pending challans
-
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్ల కన్ను
-
TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. వావాహనదారులను మోసం చేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. ఈ సైట్లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు వెల్లడించారు. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ప్రకటించిన రాయితీ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. చలాన్ల క్లియరెన్స్‌పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్లని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు. ఇదీ చదవండి: ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె -
TS: పెండింగ్ చలాన్ల చెల్లింపు.. రెస్పాన్స్ మామూలుగా లేదు.. దెబ్బకి సర్వర్ డౌన్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. మరో వైపు చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. జనవరి 10వ తేదీ వరకు చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. ఇదీ చదవండి: TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్ -
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
-
TS: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించింది. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చారు. చలాన్ల చెల్లింపులో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. కాగా, నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. -
ఫొటోలు తీయడమే కర్తవ్యమన్నట్లుగా.. ఏంది సారూ ఇది!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ నియంత్రణకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు ట్రాఫిక్ ని యంత్రణలో తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫి క్ నియంత్రణ సక్రమంగా నిర్వహించకపోగా పోలీసులే ట్రా ఫిక్ సమస్యలు సృష్టించే పరిస్థితి నడుస్తోంది. ప్రతి కూ డలిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం నియంత్రణలో ఉండడం లేదు. పట్టపగలు భారీ వాహనాలు వెళ్తున్నా పట్టింపులేదు. ట్రాఫిక్ చలాన్ల ఫొటోలు తీయడం లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ సమయంలోనైనా, ఏ పోలీసు కానిస్టేబుల్ అయినా ఫొటోలు తీయడమే తమ కర్త వ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ కనిపిస్తుండడం గమనార్హం. ఇక పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సంబంధించి పోలీసులు పలు చోట్ల తిష్ట వేసి తనిఖీలు చేస్తుండడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫొటోలు తీసి, చలాన్లు వేసి, అందుకు సంబంధించిన జరిమానాలు వసూళ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుండడం విశేషం. ఇదిలా ఉండగా మరోవైపు బార్ షాపుల వద్ద కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో ఉండి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. ► ట్రాఫిక్ చలాన్లు పంపే విషయంలో ఒక విధానం లేకుండా పోయింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన గ్లామర్ బైక్ కలిగి ఉన్న ఒక వ్యక్తికి హెల్మెట్ ధరించనందుకు చలాన్ విధించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఈ ఫొటో తీసింది మాత్రం హన్మకొండ జిల్లా కాజీపేటలో కావడం గమనార్హం. అది కూడా షైన్ బైక్ కావడం విశేషం. అసలు హన్మకొండకు వెళ్లని బైక్‌కు జరిమానా రావడం విడ్డూరం. పోలీసు శాఖ తప్పిదం అయినప్పటికీ చలాన్ మొత్తం చెల్లించాలని జిల్లా పోలీసులు చెబుతుండడం చిత్రంగా ఉంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఇష్టం వచ్చినట్లు చలాన్లు వేసిన కేసులు కోకొల్లలు.కాగా ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వసూలు చేసే విషయంలో పోలీసులు కొందరు వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తి స్తుండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. -
షాకింగ్.. ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: కర్ణాటక బెంగళూరు ట్రాఫిక్ ఫోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను ఆపి వేధించారు. పెండింగ్‌లో ఉన్న రూ.5,000 ట్రాఫిక్ చలాన్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బైక్‌ను సీజ్ చేస్తామని బెదిరించారు. తన భార్య డయాబెటిస్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్నామని, పెండింగ్ చలాన్లు తర్వాత కడతామని భర్త వేడుకున్నా ట్రాఫిక్ పోలీసులు కనికరించలేదు. దీంతో చికిత్స కోసం తెచ్చుకున్న రూ.2,000 చెల్లిస్తామని, మిగతా మొత్తం తర్వాత కడతామని దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినా ట్రాఫిక్ పోలీసులు మాత్రం జాలి చూపలేదు. మొత్తం రూ.5,000 చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక గత్యంతరం లేదని భావించిన భర్త మిగతా డబ్బు తెచ్చేందుకు ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. అతని కోసం బైక్ వద్దే ఎదురు చూసిన భార్య కాసేపటికే సృహతప్పి పడిపోయింది. ట్రాఫిక్ పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన ఈ దంపతుల కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అత్యంత కఠినంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బెంగళూరులోని సంగం సర్కిల్లో ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అదానీ మ్యాజిక్ ఏంటో చెబితే అందరూ కోటీశ్వరులవుతారు కదా..! -
పెండింగ్ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు..
బెంగళూరు: వాహనదారులు పెండింగ్ చలాన్లు కట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన 50 శాతం డిస్కౌంట్ వర్కవుట్ అయింది. ఆఫర్ ప్రకటించిన మరునాడే వాహనదారులు ఎగబడ్డారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమ పెండింగ్ చలాన్లు కట్టారు. దీంతో శుక్రవారం ఒక్క రోజే రూ.5.6 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో మొత్తం రూ.530 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనాదారులు కట్టాల్సి ఉంది. ఇందులో కేవలం బెంగళూరుకు చెందినవారే రూ.500కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫలితంగా వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. బెంగళూరులో చలాన్లు పెండింగ్ ఉన్నవారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి లేదా వెబ్సైట్, పేటీఎం ద్వారా చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఫిబ్రవరి 11 వరకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో వచ్చే వారం రోజులు కలెక్షన్లు భారీగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు.. -
రూ.90తో మొదలై.. రూ.250 కోట్లకు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలను భారీగా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్ ఈ నెల 1న మొదలైంది. ఆ రోజు తెల్లవారుజామున 1.24 గంటలకు ఓ వాహనదారు తన ద్విచక్ర వాహనంపై ఉన్న జరిమానా మొత్తంలో రిబేటు పోను రూ.90 చెల్లించారు. ఇదే ఈ– లోక్ అదాలత్‌కు సంబంధించిన తొలి చెల్లింపు. ఇలా మొదలైన చెల్లింపులు బుధవారం నాటికి రూ.250 కోట్లకు చేరాయి. తొలుత ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ఈ– లోక్ అదాలత్ ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఈ–చలాన్ బకాయిలు రూ.1700 కోట్ల వరకు ఉన్నాయి. బుధవారం వరకు 2.57 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లను వాహనచోదకులు చెల్లించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన తొలినాళ్లల్లో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా... సోమవారం నుంచి ఇది రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ– లోక్ అదాలత్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే రూ.60 కోట్లు.. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులు అత్యధికంగా పేటీఎం ద్వారా జరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పేటీఎం, వాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.60 కోట్ల ఈ– చలాన్ చెల్లింపులు జరిగాయి. (చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు) -
ఆఫర్ క్లోజెస్ సూన్.. ఇప్పుడు కె.జి.యఫ్ 2 వంతు
హైదరాబాద్: మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చు కోకండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటూ కె.జి.యఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్‌లోని ఆఫర్ క్లోజెస్ సూన్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా వాహనాల చలాన్లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్లైన్లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం ఛలాన్లు క్లియర్. హయ్యెస్ట్ ఎవరంటే.. ప్రత్యేకించి.. హైదరాబాద్ సిటీలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయి. ఓ స్కూటర్ ఓనర్‌కు.. అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయట. ఇక ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు 178 చలాన్ల మొత్తం 48,595 రూపాయలుగా ఉంది. రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ. 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. అతను ప్రత్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది. మరి వాళ్లు ఉపయోగించుకుంటారో లేదో? చూడాలి. -
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. బంఫర్ ఆఫర్ 30 రోజులే!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: వాట్సాప్ యూనివర్సిటీ వైద్యం.. వారి సలహాలు వింటే సరి.. లేదంటే ప్రాణాలు హరీ! ) హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈ-చలాన్ సిస్టమ్ ద్వార పెండింగ్ చలాన్లను చెలించాలని అన్నారు. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గతంలో నో మాస్క చలాన్లు రూ.1000 ఫైన్ ఉండగా, ప్రస్తుతం అవి రాయితీ అనంతరం రూ.100 కడితే సరిపోతుందన్నారు. కాగా దీనిపై నేటి రాత్రిలోపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
పెండింగ్ చలాన్ వాహనదారులకు భారీ శుభవార్త..!
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఈ-చలాన్లు అందుకుంటూ, ఆర్థిక సమస్యలతో వాటిని కట్టకుండా పెండింగ్‌లో పెట్టిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా పోలీస్‌శాఖ రాయితీలను ప్రకటించింది. రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఉపశమనం కలిగిస్తూ పెండింగ్ చలాన్లలో రాయితీని ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌శాఖ మార్చి 1 నుంచి 30 తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. వాహనదారులకు భారీ స్థాయిలో హైదరాబాద్ పోలీసులు రిబెట్ ప్రకటించారు. ద్విచక్ర వాహనదారుల చలాన్ మొత్తంలో 25 శాతం చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు మిగత 75 శాతాన్ని పోలీస్‌శాఖ మాఫీ చేయనుంది. అంతేకాకుండా కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు హైదరాబాద్ పోలీస్‌శాఖ ఇచ్చింది. ఈ మొత్తాన్ని ఆన్లైన్, మీసేవా, ఆన్లైన్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మొత్తం రూ.600 కోట్లకు పైగా పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదన పోలీస్‌శాఖ తీసుకొచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్లపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. చలానాల్లో రాయితీ ఇవ్వడం ద్వారా వాహనదారులు జరిమానాలు చెల్లించే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. (చదవండి: సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!) -
Banjara Hills: ఒక స్కూటీ.. 130 చలానాలు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ కలిగిన హోండా డియో (స్కటీ)ని పరిశీలించగా ఈ వాహనంపై 130 పెండింగ్ చలానాలు ఉన్నట్లుగా గుర్తించి అవాక్కయ్యారు. గత మూడేళ్లుగా ఈ వాహన యజమాని విజయ్ పెండింగ్ చలానాలతోనే ఎప్పటికప్పుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం 130 చలానాలకు గాను రూ.35,950 బకాయి ఉన్నట్లు తేలింది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో వాహనదారుడు చేతులెత్తేయడంతో వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. -
ఒక వాహనం.. 73 చలాన్లు
సనత్‌నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది కాదు అంతకంటే కాదు.. ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 73 పెండింగ్ చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ట్రాఫిక్ పోలీసులు సదరు ద్విచక్ర వాహనాన్ని గుర్తించి ఆ చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం మహంకాళి పోలీసులు సోదాలు చేస్తుండగా ఏపీ 09 సీడబ్లు్య 6418 నెంబర్ బైక్‌పై ఉన్న చలాన్లను ఆన్లైన్లో చెక్ చేశారు. దీంతో 73 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. అప్పటికప్పుడే సదరు వాహనదారుడి నుంచి మొత్తం రూ.13,120 పోలీసులు వసూలు చేశారు. -
పెద్ద హీరోలు.. చిన్న జరిమానాలు
సాక్షి, హైదరాబాద్ : సినిమాల్లో నీతులు చెబుతూ ఉండే హీరోలు నిజ జీవితంలో వచ్చేసరికి తేలిపోతుంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించి వారు చెల్లించాల్సిన చలాన్లు గత రెండు మూడేళ్లుగా మరుగునపడుతున్నా.. వాటిని మాత్రం చెల్లించలేకపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్, పార్కింగ్ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి. వీరిలో అత్యధికంగా మహేష్ బాబు పేరిట ఏడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.8,745 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్ కట్టలేకపోతున్నారు. 2018లో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు రాజేంద్రనగర్ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1035 ఫైన్ వేశారు. పవన్ కళ్యాణ్ వాహనం పార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ను చెల్లించలేకపోతున్నారు. సునీల్, నితిన్ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పది చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్ చేస్తామంటూ హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. -
చిక్కారో.. చుక్కలే..!
► పెండింగ్ చలాన్లపై అదనపు బాదుడు! ► భారీగా ఉంటే కోర్టుల్లో చార్జిషీట్లు ► 20 శాతం పెనాల్టీ విధించనున్న న్యాయస్థానం ► పెండింగ్ చలాన్లు 41.3 శాతం హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2014–16 మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 41.3 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ మూడేళ్ల కాలంలో 1.03 కోట్లు చలాన్లు జారీ కాగా, ఇందులో 42.62 లక్షల చలాన్లకు సంబంధించి వాహనచోదకులు జరిమానాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభా గం అధికారులు ఉల్లంఘనులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇలాంటి వారిపై న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేస్తుండగా... కోర్టు ఉల్లంఘనులకు పెండింగ్‌లో ఉన్న చలాన్ మొత్తానికి అదనంగా 20శాతం పెనాల్టీ విధిస్తోందని ట్రాఫిక్ చీఫ్ డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు. ఎక్కువ చలాన్లుంటే చార్జిషీట్లే... సిటీలోని అనేక వాహనాలపై భారీ సంఖ్యలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. పీడీఏ మెషిన్ల ద్వారా గుర్తించి, పట్టుకున్నప్పుడు ఇలాంటి వారిని కేవలం జరిమానాతో సరిపెట్టట్లేదు. వీరి నుం చి వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు పెండింగ్‌లో ఉన్న చలాన్ మొత్తానికి 20శాతం అదనంగా పెనాల్టీ విధిస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించని పక్షంలో వాహనచోదకుడికి జైలు శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు ట్రాఫిక్ చీఫ్ పేర్కొన్నారు. వాహనచోదకులు ఉల్లంఘనలకు పాల్పడకూడదని, పాల్పడినవారు ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అంతా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్... ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా పోలీసుస్టేషన్ నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అప్లోడ్ చేస్తారు. అక్కడి అధికారులు ఈ ఫొటోల ఆధారంగా వాహనచోదకులకు పోస్టు ద్వారా ఈ–చలాన్లు పంపిస్తున్నారు. భారీగా పెండెన్సీ ఈ కారణాల నేపథ్యంలో ఈ–చలాన్ల పెండెన్సీ భారీగా పెరిగిపోయింది. 2014–16 మధ్య నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 101 ఉల్లంఘనలకు సంబంధించి వాహనచోదకులకు 1,03,09,352 చలాన్లు జారీ చేశారు. ఈ–సేవ, మీ–సేవ, కాంపౌండింగ్ బూత్, ఆన్లైన్, నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఉల్లంఘనులు వీటిలో 60,46,500 చలాన్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన 42,62,852 చలాన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తం పెండింగ్‌లో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పీడీఏ మిషన్ల ద్వారా తనిఖీ చేస్తూ గరిష్టంగా మూడు కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మొత్తం చెల్లించిన తర్వాతే వాహనాన్ని విడిచిపెడుతున్నారు. ఆర్టీఏలో పక్కాగా లేని చిరునామాలు... ఈ–చలాన్లను ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌ను అనుసంధానం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు తమ కంప్యూటర్లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్ ఆ చిరునామాను ఈ–చలాన్ జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్టీఏ డేటాబేస్‌లో దాదాపు 50 శాతం చిరునామాలు అప్డేట్ కాలేదు. దీంతో ఈ చలాన్లు వాహన యజమానికి డెలివరీ కాకపోవడంతో తమ వాహనంపై చలాన్ జారీ అయిం దనే విషయం యజమానికి తెలియట్లేదు. మరికొందరు వాహనదారులు చలాన్ జారీ అయినట్లు తెలిసినా చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు పేర్కొం టున్నారు. గత మూడేళ్లలో మెగా లోక్ అదా లత్‌లు నిర్వహించిన ప్రతిసారీ ప్రచారం చేస్తూ దాదాపు 50శాతం వరకు రాయితీ లు ప్రకటిస్తున్నా ఫలితం కన్పించడం లేదన్నారు. స్టేటస్ తెలుసుకోండిలా... నగర ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.htp.gov.in), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.ct p.gov.in)లతో పాటు (Hyderabad Traffic Live, Telangana EChallan, Telangana Traffic Police) మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారానూ వివరాలు తెలుసుకోవచ్చు.