మహేశ్ మేనల్లుడి సినిమా ట్రైలర్ రిలీజ్ | Devaki Nandana Vasudeva Telugu Trailer Release | Sakshi
Sakshi News home page

మొత్తం కృష్ణుడి రిఫరెన్స్‌లే.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Published Tue, Nov 12 2024 12:24 PM | Last Updated on Tue, Nov 12 2024 12:33 PM

Devaki Nandana Vasudeva Telugu Trailer Release

'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?

(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)

ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం నవంబర్ 14నే మూవీ రిలీజ్ కావాలి. కానీ 'మట్కా', 'కంగువ'తో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో ఉన్నట్లే హీరో ఎంట్రీ, హీరోయిన్ వెనక పడటం, విలన్, చివరలో కృష్ణుడి రిఫరెన్స్.. ఇలా ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లే అన్ని ఎలిమెంట్స్ చూపించారు.

'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. ట్రైలర్‌లోని ఎలివేష్ షాట్స్ చూస్తుంటే యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ కృష్ణుడి అనే స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement