TS: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌ | Telangana Police Department Huge Discount On Traffic Challans | Sakshi
Sakshi News home page

TS: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌

Published Fri, Dec 22 2023 3:38 PM | Last Updated on Fri, Dec 22 2023 5:40 PM

Telangana Police Department Huge Discount On Traffic Challans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించింది. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. 

వివరాల ప్రకారం.. ట్రాఫిక్‌ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆఫర్‌ ఇచ్చారు. చలాన్ల చెల్లింపులో భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. 

చలాన్లలో డిస్కౌంట్‌ ఇలా.. 
►ఆర్టీసీ  డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్
► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్
►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్
►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్.

కాగా, నవంబర్‌ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్‌ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement