర్ హస్తం ఉందంటూ ఆరోపించారు. -
పోలీసుల వేతనాలు పెంపు !
10 నుంచి15 శాతం వరకు పెరిగే అవకాశం బెంగళూరు: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పోలీసుల డిమాండ్లలో ఒకటైన వేతనాల పెంపు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే పోలీసుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించనుందని సమాచారం. పోలీసుల వేతనాలను 10నుంచి 15 శాతం వరకు పెంచేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ సూత్ర ప్రాయంగా అంగీకరించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆర్థిక శాఖ వద్ద సైతం ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారానికి పోలీసులు గతంలో సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ వినాయక చవితి పండుగకు పోలీసులకు శుభవార్తను వినిపించనుందని తెలుస్తోంది. -
బెంగళూరులో 'సరి - బేసి విధానం' !
బెంగళూరు : దేశ రాజధాని న్యూఢిల్లీలో సరికొత్తగా అమలు చేస్తున్న 'సరి - బేసి' విధానాన్ని బెంగళూరు నగరంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. శనివారం బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ప్రాంతంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్‌ను పరమేశ్వర్ ప్రారంభించారు. అనంతరం జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... ఈ విధానం అమలుకు సంబంధించిన సాధక, బాధకాలపై ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీతోపాటు వాయు, శబ్ద కాలుష్యం సైతం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని అంశాలపై తాము చర్చిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అమలు చేస్తున్న సరి బేసి విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందువల్ల ఈవిధానంపై చర్చిస్తున్నట్లు పరమేశ్వర్ చెప్పారు. -
వైఎస్ హయాంలోనే అభివృద్ధి : టీడీపీ నాయకుడు
విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే తమ గ్రామాలు అభివృద్ధి చెందాయని విజయనగరం జిల్లా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు మండలం కూర్మరాజుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పరమేశ్వర్ సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో రాజన్నదొర ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలోనే తమ గ్రామాభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరతోపాటు టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి నిధులు రావడం లేదన్నారు. పరమేశ్వర్ వ్యాఖ్యలతో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ సంధ్యారాణితో పాటు టీడీపీ నాయకులు మిన్నుకుండిపోయారు. -
నిర్లక్ష్యాన్ని వీడండి...
రైతు ఆత్మహత్యలను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై రాహుల్ మండిపాటు త్వరలోనే బాధిత కుటుంబాలకు పరామర్శ షెడ్యూల్ ఖరారు చేయాల్సిందిగా సీఎం, కేపీసీసీ అధ్యక్షుడికి సూచన బెంగళూరు : రాష్ట్రంలో రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసహనం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి పొద్దు పోయాక బెంగళూరుకు చేరుకున్న రాహుల్‌గాంధీని ఇక్కడి ఓ రిసార్ట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలకు సంబంధించి అంశం ప్రస్తావనకు వచ్చింది. రైతుల ఆత్మహత్యల విషయంపై ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడితో రాహుల్‌గాంధీ అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ నెల రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల సంఖ్య 70గా ఉంది, అయితే అనధికారికంగా ఈ సంఖ్య 120 వరకు ఉండవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలను అడ్డుకోవడంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, అది ప్రభుత్వ మనుగడకే ముప్పుగా మారుతుందని రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ‘రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తున్నాను, అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలా రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగడం ఎంతమాత్రం సరికాదు. రైతులు ముఖ్యంగా అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంలో బ్యాంకులు రైతులపై అప్పుల చెల్లింపునకు సంబంధించి ఒత్తిడి తీసుకురాకుండా చేయడంపై దృష్టి సారించండి. అంతేకాదు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు సూచించారు. మీరెలాగో పోలేదు.....నేనే వెళతా.... ఇక రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ స్వయంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్.ఎం.కృష్ణ తీరును మెచ్చుకున్న రాహుల్‌గాంధీ...‘అసలు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా ముందుగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రైతుల కుటుంబాలను కలిసి పరామర్శించాల్సింది, తద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాల్సింది, అయితే మీరెలాగో వెళ్లలేదు కదా, అందుకే నేనే వెళతాను, రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబ సభ్యులను కలిసేందుకు గాను రెండు రోజుల షెడ్యూల్‌ను ఖరారు చేయండి, కర్ణాటకలో కూడా త్వరలోనే పాదయాత్ర ద్వారా రైతులను కలుస్తాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించిన ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వెళ్లండి...
రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా... ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో పర్యటించండి సీఎల్పీ సమావేశంలో సీఎం సిద్ధు బెంగళూరు : రాష్ట్రంలో రైతుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో బాధిత రైతుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పడంతో పాటు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని రైతులను కలిసి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని బుధవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. విధానసౌధలోని సమ్మేళన సభాంగణలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో రైతుల ఆత్మహత్యలపైనే ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పాలని, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. ‘ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో పర్యటించండి. రైతులతో పాటు ఇతర సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో స్వయంగా తెలుసుకోండి, వారితో చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించండి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలేమిటో వారికి వివరించి చెప్పండి. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ విజ్ఞప్తి చేయండి’ అని సూచిం చారు. ఇక ఇదే సందర్భంలో ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు సైతం జిల్లాల్లో పర్యటించాలని, ఎమ్మెల్యేల డిమాండ్లపై వేగవంతంగా స్పందించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరుపై సమావేశంలో పాల్గొన్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఎమ్మెల్యేలు, మంత్రులు మరింత చురుగ్గా పాల్గొనాల్సిన ఆవశ్యకతను వివరించారు. -
అలకలు వీడి ఒక్కటై...
బెంగళూరు: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశం కాంగ్రెస్ నేతల్లో ఒకింత ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దావణగెరెలోని బా పూజీ ఎంబీఏ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ ‘సర్వోదయ’ పేరిట ఏర్పాటు చేసిన స మావేశంలో కాంగ్రెస్ నేతలంతా తమ తమ విభేదాలను మరిచి చేతులు కలపడమే ఇందుకు ముఖ్య కారణం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కు మ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇన్చార్జ్ మంత్రులు తమ తమ నియోజకవర్గాల వ్యవహారాల్లో ఎక్కువగా తల దూ రుస్తున్నారంటూ అధికార పార్టీకి చెంది న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదుటే మండిపడ్డారు. ఇక మంత్రులు అసలు కేపీసీసీ కార్యాలయం వైపే రావడం లేదని, పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి నెలకొంది. అంతేకాక పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు మంత్రుల సహాయ సహకారాలు లభించడం లేదని కూడా పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో రాష్ట్రంలో అ ధికారాన్ని చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌ను మంత్రి పదవికి దూరంగా ఉంచ డం వంటి కారణాలన్నీ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య దూరాన్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లోనే ఒకరంటే ఇంకొకరికి పడటం లేదంటూ చర్చ సాగింది. అయితే దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశంలో కాంగ్రెస్ నేతలు తమ కుమ్ములాటలను పక్కన పెట్టి అందరూ చేతులు కలపడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దావణగెరెలో నిర్వహించిన సర్వోదయ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మంత్రులు ఆంజనేయ, డి.కె.శివకుమార్, మహదేవ ప్రసాద్, శామనూరు శివశంకరప్ప తదితరులు పాల్గొన్నారు. సమావేశం పై వరుణుడి ప్రతాపం దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశం పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. శనివారం ఉదయం సమావేశం ప్రారంభం కాగానే దావణగెరెలో వర్షం ప్రారంభమైంది. దీంతో అక్కడికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు తాము కూర్చున్న కుర్చీలను తీసుకొని వర్షానికి అడ్డుగా తలపై పెట్టుకొని నాయకుల ప్రసంగాలను వినాల్సి వచ్చింది. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వద్దంటున్నాడు..
న్యాయం చేయాలంటూ ఆందోళన కమ్మర్పల్లి : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను కాదంటున్నాడని మమత అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కోనాసముందర్‌కు చెందిన మమత అదే గ్రామానికి చెందిన పరమేశ్వర్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పరమేశ్వర్ మేనమామ వీరిని 22న కమ్మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. తర్వాత అడవి మామిడిపల్లికి తీసుకెళ్లి, మరుసటి ఉదయం మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి పరమేశ్వర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తానంటే ఇష్టం లేదని పేర్కొంటున్నాడని మమత ఆరోపించింది. ఈ విషయమై పోలీసులు తమకు కౌన్సెలింగ్ నిర్వహించారని, అయినప్పటికీ పరమేశ్వర్ తనతో కలిసి ఉండడానికి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బంధువైన ఓ కానిస్టేబుల్.. ఆయన మనసు మార్చి తనకు దూరం చేశారని ఆరోపించింది. ఆయనకు వేరొకరితో వివాహం జరిపించడానికి యత్నిస్తున్నారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. అయితే మమత తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్సై ప్రభాకర్ తెలిపారు. -
‘సామాజిక స్పృహ’ చిత్రాలు రావాలి
నేతల మధ్య వార్.. = పరస్పర ఆరోపణల వెల్లువ = ఓ వర్గానికి జిల్లా ఇన్చార్జి మంత్రి మద్దతు! = మరో వర్గాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్న పరమేశ్వర్? సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి చెందిన జిల్లా నేతల మధ్య రోజురోజుకూ అఘాతం పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని మాజీ ఎంపీ కేసీ కొండయ్య కబ్జా చేసి రాజీవ్ మెమోరియల్ ట్రస్టు పేరిట సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, ఇతర ముఖ్యులు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఫిర్యాదు చేయడంతో విభేదాలు మరింత ముదిరాయి. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ జోక్యం చేసుకుని కేసీ కొండయ్యకు నోటీసు జారీ చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో స్థల వివాదం నుంచి బయట పడేందుకు కేసీ కొండయ్య ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. జిల్లాలో ఒక వర్గానికి మంత్రి పరమేశ్వర్ నాయక్ మద్దతు ఉండగా, మరొక వర్గాన్ని తెర వెనుక నుంచి కేపీసీపీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, బళ్లారి జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్ బాబు, మాజీ ఎంపీ కేసీ కొండయ్య, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప తదితరుల మధ్య సఖ్యత లేదనేది బహిరంగ రహస్యం. బళ్లారి జిల్లాలో నేతల మధ్య కోల్డ్ వార్తో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా కొత్తగా పనులకు భూమి పూజ ఎక్కడా చేయలేదు. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో పూర్తై పలు అభివృద్ధి పనులు సైతం ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు. ఇందుకు బళ్లారి నగర నడిబొడ్డున రూ.6 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఫుట్‌బాల్ స్టేడియం అద్దం పడుతోంది. ఈ స్టేడియంను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎవరికి అంతుచిక్కడం లేదు. -
టార్గెట్@25
= లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు = ఢిల్లీలో మొదలైన కసరత్తు = రాహుల్‌తో సిద్ధు, పరమేశ్వర్.. భేటీ = డిసెంబరు రెండో వారంలోగా అభ్యర్థుల ఎంపిక = జాగ్రత్తగా వ్యవహరించాలన్న రాహుల్ = అసమ్మతికి ఆస్కారం లేకుండా చూడాలని హితవు = విపక్షాల్లో విభేదాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 25 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఆ సన్నాహాల్లో భాగంగా కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కమిటీ సభ్యులైన రాష్ట్ర హోం మంత్రి కేజే. జార్జ్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ ప్రభృతులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించామని పరమేశ్వర సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. డిసెంబరు రెండో వారంలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి గాను కేపీసీసీ నుంచి సత్వరమే జాబితాను పంపుతామని చెప్పామని వెల్లడించారు. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికలు పార్టీకి అగ్ని పరీక్షగా మారే అవకాశాలున్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ రాష్ర్ట నాయకులకు సూచించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయినందున ప్రజా వ్యతిరేకతకు ఇప్పటికిప్పుడు ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ప్రతిపక్షాలు ఒకటిగా లేకపోవడం కూడా పార్టీకి లాభించే అంశమని పేర్కొన్నారు. ఎటు లేదన్నా 28కి గాను 25 సీట్లను గెలుచుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అసమ్మతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చూడాలని జాగ్రత్తలు చెప్పారు. బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలను ఎన్నికల తర్వాతే చేపట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పదవులు రాని వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమో, అభ్యర్థుల విజయానికి పాటు పడకుండా గుంభనంగా ఉండిపోవడమో.... లాంటి పరిణామాలు సంభవించే అవకాశాలున్నందున, ఎన్నికలయ్యేంత వరకు అందరినీ ఊహా లోకంలో తేలియాడే పరిస్థితిని కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరో వైపు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రికి సూచనలు అందాయి. షాదీ భాగ్య, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విహార యాత్రలు లాంటి నిర్ణయాల వల్ల కొంత గందరగోళం నెలకొన్న విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువైనందున, లోక్‌సభ ఎన్నికల్లో వాటి ద్వారా పార్టీకి లబ్ధి కలిగేలా చూడాలని రాహుల్ సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి.