![73 Pending Challans on Two Wheeler in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/26/challan.jpg.webp?itok=9XF5aYlc)
చలాన్లు చూపుతున్న వాహనదారుడు
సనత్‌నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది కాదు అంతకంటే కాదు.. ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 73 పెండింగ్ చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ట్రాఫిక్ పోలీసులు సదరు ద్విచక్ర వాహనాన్ని గుర్తించి ఆ చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం మహంకాళి పోలీసులు సోదాలు చేస్తుండగా ఏపీ 09 సీడబ్లు్య 6418 నెంబర్ బైక్‌పై ఉన్న చలాన్లను ఆన్‌లైన్‌లో చెక్ చేశారు. దీంతో 73 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. అప్పటికప్పుడే సదరు వాహనదారుడి నుంచి మొత్తం రూ.13,120 పోలీసులు వసూలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment