Murari
-
అమెరికాలో మురారి రీ-రిలీజ్
-
మురారి సీక్వెల్ కావాలంటున్న మహేష్ ఫ్యాన్స్..
-
పవన్ కల్యాణ్ రికార్డ్‌ని 3రోజుల్లోనే అందుకున్న మహేశ్ బాబు
మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన హిట్ సినిమా మురారి రీ- రిలీజ్ అయింది. తొలిరోజే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 5.46 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. మహేశ్‌బాబు- సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం ఆగస్టు 9న రీ-రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మహేష్‌బాబు రీ రిలీజ్ సినిమాల్లో బిజినెస్మెన్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా మురారి నిలిచింది. బిజినెస్మెన్ ఫస్ట్ డే రూ. 5.7 కోట్లు రాబట్టింది.పవన్ ఖుషి చిత్రాన్ని బీట్ చేసిన మురారిసౌత్ ఇండియాలో ఇప్పటి వరకు రీ-రిలీజ్ చిత్రాలు భారీగానే విడుదలయ్యాయి. అయితే, ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సౌత్ ఇండియా చిత్రంగా పవన్ కల్యాణ్ 'ఖుషి' ప్రథమ స్థానంలో ఉంది. 2022 డిసెంబర్ 31న రీ-రిలీజ్ అయిన ఈ సినిమా పదిరోజుల పాటు కొనసాగింది. అప్పట్లో సుమారు రూ. 7.5 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఖుషి సినిమానే కలెక్షన్ల పరంగా టాప్‌లో ఉంది. అయితే, మహేశ్ మురారి సినిమా కేవలం 3రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఇప్పటికే రూ. 8.31 కోట్ల కలెక్షన్లు రాబట్టి రీ-రిలీజ్ సినిమా కలెక్షన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇంకా బాక్సాఫీస్ వద్ద మురారి సందడి కొనసాగుతుంది. కలెక్షన్లు క్లోజింగ్ అయ్యే సమయానికి రూ. 10 కోట్ల మార్క్‌ను మురారి చేరుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ 10రోజుల కలెక్షన్ల రికార్డ్‌ను మహేశ్ కేవలం 3రోజుల్లోనే సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.2001లో విడుదలైన మురారి చిత్రానికి ఇప్పుడు కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుండటంతో మహేష్ బాబు తన ఆనందాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. అభిమానులు ఇచ్చిన తిరుగులేని మద్దతుకు ఆయన ధన్యవాదాలు చెప్పాడు. మురారి రీ-రిలీజ్ విజయం సినిమా రీ-రిలీజ్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. 2001 నంది అవార్డుల కార్యక్రమంలో మురారి సత్తా చాటింది. ఏకంగా మూడు నంది అవార్డులను దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. 2015లో హిందీలో రౌడీ చిరుతగా డబ్ చేయబడిన మురారి.. 2006లో కన్నడలో గోపిగా రీమేక్ చేయబడింది.విజయ్ గిల్లీ పరిస్థితి ఏంటి..?మహేశ్ బాబు 'ఒక్కడు' చిత్రాన్ని కోలీవుడ్‌లో 'గిల్లీ' పేరుతో దళపతి విజయ్ రీమేక్ చేశాడు. 2004లో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే, రీసెంట్గా రీ-రిలీజ్ అయిన గిల్లీ సినిమా రూ. 32.5 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కానీ, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్రమైన దుమారం రేగింది. రికార్డుల కోసం ఇలా తప్పుడు కలెక్షన్లు ప్రకటించారని ఒక కామెంట్ ఉంది. కొందరు మాత్రం అందులో నిజం లేదని కొట్టిపడేశారు. విజయ్ అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో సుమారు 10 రోజుల పాటు గిల్లీ సినిమా టికెట్లు కొనుగోలు చేశారని ఒక విమర్శ ఉంది. సుమారు 30రోజుల పాటు కొన్ని థియేటర్స్‌లలో గిల్లీ చిత్రాన్ని ప్రదర్శించారు. దీంతో సౌత్ ఇండియా రీ-రిలీజ్ టాప్ సినిమాల జాబితాలో గిల్లీ సినిమానా..? మురారి చిత్రమా..? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. -
మురారి రిరిలీజ్.. దద్దరిల్లిన థియేటర్స్..
-
మురారి రి రిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
బ్లాక్‌బస్టర్ హిట్ 'మురారి' రీ రిలీజ్.. అస్సలు పట్టించుకోని హీరోయిన్!
టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే కావడం.. సూపర్ హిట్ మూవీ మురారి రీ రిలీజ్ చేయడం అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. 2001లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పెళ్లి సీన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇవాళ రీ రిలీజ్ కావడంతో కొందరైతే ఏకంగా థియేటర్లనే పెళ్లి చేసుకోవడం చూస్తే ప్రిన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది.రీ రిలీజ్‌పై స్పందించని హీరోయిన్..అయితే మురారిలో హీరోయిన్గా మెప్పించిన ముంబయి ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఆ తర్వాత ఇంద్ర, మన్మధుడు లాంటి హిట్ సినిమాల్లోనూ కనిపించింది. ఆమె మురారి సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాతే చిరంజీవి, నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇవాళ మురారి రీ రిలీజ్ అయినప్పటికీ ఎక్కడా కూడా ఈ సినిమా గురించి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. తనకు సూపర్ హిట్ అందించిన మురారి చిత్రంపై కనీసం ఇన్‌స్టా వేదికగా స్పందించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఏది ఏమైనా సోనాలి తొలి టాలీవుడ్ గురించి రియాక్ట్ అయి ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే 2002లో నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీ బెల్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడిన భామ.. ఆ తర్వాత కోలుకుంది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవలే ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) -
థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ గత ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. మహేశ్, పవన్ పాత సినిమాల్ని థియేటర్లో మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా దాదాపు అందరి హీరోల పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా మహేశ్ 'మురారి'కి ఎక్కడలేనంత హైప్ వచ్చింది.(ఇదీ చదవండి: యాంకర్ అనసూయ 'సింబా' సినిమా రివ్యూ)హైదరాబాద్‌లోని కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓ థియేటర్లో అయితే ఓ అభిమాని నిజంగానే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షతలు పంచుతూ వైరల్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?)Nijam ga pelli cheskunaru🤣🔥 #Murari4K pic.twitter.com/kRABlUVBWM— VardhanDHFM (@_VardhanDHFM_) August 9, 2024Brahmaramba lo akshinthalu panchuthunnaru 😭#Murari4K @urstrulyMahesh pic.twitter.com/UcG6WE2QAS— 28 (@898SAG) August 9, 2024Theaters ❎ Marriage Functions ✅#Murari4K #MaheshBabu𓃵 pic.twitter.com/kcquN8Njxr— Addicted To Memes (@Addictedtomemez) August 9, 2024Kukatpally Mass 🔥 #Murari4K pic.twitter.com/VlOMbTNvGQ— ʌınɐʎ (@CoolestVinaay) August 9, 2024 -
నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన క్లాసిక్ హిట్స్‌లో మురారి ఒకటి. మహేశ్‌బాబు, సోనాలి బింద్రె జంటగా నటించిన ఈ సినిమాను కృష్ణ వంశీ తెరకెక్కించాడు. మణిశర్మ సంగీతం సినిమా విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి సుధ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. హీరోయిన్ను ఏడిపించే సాంగ్ఆమె మాట్లాడుతూ.. అందరూ ఇష్టపడే హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు. మీ నాన్న గారితో, మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశీ, దూకుడు, అతడు.. ఇలా మంచి చిత్రాల్లో నటించాను. మురారి రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఓ సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. హీరోయిన్ సోనాలి బింద్రెను ఏడిపించే పాట(బంగారు కళ్ల బుచ్చమ్మో..)లో మహేశ్, నేను ఆమెను మామూలుగా ఏడిపించలేదు. కావాలనే ఏడిపిస్తున్నారు కదాఆ షాట్ పూర్తయ్యాక తనొచ్చి.. మీరిద్దరూ కలిసి కావాలనే ఏడిపిస్తున్నారు కదా.. నాకు అర్థమవుతోంది. దర్శకుడు చెప్పకపోయినా కావాలని ఏడిపిస్తున్నారంది. ఆ పాటలో.. తనతో గేదెకు స్నానం చేయిస్తున్నప్పుడైతే ఎంత నవ్వుకున్నామో.. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని సీన్స్‌లో నేను కనిపించను. అయినా ఉన్నంతవరకు షూటింగ్ ఆనందంగా చేశాం అని చెప్పుకొచ్చింది. Veteran artist #Sudha garu’s special video byte for #Murari4K 💥❤️🔥@urstrulyMahesh #SSMB29 pic.twitter.com/vnkM7Po5Zx— 𓆩MB_RAJ𓆪 (@Raj_6208) July 27, 2024 చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 'ప్రేమలు' నటుడు -
రీరిలీజ్.. టాలీవుడ్లో ఇప్పుడిదే ట్రెండ్!
రీరిలీజ్ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్‌గా మారింది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని రీరిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.మహేశ్‌బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్ 5, 1989లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్ మీనన్. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. -
‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్
కృష్ణ వంశీ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ‘మురారి’ ఒకటి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. కృష్ణవంశీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు.మహేశ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడని ఘట్టమనేని అభిమానులు అభినందించారు. మహేశ్ కూడా తను బాగా ఇష్టపడే సినిమాల్లో మురారి ఒకటని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆయన అభిమానులు కూడా తమ హీరో నుంచి మురారి లాంటి మరో క్లాసిక్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఇక మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మురారీ సాంగ్స్‌ని, ఆ సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.కృష్ణవంశీ సైతం సోషల్ మీడియా వేదికగా మురారి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తున్నాడు. అయితే ఈ రీరిలీజ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ‘మురారి’ ప్లాప్ సినిమా అని రాసుకొచ్చాడు. దానికి కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘హలో అండీ నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావు గారి నుంచి రూ. 55 లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్లో రూ. 1.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రామాణికం అయితే.. అది ఫ్లాప్ చిత్రమా లేదా సూపర్ హిట్టా?’ మీరే నిర్ణయించుకోండి’ అని రిప్లై ఇచ్చాడు. -
సర్వోదయ నేత మురారీ లాల్ కన్నుమూత
గోపేశ్వర్: సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్య మాల నేత మురారీ లాల్(91) కన్నుమూశారు. శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మురారీ లాల్ తుదిశ్వాస విడిచారు. చమోలి జిల్లా గోపేశ్వర్‌కు సమీపంలోని పాప్డియానా గ్రామంలో 1933లో మురారీ లాల్ జన్మించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీ లాల్ అధ్యక్షుడిగా పనిచేశారు. మురారీ లాల్ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. చమోలీ జిల్లా మద్య నిషేధం కోసం ఉద్యమించారు. 1975–76 కాలంలో భూమి లేని పేదలకు లీజుపై భూమి దక్కేలా చేశారు. శ్రమదానంతో స్వగ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. -
చిలుకూరు బాలాజీ టెంపుల్ పాడుబడిందని అక్కడ మహేష్ బాబు సినిమా చేయలేదు
-
తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!
అభిరుచి గల మురారి... ఆద్యంతం సాహిత్య సంగీతాల్ని ప్రేమించిన మురారి... మంచి చిత్రాల నిర్మాత ‘యువచిత్ర’ మురారి వెళ్ళిపోయారు. మూడు దశాబ్దాల స్నేహంలో ఎన్నో ఘటనలు మనసులో రీళ్ళు తిరిగాయి. మురారిది కమ్యూనిస్ట్ కుటుంబం. బెజవాడలో బాగా డబ్బున్న కాట్రగడ్డ కుటుంబం. సినీ నిర్మాణానికి పంపిణీ వ్యవస్థే మూలస్తంభమైన రోజుల్లో ప్రతిష్ఠాత్మక నవయుగ ఫిల్మ్స్ అధినేతకు అన్న కొడుకు. ఆ కొంగుచాటులన్నీ దాటుకొని, కష్టపడి, ఒక్కో మెట్టూ పేర్చు కుంటూ మురారి తనదైన కీర్తి, అపకీర్తుల సౌధం కట్టుకు న్నారు. వి. మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడైన మురారికి అనంతరకాల అగ్ర దర్శకుడు కోదండరామి రెడ్డి సహపాఠీ. జెమినీ వాసన్, విజయా చక్రపాణి వద్ద నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. కొట్లాడే దర్శకుడు కాబోయి, తిట్టి మరీ చెప్పి చేయించుకొనే నిర్మాతగా మారడమే తెలివైన పని అని గ్రహించారు. తనకు నచ్చిన సినిమాలే తీశారు. తనకు నచ్చినట్టే తీశారు. పంతం పట్టి రీషూట్లూ చేశారు. పారితోషికం పెంచి ఇస్తూ, పని చేయించుకున్నారు. ‘తిడతాడు.. డబ్బుతో కొడతాడు’ అనిపించుకున్నారు. సమకాలికుల్లో విలక్షణంగా నిలిచారు. బ్యానరే ఇంటిపేరైన కొద్ది నిర్మాతల్లో ఒకరయ్యారు. మద్రాస్ మెరీనా బీచ్‌లోని దేవీప్రసాద్‌రాయ్ చౌధురి ‘శ్రామిక విజయం’ శిల్పం తమ సంస్థకు చిహ్నంగా పెట్టుకో వడం మురారి పెరిగిన వాతావరణపు ఆలోచన. నవలల్ని తెరపైకి తెచ్చినా, ఇంగ్లీష్ ఇతివృత్తాల్ని తెలుగు కథలుగా మలిచినా అది ఆయన పెంచుకున్న అభిరుచి. ‘సీతామాలక్ష్మి, గోరింటాకు, త్రిశూలం, సీతారామ కల్యాణం’ వగైరా అన్నీ కలిపి తీసినవి 9 సినిమాలే! విజయ బాపినీడుతో కలసి నిర్మించిన ‘జేగంటలు’ తప్ప అన్నీ సక్సెస్‌లే. నందులతో సహా అనేక అవార్డులు తెచ్చినవే. ఆయన పాటలు అందమైన హిందోళాలు. ఎవర్గ్రీన్ హిట్లు. ఒకే నిర్మాత సినిమాల్లోని సాహిత్య విలువలపై 20 ఏళ్ళక్రితమే విశ్వవిద్యాలయ పరిశోధన జరిగింది ఒక్క ‘యువచిత్ర’ సినిమాలకే! ‘మామ’ మహదేవన్ లేకుండా సినిమా తీయనన్న మురారి, మామ పోయాక నిజంగానే సినిమా తీయలేకపోయారు. కీరవాణి సంగీతంతో కథ, సంగీత చర్చలు జరిగినా ముందుకు సాగలేదు. మూగబోయిన కృష్ణశాస్త్రిని ఆరాధిస్తూ బాంబే బ్రెడ్ టోస్ట్ చేసిచ్చినా, ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కని పాలగుమ్మి పద్మ రాజును ఆస్థాన రచయితగా పోషించినా, కనుమరుగైన మహా నటి సావిత్రితో ‘గోరింటాకు’లో పట్టుబట్టి వేషంవేయించినా, జగ్గయ్య సారథ్యంలో ‘మనస్విని’ ట్రస్ట్–అవార్డులతో మరణిం చిన ఆత్రేయను కొన్నేళ్ళు ఏటా స్మరించినా, ఎస్పీబీ – సత్యానంద్ – జంధ్యాల – ఓంకార్‌లతో గాఢంగా స్నేహిం చినా... అది మురారి మార్క్ ప్రేమ. కృష్ణశాస్త్రి మరణించాక ‘ఇది మల్లెల వేళ’ అంటూ ఎంపిక చేసిన 11 పాటల్ని ఎల్పీ రికార్డుగా హెచ్ఎంవీతో పట్టుబట్టి రిలీజ్ చేయించారు. ఆత్రేయ సాహిత్యం వెలికి రావడంలో పాత్ర పోషించారు. ప్రొడ్యూసరంటే కాంబినేషన్లు కుదిర్చే క్యాషియరనే కాలం వచ్చాక, అభిరుచి చంపుకోలేక మూడు దశాబ్దాల క్రితమే నిర్మాతగా స్వచ్ఛంద విరమణ చేశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లో ‘సన్’ స్ట్రోక్‌కు ఆవిరి కారాదని తంటాలు పడ్డారు. ప్రతిభను గుర్తించి, నెత్తికెత్తుకోవడం మురారి నైజం. 22 ఏళ్ళ క్రితం ఓ సికింద్రాబాద్ కుర్రాడు సినిమా తీస్తే, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. వార్త చదివిన మురారి ఆ కుర్రాణ్ణి చెన్నైకి పిలిపించి, అభినందించి, ఆతిథ్య మిచ్చి మరీ పంపారు. ఆ సినిమా ‘డాలర్ డ్రీమ్స్’. ఆ సంగతి నేటికీ తలుచుకొనే అప్పటి ఆ కుర్రాడే – ఇవాళ్టి శేఖర్ కమ్ముల. హీరోయిన్లు తాళ్ళూరి రామేశ్వరి, వక్కలంక పద్మ, గౌతమి, రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి), కళా దర్శకుడు రాజులను మురారే తెరకు పరిచయం చేశారు. అగ్ర హీరోలు, దర్శకులతో పని చేసినా వారి కన్నా రచయితలతోనే ఆయనకు స్నేహం. డాక్టర్ జివాగో లాంటి నవలలు, వాటిని తెరకు మలి చిన తీరు గురించి మురారి చెబుతుంటే, డబ్బులు కాదు.. మనసు పెట్టినవాడే మంచి నిర్మాతనే మాటకు సాక్ష్యం అనిపిం చేది. నాటి ‘వేయిపడగలు’ నుంచి నేటి ‘అర్ధనారి’ దాకా బాగున్న ప్రతి నవల మురారి చదవాల్సిందే. చర్చించాల్సిందే. సందేహనివృత్తికి జగ్గయ్య, విఏకె రంగారావు, గొల్లపూడి, పైడి పాల, కాసల నాగభూషణం లాంటి వార్ని సంప్రతించాల్సిందే. మురారితో మాటలన్నీ పోట్లాటలే! మాట తీరే అంత. చూపులకు కోపధారి. తెలియనివాళ్ళకు తిక్క మనిషి. సన్నిహితమైతే తెలిసేది– మాటలోనే కారం కానీ మనసు నిండా మమకారమే అని! ఒక దశ దాటాక... ఆయన ప్రేమించి, గౌరవించే హీరో శోభన్‌బాబు, దర్శకుడు దాసరి లేరు. సలహా చెప్పే స్నేహశీలి ఓంకార్ ముందే వెళ్ళి పోయారు. చెన్నైగా మారిన మద్రాసులో తెలుగు చిత్రసీమ ఖాళీ అయింది. పాత మిత్రులు లేరు. కొత్తగా మిత్రులు కారు. ఊరవతల సముద్రపుటొడ్డు నివాసంలో విచిత్రమైన ఒంటరి తనం. సోషల్ మీడియాలో స్నేహాన్నీ, సాహిత్యంలో సాంత్వ ననూ వెతుక్కున్నారు. తోటలో తామరలు, ఇంట్లో కుక్కలతో సేద తీరాలనుకున్నారు. ఎఫ్బీలో నోరు చేసుకుంటూ వచ్చారు. దశాబ్దిన్నర క్రితం ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ కళ్ళు చెదిరే ఖరీదైన గ్రంథంగా రావడంలోనూ మురారి సంపా దకత్వ అభిరుచి కనిపిస్తుంది. తెలుగు నిర్మాతల వెల్ఫేర్ ట్రస్ట్ చేపట్టిన ఆ బరువైన రచనలో బలమైన ఆయన ఇష్టానిష్టాలు, చెలరేగిన వాదాలు, వివాదాలు మరో పెద్ద కథ. తోచుబడి కావట్లేదన్నప్పుడు, తరచూ చెప్పే పాత కబుర్లనే కాగితంపై పెట్టమన్న సలహా మురారిలోని రచయితను నిద్ర లేపింది. ఎన్నో చేదునిజాలు, నాణేనికి ఒకవైపే చూపిన కొన్ని అర్ధ సత్యాలను గుదిగుచ్చిన ఆయన జ్ఞాపకాల కలబోత ‘నవ్విపోదురు గాక’ సంచలనమైంది. పదేళ్ళలో 12 ముద్రణలు జరుపుకొంది. డ్రాఫ్ట్ రీడింగ్‌లో పలువురు ప్రముఖులు సందేహించినా, ఆటో బయోగ్రఫీల్లో అది నేటికీ టాప్సెల్లర్. ఆ రచనకు ప్రేరకులం, తొలి శ్రోతలమైన ఓంకార్‌నూ, అస్మదీయుడినీ పదుగురిలో పదేపదే గుర్తుచేసుకోవడం మురారి సంస్కారం. ఆవేశభరిత మురారిది జీవితంలో, సినిమాల్లోనూ ముళ్ళ దారి. ముక్కుసూటి తత్వం, మార్చుకోలేని అభిప్రాయాలు, మాట నెగ్గించుకొనే ఆభిజాత్యంతో సహచరుల్ని దూరం చేసు కోవడం మురారి జీవలక్షణాలు. చరమాంకంలో తప్పు తెలుసుకున్నారు. ‘ఆఖర్న మోయడానికి నలుగురినైనా మిగుల్చుకో వాలయ్యా’ అనేవారు. అప్పటికే లేటైంది. ఆయన పోయారు. ఆయన దర్శక, హీరోలెవరూ రాలేదు. సంతాపాలూ చెప్ప లేదు. అవసరాలే తప్ప అభిమానాలు తక్కువైన రంగుల లోకంలోని ఆ సంగతీ మురారికి ముందే తెలుసు. ‘‘ఏవయ్యా రేపు నే పోయాక పేపర్లో రాస్తావా? చదవడానికి నేనుండను కానీ, నా గురించి ఏం రాస్తావో ఇప్పుడే చెప్పచ్చుగా!’’ అనేవారు. ఇంత తొందరగా ఆయన కోరిక నెరవేరుస్తానను కోలేదు. రాశాను... చదివి చీల్చిచెండాడడానికి ఆయన లేరు. మద్రాస్ తెలుగు సినిమా ఆఖరి అనుబంధాల్లో మరొకటి తెగిపోయింది. చిన్ననాటి నుంచి చివరి రోజుల దాకా జీవి తంతో నిత్యం సంఘర్షిస్తూ, అలసిపోయిన డియర్ మురారి గారూ... రెస్ట్ ఇన్ పీస్ ఎట్లీస్ట్ ఇన్ దిస్ లాస్ట్ జర్నీ! – రెంటాల జయదేవ -
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా విజయవాడ మురారి సొంత ఊరు. 1944 జూన్ 14న జన్మించారు. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో సినిమా అంటే ప్రేమతో చెన్నైకి చేరుకున్నారు. తొలుత దర్శకుడు వి. మధుసూదన్ దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మురారి ఆ తర్వాత నిర్మాతగా మారి, యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై పలు చిత్రాలు నిర్మించారు. 1978లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘సీతామహాలక్ష్మి’ నిర్మాతగా మురారికి తొలి చిత్రం. ఆ తర్వాత శోభన్‌బాబు కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘గోరింటాకు’, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘జేగంటలు’, కృష్ణంరాజు హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘త్రిశూలం’, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘అభిమన్యుడు’, బాలకృష్ణ హీరోగా రెండు చిత్రాలు ‘సీతారామ కళ్యాణం’, ‘నారి నారి నడుమ మురారి’, వెంకటేష్ కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’, నాగార్జున హీరోగా ‘జానకి రాముడు’ వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించారు. మురారికి సంగీతం అంటే ఇష్టం. ఆయన నిర్మించిన వాటిలో దాదాపు అన్నీ మ్యూజికల్ హిట్సే. అన్ని చిత్రాలకు కేవీ మహదేవన్ సంగీతదర్శకుడిగా చేశారు. దక్షిణ భారత చలన చిత్ర మండలికి, తెలుగు నిర్మాతల మండలికి గౌరవ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా కె. మురారి సాహితీ ప్రియుడు కూడా. ‘నవ్వి పోదురుగాక నాకేంటి’ అనే పుస్తకం రచించడంతో పాటు ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ (1931–2005)కు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నవయుగ ఫిలింస్ మురారి బాబాయి కాట్రగడ్డ శ్రీనివాసరావుదే. మురారి ముక్కుసూటి మనిషి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చెన్నై, నీలాంగరైలో నివసిస్తున్న కె. మురారి శనివారం రాత్రి 8. 55 గంటల ప్రాంతంలో భోజనం చేశాక, గ్యాస్ సమస్య కారణంగా సిరప్పు వేసుకున్నారు. ఆ వెంటనే కార్డియాక్ అరెస్ట్‌కు గురై తుది శ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మురారికి భార్య, కొడుకు–కోడలు ఉన్నారు. ఆయన భౌతికకాయానికి ఆదివారం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
మురారి రీమేక్‌లో చేయాలని ఉంది: యంగ్ హీరో
ఈ ఏడాది విడుదలైన ‘హీరో’ సినిమాతో గల్లా జయదేవ్ తనయుడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నేడు (ఏప్రిల్ 5) అశోక్ గల్లా బర్త్ డే. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ– ‘‘హీరో’ సినిమా సక్సెస్ తృప్తినిచ్చింది. అయితే సంక్రాంతి టైమ్‌లో మా సినిమా విడుదల కావడంతో ఆ టైమ్‌లో రావాల్సినంత ప్రేక్షకులు థియేటర్స్‌కు రాలేదు. ఈ విషయంలో కాస్త నిరుత్సాహపడ్డాను. మార్చిలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ఊహించాం. కానీ జనవరిలో ఆ వాతావరణం కనిపించింది. అందుకే ఆడియన్స్ రాలేదేమో! యాక్టింగ్‌పరంగా మహేశ్‌బాబుగారే నాకు స్ఫూర్తి. మనల్ని మనం నమ్మాలనే విషయాన్ని మహేశ్‌గారు నమ్ముతారు. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారు. మహేశ్‌గారి నుంచి నేను నేర్చుకున్నది ఇదే. ‘హీరో’ సినిమా చూసి ‘ఐ యామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ..’ అన్నారు మహేశ్‌గారు. ఆయన చేసిన సినిమాల్లో ‘మురారి’ రీమేక్‌లో నటించాలని ఉంది. నా తర్వాతి సినిమాను జూన్‌లో ప్రకటిస్తాను. షాకయ్యాను ‘‘పబ్ ఇష్యూలో నా పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోజు నేను ఫిజియోథెరపీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఎవరో ట్విటర్ లింక్ పంపితే చూసి షాకయ్యాను. ఇప్పుడే హీరో అయ్యానని అనిపించింది. సెలబ్రిటీల లైఫ్స్ ఇలానే ఉంటాయా? (అనవసరంగా వార్తల్లోకి పేరు రావడాన్ని ఉద్దేశిస్తూ) అనిపించింది’’ అని అశోక్ అన్నారు. -
మహేష్ కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ సినిమా
హీరో మహేష్‌బాబు కెరియర్లోనే తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'మురారి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో #20YearsForMurari హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాతోనే నటి సోనాలి బింద్రే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథాంశం, కుటుంబ భావోద్వేగాలు, మణిశర్మ సంగీతం..ఇలా ఈ చిత్రంలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దాని ఫలితమే బాక్స్‌ఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురిపించింది. మురారి విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు.. కృస్ణవంశీ ఈ సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించాడు. నిజానికి మురారి కథ నిజజీవిత సంఘనల ఆధారంగా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పేరున్న జమీందార్ బ్రిటిష్ వారి కోసం తమ ఇలవేల్పు అయిన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలిస్తాడు. దీంతో అమ్మవారి ఆగ్రహానికి గురై అతడు చనిపోతాడు. అంతేగాక తన వంశానికి ఒక శాపాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు ఆ జమీందార్ ఇంటిలోని వారసుల్లో ఒకరు మరణిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో కూడా మరణిస్తారని భావించిన నేపథ్యంలో ఆయన చనిపోతాడా లేదా? ఆ శాపం నుంచి ఎలాంటి విముక్తి పొందుతారు అన్న అంశాలకు ఆధ్యాత్మికత జోడించి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రక్తికట్టించడంలో కృష్ణవంశీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ముందే మహేష్ 3 సినిమాల్లో నటించినా మురారీ మాత్రం ఆయన కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. కేవలం 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు 23 కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. మహేశ్ బాబు కెరీర్ లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిన మురారి సినిమా తన ఆల్ టైం ఫెవరెట్ సినిమా అని మహేష్ భార్య నమ్రత అన్నారు. మురారి ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమన్నారు. ఇక మురారి సినిమా పరంగానే కాకుండా, మ్యూజికల్‌గానూ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్. ముఖ్యంగా 'అలనాటి రాముచంద్రుడి' ....అనే పాట ఇప్పటికీ ప్రతి తెలుగింటి పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
80 స్థానాల్లో పోటీ చేస్తాం: శివసేన
హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్.మురారి 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాము ప్రకటించిన అభ్యర్థులకు ఇప్పటికే బీ–ఫారాలు ఇచ్చామని, ఈ నెల 14న వారు నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. నిజామాబాద్ బోధన్ నుంచి మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ప్రేమ్ గాంధీ, రాజేం ద్రనగర్ అభ్యర్థి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
కృష్ణా ముకుందా మురారి
సినిమా వెనుక స్టోరీ - 33 గోదావరి మధ్యలో ఉంది లాంచీ. టాపు మీద కూర్చున్న కృష్ణవంశీ సిగరెట్ వెలిగించాడు. గట్టిగా దమ్ము పీల్చి, చుట్టూ గోదావరిని పరికించి చూశాడు. ఆహా... ఏమి ప్రశాంతత! సినిమా సినిమాకీ గ్యాప్‌లో ఇలా గోదావరి జిల్లాలకొచ్చి ఫ్రెండ్స్‌తో గడపడం తనకి అలవాటు. క్లాప్, స్విచ్ ఆన్... ఇలాంటి మాటలు లేకుండా ఫ్రెండ్స్‌తో మనసు విప్పి మాట్లాడుతుంటే హాయిగా ఉంది. సడెన్‌గా సీరియస్ డిస్కషన్. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ... ఇలా ఆ ఫ్యామిలీ అంతా ఆకస్మిక దుర్మరణాలే!‘ఎందుకంటావ్?’ ఆసక్తిగా అడిగాడు కృష్ణవంశీ. ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వ ర్రావు ఒకటే అన్నాడు.. ‘శాపం’. కృష్ణవంశీ భ్రుకుటి ముడిపడింది. శాపమా?! ఫ్రెండ్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పాడు. ఆంధ్రాలో ఓ ఫేమస్ పర్సన్. పాలేరుని కొట్టడమో, చంపడమో చేశాడు. పాలేరు పెళ్లాం శాపనార్థాలు పెట్టింది. కట్ చేస్తే - అతగాడి పెద్ద కొడుకు పొలానికెళ్లి ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఆ కర్మకాండలు చేసొస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రెయిన్ గుద్దేసి రెండో కొడుకు పోయాడు. ఇది వినగానే కృష్ణ వంశీ షేకైపోయాడు. ఆ రాత్రి నిద్ర లేదు. ఆ రాత్రే కాదు... చాలా రాత్రిళ్లు నిద్ర రాలేదు. మహేశ్‌బాబు కోసం ప్రశాంతంగా కథ ఆలోచిస్తున్న టైమ్‌లో ఏంటీ కలవరం?! నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు నుంచి ఫోన్. ‘‘సార్... మీ పని మీదే ఉన్నా’’ అని కాసేపు ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కృష్ణవంశీ. సూపర్‌స్టార్ కృష్ణకు కరడు గట్టిన వీరాభిమాని రామలింగేశ్వరరావు. కృష్ణతోనే ‘కిరాయి కోటిగాడు’, ‘కంచు కాగడా’, ‘దొంగోడొచ్చాడు’ లాంటి సినిమాలు తీశాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో కృష్ణవంశీ డెరైక్షన్‌లో సినిమా చేయాలనేది టార్గెట్. కృష్ణవంశీకేమో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. మంచి కథ దొరికినప్పుడు చేస్తానని తప్పించుకోడానికి ప్రయత్నిం చాడు. ఆయన వదల్లేదు. ప్రస్తుతం కృష్ణవంశీ ఆ పనిలోనే ఉన్నాడు. ఏ పని చేస్తున్నా మహేశ్ గురించే ఆలోచన. మహేశ్ అందగాడు. బృందావనంలో కృష్ణుడిలాగా ముగ్ధమనో హరంగా ఉంటాడు. తనతో ఎలాంటి సినిమా తీయాలి? ఎస్... దొరికేసింది. బృందావనంలో కృష్ణుడు. ఈ కాన్సెప్ట్‌ని అప్లై చేసి సినిమా చేస్తే అదిరి పోతుంది. కానీ ఇంకా చాలా దినుసులు కావాలి. ఈ బృందావనానికి ఆ శాపాన్ని జత చేస్తే?! క్లారిటీ వచ్చేసింది. పద్మాలయా స్టూడియోలో కృష్ణ చాంబర్. కృష్ణవంశీ కథ చెబుతుంటే కృష్ణ, మహేశ్, రామలింగేశ్వరరావు వింటు న్నారు. ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. కృష్ణ ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. ‘‘వంశీ! నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ బాగున్నట్టే ఉంది. నువ్వూ, మహేశూ డెసిషన్ తీసుకోండి’’ అని చెప్పేసి వెళ్లిపోయారు. ఇప్పుడు బాల్ మహేశ్ కోర్టులో ఉంది. అతనికేమో కృష్ణ వంశీతో మంచి లవ్‌స్టోరీ చేద్దామని ఉంది. ఇతనేమో బృందావనం, శాపం అంటు న్నాడు. అలాగని కృష్ణవంశీని వదులుకో లేడు. బాల్ షిఫ్ట్స్ టు రామలింగేశ్వరరావు కోర్ట్. ఆయన కృష్ణవంశీని కన్విన్స్ చేయ డానికి ట్రై చేస్తున్నాడు. కృష్ణవంశీ మొండి వాడు. వినడే! రామలింగేశ్వర్రావూ మొండివాడే! వదలడే! కృష్ణవంశీ ఇంకో కథ చేశాడు. ముగ్గు రమ్మాయిలతో రొమాంటిక్ స్టోరీ. ‘‘భలే ఉందే’’ అన్నారు కృష్ణ. మహేశ్ కూడా. అప్పుడు పేల్చాడు కృష్ణవంశీ బాంబు. ‘‘ఈ కథతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కావచ్చు. కానీ ఆ కథతో సినిమా అయితే మాత్రం ఓ ఇరవై, ముప్ఫై ఏళ్లు చరిత్రలో నిలిచిపోతుంది. ఆలోచించుకోండి. కాదూ, కూడదంటే ఈ కథ మీకిచ్చేస్తాను. వేరే డెరైక్టర్‌తో చేయించుకోండి.’’ మళ్లీ కథ మొదటికొచ్చింది. రామ లింగేశ్వరరావు తలపట్టుకున్నాడు. ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? మహేశ్, కృష్ణవంశీని నమ్మాడు. కృష్ణవంశీ కథను నమ్మాడు. రామలింగే శ్వరరావు ఈ కాంబి నేషన్‌ను నమ్మాడు. ప్రాజెక్ట్ స్టార్ట అయ్యింది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కోసం భారతం, భాగవతం చదివి కృష్ణతత్త్వాన్ని ఒంటబట్టించు కోవాల్సి వచ్చింది. కృష్ణుడు, యశోద, పాండవులు, దుర్యోధనుడు... ఇలాంటి క్యారెక్టర్స్ అన్నింటినీ సోషలైజ్ చేసేశాడు. రుక్మిణి, సత్యభామ పాత్రలను కలగలిపి హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాడు. కథ ఫైనల్ అయ్యింది కానీ, క్లైమాక్స్‌ను ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికో ముడి వీడింది. కానీ చాలా డౌట్లు మిగిలి పోయాయి. అమ్మవారి శాపాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నామా అనేది పెద్ద డౌట్. గురువు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిని కలిశాడు. ఆయన డౌట్లన్నీ తీర్చేశారు. ఇప్పుడు కృష్ణవంశీకి ఫుల్ క్లారిటీ. టైటిల్... ‘కృష్ణా ముకుందా మురారి’ అనుకున్నాడు. ‘మురారి’ అని సింపుల్‌గా పెడితే బెటర్ కదా’ అన్నాడు రామలింగే శ్వరరావు. సినిమా నిండా ఆర్టిస్టులే ఆర్టిస్టులు. కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపూడి... ఇలా చాలామంది కావాల్సి వచ్చారు. బామ్మ పాత్రకు బెంగళూరు వెళ్లి మరీ ‘షావుకారు’ జానకికి కథ చెప్పారు. 40 రోజుల డేట్లు అంటే కష్టం అందావిడ. ఫైనల్‌గా మలయాళ నటి సుకుమారి సెలెక్టెడ్. ఇక మహేశ్ పక్కన హీరోయిన్ అంటే క్యూట్‌గా ఉండాలి. హేమమాలిని కూతురు ఇషా డియోల్ అయితే బావుంటుందనిపించింది. హేమమాలిని దగ్గరికెళ్తే ‘రెమ్యునరేషన్ ఎంతిస్తారు’ అని మొహం మీదే అడిగేసిందావిడ. దాంతో డ్రాప్. సోనాలీబెంద్రే రిఫరెన్స్ వచ్చింది. హైదరా బాద్‌లో ఫ్రెండ్ పెళ్లికి వచ్చి, కథ విని కాల్షీట్స్ ఇచ్చేసిందామె. ఫుల్ ట్రెడిషనల్ సినిమా ఇది. విలేజ్ అట్మాస్ఫియర్, పండగ హంగుల్లాంటివి కావాలి. ఆర్ట్ డెరైక్టర్ గట్టివాడే ఉండాలి. శ్రీనివాసరాజు సమర్థుడు. కృష్ణవంశీ కథ చెప్పగానే స్కెచ్‌లు వేసేశాడు. హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు చాలా పెద్దగా ఉండాలి. కేరళ వెళ్లి చూసొచ్చారు. కానీ ఇంతమంది ఆర్టిస్టులతో అంత దూరం వెళ్తే బడ్జెట్ తడిసి మోపెడ వుతుంది. రామానాయుడు సినీ విలేజ్‌లో సెట్స్ వేసేస్తే బెటర్. ఇంకా కావాలనుకుంటే రామచంద్రాపురం రాజావారి కోటలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాలో ఇంపార్టెంట్ - టెంపుల్ సీన్స్. మూడు తరాల నేపథ్యానికి సంబంధించి సీన్లు అక్కడే తీయాలి. అంటే పురాతనమైనది కావాలి. కర్ణాటకలోని బాదామిలో దొరికింది. ఒకేసారి అక్కడికి వెళ్లి సీన్లు తీయడం కష్టం. నాలుగైదుసార్లు వెళ్లాల్సిందే. ఇదీ తడిసి మోపెడయ్యే వ్యవ హారమే. అందుకే శంషాబాద్ టెంపుల్‌కి ఫిక్సయ్యారు. ఓ ఏనుగు కావాలి. ఇక్కడ దొరకదు. కేరళ నుంచి దిగుమతి చేసుకో వాల్సిందే. ఇలాంటి సినిమాకి సీనియర్ కెమెరామ్యాన్ కావాలి. కానీ కృష్ణవంశీ ‘మెరుపు’లో ఓ పాట చూసి సి.రామ్ ప్రసాద్‌కి ఆఫరిచ్చేశాడు. మ్యూజిక్ డెరై క్టర్‌గా మణిశర్మ బెస్టని ఫీలయ్యారు. ఐదు నెలల షూటింగ్. రోజుకి 12 గంటలు తక్కువ పనిచేయలేదు. కృష్ణ వంశీకి స్క్రిప్ట్ అంతా మైండ్‌లోనే ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్. ఆర్టిస్టులు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తు న్నారు. మహేశ్‌బాబు అయితే క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున ‘డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి’ పాట, వాటర్ ఫైట్ చేశాడు. కృష్ణవంశీ ఏది అడిగినా అరేంజ్ చేయమని ప్రొడక్షన్ టీమ్‌కి ఆర్డరేశాడు రామలింగేశ్వరరావు. దాంతో కృష్ణవంశీ టెన్షన్ లేకుండా సినిమా కంప్లీట్ చేయగలిగాడు. 2001 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయ్యింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో ఫస్ట్ కాపీ రెడీ. కొంత ఎడిట్ చేద్దామంటే కృష్ణవంశీ వినలేదు. తనకి ఒకటే నమ్మకం. ఇలాంటివి మళ్లీ మళ్లీ తీయలేం. మొదట డివైడ్ టాక్ వచ్చినా, సూపర్‌హిట్ కావడం ఖాయం. ఫిబ్రవరి 16న రిలీజ్. డివైడ్ టాక్. లెంగ్త్ ఎక్కువైందని కంప్లయింట్స్. డిస్ట్రిబ్యూటర్లు కటింగ్స్ మొదలుపెట్టారు. కృష్ణవంశీ కయ్‌మంటున్నాడు. కృష్ణ సినిమా చూసి కదిలిపోయారు. ‘‘మహేశ్ పర్ఫార్మెన్స్ చూసి గర్వపడుతున్నాను’’... అంటూ స్టేట్మెంట్. మహేశ్ ఫుల్ హ్యాపీ! ‘మురారి’ రిలీజ్ టైమ్‌కి హిందీ సినిమా ‘శక్తి’ (తెలుగు ‘అంతఃపురం’కి రీమేక్) షూటింగ్ కోసం ఎక్కడో నార్త్‌లో ఫోన్లు కూడా పనిచేయని చోట ఉన్నాడు కృష్ణవంశీ. వాళ్ల బ్రదర్ రెండ్రోజులు ట్రై చేస్తే, ఫోన్లో దొరికాడు. ‘‘థాంక్స్ రా’’ అన్నాడు కృష్ణవంశీ. ‘‘నేనింకా కంగ్రాట్స్ చెప్పలేదన్నయ్యా!’’ అన్నాడు తమ్ముడు. ‘‘నువ్వు అది చెప్పడానికే ఫోన్ చేశావని నాకు తెలుసు’’ అని నవ్వేశాడు కేవీ. సంకల్పం - ఓ కల్పవృక్షం. మనం బలంగా ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. నమ్మకం - ఓ ఐరావతం. మనల్ని ఎంత దూరాలకైనా మోసుకెళ్తుంది! వెరీ ఇంట్రస్టింగ్ ► క్లైమాక్స్‌లో కీలకపాత్ర కోసం సీనియర్ నటుడు ఉంటే బాగుంటుందను కున్నారు. ‘దానవీరశూర కర్ణ’లో శకునిగా చేసిన ధూళిపాళ రిటైరైపోయి, గుంటూరుకు సమీపంలో స్థిరపడ్డారు. కృష్ణవంశీ వెళ్లి ఒప్పించారు. ► ‘చెప్పమ్మా చెప్పమ్మా’ పాటలో ముగ్గు సోనాలీ బేంద్రేలా మారే షాట్‌కి ‘టెర్మి నేటర్’లోని జైలు సీను ఇన్స్పిరేషన్. -
గీత స్మరణం
పల్లవి : బృందం: డుండుం డుండుం డుండుం తక డుండుం డుండుం డుండుం తకధిమి ॥ అతడు: డుండుండుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా గుండెల్లో గురివుంటే ఎదగాలి తారలే కళ్లుగా నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరీడుగా పామాట నుంచి భామాట దాకా నాదేనురా పై ఆట ఆడితప్పనేమాటా అయ్య చూపిన బాట నమ్మినోళ్లకిస్తా నా ప్రాణం ॥ చరణం : 1 అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా (2) బ్రహ్మన్నపుత్ర హే బాలచంద్ర చెయ్యెత్తి జై కొట్టరా పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా వేసంగిలోన పూసేటిమల్లి నీ మనసు కావాలిరా అరె వెలిగించరా లోనిదీపం అహ తొలగించరా బుద్ధిలోపం ఒహో ఆత్మేరా నీ జన్మతార సాటి మనిషేరా నీపరమాత్మ ॥ చరణం : 2 చూపుంటే కంట్లో ఊపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంట (2) నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు గెలిచేలా మార్చాలిరా మనగీత చిగురంత వలపో చిలకమ్మ పిలుపో గుణపాఠం ఉండాలిరా పెదవుల్లో చలి ఈల పెనవేస్తే చెలిగోల చెలగాటం ఆడాలిరా అహ మారిందిరా పాతకాలం నిండు మనసొక్కటే నీకు మార్గం ॥ చిత్రం : మురారి (2001) రచన : వేటూరి సుందరరామమూర్తి సంగీతం : మణిశర్మ, గానం : శంకర్‌మహదేవన్, బృందం మహేష్‌బాబు... పోరాటం (1983) అనే చిత్రంలో బాల నటుడిగా తెలుగు సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. తర్వాత కొన్ని సినిమాలలో బాల నటుడిగా అలరించారు. రాజకుమారుడు (1999) చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. తన నటనకుగాను ఏడు నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు, మరెన్నో సినీపరిశ్రమకు సంబంధించిన పలు అవార్డులు అందుకున్నారు. ‘వంశీ’ చిత్రంలో తనతో జట్టుకట్టిన నమ్రతా శిరోద్కర్ ను 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పిల్లలు గౌతమ్‌కృష్ణ, సితార.