నేతల మధ్య వార్..
= పరస్పర ఆరోపణల వెల్లువ
= ఓ వర్గానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మద్దతు!
= మరో వర్గాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్న పరమేశ్వర్?
సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి చెందిన జిల్లా నేతల మధ్య రోజురోజుకూ అఘాతం పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని మాజీ ఎంపీ కేసీ కొండయ్య కబ్జా చేసి రాజీవ్ మెమోరియల్ ట్రస్టు పేరిట సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, ఇతర ముఖ్యులు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఫిర్యాదు చేయడంతో విభేదాలు మరింత ముదిరాయి. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ జోక్యం చేసుకుని కేసీ కొండయ్యకు నోటీసు జారీ చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
ఈ నేపథ్యంలో స్థల వివాదం నుంచి బయట పడేందుకు కేసీ కొండయ్య ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. జిల్లాలో ఒక వర్గానికి మంత్రి పరమేశ్వర్ నాయక్ మద్దతు ఉండగా, మరొక వర్గాన్ని తెర వెనుక నుంచి కేపీసీపీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, బళ్లారి జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్ బాబు, మాజీ ఎంపీ కేసీ కొండయ్య, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప తదితరుల మధ్య సఖ్యత లేదనేది బహిరంగ రహస్యం.
బళ్లారి జిల్లాలో నేతల మధ్య కోల్డ్ వార్‌తో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా కొత్తగా పనులకు భూమి పూజ ఎక్కడా చేయలేదు. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో పూర్తై పలు అభివృద్ధి పనులు సైతం ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు. ఇందుకు బళ్లారి నగర నడిబొడ్డున రూ.6 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఫుట్‌బాల్ స్టేడియం అద్దం పడుతోంది. ఈ స్టేడియంను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎవరికి అంతుచిక్కడం లేదు.
‘సామాజిక స్పృహ’ చిత్రాలు రావాలి
Published Mon, Dec 2 2013 5:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement