Actor Ashok Galla Says Very Interested To Remake Of Mahesh Babu Murari Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

మురారి రీమేక్‌లో చేయాలని ఉంది: యంగ్‌ హీరో

Apr 5 2022 8:02 AM | Updated on Apr 5 2022 9:11 AM

Ashok Galla Says Very Interested To Remake Of Mahesh Babu Murari Movie - Sakshi

ఈ ఏడాది విడుదలైన ‘హీరో’ సినిమాతో గల్లా జయదేవ్‌ తనయుడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నేడు (ఏప్రిల్‌ 5) అశోక్‌ గల్లా బర్త్‌ డే. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అశోక్‌ మాట్లాడుతూ– ‘‘హీరో’ సినిమా సక్సెస్‌ తృప్తినిచ్చింది. అయితే సంక్రాంతి టైమ్‌లో మా సినిమా విడుదల కావడంతో ఆ టైమ్‌లో రావాల్సినంత ప్రేక్షకులు థియేటర్స్‌కు రాలేదు. ఈ విషయంలో కాస్త నిరుత్సాహపడ్డాను.

మార్చిలో కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందని ఊహించాం. కానీ జనవరిలో ఆ వాతావరణం కనిపించింది. అందుకే ఆడియన్స్‌ రాలేదేమో! యాక్టింగ్‌పరంగా మహేశ్‌బాబుగారే నాకు స్ఫూర్తి. మనల్ని మనం నమ్మాలనే విషయాన్ని మహేశ్‌గారు నమ్ముతారు. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారు. మహేశ్‌గారి నుంచి నేను నేర్చుకున్నది ఇదే. ‘హీరో’ సినిమా చూసి ‘ఐ యామ్‌ ఫ్రౌడ్‌ ఆఫ్‌ యూ..’ అన్నారు  మహేశ్‌గారు. ఆయన చేసిన సినిమాల్లో ‘మురారి’ రీమేక్‌లో నటించాలని ఉంది. నా తర్వాతి సినిమాను జూన్‌లో ప్రకటిస్తాను.

షాకయ్యాను
‘‘పబ్‌ ఇష్యూలో నా పేరు ఎందుకు వచ్చిందో  తెలియదు. ఆ రోజు నేను ఫిజియోథెరపీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఎవరో ట్విటర్‌ లింక్‌ పంపితే చూసి షాకయ్యాను. ఇప్పుడే హీరో అయ్యానని అనిపించింది. సెలబ్రిటీల లైఫ్స్‌ ఇలానే ఉంటాయా? (అనవసరంగా వార్తల్లోకి పేరు రావడాన్ని ఉద్దేశిస్తూ) అనిపించింది’’ అని అశోక్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement