పెద్ద హీరోలు.. చిన్న జరిమానాలు | Tollywood top Stars Traffic Challans Are In Pending | Sakshi
Sakshi News home page

పెద్ద హీరోలు.. చిన్న ఫైన్లు కట్టలేకపోతున్నారు!

Published Sat, Jan 12 2019 9:42 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Tollywood top Stars Traffic Challans Are In Pending - Sakshi

బాలకృష్ణ, మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లాంటి ప్రయాణించిన వాహనాలు ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాయి.

సాక్షి, హైదరాబాద్‌ : సినిమాల్లో నీతులు చెబుతూ ఉండే హీరోలు నిజ జీవితంలో వచ్చేసరికి తేలిపోతుంటారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను ఉల్లంఘించి వారు చెల్లించాల్సిన చలాన్లు గత రెండు మూడేళ్లుగా మరుగునపడుతున్నా.. వాటిని మాత్రం చెల్లించలేకపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లాంటి స్టార్‌ హీరోలు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్‌, పార్కింగ్‌ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి.

వీరిలో అత్యధికంగా మహేష్‌ బాబు పేరిట ఏడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.8,745 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్‌ కట్టలేకపోతున్నారు. 2018లో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు రాజేంద్రనగర్‌ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1035 ఫైన్‌ వేశారు. పవన్‌ కళ్యాణ్‌ వాహనం పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ను చెల్లించలేకపోతున్నారు. సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పది చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్‌ చేస్తామంటూ హైదరాబాద్‌ అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement