‘మురారి’తో మా సినిమా కథకు సంబంధమే లేదు: డైరెక్టర్‌ అర్జున్‌ | Director Arjun Jandyala Talk About Devaki Nandana Vasudeva Movie | Sakshi
Sakshi News home page

‘మురారి’తో మా సినిమా కథకు సంబంధమే లేదు: డైరెక్టర్‌ అర్జున్‌

Published Sat, Nov 16 2024 5:50 PM | Last Updated on Sat, Nov 16 2024 6:10 PM

Director Arjun Jandyala Talk About Devaki Nandana Vasudeva Movie

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ఈ చిత్రానికి ‘హను-మాన్‌’ఫేం ప్రశాంత్‌ వర్మ కథ అదించగా,  ‘గుణ 369’ఫేం అర్జున్‌ జంధ్యాల దర్వకత్వం వహించారు.  నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘దేవకి నందన వాసుదేవ’ సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్ ఇందులో ఉంటుంది. మూడో సంతానం వలన మరణం అని ట్రైలర్ లోనే చాలా క్లియర్ గా చెప్పాము. అయితే చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి. ట్రైలర్లో కంటే చాలా ఎక్కువ కథ సినిమాలో ఉంది.

ప్రశాంత్ వ‍ర్మ చెప్పిన కథను నేను ఓన్‌ చేసుకున్నాను. అలా కథను ఓన్‌ చేసుకున్నప్పడే కొత్త ఐడియాస్‌ వస్తాయి. నేను చెప్పిన కొన్ని ఆలోచనలకి ప్రశాంత్ గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన సినిమా చూసి చాలా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు.

ఈ కథకు హీరోగా అశోక్‌ అయితేనే బాగుటుందనిపించింది. ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి లుక్ అయితే బాగుంటుందని దానిపై చాలా వర్క్ చేసాం. ప్రతిదీ ఆ క్యారెక్టర్ నుంచి డిజైన్ చేసుకున్నాం.

అశోక్ గారు యాక్షన్ ఎమోషన్ లో ఇరగదీస్తారు. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.

ట్రైలర్‌ చూసి అందరూ ఈ సినిమా కథని మురారి సినిమాతో పోల్చుతున్నారు. కానీ  ఆ కథకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మురారిలో ఒక డెస్టినీ ఫీల్ ఉంటుంది. ఇందులో అది ఇంకోరకంగా ఉంటుంది. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ట్రైలర్ లో కూడా ఎక్కడా లేనివిధంగా భూమిలో సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అని చెప్పాం. దానికి ఒక కనెక్షన్ ఉంది. అది చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఒక సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అది కచ్చితంగా చెప్పగలను.

మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన టీమ్ అందర్నీ అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే సినిమాను కూడా చూడబోతున్నారు. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా చాలా అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేశారు.  

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అద్భుతంగా నచ్చుతుంది. ఇది మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఇందులో చాలా కీలకం.  దాని యొక్క సారాంశం కథలో అండర్లైన్ గా వెళుతుంది. అలాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. చాలా మంచి విజువల్ ఫీలింగ్ ఉంటుంది.

ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇచ్చిన కథకి 100% న్యాయం చేయాలి. అలాగే ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ చేయాలి. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.

సాయి మాధవ్ గారు చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రాణప్రతిష్ట చేశాడు. మ్యూజికల్ గా సినిమా వండర్ఫుల్ గా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement