మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన హిట్ సినిమా మురారి రీ- రిలీజ్ అయింది. తొలిరోజే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 5.46 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. మహేశ్‌బాబు- సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం ఆగస్టు 9న రీ-రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మహేష్‌బాబు రీ రిలీజ్ సినిమాల్లో బిజినెస్‌మెన్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా మురారి నిలిచింది. బిజినెస్‌మెన్ ఫస్ట్ డే రూ. 5.7 కోట్లు రాబట్టింది.
పవన్ ఖుషి చిత్రాన్ని బీట్ చేసిన మురారి
సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు రీ-రిలీజ్ చిత్రాలు భారీగానే విడుదలయ్యాయి. అయితే, ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సౌత్ ఇండియా చిత్రంగా పవన్ కల్యాణ్ 'ఖుషి' ప్రథమ స్థానంలో ఉంది. 2022 డిసెంబర్ 31న రీ-రిలీజ్ అయిన ఈ సినిమా పదిరోజుల పాటు కొనసాగింది. అప్పట్లో సుమారు రూ. 7.5 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఖుషి సినిమానే కలెక్షన్ల పరంగా టాప్‌లో ఉంది. అయితే, మహేశ్ మురారి సినిమా కేవలం 3రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
ఇప్పటికే రూ. 8.31 కోట్ల కలెక్షన్లు రాబట్టి రీ-రిలీజ్ సినిమా కలెక్షన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇంకా బాక్సాఫీస్ వద్ద మురారి సందడి కొనసాగుతుంది. కలెక్షన్లు క్లోజింగ్ అయ్యే సమయానికి రూ. 10 కోట్ల మార్క్‌ను మురారి చేరుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ 10రోజుల కలెక్షన్ల రికార్డ్‌ను మహేశ్ కేవలం 3రోజుల్లోనే సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
2001లో విడుదలైన మురారి చిత్రానికి ఇప్పుడు కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుండటంతో మహేష్ బాబు తన ఆనందాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. అభిమానులు ఇచ్చిన తిరుగులేని మద్దతుకు ఆయన ధన్యవాదాలు చెప్పాడు. మురారి రీ-రిలీజ్ విజయం సినిమా రీ-రిలీజ్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. 2001 నంది అవార్డుల కార్యక్రమంలో మురారి సత్తా చాటింది. ఏకంగా మూడు నంది అవార్డులను దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. 2015లో హిందీలో రౌడీ చిరుతగా డబ్ చేయబడిన మురారి.. 2006లో కన్నడలో గోపిగా రీమేక్ చేయబడింది.
విజయ్ గిల్లీ పరిస్థితి ఏంటి..?
మహేశ్ బాబు 'ఒక్కడు' చిత్రాన్ని కోలీవుడ్‌లో 'గిల్లీ' పేరుతో దళపతి విజయ్ రీమేక్ చేశాడు. 2004లో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే, రీసెంట్‌గా రీ-రిలీజ్ అయిన గిల్లీ సినిమా రూ. 32.5 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కానీ, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్రమైన దుమారం రేగింది. రికార్డుల కోసం ఇలా తప్పుడు కలెక్షన్లు ప్రకటించారని ఒక కామెంట్ ఉంది. కొందరు మాత్రం అందులో నిజం లేదని కొట్టిపడేశారు.
విజయ్ అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో సుమారు 10 రోజుల పాటు గిల్లీ సినిమా టికెట్లు కొనుగోలు చేశారని ఒక విమర్శ ఉంది. సుమారు 30రోజుల పాటు కొన్ని థియేటర్స్‌లలో గిల్లీ చిత్రాన్ని ప్రదర్శించారు. దీంతో సౌత్ ఇండియా రీ-రిలీజ్ టాప్ సినిమాల జాబితాలో గిల్లీ సినిమానా..? మురారి చిత్రమా..? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment