సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. మరో వైపు చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది.
వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. జనవరి 10వ తేదీ వరకు చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు.
చలాన్లలో డిస్కౌంట్ ఇలా..
►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్
► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్
►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్
►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్.
ఇదీ చదవండి: TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్
Comments
Please login to add a commentAdd a comment