traffic violation cases
-
డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికారో ఇక అంతే.. మీ రక్తం గుంజుడే!
చండీగఢ్: తాగి బండి నడుపొద్దని పోలీసులు ఎంత చెప్పినా వినటం లేదు మందు బాబులు. వేలకు వేలు ఫైన్లు రాసినా దారికి రావటం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పంజాబ్ పోలీసులు. కొత్త ట్రాఫిక్ నియమాలకు శుక్రవారం ఆమోద ముద్ర వేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందు కొట్టి పట్టుబడితే.. రక్త దానం చేయాలి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు రోగులకు సేవ చేయాలి. కొత్త నిబంధనలు ఇలా.. మందు కొట్టి దొరికిపోయిన వారు తప్పనిసరిగా రక్త దానం చేయాలి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటలు సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి. రవాణా శాఖ నుంచి రీఫ్రెస్ కోర్స్ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. మరోవైపు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. అందులో ఓవర్ స్పీడ్, వాహనం నడుపుతూ మొబైల్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లు వంటివి ఉన్నాయి. ఒక వేల రెండోసారి దొరికితే రెండింతల ఫైన్ వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినా.. మొబైల్ వాడినా రూ.5వేల జరిమానా విధిస్తారు. రెండోసారి అది డబుల్ అవుతుంది. అలాగే.. ఓవర్ లోడు వాహనాలకు రూ.20వేల జరిమానా విధించనున్నారు. రెండోసారి అలాగే చేస్తే జరిమానా రెండింతలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి డబుల్ ఉంటుందన్నారు. పంజాబ్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు 13 మంది మరణిస్తున్నారు. 2011 నుంచి 2020 వరకు 56,959 ప్రమాదాలు జరిగాయి. 46,550 మంది మరణించారు. ఇదీ చూడండి: ఆర్ఎల్పీ ఎమ్మెల్యే కారు చోరీ.. పోలీసుల తీరుపై ఆరోపణ! -
రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’ 40 శాతం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్ ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంతో రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. -2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి. - ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. - డ్రైవింగ్ లైసెన్సు ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై రవాణా, పోలీస్‌శాఖలు ఆలోచిస్తున్నాయి. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే.. - గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు: 21,992 - ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 7,984 - తీవ్రంగా గాయపడినవారి సంఖ్య: 24,619 - మృత్యువాత పడిన ద్విచక్రవాహనదారుల సంఖ్య: 3,287 - వీరిలో మహిళల సంఖ్య: 399 - హెల్మెట్ ధరించనివారి సంఖ్య: 1,861 - పిలియన్ రైడర్స్ (వెనుక కూర్చున్న వారు) సంఖ్య: 775 - సీటు బెల్టు ధరించని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య: 711 - ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు: 15,383 - ఓవర్ స్పీడ్ వల్ల మరణించినవారి సంఖ్య: 5,530 - డ్రంకన్‌డ్రైవ్ వల్ల మృత్యువాత పడినవారి సంఖ్య: 43 - రాంగ్ రూట్లో వచ్చి మరణించినవారి సంఖ్య: 155 - హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 2,760 నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు వాహనదారులు సామాజిక బాధ్యతగా తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే తీవ్ర చర్యలుంటాయి. ప్రాణాల విలువ తెలియజేసేందుకే జరిమానాలు పెంచాం. జరిమానాల పెంపుతోనైనా కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. భారీ జరిమానాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. జరిమానాలతో 40 శాతం ఉల్లంఘనలు సగానికి పైగా తగ్గుతాయని భావిస్తున్నాం. జరిమానాలతో ఆదాయం పెంచుకుందామనేది మా అభిమతం కాదు. - పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా శాఖ మంత్రి ఎన్ఫోర్సుమెంట్ కార్యకలాపాలు పెంచుతాం వాహనదారులకు క్రమశిక్షణ నేర్పేందుకే ప్రభుత్వం జరిమానాలు పెంచింది. చెల్లుబాటయ్యే లైసెన్సు ఉన్నవారు కూడా రోడ్డు ప్రమాదాలకు కారకులవడం బాధాకరం. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేందుకు కూడా.. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై ఎన్ఫోర్సుమెంట్ కార్యకలాపాలు పెరుగుతాయి. - పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ గత ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు జిల్లా ఓవర్ స్పీడ్ లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసినవి అనంతపురం 320 327 చిత్తూరు 8 269 తూర్పుగోదావరి 30 289 గుంటూరు 1 459 కృష్ణా 1 101 కర్నూలు 147 330 నెల్లూరు 1,926 603 ప్రకాశం 2 146 శ్రీకాకుళం 0 8 విశాఖపట్నం 3,446 302 విజయనగరం 0 42 పశ్చిమగోదావరి 7 722 వైఎస్సార్ కడప 0 231 మొత్తం 5,888 3,829 రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాలు.. సంవత్సరం మరణాలు 2016 8,541 2017 8,060 2018 7,556 2019 7,984 2020 (సెప్టెంబర్ వరకు) 4,752 -
పెద్ద హీరోలు.. చిన్న జరిమానాలు
సాక్షి, హైదరాబాద్ : సినిమాల్లో నీతులు చెబుతూ ఉండే హీరోలు నిజ జీవితంలో వచ్చేసరికి తేలిపోతుంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించి వారు చెల్లించాల్సిన చలాన్లు గత రెండు మూడేళ్లుగా మరుగునపడుతున్నా.. వాటిని మాత్రం చెల్లించలేకపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్, పార్కింగ్ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి. వీరిలో అత్యధికంగా మహేష్ బాబు పేరిట ఏడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.8,745 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్ కట్టలేకపోతున్నారు. 2018లో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు రాజేంద్రనగర్ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1035 ఫైన్ వేశారు. పవన్ కళ్యాణ్ వాహనం పార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ను చెల్లించలేకపోతున్నారు. సునీల్, నితిన్ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పది చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్ చేస్తామంటూ హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. -
రింగ్ రోడ్డు మీద రెండు లక్షలు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాసుల వర్షం కురుస్తోంది! ఒకటి కాదు రెండు కాదు రోజుకు రూ. 31,328.. వారంలో రూ. 2,19,300 .. రెండున్నర నెలల్లో రూ. 21,38,600.. ఇంతకీ ఈ మొత్తం ఎవరికి చేరుతుందో తెలుసా? ప్రభుత్వానికి! అవునుమరి.. ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వాహనదారులు చెల్లిస్తున్న అపరాధ రుసుములు.. ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది! మార్చి 7 నుంచి 13 వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై 266 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటిలో 78 రాంగ్ పార్కింగ్, 188 రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులున్నాయి. ఇవేకాకుండా ఫైన్ల రూపంలో పోలీసులు రూ. 2,19,300 వసూలు చేశారు. 2015, జనవరి1 నుంచి మార్చి 13 వరకు 2, 643 కేసులు నమోదుకాగా, రూ.21,38,600 అపరాధ రుసుము వసూలయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నిబంధనల అతిక్రమణను నిరోధించేందుకు గత ఏడాది జనవరి నుంచి ప్రత్యేక పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాలుగు పెట్రోలింగ్ వాహనాలు నిత్యం పహారా కాస్తూ నేరాల నిరోధానికి ప్రయత్నిస్తుంటాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై అమలులో ఉన్న ట్రాఫిక్ రూల్స్ తెల్సుకోవడంతోపాటు ఫిర్యాదులు, సలహాల కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక హెల్ప్‌లైన్స్ (040-2300 2424 లేదా 8500411111) ఏర్పాటు చేశారు.