Ashok Galla
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – అశోక్ గల్లా
‘‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. భక్తి అంశాలు, ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు అశోక్ గల్లా. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ– ‘‘దేవకీ నందన వాసుదేవ’లో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు.. ఇలా మైథాలజీ టచ్ ఉంటుంది. ప్రశాంత్‌గారి టచ్‌తో బోయపాటి శ్రీనుగారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అర్జున్ జంధ్యాల ఈ మూవీ తీశారు. సోమినేని బాలకృష్ణగారు కథని నమ్మి రాజీపడకుండా నిర్మించారు. మా సినిమా చూశాక మహేశ్‌బాబు మావయ్య ఎలా స్పందిస్తారా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
‘మురారి’తో మా సినిమా కథకు సంబంధమే లేదు: డైరెక్టర్ అర్జున్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ఈ చిత్రానికి ‘హను-మాన్’ఫేం ప్రశాంత్ వర్మ కథ అదించగా, ‘గుణ 369’ఫేం అర్జున్ జంధ్యాల దర్వకత్వం వహించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్ ఇందులో ఉంటుంది. మూడో సంతానం వలన మరణం అని ట్రైలర్ లోనే చాలా క్లియర్ గా చెప్పాము. అయితే చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి. ట్రైలర్లో కంటే చాలా ఎక్కువ కథ సినిమాలో ఉంది.→ ప్రశాంత్ వర్మ చెప్పిన కథను నేను ఓన్ చేసుకున్నాను. అలా కథను ఓన్ చేసుకున్నప్పడే కొత్త ఐడియాస్ వస్తాయి. నేను చెప్పిన కొన్ని ఆలోచనలకి ప్రశాంత్ గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన సినిమా చూసి చాలా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు.→ ఈ కథకు హీరోగా అశోక్ అయితేనే బాగుటుందనిపించింది. ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి లుక్ అయితే బాగుంటుందని దానిపై చాలా వర్క్ చేసాం. ప్రతిదీ ఆ క్యారెక్టర్ నుంచి డిజైన్ చేసుకున్నాం.→ అశోక్ గారు యాక్షన్ ఎమోషన్ లో ఇరగదీస్తారు. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.→ ట్రైలర్ చూసి అందరూ ఈ సినిమా కథని మురారి సినిమాతో పోల్చుతున్నారు. కానీ ఆ కథకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మురారిలో ఒక డెస్టినీ ఫీల్ ఉంటుంది. ఇందులో అది ఇంకోరకంగా ఉంటుంది. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ట్రైలర్ లో కూడా ఎక్కడా లేనివిధంగా భూమిలో సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అని చెప్పాం. దానికి ఒక కనెక్షన్ ఉంది. అది చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఒక సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అది కచ్చితంగా చెప్పగలను.→ మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన టీమ్ అందర్నీ అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే సినిమాను కూడా చూడబోతున్నారు. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా చాలా అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేశారు. → ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అద్భుతంగా నచ్చుతుంది. ఇది మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఇందులో చాలా కీలకం. దాని యొక్క సారాంశం కథలో అండర్లైన్ గా వెళుతుంది. అలాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. చాలా మంచి విజువల్ ఫీలింగ్ ఉంటుంది.→ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇచ్చిన కథకి 100% న్యాయం చేయాలి. అలాగే ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ చేయాలి. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.→ సాయి మాధవ్ గారు చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రాణప్రతిష్ట చేశాడు. మ్యూజికల్ గా సినిమా వండర్ఫుల్ గా ఉంటుంది. -
'దేవకీ నందన వాసుదేవ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహేశ్ మేనల్లుడి సినిమా ట్రైలర్ రిలీజ్
'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం నవంబర్ 14నే మూవీ రిలీజ్ కావాలి. కానీ 'మట్కా', 'కంగువ'తో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో ఉన్నట్లే హీరో ఎంట్రీ, హీరోయిన్ వెనక పడటం, విలన్, చివరలో కృష్ణుడి రిఫరెన్స్.. ఇలా ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లే అన్ని ఎలిమెంట్స్ చూపించారు.'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. ట్రైలర్‌లోని ఎలివేష్ షాట్స్ చూస్తుంటే యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ కృష్ణుడి అనే స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
కంగువాతో పోటీకి దిగుతున్న ప్రశాంత్ వర్మ
అశోక్ గల్లా హీరోగా నటించిన చిత్రం దేవకీనందన వాసుదేవ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా బుర్రా సాయిమాధవ్ మాటలు సమకూర్చాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా మానస వారణాసి హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అదే రోజు సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో వాటితో పోటీకి రెడీ అయ్యాడు ప్రశాంత్ వర్మ. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి! సినిమా మీద మంచి నమ్మకం తో కంగువా మీద వేస్తున్నారు 👍సినిమా కి #టాలీవుడ్ good రిపోర్ట్ ఉంది#DevakiNandanaVasudeva in cinemas from November 14th 🎥#DNVonNov14 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @lalithambikaoff pic.twitter.com/m4WwhMIfKn— Kakinada Talkies (@Kkdtalkies) October 25, 2024 -
అమెరికాలో రొమాంటిక్ కామెడీ
అశోక్ గల్లా హీరోగా, రాహుల్ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా, ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.తొలి సన్నివేశానికి నమ్రత ఘట్టమనేని క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా – మంజులా స్వరూప్‌లు స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కి అందించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: భరద్వాజ్ .ఆర్. -
అశోక్ గల్లా కొత్త మూవీ.. కెమెరా స్విచ్చాన్ చేసిన నమ్రత
యంగ్ హీరో అశోక్ గల్లా కొత్త చిత్రం షురూ అయింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నమ్రత కెమెరా స్విచ్చాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించగా, మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి స్క్రిప్ట్‌ని ప్రశాంత్ వర్మకు అందజేశారు. అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నా పాత్ర రఫ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రశాంత్ వర్మగారు చాలా మంచి వినోదాత్మక కథ అందించారు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘నాలుగేళ్లుగా ఈ కథను రాసుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. హీరో మహేశ్ బాబు ఈ సినిమా పూజా కార్యక్రమాల ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎప్పటికీ అంతులేని విజయం సాధించాలంటూ ఆకాంక్షించారు. Best of luck on your new one @AshokGalla_!! Wishing you endless success always!! 👍👍 pic.twitter.com/eZvyQbWpzZ— Mahesh Babu (@urstrulyMahesh) February 5, 2023 చదవండి: నయనతారను పొగిడిన షారుక్ ఖాన్ -
ఘనంగా గల్లా అశోక్ కొత్త సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
మురారి రీమేక్‌లో చేయాలని ఉంది: యంగ్ హీరో
ఈ ఏడాది విడుదలైన ‘హీరో’ సినిమాతో గల్లా జయదేవ్ తనయుడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నేడు (ఏప్రిల్ 5) అశోక్ గల్లా బర్త్ డే. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ– ‘‘హీరో’ సినిమా సక్సెస్ తృప్తినిచ్చింది. అయితే సంక్రాంతి టైమ్‌లో మా సినిమా విడుదల కావడంతో ఆ టైమ్‌లో రావాల్సినంత ప్రేక్షకులు థియేటర్స్‌కు రాలేదు. ఈ విషయంలో కాస్త నిరుత్సాహపడ్డాను. మార్చిలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ఊహించాం. కానీ జనవరిలో ఆ వాతావరణం కనిపించింది. అందుకే ఆడియన్స్ రాలేదేమో! యాక్టింగ్‌పరంగా మహేశ్‌బాబుగారే నాకు స్ఫూర్తి. మనల్ని మనం నమ్మాలనే విషయాన్ని మహేశ్‌గారు నమ్ముతారు. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారు. మహేశ్‌గారి నుంచి నేను నేర్చుకున్నది ఇదే. ‘హీరో’ సినిమా చూసి ‘ఐ యామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ..’ అన్నారు మహేశ్‌గారు. ఆయన చేసిన సినిమాల్లో ‘మురారి’ రీమేక్‌లో నటించాలని ఉంది. నా తర్వాతి సినిమాను జూన్‌లో ప్రకటిస్తాను. షాకయ్యాను ‘‘పబ్ ఇష్యూలో నా పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోజు నేను ఫిజియోథెరపీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఎవరో ట్విటర్ లింక్ పంపితే చూసి షాకయ్యాను. ఇప్పుడే హీరో అయ్యానని అనిపించింది. సెలబ్రిటీల లైఫ్స్ ఇలానే ఉంటాయా? (అనవసరంగా వార్తల్లోకి పేరు రావడాన్ని ఉద్దేశిస్తూ) అనిపించింది’’ అని అశోక్ అన్నారు. -
ఓటీటీలోకి మహేశ్ మేనల్లుడి సినిమా.. ఎప్పటి నుంచంటే..
Hero Movie OTT Platform: యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
పదిహేనేళ్ల తర్వాత ‘హీరో’ కోసం థియేటర్‌కు వెళ్లాను : జగపతిబాబు
‘‘పదిహేనేళ్లుగా థియేటర్స్‌కు వెళ్లని నేను ‘హీరో’ సినిమా కోసం వెళ్లాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. పెద్ద సినిమాల్లో నటించిన నాకు కొత్త దర్శకులతో చేయాలనిపించలేదు. అందుకే ‘హీరో’ చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా? లేదా అనిపించింది. కానీ నా అంచనాలు తారుమారయ్యేలా చేశారు దర్శకుడు శ్రీరామ్. ఈ సినిమా చూశాక గతంలో నేను చేసిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం గుర్తొచ్చింది. అశోక్‌లో మంచి తపన కనిపించింది’’ అన్నారు జగపతిబాబు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అశోక్ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్యలో సినిమా చూశాను. వారి పాజిటివ్ రెస్పాన్స్ తెలిసింది’’ అన్నారు. ‘‘అశోక్ పడిన కష్టం తెరపై తెలుస్తోంది. థియేటర్స్‌లో నిజమైన పండగ కనిపిస్తోంది’’ అన్నారు శ్రీరామ్. ∙శ్రీరామ్ ఆదిత్య, నిధీ అగర్వాల్, గల్లా జయదేవ్, పద్మావతి, అశోక్, జగపతిబాబు -
‘హీరో ’మూవీ రివ్యూ
టైటిల్: హీరో నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు నిర్మాత : పద్మావతి గల్లా దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి సంగీతం : జిబ్రాన్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ టాలీవుడ్లోకి వారసుల ఎంట్రీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన కొంత మంది హీరోలు..తమ వారసులను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్‌బాబు మేనల్లుడు, కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘హీరో’.ఈ మూవీ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 15)న విడుదలైంది. ‘హీరో’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘హీరో’కథేంటంటే..? మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్జున్(అశోక్) చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కలలు కంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. అదే క్రమంలో తాను ఉంటున్న అపార్ట్మెంట్లోని పక్క ప్లాట్‌లోకి వచ్చిన పశువుల వైధ్యురాలు సుబ్బు అలియాస్ సుభద్ర(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా సాగుతున్న క్రమంలో అర్జున్‌కు ఒక కొరియర్ వస్తుంది. అందులో ఓ గన్ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. అనుకోకుండా ఓ క్రైమ్ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ గన్ ఎక్కడ నుంచి వచ్చింది? క్రైమ్ కేసు నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు తండ్రి(జగపతిబాబు)తో ఆ గన్‌కు ఉన్న సంబంధం ఏంటి? సుబ్బు ప్రేమను అర్జున్ ఎలా దక్కించుకున్నాడు? హీరో అవ్వాలనే అర్జున్ కోరిక నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. అశోక్ గల్లాకి ఇది తొలి సినిమా. కానీ ఆ విషయంలో తెరపై ఎక్కడా కనిపించలేదు. అర్జున్ పాత్రలో అశోక్ ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఫైట్ సీన్స్‌తో పాటు డాన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుబ్బుగా నిధి అగర్వాల్ మరోసారి తెరపై తనదైన అందాలతో అలరించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అశోక్ , నిధిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇక హరో స్నేహితుడు, రాప్ సింగర్‌గా సత్య తనదైన కామెడీతో నవ్వించాడు. హీరోయిన్ తండ్రిగా జగపతి బాబు నటన ఆటకుంటుంది. చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. క్లైమాక్స్‌లో మాత్రం నవ్వించాడు. హీరో తండ్రిగా నరేశ్ తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ సలీమ్ భాయ్ పాత్రలో రవికిషన్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో సినిమా హీరోగా బ్రహ్మజీ అయితే ఫుల్‌గా నవ్విస్తాడు. కోట శ్రీనివాసరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? శమంతకమణి, భలేమంచి రోజు, దేవదాస్ చిత్రాలలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీరామ్ ఆదిత్య.. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హీరో’ని తెరకెక్కించాడు. ఓ కామెడీ కథకి ముంబై మాఫియా లింకులు కలిపి ఫన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా రోటీన్‌గా సాగినప్పటికీ.. ప్రేక్షకుడికి మాత్రం బోర్ కొట్టించకుండా కామెడీతో మెప్పించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథ రోటీన్ కామెడీతో సాగడం సినిమాకు కాస్త మైనస్. జగపతి బాబు ప్లాష్ బ్యాక్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకుడికి.. ఆయన్ని కామెడీ పీస్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కామెడీ పండించడంలో భాగంగానే జగపతిబాబుని అలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ ఎంట్రీ అయితే అదిరిపోయింది. సినిమా హీరోగా బ్రహ్మాజీ పండించిన కామెడీ.. నవ్వులు పూయిస్తుంది. స్క్రీన్‌ప్లే బాగుంది. రోటీన్ కథనే.. డీసెంట్ కామెడీతో కాస్త డిఫరెంట్‌గా చూపించాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జుంబారే పాటతో పాటు రాప్ సాంగ్ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది.ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మొత్తంగా కొన్ని లాజిక్స్‌ని పక్కనపెట్టి చూస్తే ఈ సంక్రాంతికి ‘హీరో’ ఎంటర్టైన్ చేస్తాడు. -
మహేశ్‌బాబులా అశోక్ ముందుకెళ్లిపోతాడు: రాఘవేంద్రరావు
‘‘నాకు హీరో కావాలనుంది’ అని అశోక్ చిన్నప్పటి నుంచి అనేవాడు.. ‘రాజకుమారుడు’తో మహేశ్‌బాబుని పరిచయం చేశాను. మహేశ్‌లా అశోక్ కూడా టకటకా ముందుకెళ్లిపోతాడు’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ–‘‘శ్రీమంతుడు’కి అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. మహేశ్‌గారు ఎలా నటిస్తున్నారో నోట్ బుక్‌లో రాసుకుంటున్నప్పుడే సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసింది’’ అన్నారు. గల్లా పద్మావతి మాట్లాడుతూ– ‘‘నటన అంటే ఇష్టం’ అని అశోక్ చెప్పినప్పుడు లైట్ తీసుకున్నాం. సింగపూర్, అమెరికాలో చదువుకుని వచ్చాక కూడా తనలో నటనపై అదే ప్యాషన్ కనిపించింది. అందుకే నేను, జయదేవ్‌గారు ప్రోత్సహించాం’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. హీరో రానా, నిర్మాత ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు. -
సినిమా బాగుందని కృష్ణగారు అన్నారు: 'హీరో' మూవీ డైరెక్టర్
గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. నిధీ అగర్వాల్ హీరోయిన్గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో హీరో కావాలనుకునే ఓ యువకుడి కథే ఈ చిత్రం. స్క్రీన్ ప్లే రేసీగా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అశోక్ యాక్టింగ్ కోర్సులు చేసినప్పటికీ నాకు అవంటే పెద్దగా నమ్మకం లేదు. అందుకే అశోక్‌కు చిరంజీవి, మహేశ్బాబుగార్ల సినిమాలను రిఫరెన్సులుగా ఇచ్చాను. ఆ సినిమాల్లో వారి బాడీలాంగ్వేజ్‌ను గమనించి, నేర్చుకోమని చెప్పాను. అశోక్ బాగా నటించాడు. కృష్ణగారు మా సినిమాను చూసి ‘బాగుంది’ అని మెచ్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా షూటింగ్లో కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడమే పెద్ద సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం ఓటీటీలపై ఆసక్తి లేదు. ప్రొడక్షన్ పరంగా ఏమైనా చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు. -
ఆకట్టుకుంటున్న హీరో మూవీ ట్రైలర్, జక్కన్న చేతుల మీదుగా రిలీజ్
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలనే వేగవంతం చేసిన చిత్ర బృందంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా దర్శక ధీరుడు రాజమౌళి హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ చేశాడు. కాగా నేడు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు మరణించడంతో ఈవెంట్‌ను క్యాన్సల్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి చేతుల మీదుగా సోమవారం ట్రైలర్‌ను విడుదల చేయించింది మూవీ యూనిట్. చదవండి: Khushbu Sundar: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి ఇక ట్రైలర్ విషయానికోస్తే లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ అంశాలను ప్రధానంగా తీసుకుని మేకరస్ ట్రైలర్‌పై దృష్టి పెట్టారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ సాంతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అశోక్ గల్లా జోడీగా నిధి అగర్వాల్ నటించింది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో విలక్షణ నటుడు జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక అజయ్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీతో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో అలరించనున్నారు. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ -
రమేశ్ బాబు మృతి.. 'హీరో' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
Ramesh Babu Passed Away,Hero Movie Pre Release Event Cancelled: సూపర్‌స్టార్ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
మామయ్య మహేశ్‌బాబు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తా
‘‘తాతయ్య కృష్ణగారు, మావయ్య మహేశ్‌బాబుగారి వారసత్వాన్ని కంటిన్యూ చేయడం ఓ బాధ్యతగా భావించి డ్యాన్స్, యాక్షన్‌లో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఎలా నిలబడాలి? అని మహేశ్ మావయ్య సలహాలు ఇచ్చారు. తాతయ్య నుంచి డేరింగ్ అండ్ డాషింగ్, మహేశ్ మావయ్య నుంచి సెన్సాఫ్ హ్యూమర్, టాలెంట్, ఇంటెలిజెంట్, షార్ప్‌నెస్ నేర్చుకున్నాను’’ అని అశోక్ గల్లా అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘హీరో’. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గల్లా అశోక్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు అమ్మ (పద్మావతి), నాన్న (జయదేవ్) ఒకరోజు సక్సెస్ ఉంటుంది.. ఇంకోరోజు ఉండదు. ఎత్తు పల్లాలుంటాయి అవసరమా? అన్నారు. నా నిర్ణయాన్ని బలంగా చెప్పడంతో ప్రోత్సహించి ‘హీరో’ చిత్రంతో నన్ను పరిచయం చేస్తున్నారు. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తాతయ్య ‘పచ్చని సంసారం’ సినిమా చేశా. ఆ తర్వాత మహేశ్ మావయ్య ‘నాని’ సినిమాలో నటించినప్పుడు నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. ‘హీరో’ కమర్షియల్ సినిమా కాబట్టి శ్రీరామ్ ఆదిత్య నాకు ఎక్కువగా చిరంజీవిగారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు. ఓ మధ్య తరగతి అబ్బాయి హీరో అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. నాకు రాజకీయాలు, వ్యాపారాలంటే ఇష్టం లేదు. నటనపైనే నా దృష్టి’’ అన్నారు. -
అశోక్ గల్లా ‘హీరో’ సినిమా ప్రెస్‌మీట్
-
అందుకే సంక్రాంతికి వస్తున్నాం: ఆదిశేషగిరి రావు
‘‘సినిమాలో కంటెంట్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు విడుదలయినా కూడా నిలబడతాయి. మంచి కథ ఉన్నందుకే ‘హీరో’ను సంక్రాంతికి తీసుకొస్తున్నాం’’ అని నిర్మాత జి. ఆదిశేషగిరి రావు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సూపర్ స్టార్ కృష్ణగారి ‘పచ్చని సంసారం’ చిత్రంలో అశోక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అప్పటి నుంచే నటనపై ఆసక్తి పుట్టినట్టుంది. స్టార్స్‌కు, మాస్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనకు ఉన్నాయి’’ అన్నారు. ‘‘హీరో’ని జనవరి 15న విడుదల చేయమని కృష్ణగారు చెప్పారు’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. ‘‘హీరో’ సినిమాలో అశోక్‌ను చూస్తుంటే నాన్నగారే (కృష్ణ) ఎక్కువగా గుర్తొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లో మహేశ్‌బాబు కనిపించాడు’’ అన్నారు పద్మావతి గల్లా. ‘‘మా సినిమాను ఈ నెల 26న విడుదల చేద్దామనుకున్నాం కానీ కొన్ని సినిమాలు వాయిదా పడటంతో సంక్రాంతికి వస్తున్నాం’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో కృష్ణగారు, మహేశ్‌బాబుగారు ఎలాంటి ప్రత్యేక పాత్రలో కనిపించరు’’ అన్నారు అశోక్ గల్లా.