చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులుతీరాయి. దీంతో గురువారం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది.
హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచి వాహనాల రాక పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. జంక్షన్లు, క్రాసింగ్‌ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకుసాగేందుకు, ప్రమాదాల నివారణకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల కూడలి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద సాఫీగా..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు సాఫీగా సాగాయి. టోల్‌ప్లాజాలో 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి వాహనాలను పంపించారు.
విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జాతీయ రహదారిపై హైవే అథారిటీ అధికారులు గుర్తించిన 17 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ప్రతి గ్రామ స్టేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment