
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: వాట్సాప్ యూనివర్సిటీ వైద్యం.. వారి సలహాలు వింటే సరి.. లేదంటే ప్రాణాలు హరీ! )
హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈ-చలాన్ సిస్టమ్ ద్వార పెండింగ్ చలాన్లను చెలించాలని అన్నారు. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గతంలో నో మాస్క చలాన్లు రూ.1000 ఫైన్ ఉండగా, ప్రస్తుతం అవి రాయితీ అనంతరం రూ.100 కడితే సరిపోతుందన్నారు. కాగా దీనిపై నేటి రాత్రిలోపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment